PU
-
విద్యార్థిని అనుమానాస్పద మృతి.. లైంగిక దాడికి పాల్పడి హత్య?
సాక్షి, బెంగళూరు: పీయూసీ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన లింగసూగురులో చోటు చేసుకుంది. అయితే తన కుమార్తెపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లింగసూగూరు తాలూకా గోనవాట్ల తండాకు చెందిన యువతి లింగసూగూరులోని ప్రైవేటు పీయూసీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. ఏం జరిగిందో ఏమో కాని తన గదిలో శుక్రవారం ఉరి వేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించింది. పోలీసులు వచ్చి పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కాగా తన కుమార్తెను ప్రిన్సిపాల్ లైంగికంగా వేధించేవాడని, ఈక్రమంలోనే శుక్రవారం లైంగిక దాడికి పాల్పడి ఓణితోనే ఉరివేసి హత్య చేశాడని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మంజునాథ తెలిపారు. చదవండి: ‘హాయ్ అమ్మా, నాన్న.. ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను.. క్షమించండి!’ -
బుర్ఖాతో అమ్మాయిల హాస్టల్లోకి.. ఆత్మహత్య..
సాక్షి, మహబుబ్‌నగర్ : అమ్మాయిలా బుర్ఖా ధరించి ఓ యువకుడు బాలికల వసతిగృహంలోకి వెళ్లి.. హాస్టల్ సిబ్బందికి పట్టుబడ్డాడు. వారు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబుబ్‌నగర్‌లోని పాలమురులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలమూరు యూనివర్శిటీలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రి ద్వితీయ సంవత్సరం చదువుతున్న సద్దాం హుస్సేన్ అనే యువకుడు ఈ నెల 16న రాత్రి 11 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి ఆమె ఉండే హాస్టల్‌కు వెళ్లాడు. ఎవరికి అనుమానం రాకుండా అమ్మాయిలాగా బుర్ఖా ధరించాడు. పక్క గదులలో ఉన్న విద్యార్థినులు గమనించి హాస్టల్ వార్డెన్‌కు సమాచారం ఇచ్చారు. వార్డెన్ అతడ్ని పట్టుకుని మందలించారు. అతడ్ని వెంటతీసుకొచ్చిన యువతిని కూడా మందలించారు. మళ్లీ ఇలాంటి పనులు చేయొద్దంటూ చెప్పి.. అతని సెల్‌ఫోను తీసుకుని మరుసటి రోజు వచ్చి తీసుకోవాల్సిందిగా సూచించారు. అతనితో ఒక లేఖ కూడా రాయించుకున్నారు. అయితే మనస్తాపానికి గురైన సద్దాం మరుసటి రోజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ విషయం శుక్రవారం వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న సద్దాం తల్లిదండ్రులు గురువారం ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. తమ కుమారుడి మృతిపై పూర్తి విచారణ జరిపించాల్సిందిగా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడతామని రైల్వే ఎస్.ఐ రాఘవేందర్ తెలిపారు. -
ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకే సీబీసీఎస్
–పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే ఉద్ధేశ్యంతో ఉన్నత స్థాయి విద్యాసంస్థలతో పోటీ పడేందుకు డిగ్రీ స్థాయిలో సీబీసీఎస్‌ను ప్రవేశపెట్టినట్లు పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో సీబీసీఎస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన విద్యావిధానం ద్వారా భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ సీటీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ సీబీసీఎస్‌కు సంబంధించి క్రెడిట్ పాయింట్స్, గ్రేడ్ పాయింట్స్ లెక్కించే విధానాన్ని వివరించారు. పీయూ పరీక్షల నియంత్రణ అధికారి మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ సీబీసీఎస్ విధానంలో ఇంటర్నెట్, సెమిస్టర్ పరీక్షల నిర్వహణ గురించి తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.యాదగిరి, అకాడమిక్ కో ఆర్డినేటర్ అబ్దుల్ రషీద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీబీజైనాబ్, వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్లు, అకాడమిక్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకే సీబీసీఎస్
–పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే ఉద్ధేశ్యంతో ఉన్నత స్థాయి విద్యాసంస్థలతో పోటీ పడేందుకు డిగ్రీ స్థాయిలో సీబీసీఎస్‌ను ప్రవేశపెట్టినట్లు పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో సీబీసీఎస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన విద్యావిధానం ద్వారా భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ సీటీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ సీబీసీఎస్‌కు సంబంధించి క్రెడిట్ పాయింట్స్, గ్రేడ్ పాయింట్స్ లెక్కించే విధానాన్ని వివరించారు. పీయూ పరీక్షల నియంత్రణ అధికారి మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ సీబీసీఎస్ విధానంలో ఇంటర్నెట్, సెమిస్టర్ పరీక్షల నిర్వహణ గురించి తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.యాదగిరి, అకాడమిక్ కో ఆర్డినేటర్ అబ్దుల్ రషీద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీబీజైనాబ్, వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్లు, అకాడమిక్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
పీయూలో పీహెచ్‌సీని ఏర్పాటుచేయాలి
పాలమూరు యూనివర్సిటీ: పీయూలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని, సమస్యలను పరిష్కారించాలని కొరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు సోమవారం పీయూ వీసీ భూక్యా రాజారత్నంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ పీయూలో వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని, గ్రంథాలయం, ఫార్మసీ కళాశాలలో ఉన్న కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. ఫార్మసీ ఆడిటోరియాన్ని పూర్తిచేయాలని, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఫార్మసీ హాస్టల్స్ సమీపంలో మైదానం నిర్మించాలని, ప్రతి హాస్టల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అంజి, రవి, రజినికాంత్, రాఘవేందర్, సందీప్ పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఆన్లైన్ ప్రవేశాలు
పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి జడ్చర్ల టౌన్ : ఈ ఏడాది ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగిందని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన జిల్లా అయినప్పటికీ ఆన్లైన్ ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయని, జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 21వేల సీట్లు ఉండగా గత ఏడాది 18వేల మంది చేరారని, ఈ పర్యాయం 17,500మంది విద్యార్థులు ప్రవేశం పొందారని తెలిపారు. ఆన్లైన్ ప్రవేశాల వల్ల మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగిందన్నారు. కళాశాలలో సీటు లభించినప్పటికీ అడ్మీషన్ పొందని విద్యార్థులు తప్పనిసరిగా ఈనెల 30లోగా ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాల్‌లను కలసి కన్ఫర్మేషన్ పొందాలని కోరారు. కళాశాలలు, గ్రూపు, పేర్లలో మార్పులకోసం ఈనెల 30వరకు అవకాశం ఉందని తెలిపారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ భక్తవత్సల్‌రెడ్డి ఉన్నారు. -
బీఈడీ ఫలితాలు విడుదల
పాలమూరు యూనివర్సిటీ: విద్యార్థి దశలో కష్టపడే వారికే బంగారు భవిష్యత్ ఉంటుందని పీయూ వీసీ భూక్యా రాజారత్నం చెప్పారు. పీయూ పరిధిలో ఉన్న 31బీఈడీ కళాశాలల మొదటి ఏడాది వార్షిక ఫలితాలను శనివారం రాత్రి పీయూలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి, కంట్రోలర్ మధుసూదన్‌రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ నూర్జహాన్‌తో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2466మంది విద్యార్థులు పరీక్ష రాయగా దీంట్లో 1474మంది ఉతీర్ణత సాధించినట్లు చెప్పారు. 992మంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారని పేర్కొన్నారు. బీఈడీ ఫలితాల్లో 59.77శాతం ఉతీర్ణత సాధించడం మంచి విషయమన్నారు. అయితే పాలమూరు జిల్లాలో ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్య పెరగాలని కోరారు. విద్యార్థి ఎప్పుడు కూడా ఒక కోర్సు అభ్యసిస్తున్న సమయంలో దానిపై పట్టుపెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. -
పీయూలో విద్యార్థుల ఘర్షణ
♦ బీఎస్ఎఫ్, ఏబీవీపీ నేతల బాహాబాహీ ♦ కేర్‌టేకర్‌ను తొలగించే విషయంపై రచ్చ రచ్చ ♦ ఇద్దరు విద్యార్థులకు గాయాలు పాలమూరు యూనివర్సిటీ: మహబూబ్‌నగర్ జిల్లా పీయూ (పాలమూరు యూనివర్సిటీ)లో శనివారం విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్థినేతలు ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత విద్యార్థుల కథనం మేరకు.. ప్రస్తుతం పీయూ పీజీ కళాశాల హాస్టల్ వార్డెన్‌గా ఉన్న పర్వతాలు సక్రమంగా పనిచేయడం లేదని.. అతడిని తొలగించాలని శని వారం మధ్యాహ్నం పీయూ ప్రిన్సిపాల్ పవన్‌కుమార్‌ను పీజీ ప్రథమ సంవత్సరం విద్యార్థులు కలిసి ఫిర్యాదు చేశారు. అయితే సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అక్కడికి చేరుకుని ఏబీవీపీ పీయూ ఇన్చార్జ్ రాజు నాయక్..హాస్టల్ వార్డెన్‌పై ఎందుకు ఫిర్యాదుచేశారని అక్కడే ఉన్న పీజీ ప్రథమ సంవత్సరం విద్యార్థులను ప్రశ్నించారు. అక్కడే ఉన్న బహుజన స్టూడెంట్ ఫ్రంట్(బీఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు, ఫార్మాసీ విద్యార్థి బండి పృథ్వీరాజ్ వారించాడు. రాజు నాయక్ కల్పించుకుని యూనివర్సిటీల్లో కులరాజకీయాలు చేస్తున్నారని అతడిపై దూషణలకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇదే సమయంలో శ్రీనివాసులు ఆంగ్లం ప్రథమ సంవత్సరం విద్యార్థి భవనంపై నుంచి కిందకు నీళ్లు తాగడానికి వస్తే అతడిని కూడా రాజునాయక్ ఎందుకు ఫిర్యాదు చేశారని అడిగాడు. ఈ క్రమంలో రాజు నాయక్ శ్రీనివాస్ అనే విద్యార్థిపై రాయితో దాడి చేయడం తో తీవ్రంగా గాయపడ్డాడు. ఇదే సమయంలో పృథ్వీరాజ్‌పై దాడిచేసి మర్మాంగాలపై కాళ్లతో తన్నడంతో సృహ కోల్పోయాడు. విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. దీంతో గాయపడిన శ్రీనివాసులు, పృథ్వీరాజ్‌ను పోలీ సులు ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన రాజునాయక్‌ను మహబూబ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పీయూలో విద్యార్థులపై దాడి చేసిన ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసిన కఠిన చర్యలు తీసుకోవాలని పీయూ విద్యార్థులు పీయూ ఎదుట ధర్నాచేశారు. సంఘటన స్థలానికి రూరల్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్ చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనపై ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.