మాట్లాడుతున్న పీయూ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి
పారదర్శకంగా ఆన్‌లైన్ ప్రవేశాలు
Published Sat, Aug 27 2016 11:43 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి
జడ్చర్ల టౌన్ : ఈ ఏడాది ప్రభుత్వం డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించడంతో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగిందని పాలమూరు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పాండురంగారెడ్డి అన్నారు. శనివారం జడ్చర్ల డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన జిల్లా అయినప్పటికీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగాయని, జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 21వేల సీట్లు ఉండగా గత ఏడాది 18వేల మంది చేరారని, ఈ పర్యాయం 17,500మంది విద్యార్థులు ప్రవేశం పొందారని తెలిపారు. ఆన్‌లైన్ ప్రవేశాల వల్ల మెరిట్ విద్యార్థులకు న్యాయం జరిగిందన్నారు. కళాశాలలో సీటు లభించినప్పటికీ అడ్మీషన్ పొందని విద్యార్థులు తప్పనిసరిగా ఈనెల 30లోగా ఆయా కళాశాలల్లో ప్రిన్సిపాల్‌లను కలసి కన్ఫర్మేషన్ పొందాలని కోరారు. కళాశాలలు, గ్రూపు, పేర్లలో మార్పులకోసం ఈనెల 30వరకు అవకాశం ఉందని తెలిపారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ భక్తవత్సల్‌రెడ్డి ఉన్నారు.
Advertisement
Advertisement