క్యాన్సర్ బారిన పడిన పిల్లలు( 18సంవత్సరాలలోపు)ఉచితంగా వైద్యం అందించేందుకు పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.
పంజాబ్: పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బారిన పడిన పిల్లలు( 18సంవత్సరాలలోపు) ఉచితంగా వైద్యం అందించేందుకు నిర్ణయించింది. క్యాన్సర్ వ్యాధిపై పత్ర్యేక అవగాహనా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం శుక్రవారం ఈ ప్రకటన చేసింది. ఈ పథకం అమలుకోసం లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ క్యాన్‌కిడ్స్‌తో పంజాబ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది.
సీఎం క్యాన్సర్ రిలీఫ్ ఫండ్ పథకంలో క్యాష్ లెస్ ట్రీట్‌మెంటును రోగులుకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో రూ. 1.5లక్షల మేర చికిత్స కు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈ క్యాష్‌లెస్ ట్రీట్‌మెంటును ఇకపై పిల్లలకుకూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. పీడియాట్రిక్ ఆంకాలజీ పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో రాష్ట్ర ఆరోగ్య మంత్రి బ్రహ్మ మహీంద్రా ప్రకటించారు. రాష్ట్రంలో క్యాన్సర్తో బాధపడుతున్న ప్రతి శిశువుకు ఆరోగ్య సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకు లాభాపేక్ష లేని సంస్థ స్వచ్ఛంద సంస్థ క్యాన్‌కిడ్స్‌తో పంజాబ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. క్యాన్సర్‌పై మరింత అవగాహన కల్పించడానికి వచ్చే వారం రాష్ట్ర వ్యాప్త కార్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో పటియాలా, అమృత్‌సర్ మెడికల్ కాలేజీతో సహా ఇతర క్యాన్సర్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగు పర్చేపథకాలను అమలు చేసినట్టు పేర్కొనన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు, మహిళలకు పరీక్షలు నిర్వహించడానికి వైద్య అధికారులు, సిబ్బంది నర్సులు, సహాయక నర్సింగ్ మంత్రసానులకు ఏఎన్‌ఎం ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణను అందిస్తోంది.