CBSE Class 12 results
-
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
-
అతడికి చేతులు లేవు కానీ.. రాయడం ఆపలేదు
లక్నో: తుషార్ విష్వకర్మకు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు కానీ అతడికి తన ఇద్దరు సోదరులతో కలిసి బడికి వెళ్లి చదువుకోవాలని ఉండేది. కసితో కాళ్లతో రాయడం ప్రాక్టీస్ చేశాడు. రాయడం నేర్చుకుని స్కూల్లోనూ చేరాడు. అలా రాస్తూనే అన్ని తరగతులూ పాసయ్యాడు. వివరాల్లోకెళ్తే.. లక్నోకి చెందిన తుషార్ క్రియేటివ్ కాన్వెంట్లో 12వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం అతను సీబీఎస్ఈ విడుదల చేసిన ఫలితాల్లో 70 శాతం మార్కులతో పాసయ్యాడు. ఏ లోపం లేని ఎంతో మంది విద్యార్ధులు పాసైతే చాలు అనుకుంటుంటే తుషార్ మాత్రం 70 శాతం మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అంతే కాదు పరీక్షల సమయంలో ప్రభుత్వం అంగవైకల్యంతో బాధపడే విద్యార్ధులకు కల్పించే రైటర్ సహాయం తీసుకోవడం లేదా అధిక సమయం తీసుకోవడం వంటి బెనిఫిట్స్‌ను కూడా ఏనాడూ వినియోగించుకోలేదు. అడిగితే నేను అందరిలాంటి సాధారణ వ్యక్తినని అందుకే నేను అందరిలానే పరీక్ష రాస్తానని అంటున్నాడు తుషార్. తుషార్ మాట్లాడుతూ: చిన్నప్పుడు మా అన్నలు ఇద్దరూ స్కూల్‌కి వెళ్తుంటే నేనూ వారితో వెళ్తానని తల్లిదండ్రులను అడిగే వాడిననీ అన్నారు. అయితే తన లోపం వల్ల రాయడం ఇబ్బందిగా ఉండేదని అయితే తన అన్నల పుస్తకాల సాయంతో కాళ్లతో రాయడం ప్రాక్టీస్ చేసి తను దానిని అధిగమించడానికి తనకు ప్రతి రోజూ ఆరు గంటల సమయం పట్టేదని చెప్తున్నాడు. అలాగే తను ఈ స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, అన్నలకు, ముఖ్యంగా టీచర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. -
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లో ఫలితాలను చూసుకోవచ్చు. కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలు రద్దయినందున టాపర్స్ మెరిట్ జాబితాను ప్రకటించడం లేదని తెలిపింది. మొత్తం 12,96,318 మంది విద్యార్థులు 99.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2020లో 88.78 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం బాలుర కంటే బాలికలు 0.54% పైచేయి సాధించారు. బాలికల ఫలితాలు 99.67% కాగా, బాలురు 99.13% ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 30 శాతం, 11 వ తరగతిలో మార్కుల ఆధారంగా 30 శాతం, 12వ తరగతిలో మిడ్ టర్మ్, ప్రీ-బోర్డ్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇలా మొత్తం 100 శాతానికి మార్కులను లెక్కించి ఫలితాలను విడుదల చేసింది. క్వాలిఫైయింగ్ మార్కులు సాధించని విద్యార్థులను కంపార్మెంట్ కేటగిరీలో ఉంచనున్నారు. అయితే ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులకు కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. -
రైతు కొడుకు.. చదువులో చురుకు!
లక్నో: ఉత్తప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతు కుమారుడు సీబీఎస్ఈ ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభను కనబరడిచాడు. లఖింపూర్‌కు చెందిన అనురాగ్ తివారీ తాజాగా విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 98.2 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. అంతేకాకుండా అమెరికా కార్నెల్ యూనివర్సిటీలో ఫుల్ స్కాలర్‌షిప్‌తో ఆర్థిక శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించడానికి ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా అనురాగ్ మాట్లాడుతూ.. ‘నేను సీతాపూర్‌లోని శివనాదర్ ఫౌండేషన్ నిర్వహించిన విద్యాగ్వాన్ లీడర్షిప్ అకాడమీలో చదివాను. మొదట్లో సీతాపూర్ పంపించేందుకు నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఎందుకంటే మాది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం. మా నాన్న రైతు అమ్మ ఇంట్లోనే ఉంటుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల కూడా ఎక్కువే. ఇక నేను చదువుకుంటే భవిష్యత్తులో వ్యవసాయం చేయలేమోనని వారు భావించి నన్ను కాలేజీ పంపించేందుకు ఇష్టపడలేదు. నా ముగ్గురు సోదరీమణులు వారిని ఒప్పించారు’ అంటూ అనురాగ్ చెప్పుకొచ్చాడు. ఆర్థిక శాస్త్రంలో వందకు 100 మార్కులు: సీబీఎస్ఈ ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో అనురాగ్ అన్ని సబ్జెక్ట్స్‌ల్లోను మెరుగైన ప్రతిభ కనబరిచాడు. గణితంలో- 95, ఇంగ్లీషులో-97, పొలిటికల్ సైన్స్‌లో- 99, హిస్టరీ, ఎకనామిక్స్‌లో- 100 మార్కులు సాధించాడు. -
ఒకేలా ఉండటమే కాదు ఫలితాలు కూడా ఒకటే!
నోయిడా: ఆ కవలలిద్దరూ ఒకేలా ఉండటమే కాదు సీబీఎస్ఈ ఫలితాల్లోనూ ఒకే విధమైన మార్కులు సాధించారు. ఢిల్లీ నోయిడాకు చెందిన కవలలు మాన్సి, మాన్య చూడటానికి అచ్చుగుద్దినట్లు ఒకేలా కనిపిస్తారు. ఒకే పాఠశాలలో చదవడమే కాదు అన్ని సబ్జెక్టుల్లోనూ సమాన మార్కులు సంపాదించి ఔరా అనిపించారు. జూలై13న విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఇద్దరూ 95.8 శాతం స్కోరు సాధించారు. ఇంజనీరింగ్ చదవాలన్నది తమ కల అని కవలలు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో జరగనున్న జేఈఈ మొయిన్స్‌కు సమాయత్తమవుతున్నామని వివరించారు. (సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు విడుదల ) 'మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఆరోగ్యకరమైన పోటీనే ఉంటుంది. అంతేకాకుండా మా ఇష్టాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. నాకు కెమిస్ట్రీ సబ్జెక్ట్ అంటే ఇష్టం కాగా మాన్సికి భౌతికశాస్ర్తం మీద మక్కువ. పరీక్షలకు ఇద్దరం కలిసే ప్రిపేర్ అయ్యాం. యాదృచ్చికంగా జరిగింది కానీ ఇద్దరికీ సమానంగా మార్కులు వస్తాయని అయితే ఊహించలేదు' అని మాన్య పేర్కొంది. ఈ ఏడాది విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో 88.79 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 5.38 శాతం పెరిగింది. ఫలితాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ముందజలో ఉన్నారు. ఫలితాల్లో 92.15 శాతం మంది బాలికలు, 86.19 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత కంటే బాలికల ఉత్తీర్ణత 5.96 శాతం అధికం. 66.67 శాతం ట్రాన్స్జెండర్లు ఉత్తీర్ణులు కావడం విశేషం. (సీబీఎస్ఈ ‘12’లో బాలికలదే పైచేయి ) -
అందుకే 100 శాతం మార్కులు: దివ్యాన్షి
‘‘నేను రోజూ ప్రార్థనలు చేశాను. అదే విధంగా కష్టపడి చదివాను కూడా. ప్రతీ సబ్జెక్టుకు ప్రత్యేకంగా నోట్స్ తయారు చేసుకున్నాను. కీలక అంశాలను అందులో రాసుకున్నా. తద్వారా త్వరగా, మెరుగ్గా పాఠాలను అర్థం చేసుకొని గుర్తుపెట్టుకున్నా. చదివిన ప్రతీ అంశాన్ని అనేక మార్లు పునరుశ్చరణ చేసి.. వాటిని విశ్లేషించి అర్థం చేసుకున్నా’’అంటూ తన విజయ రహస్యాన్ని వెల్లడించింది సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో 100 శాతం(600/600) మార్కులు సాధించిన దివ్యాన్షి జైన్. హిస్టరీ సబ్జెక్టుపై పరిశోధన చేయాలనుకుంటున్నానని, దేశానికి సంబంధించిన గత చరిత్ర, విశేషాలపై అధ్యయనం చేయాలనుకుంటున్నట్లు భవిష్యత్ ప్రణాళిక గురించి పంచుకుంది. కాగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాలు సోమవారం వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో బాలురపై(86.19 శాతం) బాలికలు(92.15 శాతం) పైచేయి సాధించారు.(సీబీఎస్ఈ ‘12’లో బాలికలదే పైచేయి) ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు చెందిన దివ్యాన్షి జైన్ 600/600 స్కోరు సాధించి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. నవయుగ్ రేడియన్స్ సీనియర్ సెకండరీ స్కూళ్లో విద్యనభ్యసించిన ఆమె ఇంగ్లీష్, సంస్కృతం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, భూగోళ శాస్త్రం, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్‌లో వంద శాతం మార్కులు సాధించింది. దివ్యాన్షి తండ్రి స్థానికంగా దుకాణం నిర్వహిస్తుండగా.. ఆమె తల్లి గృహిణిగా ఇంటి బాధ్యతలు నెరవేస్తున్నారు. ఇక పరీక్షల్లో తాను సాధించిన గెలుపు గురించి దివ్యాన్షి మాట్లాడుతూ.. గంటల కొద్దీ పుస్తకాలతో కుస్తీ పట్టలేదని, ప్రణాళిక ప్రకారం రివిజన్, మాక్ టెస్టులకు సమయం కేటాయించి.. ఎక్కువగా ఎన్సీఈఆర్టీ(నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రెయినింగ్) పుస్తకాలనే చదివానని చెప్పుకొచ్చింది. తన విజయానికి తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహమే కారణమని పేర్కొంది. -
సీబీఎస్ఈ ‘12’లో బాలికలదే పైచేయి
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో బాలురపై బాలికలే పైచేయి సాధించారు. ఈ ఫలితాలను సీబీఎస్ఈ సోమవారం ప్రకటించింది. గత ఏడాది కంటే ఈసారి ఉత్తీర్ణత 5.38 శాతం పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది మెరిట్ లిస్టు ప్రకటించకూడదని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఉత్తీర్ణత సాధించని వారి మార్కుల లిస్టులో ఫెయిల్ బదులు ఎసెన్షియల్ రిపీట్ అనే పదం చేర్చనున్నారు. 12వ తరగతి ఫలితాల్లో 92.15 శాతం మంది బాలికలు, 86.19 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత కంటే బాలికల ఉత్తీర్ణత 5.96 శాతం అధికం. 66.67 శాతం ట్రాన్స్జెండర్లు ఉత్తీర్ణులు కావడం విశేషం. 2019లో మొత్తం 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ఈసారి 88.78 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది 11.92 లక్షల మంది 12వ తరగతి పరీక్షలకు హాజరు కాగా, దాదాపు 1.57 లక్షల మంది విద్యార్థులు 90 శాతానికిపైగా మార్కులు సాధించారు. 38,000 మంది 95 శాతానికిపైగా మార్కులు పొందారు. జవహర్ నవోదయ విద్యాలయాల విద్యార్థులు 98.70 శాతం మంతి ఉత్తీర్ణులయ్యారు. కేరళలోని త్రివేండ్రం రీజియన్‌లో అత్యధికంగా 97.67 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. -
పట్టరాని సంతోషంలో స్మృతీ ఇరానీ, సునీతా కేజ్రీవాల్
న్యూఢిల్లీ : స్త్రీలు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే.. సంతానం విషయానికి వచ్చేసరికి ఒకేలా స్పందిస్తారు. పిల్లలు గెలిస్తే అందరికన్నా ఎక్కువ వారే సంతోషపడతారు.. ఓడితే పిల్లలకు ధైర్యం చెబుతారు. ఇందుకు నిదర్శనంగా నిలిచారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి భార్య సునీత కేజ్రీవాల్. ఇంతకు విషయం ఏంటంటే.. గురువారం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో కేజ్రీవాల్ కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్ 96.4 శాతం, స్మృతి ఇరానీ కొడుకు జోహర్ 91 శాతం మార్కులు సాధించి వారి తల్లిదండ్రుల ఆనందానికి కారణమయ్యారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు సునీత కేజ్రీవాల్, స్మృతి ఇరానీ. ‘దేవుడి దయ, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో మా అబ్బాయి సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాల్లో 96.4 పర్సంటైల్‌ను సాధించాడు. అత్యంత కృతజ్ఞతాభావంతో’ అని సునీత ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా..‘బిగ్గరగా చెప్పడం కరెక్టే. మా అబ్బాయి జోహర్ పట్ల చాలా గర్వంగా ఉంది. ప్రపంచ కెంపో ఛాంపియన్ షిప్లో క్యాంస పతకం సాధించడంతో పాటు సీబీఎస్సీలో మంచి స్కోర్ సాధించాడు. ఆర్థిక శాస్త్రంలో 94 శాతాన్ని సాధించినందుకు స్పెషల్ యాహూ. నన్ను క్షమించండి. ఈ రోజు నేను అత్యంత సంతోషకరమైన అమ్మను’ అని పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం వెల్లడైన ఈ ఫలితాల్లో 83.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. Ok saying it out loud— proud of my son Zohr..not only did he come back with a bronze medal from the World Kempo Championship also scored well in 12 th boards. Best of 4– 91% .. special yahoo for 94% in economics.. Maaf karna ,today I’m just a gloating Mom🙏 — Chowkidar Smriti Z Irani (@smritiirani) May 2, 2019 -
నా సక్సెస్ సీక్రెట్ అదే: గౌరంగీ చావ్లా
రిషికేశ్: ‘నేనేమి పుస్తకాల పురుగును కాదు. అన్ని విషయాల్లో చురుగ్గా ఉండాలనుకుంటాను. పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకెళుతుంటా. స్వీయ నియంత్రణే నా మంత్రం. పరీక్షల సమయంలో ఒత్తిడి నుంచి బయటపడేందుకు కామ్‌గా, రిలాక్స్డ్గా ఉంటాన’ని గౌరంగీ చావ్లా వెల్లడించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) గురువారం ప్రకటించిన పన్నెండో తరగతి పరీక్షా ఫలితాల్లో 500 గానూ 498 మార్కులు సాధించి ఆమె రెండో ర్యాంకు దక్కించుకుంది. ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉన్న నిర్మల్ ఆశ్రమ్ దీపమాల పబ్లిక్ స్కూల్లో చదివిన ఆమె పొలిటికల్ సైన్స్, ఇంగ్లీషు తప్పా మిగతా సబ్జెక్టుల్లో వందకు వంద మార్కులు తెచ్చుకుంది. రెండో ర్యాంకు రావడం పట్ల గౌరంగీ సంతోషం వ్యక్తం చేసింది. ఇన్ని మార్కులు వస్తాయని ఊహించలేదని, ఇంగ్లీషులో 99 మార్కులు తెచ్చుకోవడం మామూలు విషయం కాదని పేర్కొంది. ఇంగ్లీషు సబ్జెక్టు చదివేటప్పుడు విద్యార్థులు సాధారణంగా లిటరేచర్ మీద దృష్టి పెడతారని, తాను మాత్రం గ్రామర్ మీద ఫోకస్ చేశానని వెల్లడించింది. (చదవండి: హన్సిక ఈజ్ ద బెస్ట్!) తన విజయానికి తల్లిదండ్రులు, టీచర్లతో పాటు తన బెస్ట్ ఫ్రెండ్ దేవేంద్ర పరిహార్ కారణమని తెలిపింది. జియోగ్రఫీ(హానర్స్) చేసిన తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పింది. ఒత్తిడిని అధిగమించేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు తనలో తాను మాట్లాడుకునేదాన్నని గౌరంగీ వివరించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ కేంద్రీయ విద్యాలయ విద్యార్థిని ఐశ్వర్య, హర్యానాకు చెందిన భవ్య కూడా 498 మార్కులు సాధించి గౌరంగీ పాటు సంయుక్తంగా రెండో ర్యాంకులో నిలిచారు. హన్సిక శుక్లా(ఘజియాబాద్), కరిష్మా అరోరా 499 మార్కులతో సంయుక్తంగా ఫస్ట్ ర్యాంకు సాధించారు. (చదవండి: 500కు 499 మార్కులు.. మళ్లీ వాళ్లే టాప్!) -
హన్సిక ఈజ్ ద బెస్ట్!
న్యూఢిల్లీ: చరిత్ర అంటే తనకెంతో ఇష్టమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పన్నెండో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన హన్సిక శుక్లా తెలిపింది. సీబీఎస్ఈ ఫలితాల్లో అగ్రస్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఘజియాబాద్‌లోని ఢిల్లీ ప్లబిక్ స్కూల్లో చదివిన హన్సిక.. చరిత్ర, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, హిందూస్తానీ వోకల్లో వందకు వంద మార్కులు సాధించింది. ఇంగ్లీషులో మాత్రమే 99 మార్కులు తెచ్చుకుంది. ‘ఫలితాలు వెలువడిన వెంటనే ఆఫీస్ నుంచి మా నాన్న ఫోన్ చేశారు. నేను చూసుకోలేదు. తర్వాత మా అమ్మ కాల్ చేసి అభినందనలు తెలిపింది. టాప్‌లో నిలిచానని చెప్పడంతో నమ్మలేకపోయాన’ని హన్సిక ‘ఏబీపీ’ వార్తా సంస్థతో చెప్పింది. తన విజయానికి తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని వెల్లడించింది. హన్సిక తల్లి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, తండ్రి రాజ్యసభ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండి, ప్రతి సబ్జెక్ట్‌పై ఫోకస్ చేయడం వల్లే పరీక్షల్లో టాపర్ నిలిచానని హన్సిక తెలిపింది. డిగ్రీలో సైకాలజీ చదివి ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరాలన్నదే తన లక్ష్యమని పేర్కొంది. శాస్త్రీయ సంగీతం, బాలీవుడ్, ఇంగ్లీషు పాటలు వింటూ రిలాక్స్ అవుతుంటానని వెల్లడించింది. జంక్ ఫుడ్ చాలా తక్కువగా తీసుకుంటానని, పనీర్ అంటే తనకు చాలా ఇష్టమని హన్సిక తెలిపింది. (500కు 499 మార్కులు.. మళ్లీ వాళ్లే టాప్!) -
500కు 499 మార్కులు.. మళ్లీ వాళ్లే టాప్!
న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పన్నెండో తరగతి ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఏడాది 84.3 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తీర్ణత శాతంలో విద్యార్థినులే ముందున్నారు. అదేవిధంగా మొదటి రెండు స్థానాల్లోనూ నిలిచి మరోసారి సత్తా చాటారు. 500 గానూ 499 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థినులు హన్సికా శుక్లా, కరీష్మా అరోరా టాప్ స్కోరర్లుగా నిలిచారు. వీరిద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారే కావడం విశేషం. ఇక 498 మార్కులతో ముగ్గురు విద్యార్థినులు గౌరంగీ చావ్లా, ఐశ్వర్య(రిషికేశ్), భవ్య(హర్యానా) సంయుక్తంగా రెండో స్థానం సంపాదించారు. కాగా సీబీఎస్ఈ టాపర్‌గా నిలిచిన హన్సికకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు.. ‘ సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాల్లో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన హన్సికా శుక్లాకు అభినందనలు’ అని ఆయన ట్వీట్ చేశారు. ఇక గతేడాది కూడా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మేఘన శ్రీవాస్తవ 500 మార్కులకు గానూ 499 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, అదే రాష్ట్రానికి చెందిన మరో విద్యార్థిని అనౌష్క చంద్ర 498 మార్కులతో రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
నన్ను క్షమించు నాన్నా...
సాక్షి, న్యూఢిల్లీ : రైలు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందిన విషాదకర ఘటన ఆగ్నేయ ఢిల్లీలో తుగ్లకాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిన్న(ఆదివారం) సాయంత్రం ఢిల్లీకి చెందిన ఇద్దరు విద్యార్థినులను రైలు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన వారిద్దరిని ఆస్పత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా విద్యార్థినుల బ్యాగులు పరిశీలించిన పోలీసులకు నోట్ లభించింది. ‘సారీ నాన్నా’ అంటూ రాసి ఉన్న ఆ నోట్ ఆధారంగా విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం విడుదలైన సీబీఎస్సీ ఫలితాల నేపథ్యంలో డిప్రెషన్‌కు గురై వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఔరా అనిపించిన అమ్మాయిలు
నొయిడా: సీబీఎస్ఈ ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఈసారి కూడా 88.31 శాతం ఉత్తీర్ణతో బాలికలే ముందంజలో ఉండగా.. బాలురు 78.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాకు చెందిన నిధి ఉపాధ్యాయ, సృష్టి సింగ్‌లు ఎన్నో కష్టాలు ఎదురైనా పట్టుదలతో చదివి 96 శాతం మార్కులు సాధించారు. వీరిద్దరు నొయిడాలోని సెక్టార్ 44 గల మహామాయ ప్రభుత్వ బాలికల ఇంటర్ కళాశాలలో చదువుతున్నారు. ర్యాంకులు సాధించడానికి పట్టుదల, నిబద్ధత అవసరమని రుజువు చేశారు. ఖరీదైన, కార్పొరేటు విద్యాలయాల్లో చదివితేనే ర్యాంకులు వస్తాయనే అపోహను పటాపంచలు చేశారు. హ్యుమనిటీస్ విభాగంలో నిధి ఉపాధ్యాయ 96.2 శాతం మార్కులు సాధించగా, బయాలజీ విభాగంలో సృష్టి సింగ్ 98.8 శాతం మార్కులు సాధించి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చారు. ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారు. ఐఏఎస్ కావడమే లక్ష్యం: నిధి ‘మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో బాగా చదివాను. ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు విషయంలో నాన్న వెన్నంటి ఉన్నారు. నా లక్ష్యం ఐఏఎస్ కావడం. కష్టపడి చదివి నా తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేస్తా’ ఆమె కోసమే ఇక్కడికొచ్చా.. నిధి తండ్రి రామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. ‘నా కూతురు చదువులో చురుగ్గా ఉంటుంది. ఆమె చదువు కోసమే ఈ పట్టణానికి వచ్చా. రోజంతా ఆటో నడిపినా పూట గడవడమే కష్టం. అయినే సరే ఆమె కోసం కష్టపడటంలో ఆనందం ఉంది. నిధి తప్పకుండా తన లక్ష్యాన్ని చేరుకుంటుంది’ ఆర్మీ డాక్టర్నవుతా: సృష్టి ‘వ్యాపారం చేసుకుని మమ్మల్ని బాగా చూసుకునే నాన్నకు పెద్ద కష్టం వచ్చింది. గతేడాది నా అనారోగ్యం కారణంగా మా కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఆయన వ్యాపారం పూర్తిగా నష్టాల బాట పట్టింది. నా ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి తలెత్తింది. కానీ, మా ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పట్టుదలగా చదివా. నా కోసం మా టీచర్లు సాయంత్రం కూడా క్లాసులు పెట్టారు. వారికి నా ధన్యవాదాలు. చదువులో రాణించాలంటే గురువుల మార్గదర్శనం తప్పనిసరి. డాక్టర్ని అయి ఆర్మీలో సేవలందిస్తా’ -
సీబీఎస్ఈ: టాప్‌లో బస్ డ్రైవర్ కొడుకు
సాక్షి, న్యూఢిల్లీ: పట్టుదలగా ప్రయత్నిస్తే ఫలితాలు వాటంతటవే వస్తాయని మరోసారి రుజువైంది. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్లో పనిచేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు శనివారం విడుదలైన సీబీఎస్ఈ ఫలితాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచాడు. ఖరీదైన, ‘హైటెక్’ ప్రైవేటు విద్యాలయాల్లో చదివితేనే ర్యాంకులు వస్తాయనే అపోహను పటాపంచలు చేశాడు. శనివారం విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఢిల్లీకి చెందిన ప్రిన్స్ కుమార్ 500 మార్కులకు 485 సాధించి సైన్స్ విభాగంలో ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్‌గా నిలిచాడు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ట్విటర్లో స్పందిస్తూ.. కుమార్ ప్రభుత్వ విద్యాలయాల పట్ల నమ్మకాన్ని పెంచాడని అభినందించారు. ద్వారకా ప్రాంతంలోని సెక్టార్ 10లో గల రాజ్‌కియా ప్రతిభా వికాస్ విద్యాలయలో విద్యనభ్యసిస్తున్న కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవలి కాలంలో ప్రభుత్వం విద్యా పునర్వైభవానికి చర్యలు తీసుకుంటోందని చెప్పాడు. ‘మా పాఠశాలలో సౌకర్యాలు చాలా బాగున్నాయి. నా విజయంలో నిపుణులైన మా ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన వర్గాల పిల్లలు ఎక్కువగా చేరుతుంటారు. మా వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఫలితాలు బాగుంటాయ’ని కుమార్ తెలిపాడు. తమ పాఠశాలలో పనిచేసే మాస్టార్లు ప్రైవేటు బడుల్లో పనిచేసే వారికంటే ఉన్నత విద్యావంతులని కుమార్ వెల్లడించాడు. ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యునికేషన్స్‌లో ఇంజనీరింగ్ చేస్తానని కుమార్ తెలిపాడు. హ్యూమనిటీస్ విభాగంలో 95.6 శాతం మార్కులతో చిత్రా కౌశిక్ మొదటి స్థానంలో నిలవగా, కామర్స్ విభాగంలో 96.2 శాతం మార్కులతో ప్రాచి ప్రకాశ్ టాపర్‌గా నిలిచారు. విద్యా శాఖను పర్యవేక్షిస్తున్న సిసోడియా వారిని ట్విటర్లో అభినందించారు. మంచి ఫలితాలతో ఎంతో మంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. 168 ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని సిసోడియా ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది 82.02 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈ యేడు 83.01 శాతానికి పెరిగింది. Very proud moment, just congratulated Prince Kumar,topper of Delhi Govt school, Science stream in Class 12, Son of a DTC bus driver has got 97% with 100/100 in Maths, 99/100 Eco, 98/100 in Chemistry #DelhiEducationRevolution pic.twitter.com/IeaxhNpX9m — Manish Sisodia (@msisodia) May 26, 2018 It was also touching moment to speak to Prachi Prakash and her family, topper of Delhi Govt school, Commerce stream in Class 12 Daughter of a small private company executive, Prachi got 96.2% with 100/100 in Eco, 99/100 in Math, #DelhiEducationRevolution pic.twitter.com/lQ4eqCXAi8 — Manish Sisodia (@msisodia) May 26, 2018 Was wonderful to talk to a very excited Chitra Kaushik, topper of Delhi Govt school, Arts stream in Class 12 Daughter of an ASI in Delhi Police, she got 95.6% with 100/100 in History, 97/100 in Pol. Science#DelhiEducationRevolution pic.twitter.com/1xr4qZkXOV — Manish Sisodia (@msisodia) May 26, 2018 -
500కు 499 మార్కులు..!
సాక్షి, న్యూఢిల్లీ : గత నెల రోజులుగా విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పన్నెండో తరగతి ఫలితాలను శనివారం వెల్లడించారు. అయితే ఎప్పటిలాగే ఈసారి కూడా ఉత్తీర్ణత శాతంలో విద్యార్థినులే ముందున్నారు. అదేవిధంగా మొదటి మూడు స్థానాల్లోనూ నిలిచి మరోసారి సత్తా చాటారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మేఘన శ్రీవాస్తవ 500 మార్కులకు గానూ 499 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలవగా, అదే రాష్ట్రానికి చెందిన మరో విద్యార్థిని అనౌష్క చంద్ర 498 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన చాహత్ బోద్‌రాజ్ 497 మార్కులు సాధించి మరో ఆరుగురు విద్యార్థినులతో సంయుక్తంగా మూడో స్థానాన్ని ఆక్రమించారు. అసలు ఊహించలేదు... సీబీఎస్ఈ ఆలిండియా టాపర్ మేఘన శ్రీవాత్సవ మీడియాతో మాట్లాడుతూ.. ‘ టాపర్‌గా నిలవడానికి నేను ప్రత్యేకంగా ట్యూషన్‌కి కూడా వెళ్లలేదు. మంచి మార్కులు వస్తాయని ఊహించాను. కానీ టాపర్‌గా నిలుస్తాననుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. సంవత్సరమంతా ఎంతో కష్టపడి చదివాను. అందుకు ఫలితంగా నేడు నా కల నిజమైంది. హార్డ్‌వర్క్ చేయడంతోపాటు.. నిలకడ, నిబద్ధత కూడా చాలా ముఖ్యం. ఒత్తిడికి లోనైతే ఏమీ సాధించలేమంటూ’ తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. హ్యుమానిటీస్ అభ్యసించిన తాను సైకాలజిస్ట్ కావాలనుకుంటున్నానని మేఘన తెలిపారు. మరో విద్యార్థిని చాహత్ బోద్‌రాజ్ కూడా సైకాలజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవడమే తన ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. కాగా ఫలితాల్లో త్రివేండ్రం (97.32 శాతం), చెన్నై (93.87 శాతం), ఢిల్లీ (89 శాతం) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2017లో 82.02మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 83.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈసారి కూడా 88.31 శాతం ఉత్తీర్ణతో విద్యార్థినులే ముందంజలో ఉండగా.. విద్యార్థులు 78.09 శాతం ఉత్తీర్ణత సాధించారు. -
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను శనివారం వెల్లడించారు. 12వ తరగతి పరీక్షల్లో మొత్తం 83.1 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఘజియాబాద్‌కు చెందిన మేఘనా శ్రీవాత్సవ (499/500) టాపర్‌గా నిలిచారు. ఫలితాల్లో త్రివేండ్రం (97.32 శాతం), చెన్నై (93.87 శాతం), ఢిల్లీ (89 శాతం) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా గత ఏడాది కంటే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2017లో 82.02మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, ఈ ఏడాది 83.01 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మరోవైపు ఎప్పటిలాగానే ఉత్తీర్ణతలో విద్యార్థినులే ముందంజలో ఉన్నారు. -
సూపర్ సుకృతి!!
న్యూఢిల్లీలోని మాంట్ఫ్రంట్ స్కూల్లో చదివిన సుకృతి గుప్తా క్లాస్-12 పరీక్షల్లో 99.4శాతం స్కోరు సాధించి ప్రతిభ చాటుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శనివారం ప్రకటించిన ఫలితాల్లో సుకృతి టాప్ ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది. సైన్స్ విద్యార్థిని అయిన ఆమెకు బోర్డ్ పరీక్షల్లో 500 మార్కులకుగాను 497 మార్కులు వచ్చాయి. గత ఏడాది ఢిల్లీలోని న్యూ గ్రీన్ ఫీల్డ్ స్కూల్ విద్యార్థిని కామర్స్ విభాగంలో 496 మార్కులు సాధించి టాపర్‌గా నిలించింది. సుకృతి ఫిజిక్స్, కెమెస్ట్రీ సబ్జెక్టుల్లో 100కు వందమార్కులు తెచ్చుకోగా, మాథ్య్స్, ఇంగ్లిష్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో 99 మార్కుల చొప్పున తెచ్చుకుంది. ఆదివారం జరగనున్న జెఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్‌కు ప్రస్తుతం సుకృతి సిద్ధమవుతోంది. ఇక హర్యానాకు చెందిన పాలక్ గోయెల్ 496 మార్కులతో టాప్ సెంకండ్ ట్యాంకును సొంతం చేసుకుంది.