సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను శనివారం వెల్లడించారు. 12వ తరగతి పరీక్షల్లో మొత‍్తం 83.1 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఘజియాబాద్‌కు చెందిన మేఘనా శ్రీవాత్సవ (499/500) టాపర్‌గా నిలిచారు. ఫలితాల్లో త్రివేండ్రం (97.32 శాతం), చెన్నై (93.87 శాతం), ఢిల్లీ (89 శాతం) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2017లో 82.02మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 83.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు ఎప్పటిలాగానే ఉత్తీర్ణతలో విద్యార్థినులే ముందంజలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment