తప్ప తాగి ఇద్దరు వ్యక్తులు, గ్యాంగ్‌లు కొట్టుకోవడం చూశాం. ఏదైనా విషయంలో రెండు వర్గాలు తగువులాడుకోడమూ తెలుసు. అమ్మాయిల ఇద్దరు అబ్బాయిలు గొడవ పడటం గురించి కూడా విన్నాం. కానీ ఇందుకు భిన్నంగా ఇద్దరు స్కూల్ విద్యార్థినీలు కొట్టుకోవడం ఎప్పుడైనా చూశారా.. ఇప్పుడు చెప్పబోయే వార్త అలాంటిదే. నడిరొడ్డు మీద స్కూల్ యూనిఫాం ధరించిన ఇద్దరు ఆమ్మాయిలు నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. పదుల సంఖ్యలో జనాలు చూస్తున్నా భయం లేకుండా జుట్లు పట్టుకొని పిచ్చిపిచ్చిగా గొడవ పడ్డారు. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా ఆవడిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఇద్దరి అమ్మాయిలకు పరీక్షలో వచ్చి ర్యాంకుల్లో తేడాలు వచ్చాయి. దీంతో వీరి మధ్య గొడవ పెద్దదిగా మారడంతో ఇలా రెండు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై ఫైట్‌కు దిగారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని కొట్టుకున్నారు. కింద పడినా వదలకుండా వీరావేశంలో ఊగిపోయారు. అక్కడున్న పెద్దలు వీరిని ఆపేందుకు ప్రయత్నించినా ఆగలేదు. ఒకరినొకరు చెంపలు వాయించుకున్నారు.
చదవండి: నన్ను ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి
అయితే అమ్మాయిలు అలా నడిరోడ్డుపై కొట్టుకుంటుంటే అక్కడున్న వాళ్లంతా నోరెళ్లబెట్టి సినిమా చూసినట్టు చూశారు. ఈ గొడవనంతా అక్కడున్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో స్కూల్ విద్యార్థుల స్ట్రీట్ ఫైట్ వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు అమ్మాయిలు అంటే ఆమాత్రం ఉండాలి. ఆడవాళ్లతో పెట్టుకుంటే రిజల్ట్స్ ఇలా ఉంటాయి. స్త్రీ శక్తి’ . అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి: Bipin Rawat : హెలికాప్టర్ ప్రమాదం.. వైరల్ అవుతున్న ఫేక్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment