Ongole Street Fight Video Goes Viral In Social Media - Sakshi
Sakshi News home page

ఒంగోలులో స్ట్రీట్‌ ఫైట్‌.. వీడియో వైరల్‌

Published Sun, Sep 12 2021 10:46 AM | Last Updated on Mon, Sep 20 2021 12:10 PM

Ongole Street Fight Video Viral In Social Media - Sakshi

సాక్షి, ప్రకాశం: ఒంగోలు శివారు మంగమూరు రోడ్డులో జరిగిన ఓ స్ట్రీట్ ఫైట్ వీడియో వైరల్‌గా మారింది. కారు కొనుగోలు విషయంలో కబాడీపాలెంకు చెందిన ఇరువర్గాల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. ఓ యువకుడిని మరో వర్గానికి చెందిన యువకులు విచక్షణారహితంగా కొట్టారు.

రాడ్లు, కర్రలతో కొట్టడంతో ఆ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘర్షణ సమయంలో అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్.. వద్దని వారిస్తున్నా ఆ యువకులు లెక్క చేయలేదు. సోషల్‌ మీడియాలో ఈ కొట్లాట దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి:
గణేష్‌ ఉత్సవాల్లో విషాదం: చూస్తుండగానే యువకుడు మృతి 
కుసంస్కారం: టీడీపీ పిచ్చి పరాకాష్టకు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement