CBSC
-
కూలీ కూతురు.. నూటికి నూరు మార్కులు
ఉత్తరప్రదేశ్‌లో సీబీఎస్సీ క్లాస్ 12వ తరగతి ఎగ్జామ్ ఫలితాలను మొన్న శుక్రవారం ప్రకటించారు. ఇందులో బదేరా గ్రామంలో దినసరి కూలీ కూతురు అయిన అన్సూయ కుశ్వా నూటికి నూరు శాతం మార్కులు సాధించి అందరి ప్రశంసలూ అందుకుంటోంది. బలహీన వర్గాల ఆడపిల్లల విద్యకు ప్రేరణగా నిలిచింది. అన్సూయ ఉండే బదేరా గ్రామంలో ఎనిమిదవ తరగతి వరకే ఉంది. ‘మా ఊళ్లో అమ్మాయిల చదువు ఎనిమిదవ తరగతితోనే పూర్తవుతుంది. ఆపైన ఎవరూ చదువుకోరు’ అంటూ ఫలితాలు విడుదలైన తర్వాత తమ గ్రామ పరిస్థితి ని తెలియజేసింది 17 ఏళ్ల అన్సూయ. ఆర్థికంగా వెనుకబడిన అర్హులైన యువత కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా బులంద్ షహార్లోని విద్యాజ్ఞాన్లో చదువుకుంటోంది అన్సూయ. అందరిలో ఒకరిలా కాకుండా ‘వేరు’గా ఉండాలనేది అన్సూయ ఆలోచన. అందుకు సీబీఎస్సీ పరీక్ష లో వందకు వందమార్కులు తెచ్చుకోవాలనే ఆశయంతో సాధన మొదలుపెట్టి, విజయం సాధించింది. సమస్యలకు సవాల్ కుటుంబ పరిస్థితులే కాదు కోవిడ్–19 కూడా చాలా మంది పిల్లలను చదువులో వెనుకంజ వేసేలా చేసింది. కానీ, ఆన్లైన్ ద్వారా చదువును కొనసాగిస్తూ తన గమ్యాన్ని చేరుకుంది అన్సూయ. ‘మా ఊళ్లో ఇంటర్నెట్ సదుపాయం లేదు. వైర్లెస్ నెట్వర్క్, కరెంట్ సమస్యలూ... ఈ సమయం చాలా కష్టమే అనిపించింది. మా స్కూల్ వాళ్లు వాట్సప్ లో స్టడీ మెటీరియల్‌ని పంపేవాళ్లు. నేను నెట్వర్క్ ఉన్నప్పుడు వాటిని డౌన్లోడ్ చేసుకొని, చదువుకునేదాన్ని’ అంటూ ఆమె తన సాధనలో వచ్చిన సమస్యలను, వాటిని అధిగమించిన విధానాన్ని వివరించింది. ఎనిమిది తర్వాత చదువుకు ఫుల్స్టాప్ బదేరా గ్రామంలో ఆడపిల్లలకు ఎనిమిదవ తరగతి అయిపోగానే పెళ్లి కోసం తర్వాతి గృహజీవితం కోసం పెద్దలు తీర్చిదిద్దుతారని, అబ్బాయిలు తమ పెద్దవారితో కలిసి శారీరక శ్రమ ఉండే పొలం పనుల్లో చేరుతుంటారని ఈ సందర్భంగా ఆమె వివరించింది. గ్రామీణ యువతకు అవకాశం ఏడుగురు తోబుట్టువుల్లో అన్సూయ ఒకరు. ఐఎఎస్ పూర్తి చేసి గ్రామీణ యువత జీవితాలను చక్కదిద్దాలనే ఆలోచనతో ఉన్నానని చెబుతూనే, గ్రామాల్లో యువత ఉన్నత చదువులు చదివే అవకాశాలను ప్రభుత్వాలు పెంచాలనీ కోరుకుంటున్నది. కుటుంబాలనే కాదు ఎవరికి వారు తమ జీవితాలనూ బాధ్యతగా తీసుకోవాలని తను సాధించిన విద్య ద్వారా చూపుతుంది అన్సూయ. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా చదువొక్కటే తన జీవితాన్ని చక్కదిద్దగలదనే నమ్మకంతో భావి జీవితానికి దారులు వేసుకుంటున్న అన్సూయ లాంటి అమ్మాయిలు మన మధ్యే ఉంటారు. వారికి తగినంత ప్రోత్సాహం ఇవ్వడమే సమాజ బాధ్యత. -
ఆన్లైన్ క్లాస్‌ల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి నివేదిక సమర్పించకపోవడంతో హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఏడాది విద్యా సంవత్సరాన్ని ఇంకా ప్రారంభించలేదని క్యాబినెట్ సమావేశం అనంతరం దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే ఆన్లైన్ క్లాసెస్ ఎందుకు నిర్వహిస్తున్నారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అంతేగాక ఆన్లైన్ క్లాసుల వల్ల ఆర్థికంగా వెనుకబడిన వారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ఈ నెల 13వ తేదీలోగా లిఖితపూర్వకంగా నిర్థిష్ట ప్రణాళికను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. (‘కొత్త బిల్లుతో మూడు రకాల నష్టాలున్నాయి’) అదే విధంగా ఆన్లైన్ క్లాసెస్‌పై ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోషియేషన్ ఇంప్లీడ్(ఇస్మా) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఎస్ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా రెండు నెలల క్రితమే విద్యా సంవత్సరం ప్రారంభించిందని ఇస్మా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం లేదని, ఇది వారికి ఆప్షన్ మాత్రమేనని ఇస్మా పిటిషన్లో పేర్కొంది. సీబీఎస్ఈపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని ఇస్మా న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఇస్మాకు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. (కరోనా పరీక్షలు నిలిపేస్తున్నామని ఎలా చెబుతారు?) -
సీబీఎస్ఈ ఫీజు 24 రెట్లు పెంపు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ, 12వ తరగతుల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పరీక్ష ఫీజును 24 రెట్లు అంటే ప్రస్తుతమున్న రూ.50 నుంచి అమాంతం రూ.1,200కు పెంచింది. అదేవిధంగా జనరల్ కేటగిరీ విద్యార్థుల ఫీజును రూ.750 నుంచి రూ.1,500గా నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్ఈ గత వారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఫీజు చెల్లింపు ప్రక్రియ మొదలు కావడంతో పాత రుసుము చెల్లించిన విద్యార్థులు పెంచిన మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పెంచిన ప్రకారం ఫీజును గడువులోగా చెల్లించని విద్యార్థులను 2019–20 వార్షిక పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని తెలిపింది. తాజా విధానం ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు ఐదు సబ్జెక్టులకు పరీక్ష ఫీజు రూ.1,200 చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.350 మాత్రమే. జనరల్ కేటగిరీ వారికి ఇప్పటి వరకు ఉన్న ఫీజు రూ.750ను రూ.1,500కు పెంచింది. ఈ విధానం 10, 12వ తరగతుల విద్యార్థులకు వర్తిస్తుంది. 12వ తరగతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అదనంగా ఒక సబ్జెక్టు పరీక్ష రాయాలంటే గతంలో ఎలాంటి ఫీజు ఉండేది కాదు. ఇకపై వారు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు కూడా అదనపు సబ్జెక్టు కోసం రూ.150 బదులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 100 శాతం అంధ విద్యార్థులకు మాత్రం సీబీఎస్ఈ పరీక్ష రుసుమును మినహాయించింది. మైగ్రేషన్ ఫీజును కూడా రూ.150 నుంచి రూ.350కి పెంచింది. -
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను శనివారం వెల్లడించారు. 12వ తరగతి పరీక్షల్లో మొత్తం 83.1 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఘజియాబాద్‌కు చెందిన మేఘనా శ్రీవాత్సవ (499/500) టాపర్‌గా నిలిచారు. ఫలితాల్లో త్రివేండ్రం (97.32 శాతం), చెన్నై (93.87 శాతం), ఢిల్లీ (89 శాతం) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2017లో 82.02మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 83.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు ఎప్పటిలాగానే ఉత్తీర్ణతలో విద్యార్థినులే ముందంజలో ఉన్నారు. -
నీట్ ఫలితాల విడుదలకు మార్గం సుగమం
ఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఫలితాల విడుదలకు గల అడ్డంకులు తొలగిపోయాయి. ఫలితాల విడులను నిలిపివేయాలని గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం అత్యున్నత ధర్మాసనం స్టే విధించింది. దీంతో నీట్ ఫలితాల విడుదలకు మార్గం సుగమం అయింది. నీట్ ఫలితాలను నిలిపివేయాలని గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తమిళ, ఆంగ్ల భాషల ప్రశ్నపత్రాల మధ్య తేడా ఉందని, అందువల్ల పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అక్కడి విద్యార్థులు కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఫలితాల విడుదలను నిలిపివేయాలని తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సీబీఎస్ఈ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మద్రాస్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. నీట్ ఫలితాలను ప్రకటించాలని సీబీఎస్ఈని ఆదేశించింది. అలాగే నీట్ అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రభావితం చేసే పిటిషన్లను హైకోర్టులు విచారించరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
నేడు వెబ్సైట్లో జేఈఈ మెయిన్ కీ
- వెబ్సైట్లో విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల స్కాన్ కాపీలు - పొరపాట్లపై ఈనెల 22 వరకు అభ్యంతరాల స్వీకరణ - ఆన్లైన్లో రాసిన వారికి నో చాన్స్ - సీబీఎస్ఈ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు ఈనెల 2న ఆఫ్‌లైన్‌లో నిర్వహించిన జేఈఈ మెయిన్ రాత పరీక్షకు హాజరైన విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను, ‘కీ’లను మంగళవారం నుంచి ఈనెల 22 వరకు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. జేఈఈ మెయిన్ వెబ్సైట్లో విద్యార్థులు జవాబుల కీలను, ఓఎంఆర్ జవాబు పత్రాల స్కాన్ కాపీలను పొందవచ్చని పేర్కొంది. విద్యార్థులు ఓఎంఆర్ కాపీలను చూసుకొని, కీలలో పేర్కొన్న జవాబులపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రత్యేకంగా ఇచ్చే లింకు ద్వారా ఆన్లైన్లో ఛాలెంజ్ చేయవచ్చని వెల్లడించింది. 22వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల వరకు వాటిని ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే విద్యార్థులు ఇందుకు రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుందని, వాటిని నెట్ బ్యాంకింగ్/క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు ద్వారా చెల్లించవచ్చని వివరించింది. అభ్యర్థి చేసిన ఛాలెంజ్ సరైంది అయితే, కీలలో పొరపాట్లు ఉంటే వాటిపై నిఫుణుల కమిటీతో పరిశీలన జరిపించి బోర్డు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. వాటిని ఛాలెంజ్ చేసిన విద్యార్థులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని వివరించింది. ఈనెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ప్రశ్న పత్రాలు, జవాబులకు సంబంధించిన వివరాలను విద్యార్థుల రిజిస్టర్డ్ మెయిల్ ఐడీలకు పంపించినట్లు తెలిపింది. అయితే వారి నుంచి ఛాలెంజ్‌ను స్వీకరించబోమని సీబీఎస్ఈ పేర్కొంది. -
ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకే సీబీసీఎస్
–పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే ఉద్ధేశ్యంతో ఉన్నత స్థాయి విద్యాసంస్థలతో పోటీ పడేందుకు డిగ్రీ స్థాయిలో సీబీసీఎస్‌ను ప్రవేశపెట్టినట్లు పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో సీబీసీఎస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన విద్యావిధానం ద్వారా భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ సీటీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ సీబీసీఎస్‌కు సంబంధించి క్రెడిట్ పాయింట్స్, గ్రేడ్ పాయింట్స్ లెక్కించే విధానాన్ని వివరించారు. పీయూ పరీక్షల నియంత్రణ అధికారి మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ సీబీసీఎస్ విధానంలో ఇంటర్నెట్, సెమిస్టర్ పరీక్షల నిర్వహణ గురించి తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.యాదగిరి, అకాడమిక్ కో ఆర్డినేటర్ అబ్దుల్ రషీద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీబీజైనాబ్, వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్లు, అకాడమిక్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
ఉన్నత ప్రమాణాలతో విద్యనందించేందుకే సీబీసీఎస్
–పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించాలనే ఉద్ధేశ్యంతో ఉన్నత స్థాయి విద్యాసంస్థలతో పోటీ పడేందుకు డిగ్రీ స్థాయిలో సీబీసీఎస్‌ను ప్రవేశపెట్టినట్లు పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో సీబీసీఎస్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన విద్యావిధానం ద్వారా భవిష్యత్తులో విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ సీటీ కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ సీబీసీఎస్‌కు సంబంధించి క్రెడిట్ పాయింట్స్, గ్రేడ్ పాయింట్స్ లెక్కించే విధానాన్ని వివరించారు. పీయూ పరీక్షల నియంత్రణ అధికారి మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ సీబీసీఎస్ విధానంలో ఇంటర్నెట్, సెమిస్టర్ పరీక్షల నిర్వహణ గురించి తెలిపారు. కార్యక్రమంలో ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.యాదగిరి, అకాడమిక్ కో ఆర్డినేటర్ అబ్దుల్ రషీద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బీబీజైనాబ్, వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్లు, అకాడమిక్ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
సీబీఎస్ఈ కంటే మన సిలబసే ఎక్కువ
- ‘నీట్’కు దాన్ని మినహాయించి చదివితే చాలు - ఇంటర్ బోర్డు భేటీలో నిపుణుల స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: నీట్ సిలబస్ రాష్ట్ర విద్యార్థులకు సమస్యే కాదని నిఫుణులు స్పష్టం చేశారు. నీట్ పరిగణనలోకి తీసుకునే సీబీఎస్ఈ 11, 12 తరగతుల సిలబస్‌లోని అంశాలన్నీ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి నీట్ తప్పనిసరి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఇంటర్ సిలబస్‌లో మార్పులపై సబ్జెక్టు నిపుణులతో ఇంటర్ బోర్డు శనివారం సమావేశం నిర్వహించింది. రెండింటినీ పరిశీలించిన నిపుణులు, సీబీఎస్ఈ కంటే మన బోర్డు సిలబస్‌లోనే అదనపు పాఠ్యాంశాలున్నాయని తేల్చారు. వచ్చే ఏడాది నుంచి నీట్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు మన బోర్డు సిలబస్‌లో అదనంగా ఉన్న అంశాలను తొలగించి మిగతావి మాత్రం ప్రిపేరైతే సరిపోతుందన్నారు. కాబట్టి ఏ ఆందోళనా లేకుండా నీట్-2 పరీక్షకు సిద్ధమవ్వాలని సూచించారు. అయితే నెగిటివ్ మార్కుల విషయంలో గ్రామీణ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. 2010లో నీట్‌ను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించినప్పుడే రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ, బోటనీ సబ్జెక్టుల సిల బస్‌ను నీట్‌కు అనుగుణంగా, సీబీఎస్ ఈ 11, 12 తరగతుల్లోని సిలబస్ మేరకు మార్చారు. సీబీఎస్ఈ కంటే రాష్ట్ర బోర్డు బోటనీలో 20 శాతం, జువాలజీలో 30% సిలబస్ అదనంగా ఉందని లెక్చరర్లు చెబుతున్నారు.మన సిలబస్‌లో సబ్జెక్టుల వారీగా ఉన్న అదనపు అంశాలు... ఫిజిక్స్‌లో: సీబీఎస్ఈలో ఉన్నవే ఇంటర్ బోర్డు సిలబస్‌లోనూ ఉన్నాయి కెమిస్ట్రీలో: సీబీఎస్ఈలో ఉన్న అన్ని టాపిక్లతో పాటు, అందులో లేని ‘ఎక్స్’ కిరణ స్పటిక విజ్ఞానమనే టాపిక్ కూడా బోర్డు సిలబస్‌లో ఉంది జువాలజీలో: సీబీఎస్ఈ సిలబస్‌కు అదనంగా ఆవరణ శాస్త్రం, ఏక కణ జీవుల గమనం, ప్రత్యుత్పత్తి, మానవ పరిణామక్రమం, వ్యాధి నిరోధక శాస్త్రం పాఠ్యాంశాలున్నాయి వృక్షశాస్త్రంలో: వృక్ష ఆవరణ శాస్త్రం, సూక్ష్మ జీవ శాస్త్రంలో బ్యాక్టీరియా, వైరస్, వృక్షశాస్త్ర పరిధి, వృక్షశాస్త్ర శాఖలు, ద్విభాగాలు పాఠ్యాంశాలు కూడా మన దగ్గరే అదనంగా ఉన్నాయి. పుస్తకాల్లో నేరుగా లేనివి 9 ప్రశ్నలే ఇటీవల జరిగిన నీట్-1 పరీక్ష తాలూకు ప్రశ్నపత్రాల సరళిని చూస్తే మన ఇంటర్ పుస్తకాల్లో లేని ప్రశ్నలు 9 వచ్చాయి. అయితే వాటిలో మూ డింటికి కాన్సెప్టులు (భావనలు) అడిగారు. మరో మూడింటిని ప్రయోగ దీపికల నుంచి అడిగారు. ఇంకో మూడింటిని బేసిక్ కాన్సెప్టుల నుంచి అడిగారు. ఇవి సీబీఎస్ఈ 8 నుంచి 10వ తరగతి పుస్తకాల్లో ఉన్నవే.