ఇకపై మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్లు
ఇకపై మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్లు
Published Wed, Nov 23 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
– ఔషధ నియంత్రణ శాఖ రాయలసీమ డిప్యూటీ డైరెక్టర్ కుమార్
డోన్ టౌన్ : జిల్లాలోని 1700 మెడికల్ షాపుల్లో స్వైప్‌మిషన్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలని, అలా చేయకుంటే షాపులను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని ఔషధనియంత్రణశాఖ రాయలసీమ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక రోటరీక్లబ్ కార్యాలయంలో డివిజన్‌స్థాయి మెడికల్ షాపు యజమానుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భఃగా ఆయన మాట్లాడుతూ.. నగదు రహిత వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వారంలోపు మెడికల్ షాపుల్లో నగదు రహిత వ్యాపారాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
మినిమం బ్యాలెన్స్ లేకపోయినా కరెంట్ అకౌంట్ తెరవాలని.. అందుకు బ్యాంకులు సహకరిస్తాయని డోన్ ఎస్‌బిఐ మేనేజర్ యశోదర కృష్ణారావు మెడికల్ షాపుల యజమానులకు సూచించారు. కార్యక్రమంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, డోన్, ప్యాపిలి, వెల్దుర్తి, బేతంచర్ల, కృష్ణగిరి మండలాలకు చెందిన మెడికల్ షాపుల యజమానులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement