మాట్లాడుతున్న పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి
ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకే సీబీసీఎస్
Published Tue, Aug 30 2016 11:32 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
–పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే ఉద్ధేశ్యంతో ఉన్నత స్థాయి విద్యాసంస్థలతో పోటీ పడేందుకు డిగ్రీ స్థాయిలో సీబీసీఎస్‌ను ప్రవేశపెట్టినట్లు పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ డిగ్రీ కళాశాలలో సీబీసీఎస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన విద్యావిధానం ద్వారా భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందన్నారు.
ప్రభుత్వ సీటీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ సీబీసీఎస్‌కు సంబంధించి క్రెడిట్ పాయింట్స్, గ్రేడ్ పాయింట్స్ లెక్కించే విధానాన్ని వివరించారు. పీయూ పరీక్షల నియంత్రణ అధికారి మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ సీబీసీఎస్ విధానంలో ఇంటర్నెట్, సెమిస్టర్ పరీక్షల నిర్వహణ గురించి తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.యాదగిరి, అకాడమిక్ కో ఆర్డినేటర్ అబ్దుల్ రషీద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీబీజైనాబ్, వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్‌లు, అకాడమిక్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement