ఎవ్వరూ తగ్గేదేలే!.. రోడ్డుపైనే జుట్లు పట్టుకొని తన్నుకున్న బాలికలు | Viral Video: Bengaluru School Girls Fight On Road, Beat Each Other With Sticks | Sakshi
Sakshi News home page

Viral Video: రోడ్డుపైనే జుట్టు పట్టుకొని తన్నుకున్న విద్యార్థినిలు

Published Wed, May 18 2022 2:38 PM | Last Updated on Wed, May 18 2022 6:38 PM

Viral Video: Bengaluru School Girls Fight On Road, Beat Each Other With Sticks - Sakshi

బెంగళూరు: కర్ణాటకలోని ఓ పాఠశాలకు చెందిన కొంతమంది బాలికలు రోడ్డుపై  తగువులాడుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ విషయంపై రెండు వర్గాల విద్యార్థుల మధ్యం వాగ్వాదం చోటుచేసుకోగా.. కొద్ది సేపటికే ఈ చర్చ గొడవకు దారి తీసింది. దీంతో పాఠశాల ముందే ఓ వర్గానికి చెందిన బాలికల గుంపు మరొక గుంపుపై దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల అమ్మాయిలు ఒకరినొకరు జుట్టు పట్టుకొని లాక్కున్నారు.

గట్టిగా కేకలు వేస్తూ, కర్రలతో దాడిచేస్తూ, తన్నుకున్నారు. ఈ ఘర్షణలో కొంతమంది అబ్బాయిలు కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. గొడవ పడుతున్న బాలికలందరూ స్కూల్‌ యూనిఫాం ధరించి ఉన్నారు. వీరంతా బెంగుళూరులోని బిషప్ కాటన్ గర్ల్స్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా తేలింది. అయితే ఏ విషయంలో ఇంతలా గొడవ పడ్డారనే విషయంపై సమాచారం లేదు. అంతేగాక ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో కూడా తెలియరాలేదు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తన ఫోన్‌లలో రికార్డ్‌ చేశారు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో మాత్రం తెగ హల్‌చల్‌ చేస్తోంది.
చదవండి: ఈ ప్రపంచానికి ఏమైంది? మొన్న మ్యాంగో మ్యాగీ.. ఈసారి పేస్ట్రీ మ్యాగీ! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement