cashless
-
నగదు రహిత చికిత్స పథకం తీసుకురావాలి
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించే విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ కాలంలో బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందించేలా ఒక పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 162(2) ప్రకారం ఈ పథకం అమల్లోకి తేవాలని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని రూపొందించి, అమలు చేయాలని స్పష్టంచేసింది. దీనివల్ల విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొంది. సెక్షన్ 2(12–ఎ) ప్రకారం గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట. రోడ్ ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన వారికి తొలి గంటలో చికిత్స అందిస్తే వారి ప్రాణాలు కాపాడే అవకాశాలు అధికంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాణాలు కాపాడడం కష్టమవుతుందని పేర్కొంటున్నారు. చట్టప్రకారం గోల్డెన్ అవర్‌లో బాధితు లకు నగదు రహిత చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని తీసుకురావాల్సిందేనని, ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. -
Health Insurance: ఎక్కడైనా నగదు రహిత వైద్యం!
ఆస్పత్రిలో చేరాల్సి వస్తే ఆదుకునే సాధనం హెల్త్ ఇన్సూరెన్స్. ఇందులో ఉన్న ముఖ్యమైన సదుపాయాల్లో ఒకటి నగదు రహిత వైద్యం. ముందస్తు ప్రణాళికతో లేదా అత్యవసర సమయాల్లో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా ఈ సదుపాయం ఎంతో అక్కరకు వస్తుంది. సాధారణంగా బీమా సంస్థ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే ఈ నగదు రహిత వైద్యం అందుబాటులో ఉండేది. నెట్వర్క్ జాబితాలో లేని ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటే, సొంతంగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్మెంట్ క్లెయిమ్ దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ ఇబ్బందిని తప్పిస్తూ.. ఏ ఆస్పత్రిలో అయినా నగదు రహిత వైద్యం పొందేందుకు వీలుగా జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఈ ఏడాది జవనరి నుంచి ‘ఎక్కడైనా నగదు రహితం’ పేరుతో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి విధి విధానాలేమిటో చూద్దాం. బీమా సంస్థ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లోనూ నగదు రహిత చికిత్స పొందడమే నూతన విధానంలోని సౌలభ్యం. ప్రతి బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్స్ పేరుతో ఒక జాబితా నిర్వహిస్తుంటుంది. ఆ జాబితాలోని ఏ హాస్పిటల్లో చికిత్స పొందినా బీమా సంస్థే నేరుగా చెల్లింపులు చేస్తుంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ నెట్వర్క్ ఆస్పత్రిలోనే చికిత్స పొందాలంటే సాధ్యపడకపోవచ్చు. ప్రమాదానికి గురైనప్పుడు వేగంగా సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం వల్ల విలువైన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఆ ఆస్పత్రి బీమా నెట్‌వర్క్‌లో భాగంగా లేకపోతే? బిల్లు భారీగా వస్తే..? ఆ మొత్తాన్ని రోగి సంబందీకులు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాగే, వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ అయి, సత్వర వైద్యం అందాల్సిన సందర్భాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అలాంటి తరుణంలో సమీపంలోని హాస్పిటల్‌కు వెళ్లక తప్పదు. ఆ సమయంలో ఎక్కడైనా నగదు రహితం ఉపయోగపడుతుంది. అత్యవసరమనే కాదు, ముందుగా అనుకుని నిర్ణిత సమయానికి తీసుకునే చికిత్సలకు సైతం నాన్ నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లొచ్చు. కాకపోతే ఎక్కడైనా నగదు రహితం విధానం ఎలా పనినిచేస్తుందో తెలుసుకోవడం అవసరం. నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిందే.. జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి రావడానికి ముందు కూడా కొన్ని బీమా సంస్థలు నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి అవకాశం కల్పించాయి. ఇప్పుడు ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, నేషనల్ ఇన్సూరెన్స్, ఫ్యూచర్ జనరాలి, రిలయన్స్ జనరల్, బజాజ్ అలియాంజ్ జనరల్ సైతం నాన్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేశాయి. ముందస్తుగా నిర్ణయించుకుని, తీసుకునే చికిత్స విషయంలో బీమా సంస్థ లేదంటే థర్డ్ పార్టీ అడ్మిని్రస్టేటర్ (టీపీఏ)కు రెండు నుంచి మూడు రోజుల ముందు (48–72 గంటలు) తెలియజేయడం తప్పనిసరి. ఈ మెయిల్ లేదంటే ఇతర ఆన్లైన్ మార్గాల ద్వారా లేదంటే లిఖిత పూర్వకంగా బీమా సంస్థకు తెలియజేయవచ్చు. అత్యవసరంగా చికిత్స తీసుకోవాల్సి వస్తే కనుక నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చేరిన 24 నుంచి 48 గంటల్లోపు (బీమా సంస్థ ఆధారంగా వేర్వేరు) విషయాన్ని తెలియజేయాలి. 15 పడకలు తప్పనిసరి.. నగదు రహిత వైద్యం పొందేందుకు ఎంపిక చేసుకునే ఆస్పత్రిలో కనీసం 15 పడకలు (బెడ్స్) ఉండాలన్నది నిబంధన. హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ నిబంధనలకు అనుగుణంగా, హాస్పిటల్ అనే నిర్వచనానికి అనుగుణంగా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పనిచేస్తూ ఉండాలి. గుర్తింపు కార్డులు, పాలసీ డాక్యుమెంట్లు, మెడికల్ రిపోర్ట్లు, పి్రస్కిప్షన్లు, బిల్లులు నిర్ధేశిత ఫార్మాట్లో బీమా సంస్థకు పంపించాల్సి ఉంటుంది. నగదు రహిత వైద్యానికి అనుమతించే ముందు నాన్ నెట్వర్క్ హాస్పిటల్ నుంచి ఆమోద లేఖను చాలా బీమా సంస్థలు కోరుతున్నాయి. ఆస్పత్రి బిల్లులు నిజమైనవేనా? ప్రామాణిక అడ్మిషన్ ప్రక్రియ విధానాన్నే అనుసరిస్తున్నారా? ప్రమాణాలకు అనుగుణంగానే చికిత్సా విధానాలు ఉన్నాయా? అని బీమా సంస్థలు పరిశీలిస్తాయి. ఇక పాలసీకి సంబంధించి వెయిటింగ్ పీరియడ్ (కొన్ని వ్యాధుల చికిత్సా క్లెయిమ్‌లో వేచి ఉండాల్సిన కాలం), కోపే క్లాజ్, మినహాయింపులు, ముందస్తు వ్యాధుల నిబంధనల్లో ఎలాంటి మార్పు ఉండదని గమనించాలి. కొన్ని చికిత్సలకు సంబంధించి (ఉదాహరణకు కేటరాక్ట్) ఉప పరిమితులు ఉంటే, వాటి విషయంలోనూ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ పరంగా ఎలాంటి మార్పు ఉండదు. పాలసీలో ప్రత్యేకమైన రైడర్ తీసుకుంటే తప్ప కాటన్, ఫేస్ మాస్‌్కలు, సర్జికల్ గ్లోవ్‌లు, నెబ్యులైజేషన్ కిట్లకు పరిహారం రాదు. ఏవైనా అదనపు చార్జీలు (కవరేజీలోకి రానివి) విధిస్తే, పాలసీదారు సొంతంగా చెల్లించుకోవాలి. చార్జీల పట్ల అవగాహన నెట్వర్క్ ఆస్పత్రులు వివిధ రకాల చికిత్సలకు వసూలు చేసే చార్జీల వివరాలు బీమా సంస్థ రికార్డుల్లో ఉంటాయి. దీనివల్ల పాలసీదారు సొంత పాకెట్‌పై భారం పడదు. నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో చికిత్సలకు ఎంత చార్జీ వసూలు చేస్తారన్నది కీలకం అవుతుంది. నెట్వర్క్ హాస్పిటల్‌కు మించి నాన్ నెట్వర్క్ ఆస్పత్రి చార్జీ చేస్తే, అప్పుడు క్లెయిమ్ పూర్తిగా రాకపోవచ్చు. పైగా ఆస్పత్రి పడకలు, ఏ ప్రాంతంలో ఉందన్న దాని ఆధారంగా చికిత్సల ధరలు ఉంటాయి. ఉదాహరణకు ఒక చికిత్సకు నెట్వర్క్ హాస్పిటల్లో రూ.50,000 పరిమితి ఉందనుకోండి. అదే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో ఇదే చికిత్సకు రూ.70,000 వేలు చార్జ్ చేస్తే, పాలసీదారు తాను సొంతంగా రూ.20,000 చెల్లించాల్సి వస్తుంది. అందుకని నగదు రహిత వైద్యం కోరుకునే వారు తమ పాకెట్ నుంచి పెద్దగా చెల్లించొద్దని భావిస్తే, అప్పుడు బీమా సంస్థ నెట్వర్క్ హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది. కొన్ని సందర్భాల్లో నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ తిరస్కరణకు గురికావచ్చు. అలాంటప్పుడు పాలసీదారు సొంతంగా చెల్లించి, డిశ్చార్జ్ తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు వెళ్లాల్సి వస్తుంది. రోగికి శరవేగంగా చికిత్స అవసరమైతే తప్పించి, మిగిలిన వాటికి నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్‌ను ఎంపిక చేసుకోకపోవడం మంచిది. నెట్వర్క్–నాన్ నెట్వర్క్ బీమా సంస్థ నగదు రహిత వైద్యం అందించేందుకు వీలుగా పలు ఆస్పత్రులతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. ఇలా ఒప్పందానికి వచ్చిన ఆస్పత్రులు నెట్వర్క్ జాబితాలో ఉంటాయి. ఇలా ఒప్పందం చేసుకునే సమయంలోనే చికిత్సల ధరల విషయంలో బీమా సంస్థ ఆస్పత్రులతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. దీనివల్ల బీమా సంస్థకు కొంత భారం తగ్గుతుంది. నాన్ నెట్వర్క్ హాస్పిటల్స్‌తో ఈ అనుకూలత బీమా సంస్థలకు ఉండదు. బ్లాక్ లిస్ట్‌లో ఉండకూడదు అన్నింటికంటే ముఖ్యమైనది.. చికిత్స కోసం ఎంపిక చేసుకునే నాన్ నెట్వర్క్ ఆస్పత్రి బీమా సంస్థ బ్లాక్ లిస్ట్‌లో ఉండకూడదు. బ్లాక్ లిస్ట్‌లోని ఆస్పత్రిలో చేరడం వల్ల నగదు రహిత వైద్యం అందదు. రీయింబర్స్‌మెంట్‌కు కూడా అవకాశం ఉండదు. దీనివల్ల మొత్తానికే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే అత్యవసరంగా చికిత్స అవసరమైనప్పుడు కూడా బీమా సంస్థ పోర్టల్‌కు వెళ్లి బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్ జాబితాను ఓ సారి పరిశీలించడం ఎంతో మంచిది. ఇక ముందస్తు ప్రణాళికతో తీసుకునే చికత్సలకు బీమా సంస్థ నెట్‌వర్క్‌లోని హాస్పిటల్‌కు వెళ్లడమే మేలు. ఎందుకంటే నెట్వర్క్ ఆస్పత్రులు బీమా సంస్థ నిబంధనలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. కనుక క్లెయిమ్ విషయంలో ఎలాంటి సమస్యలు దాదాపుగా ఎదురుకావు. నెట్వర్క్ హాస్పిటల్‌తో లాభాలు ► నెట్వర్క్ (ఎంపానెల్డ్) ఆస్పత్రుల్లో టారిఫ్‌లు బీమా సంస్థతో కుదిరిన అంగీకారం మేరకు ఉంటాయి. చికిత్సల చార్జీలు నిర్ధేశిత పరిమితుల పరిధిలోనే ఉంటాయి. దీంతో క్లెయిమ్‌కు సత్వర ఆమోదం లభిస్తుంది. వేగంగా డిశ్చార్జ్ కావచ్చు. ► నెట్వర్క్ హాస్పిటల్లో నగదు రహిత వైద్యానికి సంబంధించి క్లెయిమ్ పరిష్కారం సాఫీగా, వేగంగా జరుగుతుంది. ► నెట్వర్క్ ఆస్పత్రులు అన్నింటిలోనూ చికిత్సల నాణ్యాత ప్రమాణాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో రోగులకు చికిత్సల తర్వాత సమస్యల రిస్క్ తగ్గుతుంది. ► ఆస్పత్రి, బీమా సంస్థ మధ్య విశ్వసనీయమైన బంధం వల్ల చికిత్సల బిల్లులను మరీ పెద్దవి చేసి చూపించడం ఉండదు. అనవసర ప్రక్రియలు, ఔషధాల వినియోగం ఉండదు. మోసాల రిస్క్ తగ్గుతుంది. -
ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స సౌకర్యం
-
నెట్‌వర్క్‌లోలేని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ ట్రీట్మెంట్.. కానీ..
ప్రైవేటు ఆస్పత్రుల్లో నెట్‌వర్క్‌లోలేని హాస్పటల్స్‌లో కూడా ఇవ్వాళ్టి నుంచి క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. ఈమేరకు కీలక నిర్ణయం వెలువడింది. ఆరోగ్య బీమా తీసుకున్న వారు అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈరోజు నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లు ‘ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ తెలిపింది. బీమా తీసుకుని ఏదైనా సమస్యతో ఆసుపత్రిలో చేరిన వారికి ఇకపై ఇబ్బందులు తొలగనున్నాయి. ఇప్పటివరకు నెట్వర్క్ ఆసుపత్రుల్లో చేరితేనే ఎలాంటి డబ్బు చెల్లించకుండా వైద్యం పూర్తయ్యేది. అయితే ఈరోజు నుంచి నెట్వర్క్ ఆసుపత్రులతోపాటు ఆ జాబితాలో లేని హాస్పటల్స్‌లో చేరినా ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది. జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నెట్వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయం వినియోగించుకోవాలంటే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకు రెండు రోజుల ముందు అంటే 48 గంటల ముందే సదరు వైద్యం గురించి తెలియజేయాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ఎమర్జెన్సీ సందర్భాల్లో నెట్‌వర్క్‌లోలేని ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోపు కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిం వర్తిస్తుందని కౌన్సిల్ వివరించింది. ఇప్పటివరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్వర్క్ హాస్పిటల్స్‌లో మాత్రమే క్యాష్‌లెస్‌కు అనుమతి ఉండేది. క్యాష్‌లెస్ సదుపాయం లేనిచోట వైద్యానికి అయ్యే ఖర్చును పాలసీదారులే చెల్లించాలి. తర్వాత క్లెయిమ్ చేసుకోవాలి. దాంతో ట్రీట్మెంట్ అయిన ఖర్చు పూర్తిగా ఇవ్వొచ్చు ఇవ్వకపోవచ్చు. ఫలితంగా పాలసీదారులు కొంత నష్టపోయే అవకాశం ఉండేది. దాంతోపాటు ఈ ప్రక్రియ సంక్లిష్టంగా ఉండడం, రిఫండ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉండేవి. ఇదీ చదవండి: దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం! ప్రస్తుతం 63 శాతం మంది క్యాష్‌లెస్ సదుపాయం ఎంచుకుంటుంటే.. మిగిలినవారు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని కౌన్సిల్ ఎండీ, బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈఓ తపన్ సింఘాల్ తెలిపారు. క్లెయిం ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. -
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స..! కేంద్రం కీలక నిర్ణయం
ఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి ఉచిత వైద్యం అందేలా నూతన విధానాన్ని రూపొందించింది. మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. “ప్రమాదంలో గాయపడిన బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందించడం మోటారు వాహన చట్టం 2019 సవరణలో భాగం. కొన్ని రాష్ట్రాలు దీనిని ఇప్పటికే అమలు చేశాయి. అయితే ఇప్పుడు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కలిసి రోడ్ల మంత్రిత్వ శాఖ దీనిని దేశవ్యాప్తంగా పూర్తిగా అమలు చేయనుంది” అని రోడ్డు రవాణా, హైవేస్ సెక్రటరీ అనురాగ్ జైన్ చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రమాదం జరిగిన వెంటనే సమీప ఆసుపత్రిలో ఉచిత వైద్య సాయం కల్పించడమే దీని ఉద్దేశమని అనురాగ్ జైన్ తెలిపారు. గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన గంటలోపే)తో సహా రోడ్డు ప్రమాద బాధితులందరికీ దీన్ని వర్తింపజేస్తామన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో ఇది అందుబాటులోకి రానుందన్నారు. ఇదీ చదవండి: మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఖరారు!? -
ఆర్టీసీలో మరో సరికొత్త వ్యవస్థ..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో క్యాష్‌లెస్ టికెట్ జారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీనికోసం ప్రత్యేకంగా రీచార్జి చేసుకునే కార్డులను జారీ చేయనుంది. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారానే టికెట్ కొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగం కోసం తొలుత హైదరాబాద్ సిటీలోని 16వ నంబర్ బస్ రూట్‌ను కేటాయించారు. ఈ రూట్లో తిరిగే బస్సుల్లో దీన్ని అమలు చేసి.. లోటుపాట్లు, లాభనష్టాలు గుర్తించి దాని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. భవిష్యత్తులో ఈ కార్డులను ఇతర అవసరాలకు కూడా వినియోగించేలా మార్పు చేయనున్నారు. టికెట్ జారీ ఇలా... ఈ ప్రత్యేక కార్డులు ప్రతిపాదిత మొత్తం (రూ.30గా ప్రస్తుతానికి అంచనా) చెల్లించి కొనాలి. అందులో నిర్ధారిత మొత్తాన్ని టాప్అప్ చేయించుకోవాలి. ఆ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. కండక్టర్ వద్ద ప్రత్యేక టికెట్ జారీ యంత్రం ఉంటుంది. ప్రయాణికుడు ఏ స్టేజీలో దిగాలో నమోదు చేసి ప్రయాణికుడి వద్ద ఉన్న కార్డులో ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే నిర్ధారిత టికెట్ మొత్తం కార్డు నుంచి డిడక్ట్ అవుతుంది. ఆ యంత్రం నుంచి టికెట్ జారీ అవుతుంది. కార్డులో బ్యాలెన్స్ అయిపోగానే మళ్లీ రీచార్జి చేసుకోవాలి. దీంతో చిల్లర సమస్యలుండవు, టికెట్ జారీలో అవకతవకలకు ఆస్కారం ఉండదు. ప్రయాణికుడు కచ్చితంగా వెంట టికెట్ డబ్బు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఓ కంపెనీకి ప్రయోగం బాధ్యత.. ఇటీవల వన్ మనీ అనే ప్రైవేటు కంపెనీ ఈ కార్డు విషయంలో ఆర్టీసీని సంప్రదించింది. ఇప్పటికే క్యాష్‌లెస్ లావాదేవీల విషయంలో యాప్స్ రూపొందించి అమలు చేయడంలో తనకున్న అనుభవాన్ని పేర్కొంటూ ఆర్టీసీలో దాన్ని అమలు చేయాలని కోరింది. ఈ మేరకు ప్రయోగాత్మక పరిశీలన రూట్‌ను దానికి అప్పగించారు. సిటీలో సికింద్రాబాద్–కుషాయిగూడ మధ్య ఉండే 16వ నంబర్ బస్ రూట్లో దీన్ని అమలు చేయనున్నారు. డిజిటల్ ఇండియా కింద కేంద్ర ప్రభుత్వం సంస్థలకు భారీగా సాయం చేస్తోంది. ఇప్పుడు ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలకు సంబంధించి కూడా సంబంధిత సంస్థకు కేంద్రం నుంచి భారీగా నగదు ప్రోత్సాహకాలు, గ్రాంట్లు అందే అవకాశం ఉంటుందని సమాచారం. ఆర్టీసీలో ఈ విధానాన్ని నిర్వహించే ప్రైవేటు సంస్థలకు ఈ లబ్ధి ఉండనున్నందున అవకాశం కోసం పలువురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల సమీక్ష.. రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి విజేంద్ర బోయీ ఆధ్వర్యంలో అధికారులు ఇటీవల దీనిపై సమీక్ష జరిపారు. ఆ కార్డును ఆధార్‌తో అనుసంధానించాలన్న సదరు కంపెనీ సూచనను అధికారులు వ్యతిరేకించారు. అలా చేయలేమని చెప్పడంతో ప్రస్తుతానికి ఆధార్‌తో అనుసంధానం లేకుండానే ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే టెండర్ ప్రక్రియ ద్వారా రాష్ట్రం మొత్తం నిర్వహించే బాధ్యతను నిర్ధారిత కంపెనీకి అప్పగించనున్నట్లు అధికారులు చెప్పారు. 5 శాతం రాయితీ.. కార్డును వినియోగించి టికెట్ కొంటే నిర్ధారిత బస్సు చార్జీపై 5 శాతం రాయితీ ఇచ్చేలా యోచిస్తున్నారు. దీంతో ప్రయాణికుడికి కొంత వెసులుబాటు కలుగుతుంది. డబ్బు చెల్లించడం కంటే నగదు రహిత లావాదేవీకే మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు. -
క్యాష్‌లెస్.. తుస్!
‘దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి నా ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు. ఇక ప్రతీ ఫోన్ బ్యాంక్‌లా పని చేస్తుంది. అతి తక్కువ ఖర్చుతో ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టాం. త్వరలోనే తొలి క్యాష్‌లెస్ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దనున్నా.’ – తూర్పుగోదావరి జిల్లాలోని ‘మోరి’ని గత ఏడాది క్యాష్‌లెస్ గ్రామంగా ప్రకటిస్తున్నప్పుడు సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. సాక్షి, అమరావతి/ సాక్షి నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాష్‌లెస్ లావాదేవీలు బాగా తగ్గిపోయాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా హాజరై 100 శాతం క్యాష్‌లెస్ గ్రామంగా ప్రకటించిన మోరి గ్రామంలో కూడా ఇప్పుడు పూర్తిగా నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి బ్యాంకులు వివిధ జిల్లాల్లోని పలు గ్రామాలను ‘క్యాష్‌లెస్’గా తీర్చిదిద్దడానికి దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. ప్రస్తుతం ఈ గ్రామాల్లోనూ ఆ ఊసే లేదు. పెద్ద నోట్ల రద్దు జరిగి ఈ నెల 8వ తేదీకి ఏడాది కానుండటంతో రాష్ట్రంలో క్యాష్‌లెస్ లావాదేవీల పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయమై ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. తమ ఊర్లను బ్యాంకులు దత్తత తీసుకున్న సంగతి ఆయా గ్రామాల్లో 90 శాతం మంది ప్రజలు ఇపుడు మరచిపోయారంటే పరిస్థితి ఎలా మారిపోయిందో స్పష్టమవుతోంది. అప్పట్లో బలవంతం వల్ల స్వైపింగ్ మెషిన్లు కొనుగోలు చేసిన వ్యాపారులు బ్యాంకు చార్జీలు భరించలేక వాటిని తిరిగి ఇచ్చేయడం గమనార్హం. నగదుకే మోరీ జై... తూర్పుగోదావరి జిల్లాలోని మోరీ గ్రామం జీడిపప్పు, చేనేతకు ప్రసిద్ధి. సుమారు 1400 కుటుంబాలున్న ఈ గ్రామాన్ని డిసెంబర్ 28న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోనే తొలి స్మార్ట్ విలేజ్గానే కాకుండా 100% క్యాష్‌లెస్ గ్రామంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఇక మోరీ గ్రామ ప్రజలకు నగదుతో పనిలేదని అంతా ఫోన్ ద్వారానే లావాదేవీలు జరుపుతారని చెప్పారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ ఓ స్మార్ట్‌ఫోన్‌ను అందజేశారు. వ్యాపారులకు స్వైపింగ్ మెషీన్లు ఇచ్చారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ గ్రామంలో ఫైబర్ నెట్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, కేబుల్ కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి జన్‌ధన్ ఖాతాను ప్రారంభింప చేసి ఆ ఖాతాలను ఆధార్ నంబరుతో అనుసంధానం చేశారు. గ్రామంలో 8 చోట్ల ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆధార్ చెల్లింపు వ్యవస్థకు కావాల్సిన ఫింగర్ ప్రింట్ స్కానర్ ధర రూ.2,000 అయితే వాటిని రూ.1,000 చొప్పున సబ్సిడీతో అందజేశారు. కానీ ఇప్పుడు ఈ గ్రామంలో అంతటా నగదు లావాదేవీలే జరుగుతున్నాయి. ఫైబర్ గ్రిడ్ కనెక్షన్ ద్వారా కేవలం కేబుల్ టీవీ ప్రసారాలు తప్ప ఇంటర్నెట్ పని చేయడం లేదు. వారిచ్చిన స్మార్ట్ ఫోన్లు మొరాయించాయి. ఫింగర్ ప్రింట్ వ్యవస్థ పని చేయడం లేదు. దీంతో ప్రజలు నగదు లావాదేవీలకే మొగ్గు చూపుతున్నారు. ఉచిత వైఫై కేంద్రాలు కూడా పని చేయడం లేదు. కాగా, చేనేత సొసైటీలకు మాత్రం పెద్ద నోట్లు రద్దు కాకముందు నుంచీ ఆన్లైన్ ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి. జీడిపిక్కల ఒలుపు కేంద్రాల్లోపనిచేసే కూలీలకు రోజువారీ వేతనాలను నగదు రూపంలోనే చెల్లిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. కూలీలు కూడా నగదు తీసుకోవడాన్నే ఇష్టపడుతున్నారు. నెట్వర్క్ అంతంత మాత్రం కావడంతో స్వైపింగ్ మెషిన్లు సరిగా పని చేయడం లేదని మెడికల్ షాపు యజమానులు, ఇతర వ్యాపారులు చెబుతున్నారు. రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి.. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఒకటి, రెండు నెలలు క్యాష్‌లెస్... డిజిటల్ బ్యాంకింగ్ అంటూ అధికారులు హడావుడి చేశారు. ప్రజలు దీనికి అలవాటు పడలేక పోవడంతో నగదు లావాదేవీలు మళ్లీ పెరిగాయి. దీంతో ‘క్యాష్‌లెస్’ ఊసే లేకుండాపోయింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం కన్నమడకల, గుట్టపాడు, ఎస్.కొం తలపాడు, పాలకొలను గ్రామాలను సిండికేట్ బ్యాంక్ క్యాష్‌లెస్ గ్రామాలుగా ప్రకటించింది. కానీ ఇప్పుడు ఈ గ్రామాల్లో కూడా అత్యధిక లావాదేవీలు నగదు రూపం లోనే జరుగుతున్నాయి. నగదు రహిత లావాదేవీలు లేకపోవడం, అవి జరిగినా.. జరగకపోయినా స్వైపింగ్ మెషీన్లకు ప్రతీనెలా సర్వీసు చార్జీ కింద రూ.1,400 వరకు చెల్లించాల్సి వస్తుండటంతో చాలామంది వ్యాపారస్తులు వాటిని తిరిగి ఇచ్చేశారు. ప్రకాశం జిల్లాలో ఆంధ్రా బ్యాంక్ దత్తత తీసుకున్న టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెం, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు దత్తత తీసుకున్న కాకుటూరిపాలెంలో కూడా ఇదే విధమైన పరిస్థితులు కనిపించాయి. రేషన్‌తో సహా అన్నీ నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహిస్తున్నామని, అసలు ఈ బ్యాంకులు తమ గ్రామాలను దత్తత తీసుకున్న విషయమే తెలియదని ఈ గ్రామాల వారు చెపుతుండటం విశేషం. ఇతర జిల్లాల్లో బ్యాంకులు దత్తత తీసుకున్న గ్రామాల్లోనూ పరిస్థితులు ఇంతకన్నా భిన్నంగా ఏమీలేవు. సాగని నగదు రహిత లావాదేవీలు నగదు రహిత లావాదేవీలు సక్రమంగా సాగడం లేదు. పేటీఎం, స్వైపింగ్ పద్ధతుల ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.15 వేల లావాదేవీలు చేశాను. అయితే నా బ్యాంకు అకౌంటుకు ఆ మేరకు డబ్బులు జమ కాలేదు. బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. లావాదేవీల స్లిప్‌లు అలాగే ఉండిపోయాయి. జాగ్రత్త చేయమని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. చిన్నపాటి వ్యాపారం చేసుకునే నాకు కష్టంగా ఉంది. దీంతో నగదు రూపంలోనే లావాదేవీలు కొనసాగిస్తున్నా. – సీహెచ్ పెదనందయ్య, మహలక్ష్మి మెడికల్ స్టోర్, మోరి, తూర్పుగోదావరి జిల్లా నగదుతోనే లావాదేవీలు.. మా గ్రామంలో నగదు రహిత లావా దేవీలు జరగడం లేదు. గ్రామంలోని వారంతా డబ్బులుతోనే లావాదేవీలు నిర్వహించుకుంటున్నారు. మా గ్రామాన్ని బ్యాంకు దత్తత తీసుకుందని మీరు చెప్పటమే తప్ప మాకు తెలియదు. అవగాహనా కార్యక్రమాలు నిర్వహించలేదు. నగదురహిత లావాదేవీలు అంతా ఉష్. – దామచర్ల కొండలరావు, రైతు, తూర్పునాయుడుపాలెం, ప్రకాశం జిల్లా సర్వీసు చార్జీలతో నష్టం.. మా ఊళ్లో నాతో పాటు మరో ఇద్దరికి స్వైపింగ్ మిషన్లు ఇచ్చారు. మొదటి నెలలో రూ.25 వేల నగదు రహిత లావాదేవీలు జరిగాయి. ఆ తర్వాత తగ్గిపోతూ వచ్చింది. అయితే బ్యాంకర్లు ప్రతినెల రూ.1350 నుంచి రూ.1850 వరకు సర్వీసు చార్జీ విధిస్తూ రావడంతో లావాదేవీలను నిలిపేశాను. అయినా సర్వీసు చార్జీలు చెల్లించాలని బ్యాంకు అధికారులు ఇప్పటికీ నోటీసులు పంపుతున్నారు. సర్వీస్ చార్జీలను రద్దుచేస్తేనే డిజిటల్ బ్యాంకింగ్ పుంజుకునే అవకాశం ఉంది. – భాస్కర్‌రెడ్డి, చిరువ్యాపారి, గుట్టపాడు, ఓర్వకల్ మండలం, కర్నూలు జిల్లా -
క్యాన్సర్ సోకిన పిల్లలకు ఇక్కడ ఉచిత వైద్యం
పంజాబ్: పంజాబ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్యాన్సర్ బారిన పడిన పిల్లలు( 18సంవత్సరాలలోపు) ఉచితంగా వైద్యం అందించేందుకు నిర్ణయించింది. క్యాన్సర్ వ్యాధిపై పత్ర్యేక అవగాహనా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం శుక్రవారం ఈ ప్రకటన చేసింది. ఈ పథకం అమలుకోసం లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ క్యాన్‌కిడ్స్‌తో పంజాబ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక అవగాహనా ఒప్పందంపై సంతకం చేసింది. సీఎం క్యాన్సర్ రిలీఫ్ ఫండ్ పథకంలో క్యాష్ లెస్ ట్రీట్మెంటును రోగులుకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో రూ. 1.5లక్షల మేర చికిత్స కు కేటాయించనున్నారు. ఇప్పటివరకు ఇది పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈ క్యాష్‌లెస్ ట్రీట్మెంటును ఇకపై పిల్లలకుకూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. పీడియాట్రిక్ ఆంకాలజీ పై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో రాష్ట్ర ఆరోగ్య మంత్రి బ్రహ్మ మహీంద్రా ప్రకటించారు. రాష్ట్రంలో క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రతి శిశువుకు ఆరోగ్య సేవలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకు లాభాపేక్ష లేని సంస్థ స్వచ్ఛంద సంస్థ క్యాన్‌కిడ్స్‌తో పంజాబ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. క్యాన్సర్‌పై మరింత అవగాహన కల్పించడానికి వచ్చే వారం రాష్ట్ర వ్యాప్త కార్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో పటియాలా, అమృత్సర్ మెడికల్ కాలేజీతో సహా ఇతర క్యాన్సర్ ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగు పర్చేపథకాలను అమలు చేసినట్టు పేర్కొనన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలు, మహిళలకు పరీక్షలు నిర్వహించడానికి వైద్య అధికారులు, సిబ్బంది నర్సులు, సహాయక నర్సింగ్ మంత్రసానులకు ఏఎన్ఎం ఆరోగ్య శాఖ ప్రత్యేక శిక్షణను అందిస్తోంది. -
క్యాష్‌లెస్ దిశగా ఎల్ఐసీ
జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నగదు లావాదేవీలను తగ్గించే దిశగా బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) కసరత్తు ప్రారంభించింది. మెట్రోల్లోని పలు కార్యాలయాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషీన్లను ఏర్పాటు చేసింది. కస్టమర్లు డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా ప్రీమియం సులభంగా చెల్లించే వీలుగా దశలవారీగా ఇతర కార్యాలయాల్లో ఈ మెషీన్లను అందుబాటులోకి తేనున్నట్టు ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ మేనేజర్ టి.సి.సుశీల్ కుమార్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఏడాదిలోగా అన్ని కార్యాలయాలకు ఈ సౌకర్యాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. స్మార్ట్‌ఫోన్ నుంచే చెల్లింపులు పూర్తి అయ్యేలా టెక్నాలజీని అందిపుచ్చుకుంటామని అన్నారు. ‘జోన్ పరిధిలో 1.5 లక్షలపైచిలుకు ఏజెంట్లు ఉన్నారు. మార్చి నాటికి ఈ సంఖ్యను 2 లక్షలకు చేర్చనున్నాం. 36 లక్షల కొత్త పాలసీలను జారీ చేయాలని లక్ష్యం విధించుకున్నాం. కొత్త ప్రీమియం రూ.5,100 కోట్లకు చేరుకుంటాం’ అని వివరించారు. గతేడాది క్లెయిమ్‌ల చెల్లింపులు రూ. లక్ష కోట్లపైనే సంస్థ వయసు 61 ఏళ్లు; మార్కెట్ వాటా 71 శాతం ముంబై: దేశీ బీమా రంగంలో 71 శాతం వాటా తనదేనని ఎల్ఐసీ ప్రకటించింది. శుక్రవారంతో 61 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఒక ప్రకటన చేస్తూ... 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా విలువైన క్లెయిమ్‌లను పరిష్కరించినట్టు తెలిపింది. 2.15 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించగా, వీటి విలువ రూ.1,12,700 కోట్లని తెలిపింది. కాల వ్యవధి తీరిన పాలసీలకు సంబంధించి వచ్చిన దరఖాస్తుల్లో 98.34 శాతం, మరణానికి సంబంధించి వచ్చిన క్లెయిమ్‌లలో 99.63 శాతం దరఖాస్తులను పరిష్కరించినట్లు సంస్థ తెలియజేసింది. సంస్థ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ.25 లక్షల కోట్లు కాగా ఉద్యోగుల సంఖ్య 1.15 లక్షలు. 11.31 లక్షల మంది ఏజెంట్ల సాయంతో ఇప్పటి వరకూ 29 కోట్ల పాలసీలను విక్రయించినట్లు సంస్థ పేర్కొంది. 2016–17లో కొత్త పాలసీల ప్రీమియం రూపంలో 27.22 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆధార్ స్తంభ్, ఆధార్ శీల, జీవన్ ఉమంగ్, ప్రధాన మంత్రి వయ వందన యోజన పేరిట నాలుగు పాలసీలను సంస్థ ప్రవేశపెట్టింది. -
ప్రజా పంపిణీ 81.47 శాతం పూర్తి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో మే నెలకు సంబంధించి ప్రజాపంపిణీ కార్యక్రమం సోమవారం నాటితో ముగిసింది. 81.41 శాతం కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. జిల్లాలో 2,423 చౌకదుకాణాలు ఉండగా 11,48,970 రేషన్ కార్డులు ఉన్నాయి. రాత్రి 8 గంటల çసమయానికి 9,36,092 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 2,75,525 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో నగదు రహితంపై సరుకుల పంపిణీ కొంత వరకు పెరిగింది. సంజామల మండలంలో అత్యధికంగా 64.01శాతం, బేతంచెర్ల మండలంలో 60.81 శాతం కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. కోవెలకుంట్ల, జూపాడుబంగ్లా, ఓర్వకల్లు మండలాల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. అతి తక్కువగా ప్యాపిలి మండలంలో కేవలం 2.931శాతం కార్డులకు మాత్రమే నగదు రహిత లావాదేవీలు నిర్వహించారు. -
ఐదువేల సంవత్సరాల కిందటే క్యాష్‌లెస్: యోగి
లక్నో: పెద్దనోట్ల రద్దుతో కలిగే ప్రయోజనాలను ఒప్పుకోనివారి కోసం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సరికొత్త పాయింట్‌ను తెరపైకి తెచ్చారు. నోట్ల రద్దు ప్రయోజనాలను వివరించడానికి ఆయన కృష్ణుడిని ఆశ్రయించారు. సోమవారం లక్నోలో ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం యోగి మాట్లాడుతూ.. ‘సుధామా (కుచేలుడు) శ్రీకృష్ణుడిని కలిసినప్పుడు.. కృష్ణుడు అతనికి నగదురహితరూపంలోనే సాయం చేశాడు. ఐదువేల కిందట ఇలాంటి లావాదేవి జరిగినప్పుడు ఇప్పుడెందుకు జరగదు?’ అని ప్రశ్నించారు. మన పురాణాలు తెలిసినవారందరికీ శ్రీకృష్ణుడు-కుచేలుడి కథ తెలిసిందే. శ్రీకృష్ణుడు కుచేలుడి బాల్యస్నేహితుడు. అనంతరకాలంలో నిరుపేద అయిన అతడు సాయం అర్థించేందుకు కృష్ణుడి వద్దకు వస్తాడు. అతనికి అటుకులు కానుకగా ఇస్తాడు. కానీ సాయం కోరేందుకు నోరు రాదు. నిరాశగా ఇంటికి వెనుదిరిగిన కుచేలుడు తన ఇల్లు భోగభాగ్యాలతో విలసిల్లడం చూసి విస్తుపోతాడు. కుచేలుడు సాయం కోరకపోయినా స్నేహితుడిగా అతని స్థితిని అర్థం చేసుకొని శ్రీకృష్ణుడు సాయం చేస్తాడు. గత నవంబర్‌లో ప్రధాని మోదీ అమలుచేసిన నోట్లరద్దు ప్రయోజనాలను వివరిస్తూ.. సీఎం యోగి ఈ ఘట్టాన్ని గుర్తుచేశారు. -
ప్రతి కార్డుదారుడికి దీపం గ్యాస్ కనెక్షన్
– నగదురహిత లావాదేవీలపై మరింత దృష్టి – కొత్త డీఎస్ఓ వేము సుబ్రహ్మణ్యం వెల్లడి కర్నూలు(అగ్రికల్చర్): ప్రతి రేషన్ కార్డుదారుడికి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇప్పించి, ప్రజా పంపిణీలో నగదు రహిత లావాదేవీలు పెంచడం ప్రధాన లక్ష్యమని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ) వేము సుబ్రహ్మణ్యం తెలిపారు. సోమవారం కొత్త డీఎస్‌ఓగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్‌కు బొకే సమర్పించి జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా కాకి నాడకు చెందిన తాను మచిలీపట్నం ఏఎస్ఓగా పనిచేస్తూ శ్రీకాకులం జిల్లా ఇన్చార్జీ డీఎస్‌ఓగా 15 నెలలు బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. అక్కడి నుంచి పదోన్నతిపై కర్నూలు జిల్లాకు వచ్చినట్లు వివరించారు. జూన్ 2వ తేదీ లోగా తెల్ల కార్డుదారులందరికీ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. కొత్త డీఎస్ఓను ఆఫీసు సూపరింటెండెంటు రాజరఘువీర్, అర్బన్ ఏఎస్ఓ వంశీకృష్ణారెడ్డి, సీఎస్డీటీలు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తదితరులు అభినందించారు. -
ఆర్థిక ఆంక్షల సెగ
కొనుగోళ్లకు వెనుకడుగేస్తున్న ట్రేడర్లు, చిరు వ్యాపారులు స్థానిక ఎగుమతులపై ప్రభావం పౌల్ట్రీల్లో పేరుకుపోతున్న గుడ్లు రూ.2.55కు పతనమైన రైతు ధర రోజుకు రూ.77 లక్షల మేర నష్టం ఆందోళనలో కోళ్ల రైతులు మండపేట : మూలిగే నక్కపై తాటికాయ పడిన చందాన తయారైంది జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమ పరిస్థితి. సీజ¯ŒSలో గుడ్డు ధర తీవ్రంగా నిరాశపరచగా.. తాజాగా ఆర్థిక ఆంక్షలు పరిశ్రమను నష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. వేసవి ఎండలకు తోడు ఆర్థిక ఆంక్షలతో గుడ్ల కొనుగోళ్లకు, ఎగుమతులకు ట్రేడర్లు, చిరు వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా జిల్లావ్యాప్తంగా పౌల్ట్రీల్లో గుడ్లు పేరుకుపోతుండగా.. రైతు వద్ద ధర నానాటికీ పతనమవుతోంది. ఇప్పటికే రూ.2.55కు తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో పరిశ్రమకు రోజుకు రూ.77 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. మున్ముందు మరింతగా పెరగనున్న ఎండలతో పరిశ్రమకు మరిన్ని కష్టాలు తప్పవని కోళ్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 1.30 కోట్ల కోళ్లుండగా రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తవుతున్నాయి. 40 శాతం గుడ్లు స్థానికంగా వినియోగమవుతుండగా, మిగిలినవి పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. చలి ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల ఎగుమతులకు డిమాండ్ పెరిగి, నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు గుడ్డు ధర ఆశాజనకంగా ఉంటుంది. అయితే నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో ఈ ఏడాది సీజ¯ŒSలో రైతుల ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. పరిశ్రమకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇటీవల లారీల సమ్మెతో గుడ్ల ఎగుమతి స్తంభించిపోయింది. ఆ సమ్మె ముగిసినా, ఆర్థిక ఆంక్షలు, ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కొనసాగుతోంది. నగదు రహిత లావాదేవీలు, ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో లావాదేవీలన్నీ చెక్కుల రూపంలోనే నిర్వహించాల్సి రావడం వ్యాపారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. చెల్లింపులు జరిపిన చెక్కులకు సమాధానం చెప్పాల్సి రావడం, ఆర్థిక ఆంక్షలకు సంబంధించి వ్యాపారులు, కోళ్ల రైతులకు సరైన అవగాహన లేకపోవడం సమస్యగా మారింది. లావాదేవీల్లో ఏ చిన్నపాటి లోపం చోటుచేసుకున్నా రూ.లక్షల్లో జరిమానాలు చెల్లించాల్సి రావడంతో ట్రేడర్స్‌తో పాటు స్థానిక వ్యాపారులు కూడా బెంబేలెత్తిపోతున్నారు. దీనికితోడు ఎండల ప్రభావంతో ఇతర రాష్ట్రాల్లో గుడ్ల వినియోగం తగ్గుముఖం పడుతోంది. ఈ కారణాలతో పది రోజులుగా జిల్లా నుంచి ఎగుమతులు, స్థానిక వినియోగం సగం వరకు తగ్గిపోగా పౌల్ట్రీల్లో గుడ్లు పేరుకుపోతున్నాయి. సాధారణంగా జిల్లా నుంచి రోజుకు సుమారు 50 లారీల గుడ్లు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం అది 25 లారీలకు పడిపోయింది. స్థానిక వినియోగం కూడా తగ్గిపోవడంతో పౌల్ట్రీల్లో గుడ్ల నిల్వలు పెరిగిపోతున్నాయని కోళ్ల రైతులు ఆవేదన చెందుతున్నారు. నెక్ ప్రకటిత ధర కూడా అందని దుస్థితిలో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. మేత, కూలీల ఖర్చులు పెరిగిపోవడం, వేసవి ఉపశమన చర్యలు తదితర కారణాలతో గుడ్డు రైతు ధర రూ.3.25 ఉంటే తప్ప గిట్టుబాటు కాదని పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రస్తుత రైతు ధర రూ.2.55 ఉండగా, రోజుకు ఒక్కో గుడ్డు రూపంలో 70 పైసల వరకూ కోళ్ల రైతులు కోల్పోవాల్సి వస్తోంది. దీని ప్రకారం పరిశ్రమకు రోజుకు సుమారు రూ.77 లక్షల మేర నష్టం వాటిల్లుతున్నట్టు చెబుతున్నారు. మున్ముందు వేసవి ఎండలు, వడగాలుల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి మరింత తగ్గిపోతుందని, దీంతోపాటు కోళ్ల మరణాలు పెరిగి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజా పంపిణీ 81.41 శాతం పూర్తి
– 2,21,258 కార్డులకు నగదు రహితంపై సరుకులు – అత్యధికంగా బేతంచెర్ల మండలంలో నగదురహిత లావాదేవీలు కర్నూలు(అగ్రికల్చర్): ఏప్రిల్ నెలకు సంబంధించి ప్రజా పంపిణీ కార్యక్రమం శనివారం నాటితో ముగిసింది. 81.41 శాతం కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. జిల్లాలో 2,423 చౌకదుకాణాలు ఉండగా.. 11,90199 రేషన్ కార్డులు ఉన్నాయి. సాయంత్రం 7గంటల సమయానికి 9,36,419 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 2,21,258 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్‌లో నగదు రహితంపై సరుకుల పంపిణీ గణనీయంగా పెరిగింది. బేతంచెర్ల మండలంలో అత్యధికంగా 60.86 శాతం కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. కోవెలకుంట్ల, సంజామల, పగిడ్యాల, ఓర్వకల్లు మండలాల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. అతి తక్కువగా ఎమ్మిగనూరు మండలంలో 3.41శాతం కార్డులకు మాత్రమే నగదు రహిత లావాదేవీలు నిర్వహించారు. ఈ మండలంలో 45,603 రేషన్ కార్డులు ఉండగా 37,816 కార్డులకు సరుకులు పంపిణీ అయ్యాయి. ఇందులో 1,558 కార్డులకు నగదు రహితంపై సరుకులు పంపిణీ చేశారు. -
రేషన్ దుకాణాల్లో నగదు రహితం తప్పనిసరికాదు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి కాకినాడ సిటీ: రేషన్ దుకాణాల్లో నగదు రహిత లావాదేవీలు తప్పని సరికాదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో పౌర సరఫరాల శాఖ సమీక్షా సమావేశం ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామంత్రి నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన జరిగింది. ప్రత్తిపాటి ముఖ్య అతిథిగాను, రవాణా, బీసీ సంక్షేమం, సాధికారత, చేనేత జౌళిశాఖా మంత్రి కె.అచ్చెన్నాయుడు, రాష్ట్ర శాసనమండలి ఉపాధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సమావేశంలో తొలుత జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మంత్రులకు స్వాగతం పలికి, పౌరసరఫరా కార్యక్రమాలు, రైతులకు మద్దతు ధర కల్పన, దీపం గ్యాస్ కనెక్షన్ల పంపిణీ తదితర అంశాలు జిల్లాలో అమలు ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ రేషన్‌షాపుల్లో నగదు రహిత లావాదేవీలు ప్రజల ఇష్టం మేరకే నిర్వహించాలని, బలవతం చేసి ఇబ్బందులకు గురి చేయవద్దని పౌరసరఫరా అధికారులను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీల పట్ల ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రతి నెలా లాటరీ ద్వారా ఒకరికి రూ.లక్ష బహుమతి, రూ.5 వేలు విలువైన స్మార్ట్ఫోన్లు బహుమతిగా అందజేస్తున్నామని, ఆసక్తి కలిగిన వారందరూ నగదు రహిత లావాదేవీల్లో పాల్గొని బహుమతులు పొందవచ్చన్నారు. బీసీ వర్గాల సంక్షేమానికి కృషి... రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమం, సాధికారత, చేనేత జౌళి శాఖామంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ చేతివృత్తుల వారికి అధునాతన పనిముట్లుపై శిక్షణ కల్పించి, వాటిని పంపిణీ చేస్తామన్నారు. చేనేత రంగానికి పూర్వ వైభవం తెచ్చి దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. ఆహార సలహా కమిటీల ఏర్పాటు... ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ధరల నియంత్రణపై నిరంతర పర్యవేక్షణ కోసం అన్ని స్థాయిల్లోని ఆహార సలహా కమిటీలు ఏర్పాటు చేసి సమావేశాలను తరచుగా నిర్వహించాలని ఆదేశించారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ బియ్యం ధరల నియంత్రణ లేదని, సన్నబియ్యం కేజీ రూ.50కి అమ్మతున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
నగదు రహితం..వేదనా భరితం
= సామర్థ్యం లేని సర్వర్‌తో ఇక్కట్లు = జిల్లావ్యాప్తంగా చౌకదుకాణాల్లో సమస్య = సరుకుల పంపిణీ చేయలేమన్న డీలర్లు = రేషన్ అందక జనం అష్టకష్టాలు అనంతపురం అర్బన్ : చౌకధరల దుకాణాల్లో నగదు రహితంపై రేషన్ సరుకుల పంపిణీ కష్టసాధ్యమవుతోంది. పంపిణీ ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపడం లేదు. లీడ్ బ్యాంక్‌గా ఉన్న సిండికేట్ బ్యాంక్ ‘గేట్‌వే’తో కొన్ని బ్యాంకులు లింక్ కావడం లేదు. అత్యధిక బ్రాంచ్‌లున్న ఏపీజీబీ (ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్) సంబంధించిన సర్వర్ సామర్థ్యం తక్కువ ఉండడంతో పెద్ద సమస్యగా మారింది. దీంతో ఇటు చౌకడిపో డీలర్లు, అటు రేషన్ కార్డుదారులు ఇబ్బంది పడుతున్నారు. గేట్‌వే లింక్.. సర్వర్ సమస్య జిల్లాలో 11.92 లక్షల కార్డులు ఉన్నాయి. జిల్లాలో ఏపీజీబీకి సంబంధించి అత్యధికంగా 120 బ్రాంచ్‌లు ఉన్నాయి. అధిక సంఖ్యలో కార్డుదారులకు ఈ బ్రాంచ్‌ల్లోనే ఖాతాలు ఉన్నాయి. అయితే ఏపీజీబీకి ప్రస్తుతం ఉన్న సర్వర్ సామర్థ్యం తక్కువగా ఉండడంతో సమస్య అధికమైంది. జిల్లాకు లీడ్ బ్యాంక్‌గా వ్యవహరిస్తున్న సిండికేట్ బ్యాంక్‌కు కర్ణాటక బ్యాంక్, కోటక్ మహీంద్రా, ఏడీసీసీ బ్యాంకుల లింక్ లేకపోవడంతో గేట్‌వేలోకి వెళ్లడం లేదు. ఇదో పెద్ద సమస్యగా మారినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జిల్లా సరిహద్దుగా, కర్ణాటక సమీపంలో ఉన్న గ్రామాల్లోని కార్డుదారులకు కర్ణాటక, కోటక్ మహీంద్ర బ్యాంక్ బ్రాంచీల్లో ఖాతాలు ఉన్నాయని చెబుతున్నారు. గేట్‌వే లేకపోవడంతో ఆ బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్న కార్డుదారులు నగదు రహిత లావాదేవీలు నిర్వహించలేక పోతున్నారని తెలిపారు. అమలు చేయలేమంటున్న డీలర్లు సర్వర్ సమస్య కారణంగా నగదురహితంపై సరుకులు పంపిణీ చేయలేమని జిల్లా సరఫరాల శాఖ అధికారి (డీఎస్ఓ) శివశంకర్‌రెడ్డికి చౌకడిపో డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటరావిురెడ్డి ఆధ్వర్యంలో డీలర్లు తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ–పాస్ యంత్రాలు నగదురహిత విధానాన్ని స్వీకరించడం లేదని చెప్పారు. నగదురహితానికి ఒక్కొక్క కార్డుదారుని 20 నిమిషాలకు పైగా సమయం పడుతోందని, అయినా కూడా డిక్లెయిన్ అని వస్తోందని అంటున్నారు. రోజుకు 20 మందికి కూడా సరుకులు ఇవ్వలేక పోతున్నామంటున్నారు. దీంతో కార్డుదారులు తమను ఇష్టానుసారంగా దూషిస్తున్నారంటూ వాపోయారు. పంపిణీ అంతంత మాత్రమే నగదురహిత లావాదేవీల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ జిల్లావ్యాప్తంగా అంతంత మాత్రంగానే సాగుతోంది. జిల్లాలో 11.92 లక్షల కార్డులు ఉండగా... అధికారిక లెక్కల ప్రకారం శనివారం నాటికి సరుకులు తీసుకునేందుకు చౌక ధరల దుకాణాలకు 2,30,965 మంది కార్డుదారులు వెళ్లారు. అయితే 48,219 మంది కార్డుదారులకు మాత్రమే నగదురహితంగా సరుకులు అందాయి. దీన్నిబట్టి చూస్తే ప్రక్రియ అమలు తీరు ఎంత అధ్వానంగా సాగుతోందో స్పష్టమవుతోంది. -
క్యాష్‌లెస్‌గా గోవా రాజ్‌భవన్
పనాజీ: గోవా రాజ్‌భవన్ పూర్తిగా నగదు రహితమైంది. సోమవారం దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకుంది. దీంతో ఈ కార్యక్రమం సందర్భంగా గవర్నర్ మృదుల సిన్హా తొలి నగదు రహిత లావాదేవీని చేశారు. ‘గోవా గవర్నర్ మృదుల సిన్హా సోమవారం దోనా పౌలాలోని రాజ్‌భవన్ ఇక నుంచి పూర్తిగా నగదు రహిత లావాదేవీలకు వెళుతోందని స్పష్టం చేశారు. భవన్ నిర్వహణ ఖర్చులు, పర్యటనల వ్యయాలు, తదితరుల ఖర్చులన్నీ కూడా నగదు రహిత లావాదేవీల ద్వారానే జరుగుతాయి' అని రాజ్ భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. -
నగదు రహిత కష్టాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రేషన్ సరుకుల పంపిణీలో నగదు రహిత విధానం ఇటు కార్డుదారులు.. అటు రేషన్ డీలర్లకు చుక్కలు చూపిస్తోంది. గోపాలపురం మండలం పెద్దగూడెంలో ప్రజలు ఈ పోస్ యం త్రాలను ధ్వంసం చేసే పరిస్థితి వచ్చింది. జిల్లాలో పలుచోట్ల రేషన్ డిపోల ఎదుట నిరసనలు వెల్లువెత్తాయి. పూర్తిస్థాయి కసరత్తు లేకుండా హడావుడిగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డుదారులందరికీ విధిగా బ్యాంక్ అకౌంట్లు ఉండాలనే నిబంధన విధించారు. గతంలోరేషన్ కార్డులో పేరు నమోదైన అందరి వ్యక్తుల వేలి ముద్రలు స్వీకరించారు. వారిలో ఎవరు రేష¯ŒS షాపునకు వెళ్లినా నిత్యావసర సరుకులు ఇచ్చేవారు. ఈ నెల నుంచి ఆన్లైన్ చెల్లింపు రావడంతో బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అయ్యింది. దీంతో కార్డులో పేరు నమోదైన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందేనని డీలర్లు చెబుతున్నారు. కుటుంబంలో ఒకరికి బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోదని, నిత్యావసర సరుకుల కోసం ఎవరైతే వస్తారో వారి పేరిట కచ్చితంగా అకౌంట్ ఉండాలని, ఆ అకౌంట్ నుంచే నగదు బదిలీ అవుతుందని చెబుతున్నారు. అకౌంట్లో కనీసం రూ.500 నగదు నిల్వ ఉండాలని, లేకపోతే చార్జీలు చెల్లించాల్సి వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు. అంత సొమ్మును బ్యాంక్ అకౌంట్లో నిల్వ ఉంచే పరిస్థితి పేదలకు ఉండదు. కొందరికి జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఉన్నా సరుకులు తీసుకోవడానికి రేషన్ దుకాణాలకు వెళ్లేముందు బ్యాంక్‌కు వెళ్లి సొమ్ము జమ చేయాల్సి వస్తోంది. ఆ తరువాత సరుకుల కోసం రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తోంది. కొందరి ఖాతాల్లో సొమ్ములున్నా సాంకేతిక సమస్య కారణంగా సరుకులు తీసుకోలేని దుస్థితి దాపురిస్తోంది. కొన్నిచోట్ల కార్డుదారుల ఖాతా నుంచి నగదు చెల్లింపు జరిగినా డీలర్ ఖాతాలో జమ కావడం లేదు. దీంతో కార్డుదారులు నగదు కోల్పోవడమేకాక, సరుకులు అందక ఇబ్బందులు పడుతున్నారు. యంత్రాల సమస్య జిల్లాలోని రేషన్ దుకాణాల్లో విజన్‌టెక్, ఎనలాజిక్ ఈ పోస్ యంత్రాలు ఉన్నాయి. విజన్‌టెక్ యం త్రాల్లో 25 నుంచి 30 శాతం నగదు రహిత విధానంలో పనిచేస్తున్నాయి. ఎనలాజిక్ యంత్రాలను గత నెల 31న ఆన్‌లైన్‌తో అనుసంధానించారు. కనీసం డీలర్లకు శిక్షణ ఇవ్వకుండా ఈ నెల 1 నుంచి నగదు రహిత విధానాన్ని అమల్లోకి తెచ్చారు. చాలాచోట్ల యంత్రాలు ఆన్‌లైన్‌తో అనుసంధానం కాలేదు. అందరూ ఒకేసారి ఈ యంత్రాలను అనుసంధానం చేయడంతో సర్వర్లు బిజీగా మారిపోయాయి. ఆచంట, భీమవరం, గోపాలపురం నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉండటంతో ప్రజలకు డీలర్లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఏపీపీడీఎస్ సర్వర్, ఆధార్ సర్వర్, బ్యాంకింగ్ సర్వర్ ఏకకాలంలో పనిచేయడంతోపాటు లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలో తగినంత సొమ్ము నిల్వ ఉంటేనే సరుకులు ఇవ్వడానికి వీలవుతోంది. ఏ సర్వర్ పని చేయకపోయినా, పదేపదే ప్రయత్నం చేయాల్సి వస్తోంది. మరోవైపు లబ్ధిదారులు తమ ఖాతాల్లో కనీస నగదు జమ చేసేందుకు, ఆధార్ అనుసంధానం చేసేందుకు పనులు మానుకుని బ్యాంకుల ఎదుట నిలబడుతున్నారు. డిసెంబర్ నెలలో సరుకులు అప్పుగా ఇచ్చారు. జనవరి నెలలో డీలర్లు రెండు నెలల డబ్బులు వసూలు చేశారు. డిసెంబర్లో తీసుకెళ్లిన సరుకులకు సొమ్ము చెల్లించలేనట్టు ఈ–పోస్ యంత్రాలు చూపిస్తున్నాయి. దీంతో ప్రతి ఒక్కరి బ్యాంక్ ఖాతా నుంచి రెండు నెలల సొమ్ము డీలర్‌కు బదిలీ అవుతోంది. డీలర్ల ఆందోళన నగదు రహితం పేరుతో యూజర్ చార్జీలు వసూలు చేస్తుండటంతో డీలర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక డీలర్ 400 కార్డులపై నగదు రహిత విధానం ద్వారా సరుకులు పంపిణీ చేస్తే కార్డుకు రూ.3 చొప్పున రూ.1,200 యూజర్ చార్జీలు డీలర్ ఖాతా నుంచి కట్ అవుతున్నాయి. కొందరు కార్డుదారుల ఖాతాల నుంచి బదిలీ అయిన సొమ్ములు వెనక్కి వెళ్లిపోతున్నాయి. ఈ సొమ్ములు బ్యాంకుల్లోని సస్పెన్స్ అకౌంట్లలోకి చేరుతున్నాయి. దీంతో డీలర్లు ఆ సొమ్మును తమ ఖాతాలోకి మార్పించుకోవడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నగదు రహితం పూర్తిస్థాయిలో చేశామని చెప్పుకోవడానికి జిల్లా ఉన్నతాధికారులు తీసుకువస్తున్న ఒత్తిడి కారణంగా కార్డుదారులు, డీలర్లు నలిగిపోతున్నారు. అధికారుల అనాలోచిత నిర్ణయాలు తమకు శాపంగా మారుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన తర్వాతే నగదు రహిత లావాదేవీలు చేయాలని.. లేనిపక్షంలో వచ్చే నెలలో షాపులు మూసివేసి నిరసన తెలుపుతామని డీలర్ల అసోసియేషన్ నేత గంగాధర్ ‘సాక్షి’కి తెలిపారు. -
‘నగదు రహితం’లో రాష్ట్రమే టాప్
జపాన్ పర్యటనలో మంత్రి కేటీఆర్ సాఫ్ట్‌బ్యాంకు సీఈవో మయవోషిసన్‌తో మంత్రి భేటీ టీ–ఇన్నోవేషన్ ఫండ్‌లో భాగస్వామి కావాలని విజ్ఞప్తి ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం టోక్యో క్లీన్ అథారిటీ అధికారులతోనూ కేటీఆర్ భేటీ సాక్షి, హైదరాబాద్: నగదు రహిత చెల్లింపుల్లో భారత దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం సాఫ్ట్ బ్యాంక్ సీఈవో, సీఎండీ మయవోషిసన్‌తో సమావేశమయ్యారు. సాఫ్ట్వేర్, డిజిటల్ రంగంలో తెలంగాణ సాధించిన పురోగతి, తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా భారత్‌లో నోట్ల రద్దు తర్వాతి పరిస్థితులపై సాఫ్ట్‌బ్యాంక్ సీఈవో ఆరా తీశారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలుసుకుని, అభినందించారు. నూతన ఆవిష్కరణలకు టీ–హబ్ లాంటి ప్రాజెక్టులు ఎంతో మేలు చేస్తాయని ప్రశంసించారు. ఇక నవంబర్‌లో చేపట్టనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుకు గౌరవ అతిథిగా హాజరుకావాలని సాఫ్ట్ బ్యాంక్ సీఈవోను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీ–ఇన్నోవేషన్ ఫండ్‌లో ఆ సంస్థ భాగస్వామి కావాలని కోరారు. సాంకేతిక సహకారం అందించండి జపాన్ పర్యటనలో భాగంగా బుధవారం ఆ దేశ రాజధాని టోక్యోలో మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టోక్యో లాంటి విశాల నగరాన్ని నడిపిస్తున్న తీరుపై, ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులపై అధ్యయనం జరిపారు. టోక్యో క్లీన్ అథారిటీ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. వాయు కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలను ఎదుర్కొనేందుకు అవలంబిస్తున్న వ్యూహాన్ని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ మహానగరంలో పారిశుద్ధ్య నిర్వహణకు సాంకేతిక సహాయం అందించాలని టోక్యో క్లీన్ అథారిటీ అధికారులను కేటీఆర్ కోరారు. టోక్యోలో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల పట్ల మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నగరం పట్ల అక్కడి పౌరుల బాధ్యత అద్భుతమని కొనియాడారు. ఏదో ఒక రోజు హైదరాబాద్ నగరం టోక్యో స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ చెత్తను రీసైక్లింగ్ చేసే ప్లాంట్లతో పాటు టోక్యో మెట్రోపాలిటన్ పరిధిలోని రెండు మున్సిపాలిటీల్లో చెత్త రీసైకిల్ ప్లాంట్లను మంత్రి పరిశీలించారు. టోక్యోలోని ఇండియన్ స్కూల్లో.. టోక్యోలో ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌ను కేటీఆర్ సందర్శించి, అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. గణతంత్ర దినోత్సవం కోసం విద్యార్థులు చేస్తున్న రిహార్సల్స్‌ను తిలకిం చారు. టోక్యో లాంటి అంతర్జాతీయ నగరంలో భారతదేశ జాతీయ గీతాన్ని విన్నందుకు భారతీయుడిగా గర్వపడుతున్నానని ఈ సంద ర్భంగా వ్యాఖ్యానించారు. -
నగదు రహితానికి బ్రేకులు
- ఆర్టీసీలో ‘స్వైప్’ టికెట్లకు చిక్కులు - ప్రయాణికులపై రూ.10 వరకు అదనపు భరం - లావాదేవీల్లో జాప్యంతో కార్డులను తిరస్కరిస్తున్న ఆర్టీసీ కర్నూలు (రాజ్‌విహార్): పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించేలా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారు. ఆర్టీసీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాయలసీమ ముఖద్వారం కర్నూలులోని బస్‌స్టేషన్‌కు ఎంతో పేరుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 24 గంటలు ప్రయాణికుల తాకిడి ఉన్న ఐదు బస్స్టేషన్లలో ఇదోకటి. ఈ బస్టాండ్ మీదుగా రోజుకు వెయ్యికి పైగా బస్సులు దూర ప్రాంతాలకు రాకపోకాలు సాగిస్తున్నాయి. 2003కు ముందు మ్యానువల్ (చేతి రాత పద్దతిలో) టికెట్లు ఇచ్చేవారు. ప్రయాణికుల సౌకర్యార్థం కర్నూలులో 2003 మార్చిలో ఓపీఆర్ఎస్ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కర్నూలుతోపాటు మంత్రాలయం, శ్రీశైలం, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, బనగానపల్లెలో రిజర్వేషన్ కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రతిరోజు హైదరాబాదుతోపాటు బెంగళూరు, తిరుపతి, చెన్నై, నెల్లూరు, విజయవాడ, ఒంగోలు, వేలూరు తదితర దూర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు 500 మంది వరకు ప్రయాణికులు టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. అయితే నగదు సమస్య కారణంగా ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలకు ప్రజలు ముందుకు వస్తున్న సమయంలో ఆర్టీసీ టికెట్ల వద్ద నెలకొన్న సమస్యలు చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులపై స్వైప్ చార్జీల భారం స్వైపింగ్ ద్వారా ఆర్టీసీ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులపై భారం వేస్తోంది. టికెట్ ధరలపై ఒక శాతం మేరకు స్వైప్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటోంది. స్వైప్ చేసే ప్రయాణికులపై రూ.10 వరకు అదనపు భారం వేసి ఖజానా నింపుకుంటోంది. ఇటు వివిధ రకాల బ్యాంకుల కార్డులను స్వైపింగ్‌కు వినియోగించడం ద్వారా ప్రయాణికుల ఖాతాల నుంచి టికెట్ సొమ్ము ఆర్టీసీ/ అధికృత ఏజెంట్ల ఖాతాలోకి వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతోందనే కారణంతో కార్డుల స్వైపింగ్‌ను నిరాకరిస్తున్నారు. ‘స్వైప్ మిషన్ పనిచేయడం లేదు’ అని చెప్పి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ రెండు సమస్యలతో ఆర్టీసీలో నగదు రహితానికి బ్రేకులు పడుతున్నాయి. ప్రోత్సహించాలి : ఎస్. షేక్షావలి, శరీఫ్ నగర్ ఇటీవలే బెంగళూరు వెళ్లేందుకు టికెట్ రిజర్వు చేసుకునేందుకు ఏటీఎం కార్డును స్వైప్ చేశాను. అయితే టికెట్ ధర కంటే రూ.7 అదనంగా బ్యాలెన్స్‌లో కట్ అయింది. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రయాణికులను ప్రోత్సహించకుండా భారం వేస్తే ఎలా. మిషన్ పని చేయడం లేదన్నారు : ఉమేష్, కర్నూలు చెన్నై వెళ్లేందుకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కోసం వచ్చా. డెబిట్ కార్డు ఉన్న కారణంగా నగదు తీసుకురాలేదు. అయితే రిజర్వేషన్ కౌంటరులో ఉన్న స్వైపింగ్ మిషన్ పనిచేయడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు మరోసారి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. లావాదేవీలకు సమయం పడుతోంది : పి. ప్రసాద్, ఏటీఎం, కర్నూలు బస్‌స్టేషన్. కర్నూలు బస్‌స్టేషన్‌లో ఉన్న స్వైప్ మిషన్ యాక్సిస్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అధీకృత ఏజెంట్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా ఉంది. ఈ బ్యాంకులు కాక ఇతర కార్డులు స్వైప్ చేస్తే ప్రయాణికుడి ఖాతా నుంచి ఏజెంట్‌కు వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతోంది. డబ్బులు ఎక్కువగా కట్ అవుతున్నట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పైఅధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం. -
నగదు రహితానికి బ్రేకులు
- ఆర్టీసీలో ‘స్వైప్’ టికెట్లకు చిక్కులు - ప్రయాణికులపై రూ.10 వరకు అదనపు భరం - లావాదేవీల్లో జాప్యంతో కార్డులను తిరస్కరిస్తున్న ఆర్టీసీ కర్నూలు (రాజ్‌విహార్): పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీలను నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు నిర్వహించేలా అంతటా అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యం చేశారు. ఆర్టీసీ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రాయలసీమ ముఖద్వారం కర్నూలులోని బస్‌స్టేషన్‌కు ఎంతో పేరుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 24 గంటలు ప్రయాణికుల తాకిడి ఉన్న ఐదు బస్స్టేషన్లలో ఇదోకటి. ఈ బస్టాండ్ మీదుగా రోజుకు వెయ్యికి పైగా బస్సులు దూర ప్రాంతాలకు రాకపోకాలు సాగిస్తున్నాయి. 2003కు ముందు మ్యానువల్ (చేతి రాత పద్దతిలో) టికెట్లు ఇచ్చేవారు. ప్రయాణికుల సౌకర్యార్థం కర్నూలులో 2003 మార్చిలో ఓపీఆర్ఎస్ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కర్నూలుతోపాటు మంత్రాలయం, శ్రీశైలం, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, బనగానపల్లెలో రిజర్వేషన్ కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల నుంచి ప్రతిరోజు హైదరాబాదుతోపాటు బెంగళూరు, తిరుపతి, చెన్నై, నెల్లూరు, విజయవాడ, ఒంగోలు, వేలూరు తదితర దూర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. రోజుకు 500 మంది వరకు ప్రయాణికులు టికెట్లు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. అయితే నగదు సమస్య కారణంగా ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలకు ప్రజలు ముందుకు వస్తున్న సమయంలో ఆర్టీసీ టికెట్ల వద్ద నెలకొన్న సమస్యలు చూసి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులపై స్వైప్ చార్జీల భారం స్వైపింగ్ ద్వారా ఆర్టీసీ టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులపై భారం వేస్తోంది. టికెట్ ధరలపై ఒక శాతం మేరకు స్వైప్ చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణికులను దోచుకుంటోంది. స్వైప్ చేసే ప్రయాణికులపై రూ.10 వరకు అదనపు భారం వేసి ఖజానా నింపుకుంటోంది. ఇటు వివిధ రకాల బ్యాంకుల కార్డులను స్వైపింగ్‌కు వినియోగించడం ద్వారా ప్రయాణికుల ఖాతాల నుంచి టికెట్ సొమ్ము ఆర్టీసీ/ అధికృత ఏజెంట్ల ఖాతాలోకి వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతోందనే కారణంతో కార్డుల స్వైపింగ్‌ను నిరాకరిస్తున్నారు. ‘స్వైప్ మిషన్ పనిచేయడం లేదు’ అని చెప్పి సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఈ రెండు సమస్యలతో ఆర్టీసీలో నగదు రహితానికి బ్రేకులు పడుతున్నాయి. ప్రోత్సహించాలి : ఎస్. షేక్షావలి, శరీఫ్ నగర్ ఇటీవలే బెంగళూరు వెళ్లేందుకు టికెట్ రిజర్వు చేసుకునేందుకు ఏటీఎం కార్డును స్వైప్ చేశాను. అయితే టికెట్ ధర కంటే రూ.7 అదనంగా బ్యాలెన్స్‌లో కట్ అయింది. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రయాణికులను ప్రోత్సహించకుండా భారం వేస్తే ఎలా. మిషన్ పని చేయడం లేదన్నారు : ఉమేష్, కర్నూలు చెన్నై వెళ్లేందుకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కోసం వచ్చా. డెబిట్ కార్డు ఉన్న కారణంగా నగదు తీసుకురాలేదు. అయితే రిజర్వేషన్ కౌంటరులో ఉన్న స్వైపింగ్ మిషన్ పనిచేయడం లేదని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు మరోసారి రాకుండా అధికారులు చర్యలు చేపట్టాలి. లావాదేవీలకు సమయం పడుతోంది : పి. ప్రసాద్, ఏటీఎం, కర్నూలు బస్‌స్టేషన్. కర్నూలు బస్‌స్టేషన్‌లో ఉన్న స్వైప్ మిషన్ యాక్సిస్ బ్యాంక్ నుంచి తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న అధీకృత ఏజెంట్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా ఉంది. ఈ బ్యాంకులు కాక ఇతర కార్డులు స్వైప్ చేస్తే ప్రయాణికుడి ఖాతా నుంచి ఏజెంట్‌కు వచ్చేందుకు రెండు మూడు రోజుల సమయం పడుతోంది. డబ్బులు ఎక్కువగా కట్ అవుతున్నట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే పైఅధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తాం. -
క్యాష్‌లెస్‌పై ‘పెట్రో’వార్
బంకులు, బ్యాంకుల ఎండీఆర్ చార్జీల లొల్లి ♦ తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డీలర్లు ♦ సోమవారం నుంచి బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డు చెల్లింపులు బంద్ చేస్తున్నట్టు ప్రకటన ♦ తర్వాత 13వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్టు వెల్లడి ♦ జనరల్, మెడికల్ షాపుల్లోనూ వినియోగదారులు, వ్యాపారులపై సర్‌చార్జి మోత ♦ మళ్లీ నగదు వైపే చూస్తున్న జనం న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: బంకుల్లో నగదు రహిత లావాదేవీలపై ‘పెట్రో’వార్ మొదలైంది! పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లపై ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) చార్జీల వసూలు బ్యాంకులు, బంకుల మధ్య చిచ్చు రేపింది. ఈ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా తమ నుంచి వసూలు చేయాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలుకు క్రెడిట్, డెబిట్ కార్డులను అంగీకరించబోమంటూ ఆదివారం ఆలిండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ బాంబు పేల్చింది. అయితే ఉన్నట్టుండి అర్ధరాత్రి తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ నెల 13 వరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు అఖిల భారత పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సల్ వెల్లడించారు. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించేందుకు.. పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై వినియోగదారుల నుంచి ఎండీఆర్ చార్జీలు వసూలు చేయడాన్ని కేంద్రం ఎత్తివేసింది. అయితే 50 రోజుల గడువు ముగియడంతో ఆ చార్జీలను వినియోగదారుల నుంచి కాకుండా పెట్రోల్ బంకుల యాజమాన్యాల నుంచి వసూలు చేయాలంటూ బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. ‘‘పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు లావాదేవీలపై 1 శాతం పన్ను, డెబిట్ కార్డులపై 0.25 శాతం నుంచి 1 శాతం పన్నును జనవరి 9 నుంచి వసూలు చేస్తాం’’అంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి తమకు లేఖ వచ్చిందని అజయ్ బన్సాల్ తెలిపారు. డిసెంబర్ 16న రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన సరŠుక్యలర్ మేరకే నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో హెచ్డీఎఫ్సీ పేర్కొందని వివరించారు. ఈ చార్జీల వసూలును నిరసిస్తూ సోమవారం నుంచి బంకుల్లో డెబిట్/క్రెడిట్ కార్డులను అంగీకరించవద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఆ చార్జీల వసూలును 13 వరకు వాయిదా వేస్తున్నట్లు చమురు కంపెనీల నుంచి సమాచారం అందడంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. జనరల్, కిరాణా షాపుల్లో సర్‘చార్జ్’ క్యాష్‌లెస్ చెల్లింపుల ప్రక్రియతో అటు కొనుగోలుదారులు, ఇటు వ్యాపారులపై సర్‌చార్జీ భారం పడుతోంది. డెబిట్/క్రెడిట్ కార్డు వాడుతున్న వినియోగదారుడి ప్రతి లావాదేవీపై సగటున 2.8 శాతం సర్‌చార్జీ పడుతోంది. స్వైపింగ్ మిషన్ ద్వారా చెల్లించిన మొత్తానికి మాత్రమే మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వస్తోంది. సర్‌చార్జీ పేరిట కోత పడుతున్న డబ్బులకు సంబంధించి ఎలాంటి మెసేజ్ రావడం లేదు. జనవరి 1 నుంచే ఈ వాత అమల్లోకి వచ్చింది. మరోవైపు పీఓఎస్ మెషీన్లతో లావాదేవీలు సాగిస్తున్న వ్యాపారులపైన 2 శాతం భారం పడుతోంది. దీంతో జనరల్, కిరాణా సోర్లు, మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన మొత్తంపై 2 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఎల్బీనగర్కు చెందిన రవికుమార్ ఆదివారం ఓ మెడికల్షాపులో రూ.165 మెడిసిన్ కొనుగోలు చేయగా.. షాప్కీపర్ మాత్రం స్వైపింగ్ మిషన్‌లో రూ.169 ఎంట్రీ చేసి బిల్లు తీసుకున్నాడు. అదేంటని అడిగితే.. తమకు ప్రతి కొనుగోలుపై సర్‌చార్జీ పడుతోందని, అందుకే రూ.4 అదనంగా తీసుకుంటున్నట్టు చెప్పాడు. ఇది వినియోగదారులకు, వ్యాపారులకు భారంగా మారుతుండడంతో మళ్లీ నగదు లావాదేవీల వైపే మొగ్గుతున్నారు. కారులో రూ.1,200 పెట్రోలు కొట్టించా. నగదుకు బదులుగా డెబిట్‌కార్డుతో డబ్బులు చెల్లించా. బ్యాంకు ఖాతా నుంచి రూ.1,200తో పాటు సర్వీసు చార్జీ పేరిట అదనంగా రూ.34 కోత పడింది. మినీ స్టేట్మెంట్ తీసుకుంటే ఈ విషయం తెలిసింది. ఇట్లా సర్‌చార్జీ పడితే మళ్లీ కార్డు ఉపయోగించ. – కొట్ర బలరాం, నాగర్‌కర్నూల్ క్యాష్‌లెస్ పద్ధతిలో రోజుకు సగటున రూ.2 లక్షల రాబడి వస్తుండగా.. బ్యాంకు ఖాతాలో మాత్రం రూ.1.95 లక్షలు మాత్రమే జమవుతున్నట్లు స్టేట్మెంట్లో కనిపిస్తోంది. వారం రోజుల్లో దాదాపు రూ.40 వేలు కోత పడింది. కార్డుల ద్వారా చెల్లింపులతో ఇలా కోత పడితే వాటిని వినియోగించడం కష్టం కదా.. – హనుమంతు, పెట్రోల్ క్ క్యాషియర్, ఇబ్రహీంపట్నం -
50 రోజులు.. తీరని నోట్ల కష్టాలు
సాక్షి, నేషనల్ డెస్క్: నవంబర్ 8... రాత్రి 8 గంటలు... మరికాసేపట్లో జాతినుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారన్న బ్రేకింగ్ న్యూస్ చూసి.. న్యూస్ చానల్స్ చూస్తున్నవారు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. రూ. వెయ్యి, రూ. 500 నోట్లను అర్ధరాత్రి నుంచి రద్దు చేస్తున్నట్లు చెప్పగానే అందరిలోను ఉలికిపాటు. నేటికి మోదీ నోట్ల రద్దు ప్రకటన చేసి 50 రోజులు... ఇప్పటికే దేశంలో ఏటీఎంలు, బ్యాంకుల ముందు అవే క్యూలు... అవే కష్టాలు.. నోట్ల రద్దుకు ముందు... ప్రస్తుతం! ఎస్బీఐ అంచనా మేరకు నవంబర్ 9 నాటికి మొత్తం రద్దైన నోట్ల విలువ రూ.15.44 లక్షల కోట్లు. డిసెంబర్ 30 నాటికి బ్యాంకులకు చేరే మొత్తం రూ. 13 లక్షల కోట్లుగా అంచనా. ప్రస్తుతం వేగంతో కరెన్సీ ముద్రణ కొనసాగిస్తే... మార్చి, ఏప్రిల్ 2017 వరకూ ప్రస్తుత పరిస్థితి తప్పదనేది నిపుణుల అభిప్రాయం. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రెండు నెలలు అవసరమని ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య తేల్చి చెప్పారు. క్యూల కష్టాలు ఇంతింతకాదయా... నవంబర్ 8న ప్రకటన అనంతరం కేంద్రం, ఆర్బీఐలు సవాలక్ష ఆంక్షలు, నిబంధనలతో తీవ్ర గందరగోళం సృష్టించాయి. పలుమార్లు ఈ నిబంధనలు మార్చారు. నవంబర్ 10న బ్యాంకులు, నవంబర్ 11న ఏటీఎంలు తెరుచుకున్నా... అప్పటి క్యూలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నోట్ల రద్దుతో బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలలో నిలబడి ఇంతవరకూ 100 మందికి పైగా మరణించినట్లు అంచనా. మాట మార్చిన కేంద్రం మొదట్లో నోట్ల రద్దును నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాదులపై పోరుగా ప్రధాని అభివర్ణించగా... అనంతరం నగదు రహిత భారత్ కోసమంటూ స్వరం మారింది. దేశంలో దాదాపు 90 కోట్ల మందికి ఇంటర్నెట్తో అనుసంధానం లేదు. మరి ఒక్కసారిగా డిజిటల్ చెల్లింపులు ఏలా సాధ్యం అన్నదానికి సమాధానం లేదు. -
విద్యుత్ బిల్లుల చెల్లింపు కష్టాలు తొలగిస్తాం
– కొత్త కౌంటర్లు ప్రారంభించిన ఎస్ఈ భార్గవ రాముడు కర్నూలు(రాజ్‌విహార్): విద్యుత్ బిల్లుల చెల్లింపులో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఏపీ ఎస్పీడీసీఎల్ ఆపరేషన్స్ ఎస్ఈ జి. భార్గవరాముడు స్పష్టం చేశారు. శనివారం స్థానిక పవర్ హౌస్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన బిల్లుల చెల్లింపు కౌంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సముదాయంలో కర్నూలు టౌన్, రూరల్స్ వియోగదారులకు సంబంధించి 8 కౌంటర్లు నిర్మించారు. ఇందులో ఆన్లైన్, స్వైప్ మిషన్, నగదు, డీడీలు, చెక్కుల పద్ధతిలో చెల్లించేందుకు వేరువేరుగా ఈ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు క్యూ కష్టాలు ఉండరాదని అధిక సంఖ్యలో కౌంటర్లు నిర్మించినట్లు వెల్లడించారు. ఇకపై ఉదయం 8–30గంటలకు బిల్లు వసూలు కేంద్రాలు తెరుచుకుంటాయని, మధ్యాహ్నం భోజన విరామంలో కూడా బిల్లులు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయంత్ర 4:30గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఆన్లైన్, స్వైప్ మిషన్ల ద్వారా మాత్రమే బిల్లులు చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాత రూ.500, రూ.1000 నోట్లు తీసుకోవడం లేదని, చెలామణిలో ఉన్న నోట్లను మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు. చెక్కులు, డీడీలు లేక ఆన్లైన్, ఏటీపీ మిషన్ల ద్వారా బిల్లులు చెల్లించవచ్చని సూచించారు. నగదు రహిత లావాదేవీలు జరిపేందుకు పీఓఎస్ (పాయింట్ ఆఫ్ సేల్)ను ప్రొత్సహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఈ రమేష్, ఎస్ఏఓ మత్రూనాయక్, ఏడీఈలు ప్రసాద్, రంగస్వామి, శేషాద్రి, ఏఓలు విన్సెంట్, మల్లికార్జున, ఈఆర్ఓల సిబ్బంది పాల్గొన్నారు. -
మంత్రులకు,ఐఏఎస్‌లకు క్యాష్‌లెస్ పాట్లు
-
'నోట్ల రద్దు ప్రభావం భారీగా ఉంటుంది'
హైదరాబాద్: రాష్ట్రంలో సగటున 4 లక్షల కుటుంబాలకు ఒక జిల్లా చొప్పున ఉన్నందున ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరడం ఇక సులువు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజల అసంతృప్తిని గుర్తించి వారికి మేలు చేసే విధంగా కార్యక్రమాలు ఉండాలని బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల సహకారం వల్లే గుడంబా, పేకాట లాంటి అవలక్షణాలను అరికట్టగలిగాం అని సీఎం వెల్లడించారు. అత్యవసర పనుల కోసం ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. 3 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై భారీగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీల దిశగా మనం వెళ్లాల్సిందే అని కలెక్టర్లతో కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం మొబైల్ యాప్‌ల వినియోగం పెంచడంతో పాటు.. ప్రజల్లో క్యాష్ లెస్‌పై అవగాహన పెంచేందుకు విద్యార్ధులు, టీచర్లు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని కేసీఆర్ సూచించారు. -
నగదు రహితం అసాధ్యం
సిద్దిపేట అర్బన్: వంద సంత్సరాలు తలక్రిందులుగా తపస్సు చేసినా నగదు రహిత లావాదేవీలు సాధ్యం కావని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి చెందిన సింగపూర్, అమెరికా లాంటి దేశాల్లోనే సుమారు 50శాతం నగదు రహిత లావాదేవిలు జరుగుతున్నాయని, రెండు శాతం ఉన్న మనదేశంలో 100శాతం ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. సిద్దిపేటలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు అనాలోచిత చర్య అని, ఈ విషయంలో ప్రభుత్వం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయిందన్నారు. ఆర్థిక నిపుణులతో చర్చించకుండా, ముందస్తు ప్రణాళిక లేకుండా తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంతో కూలీ పనులు చేసుకోవాల్సిన వారు క్యూల్లో ఉంటున్నారన్నారు. విదేశాల్లో ఉన్న నల్లడబ్బును వెనక్కి తెస్తానని పెద్దనోట్లను రద్దు చేయడం ‘పుండొక చోటుంటే మందొక చోట’ అన్నట్లుందన్నారు. మోదీ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని, అందుకే ప్రజల దృష్టికి మల్లించేందుకు నోట్లరద్దును ముందుకు తెచ్చిందన్నారు. వందల కోట్ల కొత్త కరెన్సీ, కిలోల కొద్దీ బంగారం బీజేపీ, టీడీపీ నాయకుల ఇళ్లల్లో బయటకు వస్తుందన్నారు. నోట్ల రద్దుతో ప్రజల ప్రాథమిక హక్కులు హరించబడ్డాయని, ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. విశ్వాసం లేని పాలన చేస్తున్న కేసీఆర్.. మోడీ తీరుకు ముగ్దుడయిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నాడన్నారు. ఉద్యమంలో ముందున్న వారిని పక్కనపెట్టి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని మంత్రి వర్గంలో చేర్చుకున్నాడన్నారు. విమలక్క కార్యాలయంపై సోదాలు చేయడం పౌరహక్కులకు భంగం కలిగించే చర్య అని అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మంద పవన్, నాయకులు వెంకట్రాంరెడ్డి, సృజన్‌కుమార్, పీవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోరుకు సిద్ధంకండి.. సిద్దిపేట అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరుకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చా రు. సీపీఐ సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలేనని చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని, క్షేత్రస్థాయిలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో పర్యటించి, పార్టీ నాయకత్వం ప్రజాసమస్యలపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజలను చైతన్యం చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బలమైన ప్రజాపోరాటాలను నిర్వహించాలన్నారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాలో పార్టీని పటిష్టవంతం చేసేందుకు అనేక అవకాశాలున్నాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజా ఉద్యమాల ద్వారానే బలమైన పార్టీ నిర్మాణం జరగుతుందని, అందుకోసం కార్యకర్తలు కంకణబద్దులై పనిచేయాలన్నారు. ఈ నెల 26 పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీలు, సభలు నిర్వహించాలన్నారు. 2017 సంవత్సరాన్ని ప్రజా ఉద్యమాల సంవత్సరంగా పరిగణించి ఉద్యమ కార్యచరణతో ప్రభుత్వ అసమర్థ పరిపాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనను శాలువాతో సన్మానించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మందపవన్, కార్యవర్గ సభ్యులు పెండెల అయిలయ్య, కొయ్యడ సృజన్‌కుమార్, మచ్చ శ్రీనివాస్, పోతిరెడ్డి వెంకట్‌రెడ్డి, వెల్పుల బాలమల్లు, గడిపె మల్లేశ్, నాయకులు ఎడ్ల వెంకట్రాంరెడ్డి, కనుకవ్వ, పీవీ.నర్సింహారెడ్డి, మన్నె కుమార్, జనార్దన్, శంకర్, రాజరెడ్డి, లక్ష్మణ్, శోభన్, ప్రతాప్‌రెడ్డి, రంగారెడ్డి, భూమయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీల విస్తృతికి చర్యలు
1,976 స్వైపింగ్ మెషీన్ల జారీ జేసీ సత్యనారాయణ కొత్తపేట :పెద్ధ నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన కరెన్సీ కొరతను అధిగమించేందుకు ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్ళించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్రమేపీ నగదు రహిత లావాదేవీలు శాతం పెంచేందుకు ప్రభుత్వ చర్యల్లో భాగంగా స్వైపింగ్ మెషీన్లు వాడకంలోకి తెస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్‌లో అందరూ మొబైల్ బ్యాంకింగ్, స్వైపింగ్ మెషీన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు సాగించేలా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో స్వైపింగ్ మెషీన్లకు 8,785 దరఖాస్తులు రాగా సుమారు 6,500 ఆన్లైన్లో ఉన్నాయన్నారు.1,976 మెషీన్లు జారీ చేశామన్నారు.అలాగే 44,437 యాప్స్ డౌన్లోడ్ చేయగా 1,642 ఓకే చేశామన్నారు. దీనిపై 8,618 మందికి అవగాహన కల్పించామని తెలిపారు.7,54,304 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు జన్‌ధన్ ఖాతాదారులు కాగా వారిలో 3,23,673 మందికి, సుమారు 4,60,000 మంది ఉపాధి హామీ కూలీలలో 1,22,085 మందికి రూపే కార్డులు జారీ చేసినట్టు తెలిపారు. మిగిలిన వారికీ దశలవారీగా జారీ చేస్తామన్నారు.ఈ నెల సామాజిక పింఛను పథకం కింద ఎస్బీఐ ద్వారా సుమారు రూ.67 లక్షలు, ఆంధ్రాబ్యాంక్ ద్వారా సుమారు రూ.24 లక్షలు పంపిణీ చేసినట్టు తెలిపారు. జేసీ వెంట అమలాపురం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, స్థానిక తహశీల్దార్ ఎన్.శ్రీధర్, ఆర్ఐ ఎంటీఆర్ ప్రసాద్ తదితరులున్నారు. -
క్యాష్ లెస్..ఎలా సాధ్యం ?
-
నగదు రహితం..ఎంతో ఉత్తమం
– జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): అన్ని శాఖల అధికారులు..నగదు రహిత లావాదేవీలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం తర్వాత జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలను నగదు రహిత లావాదేవీలు చేపట్టే విధంగా ప్రోత్సహించాలన్నారు. ప్రతి అధికారి తన కింది స్థాయి సిబ్బంది మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌పై అవగాహన పెంచాలన్నారు. సమావేశంలోనే ప్రయోగాత్మకంగా ఎస్బీఐ బడ్డీ కలెక్టర్ తన స్మార్ట్ ఫోన్ నుంచి రూ. 100లను జెడ్పీ సీఇఓకు..అలాగే జాయింట్ కలెక్టర్ హరికిరణ్ కూడా తన స్మార్ట్ పోన్ ద్వారానే డీఆర్ఓ గంగాధర్‌గౌడుకు 100 రూపాయలు పంపి నగదు బదిలీ ఎంత సులభమో చూపించారు. జిల్లాలో 40 లక్షల బ్యాంకు ఖాతాలు ఉన్నాయని.. ఖాతాదారులందరినీ ఆన్లైన్ లావాదేవీల వైపు మళ్లించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మంగళవారం నుంచి ఇంటింటికి వెళ్లి బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించి.. ఖాతాలు ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసి బస్సుల్లోను ఈ–పోస్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ–2 రామస్వామి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
క్యాష్‌లెస్ విధానంపై బీజేపీ నేతల సదస్సులు
-
జిల్లాకు పదివేల ఈ పాస్ యంత్రాలు
- నగదు రహిత లావాదేవీల కోసం ప్రతిపాదన - రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానున్న నగదు సమస్య - డీసీసీ సమావేశంలో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్) : రానున్న రోజుల్లో నగదు కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఉందని, సమస్యను ఎదుర్కొనేందుకు బ్యాంకు అధికారులు నగదు రహిత లావాదేవీలను మరింత ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ సూచించారు. పది రోజుల్లో జిల్లాకు కనీసం పది వేల ఈపాస్ యంత్రాలను తెప్పించి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్హాల్లో బ్యాంకర్లతో డీసీసీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగదు కొరతను అధిగమించడంలో బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉందన్నారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించడంతోపాటు ప్రతి ఒక్కరికీ ఏటీఎం, రూపే కార్డులను పంపిణీ చేయాలన్నారు. ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లాకు అవసరమైన స్వైపింగ్ మిషన్లు, మినీ ఏటీఎంలను తెప్పించాలన్నారు. కిరాణం షాపులు, ప్రైవేట్ విద్యా సంస్థలు, మెడికల్ షాపులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పెట్రోల్ బంకులు, ఆసుపత్రులు తదితర వాటిల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని 445 బ్రాంచుల్లో ప్రభుత్వం తరపున ఒక అధికారిని నియమస్తామని, ఈయన బ్యాంకు ఖాతాల ప్రారంభంలోనూ, ఇతరత్రా కార్యక్రమాల్లో బ్యాంకర్లకు సహకరిస్తాన్నారు. వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు జీరో బ్యాలెన్స్‌తో ఖాతాను ప్రారంభిస్తే స్వైపింగ్ మిషన్లను పంపిణీ చేయాలన్నారు. తమ దగ్గర లైసెన్సులు పొందిన వ్యాపారులందరూ స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకొని నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పది రోజుల్లో నగదు రహిత లావాదేవీలపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను వీటివైపు మళ్లించాలని సూచించారు. బ్యాంకుల్లో డబ్బుల్లేవు సారూ.. బ్యాంకుల్లో డబ్బులు లేవని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దాదాపు అన్ని బ్యాంకుల అధికారులు కలెక్టర్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు సహా దాదాపు అన్ని బ్యాంకుల అధికారులు నగదు కొరతపై కలెక్టర్‌కు వివరించారు. జిల్లాకు రూ.160 కోట్లు వచ్చినా, అన్ని రెండు వేల నోట్లే వచ్చాయని, అందువల్ల చిల్లర సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. జిల్లాకు అవసరమైన నగదును తెప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. సమావేశంలో జేసీ హరికిరణ్, ఎల్డీఎం నరసింహరావు, ఆంధ్రాబ్యాంకు డీజీఎం గోపాలకృష్ణ, ఎస్బీఐ ఆర్ఎం రమేష్‌కుమార్ పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచండి
– జిల్లా అధికారులకు కలెక్టర్ సూచన కర్నూలు (అగ్రికల్చర్): నగదు రహిత లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. సోమవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా ఆయా శాఖల్లో జిల్లా స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఆన్లైన్ లావాదేవీలకు చేపడితే ఆదర్శంగా ఉంటుందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డులు ఉపయోగించవద్దని, వీటిని ఉపయోగించడంతో అప్పుల భారం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డెబిట్ కార్డులను, రూపే కార్డులతో మాత్రమే లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. నగదు రహిత లావాదేవీల అంశాన్ని ప్రతి జిల్లా అధికారి సీరియస్‌గా తీసుకొని, సిబ్బందిని అప్రమత్తం చేసి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాకు అవసరమైనన్ని పీఓపీ మిషన్లు, మినీ మైక్రో ఏటీఎంలు వస్తున్నాయని, జిల్లా అంతటా నగదు రహిత లావాదేవీలు నిర్వహిçస్తే నగదు కొరత నుంచి బయటపడవచ్చని సూచించారు. సమావేశంలో జేసీ హరికిరణ్, జేసీ–2 రామస్వామి, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, సీపీఓ ఆనందనాయక్, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నగదు రహిత రాష్ట్రం దిశగా గోవా..!
-
నగదు రహిత బదిలీ అమలు చేయాలి
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ కాకినాడ సిటీ : నగదు రహిత బదిలీలను మీ–సేవా కేంద్రాల్లో అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. గురువారం జిల్లా శిక్షణ కేంద్రం ఆద్వర్యంలో మీ–సేవా ఆపరేటర్లకు వివిధ అంశాలపై శిక్షణ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు త్వరిత గతిన అందించేందుకు ఏర్పాటు చేసిన మీ–సేవా కేంద్రాల ద్వారా నిర్ణీత సమయంలో ఆయా సేవలను నిర్ధేశించిన రేట్లకే అందించాలన్నారు. నగదు రహిత సేవలకు సంబంధించి స్వైపింగ్ మెషీన్లు, యాప్‌లను వినియోగించాలన్నారు. ప్రభుత్వ సేవలను విస్తృతంగా ప్రజలకు అందించాలని, సర్వీసులు ఎక్కువైన తరువాత దుర్వినియోగానికి పాల్పడినా, నిర్ణయించిన చార్జీల కంటే ఎక్కువ వసూలు చేసినా జరిమానా విధింపు, విధుల నుంచి తొలగింపు వంటి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ శిక్షణలో పాల్గొన్న ఆపరేటర్లు అన్ని విషయాలు సమగ్రంగా నేర్చుకోవాలన్నారు. జిల్లా ట్రైనింగ్ కో ఆర్డినేటర్ ఎన్వీఎస్ సూరపురాజు, ఎన్ఐసీ డీఐవో ఉస్మాన్ పాల్గొన్నారు. -
ఇకపై మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్లు
– ఔషధ నియంత్రణ శాఖ రాయలసీమ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ డోన్ టౌన్ : జిల్లాలోని 1700 మెడికల్ షాపుల్లో స్వైప్‌మిషన్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలని, అలా చేయకుంటే షాపులను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని ఔషధనియంత్రణశాఖ రాయలసీమ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక రోటరీక్లబ్ కార్యాలయంలో డివిజన్‌స్థాయి మెడికల్ షాపు యజమానుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భఃగా ఆయన మాట్లాడుతూ.. నగదు రహిత వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వారంలోపు మెడికల్ షాపుల్లో నగదు రహిత వ్యాపారాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మినిమం బ్యాలెన్స్ లేకపోయినా కరెంట్ అకౌంట్ తెరవాలని.. అందుకు బ్యాంకులు సహకరిస్తాయని డోన్ ఎస్బిఐ మేనేజర్ యశోదర కృష్ణారావు మెడికల్ షాపుల యజమానులకు సూచించారు. కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, డోన్, ప్యాపిలి, వెల్దుర్తి, బేతంచర్ల, కృష్ణగిరి మండలాలకు చెందిన మెడికల్ షాపుల యజమానులు పాల్గొన్నారు. -
దళారులకు చెక్!
ఆర్టీఏ కార్యాలయాల్లో నగదురహిత సేవలు నేడు జిల్లాలో ప్రారంభించనున్న ఆర్టీఓ కిష్టయ్య వాహనదారులకు సులువుగా, వేగంగా పనులు మధ్యవర్తుల అదనపు వసూళ్లకు చెల్లుచీటి మీసేవా ద్వారా అందుబాటులోకి 59రకాల సేవలు ఆయా కేంద్రాల ఆపరేట్లరకు ప్రత్యేకశిక్షణ మహబూబ్‌నగర్ క్రై ం: డ్రై వింగ్ లైసెన్స్‌కు ఎంతవుతుందో చాలామందికి తెలియదు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలో అవగాహన ఉండదు. డ్రై వింగ్ లైసెన్స్ రెన్యూవల్‌కు ఎంత ఖర్చవుతుందో ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తే గాని పనికాదు. మధ్యవర్తులను ద్వారా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే ఖర్చులు తడిసిమోపెడు అవడం అందరికీ తెలిసిందే.. వీటన్నింటికీ అడ్డుకట్టవేయాలని రవాణాశాఖ భావిస్తోంది. దళారుల అక్రమ వసూళ్లకు ముకుతాడు వేయాలని ప్రణాళికసిద్ధం చేసింది. అందులో భాగంగానే 59రకాల సేవలను వేగంగా.. సులభంగా మీసేవా ద్వారా అందించనుంది. ఇప్పటికే ఆయా కేంద్రాల ఆపరేట్లరకు ప్రత్యేకశిక్షణ ఇచ్చారు. నేటినుంచి 59రకాల సేవలు ఈనెల 2(మంగళవారం)నుంచి ఆర్టీఏకు సంబంధించిన 59రకాల సేవలను మీసేవా ద్వారా అందించనున్నారు. డ్రై వింగ్, లైసెన్స్, వాహనాల పర్మిట్లు ఇతర ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు, చేర్పులు.. ఇలా మొత్తం 59రకాల సేవలను అందజేయనున్నారు. ఇప్పటివరకు మీ సేవలో 329అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఆర్టీఏ నుంచి వచ్చే 59 కలుపుకుని మొత్తం 388సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకే వివిధ రకాల సేవలు అందిస్తున్న మీసేవా కేంద్రాలు జిల్లాలో 480ఉన్నాయి. ప్రస్తుతం కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కోసం మీసేవా ద్వారా పొందుతున్నారు. ఈ మాదిరిగానే ఆర్టీఏ సేవలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన వారు నేరుగా అందుబాటులోని కేంద్రాలకు వెళ్లి నిర్ధేశించిన రుసుం చెల్లించి రసీదు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంబంధిత ధ్రువీకరణ పత్రాలను మీసేవలో ఇస్తే వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఆ పత్రాలను ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక అక్కడ డబ్బులు తీసుకునే దళారీ వ్యవస్థ ఉండదు. కేవలం సంబంధిత పత్రాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ అధికారులు డబ్బులు అడిగితే అది లంచంగానే భావించవచ్చు. నిర్ధేశించిన ధరలు – లర్నింగ్ లైసెన్స్ పొందడానికి రూ.475, కేవలం ద్విచక్ర వాహనానికి రూ.290, బైక్, కారు కలిపి రూ.552, ద్విచక్ర వాహనం, కారు, ఆటోరిక్షా లైసెన్స్‌కు రూ.575 అవుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ లైసెన్స్‌కు రూ.650చెల్లించాల్సి ఉంటుంది. – లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు రూ.485 ఫీజు ఉంటుంది. నకిలీ లైసెన్స్ పొందడానికి రూ.485రుసుం చెల్లించాలి. – వాహనాల రిజిస్ట్రేషన్‌లో ద్విచక్ర వాహనానికి రూ.395, కారుకు రూ.635, రవాణా వాహనాలకు రూ.870, రవాణా మీడియం వాహనాలకు రూ.1060, భారీ వాహనాలకు రూ.1360రుసుం చెల్లించి వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వీటికంటే ఎక్కువగా అడుగుతున్నారంటే అవినీతి చోటుచేసుకుంటుందని వాహనదారులు తెలుసుకోవాలి. ఇలా చేసుకోవాలి ఆర్టీఏ వెబ్‌సైట్‌పై ఎం వాలెట్ వివరాలు, శాఖ సమాచారాలు, సేవల వివరాలు ఉంటాయి. ఏ సమాచారం కావాలంటే దానిపై క్లిక్‌చేస్తే ఆ సమాచార పత్రం కనిపిస్తుంది. ఆ తర్వాత నీలిరంగు బ్యానర్‌తో ఉన్న వరుసలో సేవలు(సర్వీసెస్), లైసెన్స్, రిజిస్ట్రేషన్, అనుమతులు, పన్నులు, ఫీజులు, యూజర్‌చార్జీలు, ఫెనాల్టీ, రోడ్డుభద్రత, గణాంకాలు తదితర ఉపవిభాగాలు ఉంటాయి. ఇందులో ఏ సేవలు పొందాలనుకునేవారు.. అందులోకి వెళ్లి పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దళారులను నియంత్రించేందుకు.. ఆర్టీఏ కార్యాలయాల్లో దళారులను నియంత్రణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనదారులకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. వాహనదారులు మధ్యవర్తులను ఏమాత్రం సంప్రదించకుండా నేరుగా వాళ్ల పనులు వాళ్లే చేసుకోవచ్చు. ఇకనుంచి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వస్తాయి. – లెక్కల కిష్టయ్య, ఆర్టీఓ, మహబూబ్‌నగర్ -
కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ నగదు రహిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు నిమ్స్‌లో ఉన్నట్లుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ క్రెడిట్ ప్రాతిపదికన చికిత్స అందించేందుకు అనుమతివ్వాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. ఆసుపత్రి నుంచి బిల్లులు వచ్చాక ఆ చార్జీలను సర్కారు విడుదల చేయనుంది. గత నవంబర్ నుంచి రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నగదు రహిత చికిత్స విధానాన్ని రాష్ట్రంలో 230 ఆసుపత్రులు అమలు చేస్తుండగా.. 12 ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులు అమలు చేయడం లేదు. అందుకే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేసే శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్న ధరలను 25% పెంచాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రతి జబ్బుకూ ఇంత ఖర్చవుతుందని చెప్పలేమని కార్పొరేట్ ఆసుపత్రులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చా యి. దీనిపై ప్రభుత్వం కొన్ని రకాల చికిత్సలకు ప్యాకేజీల్లేకుండా అనుమతివ్వాలని యోచి స్తోంది. అయితే ఉద్యోగి ఇలాంటి చికిత్సలకు వైద్య విద్యా సంచాలకుడి (డీఎంఈ) ఆధ్వర్యంలో నియమించే కమిటీ అనుమతి పొందాలనే నిబంధన విధించాలని భావిస్తోంది. చికిత్స తర్వాత ఆ బిల్లును డీఎంఈ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఆసుపత్రికి మంజూరు చేస్తుంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది.