రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సమన్వయాధికారి డా.పద్మజ కోరారు
నకిరేకల్ :
రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సమన్వయాధికారి డా.పద్మజ కోరారు. బుధవారం నకిరేకల్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మికంగా తనిఖీ చేసి ఆస్పత్రిలోని రిజిస్టర్లను పరిశీలించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళలను పరామర్శించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ రఫీ, డాక్టర్‌లు శేఖర్, రజిత, రమణారెడ్డి, తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కాంపాటి శ్యామ్, సిబ్బంది ఝాన్సీరాణి, ప్రసాద్, సువర్ణ ఉన్నారు.