సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు నిమ్స్‌లో ఉన్నట్లుగా కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ క్రెడిట్ ప్రాతిపదికన చికిత్స అందించేందుకు అనుమతివ్వాలని రాష్ర్ట ప్రభుత్వం యోచిస్తోంది. ఆసుపత్రి నుంచి బిల్లులు వచ్చాక ఆ చార్జీలను సర్కారు విడుదల చేయనుంది. గత నవంబర్ నుంచి రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా నగదు రహిత చికిత్స విధానాన్ని రాష్ట్రంలో 230 ఆసుపత్రులు అమలు చేస్తుండగా.. 12 ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులు అమలు చేయడం లేదు. అందుకే కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేసే శస్త్రచికిత్సలకు ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్న ధరలను 25% పెంచాలని యోచిస్తున్నట్లు తెలిసింది.
అయితే ప్రతి జబ్బుకూ ఇంత ఖర్చవుతుందని చెప్పలేమని కార్పొరేట్ ఆసుపత్రులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చా యి. దీనిపై ప్రభుత్వం కొన్ని రకాల చికిత్సలకు ప్యాకేజీల్లేకుండా అనుమతివ్వాలని యోచి స్తోంది. అయితే ఉద్యోగి ఇలాంటి చికిత్సలకు వైద్య విద్యా సంచాలకుడి (డీఎంఈ) ఆధ్వర్యంలో నియమించే కమిటీ అనుమతి పొందాలనే నిబంధన విధించాలని భావిస్తోంది. చికిత్స తర్వాత ఆ బిల్లును డీఎంఈ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఆసుపత్రికి మంజూరు చేస్తుంది. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది.
కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ నగదు రహిత వైద్యం
Published Sat, Jun 20 2015 4:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM
Advertisement