బీఎడ్ ఫలితాలను విడుదల చేస్తున్న పీయూ వీసీ రాజారత్నం
బీఈడీ ఫలితాలు విడుదల
Published Sat, Jul 30 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
పాలమూరు యూనివర్సిటీ: విద్యార్థి దశలో కష్టపడే వారికే బంగారు భవిష్యత్ ఉంటుందని పీయూ వీసీ భూక్యా రాజారత్నం చెప్పారు. పీయూ పరిధిలో ఉన్న 31బీఈడీ కళాశాలల మొదటి ఏడాది వార్షిక ఫలితాలను శనివారం రాత్రి పీయూలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి, కంట్రోలర్ మధుసూదన్‌రెడ్డి, అడిషనల్ కంట్రోలర్ నూర్జహాన్‌తో కలిసి ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 2466మంది విద్యార్థులు పరీక్ష రాయగా దీంట్లో 1474మంది ఉతీర్ణత సాధించినట్లు చెప్పారు. 992మంది విద్యార్థులు ప్రమోట్ అయ్యారని పేర్కొన్నారు. బీఈడీ ఫలితాల్లో 59.77శాతం ఉతీర్ణత సాధించడం మంచి విషయమన్నారు. అయితే పాలమూరు జిల్లాలో ఉన్నత విద్య అభ్యసించే వారి సంఖ్య పెరగాలని కోరారు. విద్యార్థి ఎప్పుడు కూడా ఒక కోర్సు అభ్యసిస్తున్న సమయంలో దానిపై పట్టుపెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Advertisement
Advertisement