ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : రైలు ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందిన విషాదకర ఘటన ఆగ్నేయ ఢిల్లీలో తుగ్లకాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిన్న(ఆదివారం) సాయంత్రం ఢిల్లీకి చెందిన ఇద్దరు విద్యార్థినులను రైలు ఢీకొంది. ప్రమాదంలో గాయపడిన వారిద్దరిని ఆస్పత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కాగా విద్యార్థినుల బ్యాగులు పరిశీలించిన పోలీసులకు నోట్ లభించింది. ‘సారీ నాన్నా’ అంటూ రాసి ఉన్న ఆ నోట్ ఆధారంగా విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శనివారం విడుదలైన సీబీఎస్‌సీ ఫలితాల నేపథ్యంలో డిప్రెషన్‌కు గురై వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment