వీసీకి వినతిపత్రం సమర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు
పాలమూరు యూనివర్సిటీ: పీయూలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, సమస్యలను పరిష్కారించాలని కొరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సోమవారం పీయూ వీసీ భూక్యా రాజారత్నంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ పీయూలో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, గ్రంథాలయం, ఫార్మసీ కళాశాలలో ఉన్న కంప్యూటర్లకు ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. ఫార్మసీ ఆడిటోరియాన్ని పూర్తిచేయాలని, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఫార్మసీ హాస్టల్స్ సమీపంలో మైదానం నిర్మించాలని, ప్రతి హాస్టల్‌లో మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అంజి, రవి, రజినికాంత్, రాఘవేందర్, సందీప్ పాల్గొన్నారు.