swipe machine
-
స్వైపింగ్ దందా...
కోహెడరూరల్(హుస్నాబాద్) : కోహెడ మండలానికి చెందిన బోలుమల్ల రామయ్య ఒక సాధారణ రైతు. అయన బ్యాంకు ఖాతాలో రూ. 19000 వేలు ఉన్నాయి. ఇటీవల పంట కోత కోసం డబ్బులు కావాలని మండల కేంద్రలోని రెండు ఏటీఎం తిరిగాడు. ఏటీఎంలో డబ్బులు లేకపోవడంతో పని కాలేదు. రామయ్యకు తెలిసిన వ్యక్తి ఒకరు ఒక షాపు అడ్రస్ చెప్పాడు. అయన వద్దకు వెళ్లిన రామయ్య ఏటీఎం ఇచ్చి 14వేలు కావాలని చెప్పాడు. దీంతో సదరు యజమాని తన ఖాతాలోని 14వేలు తీసి 13,600 రామయ్యకు ఇచ్చాడు. డబ్బులు లెక్కపెట్టిన రామయ్య 400 తక్కువగా ఉన్నాయని ఆడగగా మీకు పుణ్యానికి డబ్బులు ఇవ్వడానికి ఎమైనా ధర్మసత్రం నడుపుతున్నానా మీకు డబ్బులు ఇచ్చినందుకు మాకు ట్యాక్సులు పడుతాయి. మా ఆకౌంట్లో డబ్బులు వాడినందుకు రేపు లేనిపోని తలనొప్పులు వస్తాయని కోపగించకున్నాడు. ఇలాంటి రామయ్యలు రోజుకు వందల సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో నగదు సమస్య పీడిస్తుంది. డబ్బుల కోసం సామాన్యులు నానా పాట్లు పడతున్నారు. వారి అవసరాలను కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. నగదు రహిత లావాదేవీల కోసం తీసుకున్న స్వైపింగ్ మిషన్ల ద్వారా కమీషన్‌పై డబ్బులు ఇస్తూ దందా చేస్తున్నారు. నగదు రహత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యాపార సముదాయలలో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కొందరు వ్యాపారులు ఈ స్వైపింగ్ మిషన్లు వ్యాపారానికే కాకుండా కమీషన్‌కు డబ్బులు ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారు. వ్యాపార సంస్థలే కాకుండా పెట్రోల్ బంకులు, వైన్‌షాపులు తదితర కమీషన్ వ్యాపారం జోరుగా సాగుతుంది. స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జరిపితే ఎలాంటి కమీషన్ తీసుకోవద్దని బ్యాంకర్లు సూచిస్తున్నా పలువురు వ్యాపారులు ఇలా విని అలా వదిలేస్తున్నారు. డబ్బులు దొరక్కపోవడంతో... పంట కోతలున్నాయి. చేతిల డబ్బులు లేవు. ఏటీఎంలో సరిపడా డబ్బులు రాకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాం.స్వైపింగ్ ద్వారా అయితే 5 నిమిషాల్లొ డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు పోతే పోయినాయి. కానీ అవసరాలు గట్టేకుతున్నాయి. –బోలమల్ల మహేందర్, స్థానికుడు కమీషన్ తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలి స్వైపింగ్ ద్వారా కమీషన్ తీసుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకోని వ్యాపారుల వద్దకు వెళ్తే స్వైపింగ్ మిషన్ ద్వారా కమీషన్ వసూలు చేస్తున్నారు. మా డబ్బులు తీసుకోవడానికి కూడా కమీషన్ ఇవ్వాల్సి వస్తోంది. –బి.శ్రీనివాస్, వరికోలు -
మార్కెట్ యార్డులకు స్వైప్ మిషన్లు
పెద్దపల్లిరూరల్ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్‌యార్డులలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించేందుకు ప్రభుత్వం స్వైప్ మిషన్లను అందజేసింది. మార్కెట్‌యార్డుల్లో క్రయ, విక్రయాలకు సంబంధించిన చెల్లింపులు అప్పటికప్పుడే స్వైప్ మిషన్ల ద్వార జరుపుకునేందుకు ఈ పద్ధతిన అవకాశం ఉంటుందని పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య తెలిపారు. పెద్దపల్లి యార్డుకు కేటాయించిన స్వైప్ మిషన్ ను సోమవారం ఆయన పరిశీలించి అనుసరించాల్సిన పద్ధతుల గురించి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తన సొంత నియోజకవర్గాన్ని నగదురహిత లావాదేవీలు జరపడంలో ముందుంచినట్టే మార్కెటింగ్శాఖలోనూ ఆ దిశగా చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మొదలైన ‘నామ్’ సేవలు రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్‌యార్డులలో ఆన్ లైన్ పద్ధతిన పంట దిగుబడుల లావాదేవీలు నిర్వహించేందుకు నామ్ సేవలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పెద్దపల్లి మార్కెట్‌యార్డులో సోమవారం తొలిసారిగా క్రయ, విక్రయాలను ఆన్ లైన్ లో నమోదు చేశారు. మార్కెట్ యార్డుకు 51మంది రైతులు సోమవారం తెచ్చిన 218 క్వింటాళ్ల పత్తిని ఆన్ లైన్ పద్ధతిన విక్రయించారు. ఈ మేరకు రైతులకు ఆన్ లై న్ కొనుగోళ్లపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఐలయ్య, సూపర్వైజర్ శంకరయ్య తెలిపారు. పెద్దపల్లి మార్కెట్‌యార్డులో పూర్తిస్థాయిలో ఆన్ లైన్ సేవలు, నగదురహిత లావాదేవీలు అమలు చేస్తామని పేర్కొన్నారు. 218 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో సోమవారం 218 క్వింటాళ్ల పత్తికొనుగోళ్లు జరిగాయి. 51 మంది రైతుల ద్వార యార్డుకు వచ్చిన పత్తికి క్వింటాలు ధర రూ.5460 అత్యధికంగా నమోదు కాగ, కనిష్టంగా రూ.5050 గా నమోదైందని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. సరాసరి ధరను రూ.5350గా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. -
స్వైప్ మిషన్.. మాకొద్దు బాబోయ్ !
- రైతు బజార్లో స్వైప్ మిషన్ల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ప్రయత్నం - నిర్వహించలేమంటున్న రైతులు, పొదుపు మహిళలు - కొనుగోలుదారులకూ కష్టమే - స్వైప్ మిషన్లు ఉంటేనే అమ్మకాలకు అనుమతి అంటూ అధికారుల బెదిరింపు ఒకప్పుడు రైతు బజార్లో ఎలక్ట్రానిక్ కాటా తప్పని సరిగా ఉపయోగించాలంటే మావల్ల కాదన్న గ్రామీణ రైతులు ఇప్పుడు స్వైప్ మిషన్లు తప్పదని అధికారులు ఆదేశించడంతో మాకొద్దు బాబోయ్ అంటున్నారు. రైతు బజార్లో రూ. 1 మొదలు కొని రూ. 70..80.. ధర ఉండే ఉత్పత్తులను కొనుగోలుదారులు ఒక్కో వ్యాపారి వద్ద ఒక్కో రకం తీసుకుని చిల్లర ఇస్తుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రూ. 500ఽకు మించి వ్యాపారం జరగదు. ఇలాంటి తరుణంలో స్వైప్ మిషన్లు తప్పనిసరి అని మార్కెటింగ్ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో విక్రయదారులు బెంబేలెత్తుతున్నారు. అసలు రైతుబజార్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. - కర్నూలు(అగ్రికల్చర్) మార్కెటింగ్ శాఖ కమిషనర్ అన్ని రైతుబాజర్లలో విధిగా నగదురహిత లావాదేవీలు నిర్వహించాలని మార్కెటింగ్ అధికారులు, ఎస్టేటు ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేయడంతో వీరు రైతులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. కర్నూలులో మూడు, నంద్యాల, ఆదోనిలో ఒక్కొక్కటి ప్రకారం మొత్తం ఐదు రైతుబజార్లు ఉన్నాయి. వీటిన్నింటిలో నగదురహిత లావాదేవీల నిర్వహణకు రైతులు స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని మార్కెటింగ్ శాఖ తప్పనిసరి అని చెప్పడంతో రైతుల ఆందోళన అంతా..ఇంతా కాదు. అసలు నగదు రహిత లావాదేవీలు అంటే ఏమి? స్వైప్ మిషన్ ఎలా పని చేస్తుంది? డబ్బులు ఖాతాల్లో ఎలా జమ అవుతాయి...వాటిని ఎలా తీసుకోవాలి? ఇలా ఎన్నో అనుమానాలతో రైతులు, పొదుపు మహిళలు స్వైప్‌పై మొగ్గు చూపడం లేదు. రైతు బజార్లో రూ.10, రూ.20 మేర కొనుగోలు చేసే వారు స్వైప్ ఉపయోగించడం ఎలా వీలు అవుతుందని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. నెలసరి నిత్యావసర సరుకులు ఒకే దుకాణంలో రూ.1500 నుంచి రూ2000 వరకు కొనుగోలు చేస్తారు. అక్కడ ఈ మిషన్లు ఉపయోగించడం సులువు కానీ రైతు బజార్లో సాధ్యం కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిరక్ష్యరాస్యతతో నిర్వహణ ఎలా: రైతు బజార్లో కూరగాయలు అమ్ముకునే రైతులు, పొదుపు మహిళలు దాదాపు నిరక్షరాస్యులే. వీరికి నగదు రహితంపై అసలు కనీస అవగాహన లేదు. తూకంలో కూడా కిలో.. అర కిలో రాళ్లనే ఉపయోగిస్తారు. ఎలకా్ట్రనిక్ కాటాను ఉపయోగించలేని వారు సై్వప్ మిషన్‌ను ఎలా నిర్వహిస్తారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మార్కెటింగ్ అధికారులు బలవంతంగా స్వైప్ మిషన్ల ఏర్పాటుకు రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. స్వైప్ మిషన్లు లేకపోతే రైతుబజార్లో కూర్చోనివ్వమని బెదిరిస్తున్నారు. రైతుబజార్లలో దళారీలు తిష్టవేశారు. మార్కెటింగ్ అధికారులు వీరిని వదలి వారంలో కేవలం రెండు, మూడు రోజలు మాత్రమే కూరగాయలు అమ్మకునే రైతులు, పొదుపు మహిళలను స్వైప్ మిషన్ల పేరుతో వేధిస్తున్నారు. మాకెందుకు కరెంట్ ఖాతాలు అంటూ చెబుతున్నా తీసుకోవాల్సిందేనంటూ ఒత్తిడి చేస్తున్నారు. వినియోగదారులు కూడా రైతుబజార్లలో స్వైప్ మిషన్లు వాడటానికి ఆసక్తి చూపటం లేదు. ఒకచోట అయితే వాడుతాము.. కూరగాయలు ఐదారుగురు దగ్గర కొంటే అందరి దగ్గర వాడాలంటే ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. నో క్యాష్ నేపథ్యంలో విత్‌డ్రా ఎలా: రూ.500, 1000 నోట్ల రద్దుతో ఇప్పటికే బ్యాంకుల్లో నగదు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఖాతాల్లో ఉన్న డబ్బును తీసుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని బ్యాంకుల్లోను నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. నగదు ఉన్నా... రూ.2000 నుంచి 4000 మించి ఇవ్వడం లేదు. స్వైప్మిషన్లను వినియోగించడం ద్వారా నగదు ఖాతాల్లో జమ అయితే తీసుకోవడం ఎలా అని ఆవేదన చెందుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూరగాయలు అమ్మగా వచ్చిన డబ్బును పొలం వద్ద కూలీలకు ఎలా చెల్లించాలని ప్రశ్నిస్తున్నారు. స్వైప్ మిషన్లు తప్పనిసరి: సత్యనారాయణ చౌదరి ఏడీఎం అన్ని రైతుబజార్‌ల్లో స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల చివరిలోగా ప్రతి ఒక్కరు కరెంట్ ఖాతాలు ప్రారంభించి స్వైప్ మిషన్లు పెట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సిండికేట్ బ్యాంకు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు, ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకు, ఏపీజీబీల్లో కరెంట్ ఖాతాలు ప్రారంభించాలని చెబుతున్నాం. ప్రస్తుతానికి 25 మంది రైతులు, 24 పొదుపు గ్రూపుల మహిళల చేత స్వైప్ మిషన్లు పెట్టిస్తున్నాం. రైతుబజార్‌ల్లో నగదురహిత లావాదేవీలు నిర్వహించాలనేది లక్ష్యం. స్వైప్ మిషన్ కష్టమే: శ్రీనివాసగౌడు నందనపల్లి కర్నూలు మండలం నేను వారంలో రెండుమూడు రోజులే కూరగాయలు అమ్ముకుంటాను. నాకు చదువు రాదు. మా దగ్గర ఒక్కొక్కరు ఒక్కో రకం కూరగాయలు కొంటారు. వీటికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని అధికారులు చెబుతున్నారు. కరెంటు ఖాతా ప్రారంభించాలం. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చుంటే రూ.500 వ్యాపారం జరుగదు. మాకెందుకు స్వైప్ మిషన్లు. డబ్బు పడితే తీసుకునేదెలా: విజయ, పడిదెంపాడు కూరగాయలు కొంటానికి వచ్చిన వారు ఎక్కడ ఏది బాగా ఉంటే అక్కడే కొనుక్కుంటారు. రైతుబజారుకు వచ్చిన వారు కనీసం ఐదారు మంది దగ్గర కూరగాయలు కొంటారు. అందరి దగ్గర మిషన్లను వాడాలంటే సాధ్యం కాదు. మాకు వ్యాపారాలపైనే దృష్టి ఉంటుంది. మిషన్ల ద్వారా ఎలా తీసుకుంటాము. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడితే తీసుకోవడం ఎలా... బ్యాంకుల్లో డబ్బులు లేకపోతే ఎలా ఇస్తారు. ఈ వ్యాపారాలకు మిషన్లు సరిపోవు. ఒత్తిడి చేయడం మంచిది కాదు: మద్దమ్మ, భూపాల్‌నగర్ కరెంటు ఖాతాలు ప్రారంభించాలని, మిషన్లు తెచ్చుకోవాలని అధికారులు మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు. మాకు చదువు రాదు. కరెంటు ఖాతాలు... స్వైప్ మిషన్ల పేర్లే వినలేదు. కనీస అవగాహన కూడ లేకపోతే వాటిని ఎలా నిర్వహించాలి. పెద్దపెద్ద వ్యాపారాల దగ్గర వాటిని పెడితే ఉపయోగం ఉంటుంది. ఇప్పటికైన ప్రభుత్వం పునరాలోచన చేయాలి. -
వారంలోగా మద్యం దుకాణాల్లో స్వైప్ మిషన్లు
కర్నూలు: మద్యం దుకాణాల్లో వారంలోగా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ సీఐలను ఆ శాఖ సూపరింటెండెంట్ మహేష్‌కుమార్ ఆదేశించారు. కర్నూలులో సోమవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గిఉండాలని సూచించారు. ఎక్సైజ్ నేరాలు పాతవి, కొత్తవి అన్ని ఆన్లైన్లో పొందుపర్చాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు.ఇదిలా ఉండగా.. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో పేపర్ రహిత పాలనపై ఎన్ఫోర్సుమెంటు డైరెక్టర్ వెంకటేశ్వరరావు విజయవాడ నుంచి అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు కర్నూలు ఎక్సైజ్ కార్యాలయంలో ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు, కర్నూలు, నంద్యాల ఏఈఎస్‌లు ఫయాజుద్దీన్, హెబ్సిబారాణి, ఈఎస్‌లు ఆదినారాయణమూర్తి, మహేష్‌కుమార్‌తో పాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు. -
విద్యుత్ శాఖకు 80 స్వైప్ మిషన్లు
కర్నూలు(రాజ్‌విహార్): పెద్ద నోట్ల రద్దు ప్రభావం విద్యుత్ శాఖపై తీవ్రంగా పడింది. ఇకపై భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో విద్యుత్ బిల్లులను కూడా అదే తరహాలో వసూలు చేసేందుకు స్వైప్ మిషన్లు ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా కొత్తగా 80 స్వైప్ మిషన్లను కొనుగోలు చేసింది. ఇందులో హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి 40, యాక్సిస్ బ్యాంకు నుంచి మరో 40 మిషన్లు కొనుగోలు చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. వీటి నిర్వహణపై సిబ్బంది, అధికారులకు త్వరలో అవగాహన కల్పించి వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. -
అంతా గీకుడేనట..!
సాక్షి ప్రతినిధి, కడప: పెద్ద నోట్ల రద్దు.. కొత్త నోట్లు ఇంకా పూర్తిగా చెలామణిలోకి రాని ప్రస్తుత పరిస్థితుల్లో చిల్లర నోట్ల సమస్యతో జనం ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిపై మరో భారం మోపడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రూ.1000, రూ.500 నోట్ల రద్దు, నగదు విత్ డ్రాపై ఆంక్షలతో ఇప్పటికే అసహనంతో ఉన్న చిరు వ్యాపారులకు పీఓఎస్ మిషన్లు కట్టబెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఆర్థిక లావాదేవీలన్నీ స్వైపింగ్ మిషన్ల ద్వారానే జరగాలని సూచిస్తున్నారు. కిళ్లీ బడ్డీలు, కూరగాయల వ్యాపారులు, పచారీ దుకాణాలు, సినిమా థియేటర్లలో వ్యాపారులందరికీ పీఓఎస్ మిషన్లు సరఫరా చేస్తామని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. కాగా ఈ తరహా లావాదేవీలు ఇప్పటికిప్పుడు నిర్వహించడం అసాధ్యమేనని పలువురు పేర్కొంటున్నారు. అత్యధిక శాతం నిరక్షరాస్యులు ఉన్న మన రాష్ట్రంలో క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించుకోవడం అనేది విద్యావంతులకే ఇప్పటికీ తెలియదు. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన నగదు రహిత లావాదేవీలు నిర్వహణ అనేది అంత తేలికైన విషయం కాదన్నది అత్యధికుల వాదన. గ్రామీణ ప్రాంతాల్లో బహు కష్టం.. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని లావాదేవీలను నగదు రహితంగా నిర్వహించడం ఇప్పుడిప్పుడే వీలుకాదని అధికారులు చెబుతున్నారు. పల్లెల్లో దీనిపై ఇంకా అవగాహన లేదని, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. గ్రామీణుల్లో చాలా మందికి సెల్‌ఫోన్ వినియోగించడమే సరిగ్గా చేతకాదని మరికొందరంటున్నారు. జిల్లాలో మొత్తం జనాభాలో 32.70 శాతం మంది నిరక్షరాస్యులు ఉన్నారు. వారిలో చాలా మందికి బ్యాంకు ఖాతాలే లేనట్లు తెలుస్తోంది. వాళ్లందరికీ ఖాతాలు ఎప్పుడు తెరుస్తారు, వారికి స్వైపింగ్ పరిజ్ఞానం అర్థం కాకుంటే ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఏమిటీ అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. ఏటీఎం కార్డులు విరివిగా ఉపయోగించడం వల్లే ఎక్కువగా ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలన్నీ పీఓఎస్ మిషన్ల ద్వారా అంటే మరిన్ని మోసాలు జరిగే అవకాశం లేకపోలేదు. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం ఎంత..? బ్యాంకు ఖాతాదారుల్లో డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు కలిగిన వారు 25 శాతం మంది ఉంటారని అంచనా. వీటిని జారీ చేసే క్రమంలో ఆయా బ్యాంకులు కొన్ని ప్రత్యేక విధి విధానాలను అమలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలోనే ఈ కార్డుల జారీ, వాడకం పెరిగిపోయింది. అయితే వీటిని వినియోగించడంపై చాలా మందికి అవగాహన లేదు. చిన్న వ్యాపారులు, చదువురాని వారికి అసలే లేదు. ఈ విధానంపై అవగాహన కల్పించాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎంత మందికి తెలుసు..? ఇప్పటి వరకూ అతి కొద్ది మంది మాత్రమే నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వీరు ఎంత మంది ఉంటారనే దానికి కచ్చితమైన గణాంకాలు లేవు. జిల్లాలో 28,82,469 మంది జనాభా ఉంటే వారిలో నెట్ బ్యాంకింగ్ నిర్వహించే వారు రెండు, మూడు లక్షలకు మించి ఉండరని కొందరు బ్యాంకు మేనేజర్లు చెబుతున్నారు. అది కూడా మనీ ట్రాన్స్ఫర్ కోసం, విమానం, రైలు, ఆర్టీసీ టికెట్ల బుకింగ్, పెద్ద మాల్స్, సినిమా థియేటర్ల కొనుగోలుకు మాత్రమే పరిమితం అంటున్నారు. ఈ విధానం కూడా బ్యాంక్ అకౌంట్లను కచ్చితంగా ఎక్కువ మొత్తంలో నిర్వహించే వారికి, నెట్ బ్యాంకింగ్ గూర్చి తెలిసిన వారికే సాధ్యమని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానాన్ని వినియోగించే వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. -
ఇకపై మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్లు
– ఔషధ నియంత్రణ శాఖ రాయలసీమ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ డోన్ టౌన్ : జిల్లాలోని 1700 మెడికల్ షాపుల్లో స్వైప్‌మిషన్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలని, అలా చేయకుంటే షాపులను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని ఔషధనియంత్రణశాఖ రాయలసీమ డిప్యూటీ డైరెక్టర్ కుమార్ హెచ్చరించారు. బుధవారం స్థానిక రోటరీక్లబ్ కార్యాలయంలో డివిజన్‌స్థాయి మెడికల్ షాపు యజమానుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భఃగా ఆయన మాట్లాడుతూ.. నగదు రహిత వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వారంలోపు మెడికల్ షాపుల్లో నగదు రహిత వ్యాపారాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మినిమం బ్యాలెన్స్ లేకపోయినా కరెంట్ అకౌంట్ తెరవాలని.. అందుకు బ్యాంకులు సహకరిస్తాయని డోన్ ఎస్బిఐ మేనేజర్ యశోదర కృష్ణారావు మెడికల్ షాపుల యజమానులకు సూచించారు. కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, డోన్, ప్యాపిలి, వెల్దుర్తి, బేతంచర్ల, కృష్ణగిరి మండలాలకు చెందిన మెడికల్ షాపుల యజమానులు పాల్గొన్నారు. -
మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్లు
- ఒకటి నుంచి అమలు కర్నూలు(హాస్పిటల్): వచ్చే నెల ఒకటో తేదీ నాటికి అన్ని మెడికల్ షాపుల్లో స్వైప్ మిషన్(ఈ - పాస్)లను తప్పనిసరి చేస్తూ ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఒ.కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక కెమిస్ట్ భవన్లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన బ్యాంకు అధికారులు, కెమిస్ట్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజల వద్ద ప్రస్తుతం కేవలం 10 శాతం మాత్రమే నగదు ఉందన్నారు. ఈ కారణంగా మెడికల్‌షాపు నిర్వాహకులు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో 2వేలకు పైగా హోల్‌సేల్, రిటైల్ కెమిస్ట్లున్నారని, వీరందరూ తప్పనిసరిగా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాల్సిందేనన్నారు. మిషన్లు ఏర్పాటు చేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు అబిద్ అలి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
చిల్లర వర్తకులకు ఉచితంగా స్వైప్ మిషన్లు
ఏపీ, తెలంగాణలో అవర్‌ట్రిప్.ఇన్ అందజేత హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఆన్లైన్ లావాదేవీలు పెరిగారుు. స్వైప్ మిషన్లు ఉన్న సూపర్ మార్కెట్లు, పెద్ద ఔట్లెట్లు తమ వ్యాపారాలను సజావుగా సాగిస్తున్నారుు. మరి చిన్న చిన్న చిల్లర దుకాణాలు, వ్యాపారస్తులు మాత్రం వ్యాపారం లేక తల్లడిల్లిపోతున్నారు. మార్కెట్లో నోట్ల హడావుడి తగ్గితే కానీ వీరి వ్యాపారం మళ్లీ గాడినపడదు. వీరి కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అవర్‌ట్రిప్.ఇన్ స్టార్టప్ ఉచితంగా స్వైప్ మిషన్లను పంపిణీ చేయాలని నిర్ణరుుంచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ట్రావెల్ ఏజెంట్లు, చిన్న దుకాణాదారులు, వర్తకులు, ఏపీ ఆన్లైన్, మీ సేవా, మీ సేవా కేంద్రాలు, ఎంఎస్ఎంఈలకు ఈ అవకాశం కల్పిస్తున్నామని కంపెనీ ఫౌండర్ బి. మోహన్ రావు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు. సాధారణంగా స్వైప్ మిషన్ నుంచి జరిగే ప్రతి లావాదేవీ మీద 2-2.5 శాతం ఎండీఆర్ చార్జీలుంటాయని.. అరుుతే అవర్‌ట్రిప్ మాత్రం క్రెడిట్ కార్డ్ దారులకై తే 1.6 శాతం, డెబిట్ కార్డుదారులకై తే 1 శాతం మాత్రమే చేస్తుందని చెప్పారు. ఏపీ ఆన్లైన్, మీ సేవా కేంద్రాలకు కూడా ఉచితంగా స్వైప్ మిషన్లను అందిస్తామని.. వీరికి 1.2 శాతం చార్జీ విధిస్తామని.. మిషన్లు కావాలనుకునే వారు 94934 82134 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం బస్సు, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స, డొమెస్టిక్ మనీ ట్రాన్సఫర్, వినియోగ చెల్లింపులు వంటి సేవలందిస్తున్నాం. ప్రతి నెలా రూ.6-7 కోట్ల లావాదేవీలు జరుగుతున్నారుు. 2 నెలల్లో రూ.15 కోట్ల నిధుల సమీకరణ పూర్తి చేయనున్నామని’’ మోహన్ వివరించారు. -
చెయ్యే క్రెడిట్ కార్డు!
వాషింగ్టన్: చేతిలో చిల్లిగవ్వలేకున్నా.. క్రెడిట్ కార్డు తీసుకెళ్లకున్నా.. ఎం చక్కా మీరు షాపింగ్ చేయొచ్చు.. కొనాల్సినవన్నీ కొనేసి.. మీ చేతిని స్వైప్ మిషన్‌పై పెడితే చాలు.. మీ అకౌంట్లోని డబ్బులు కావాల్సిన వారి ఖాతాలోకి వెళ్లిపోతాయి. స్వీడన్‌కు చెందిన క్విస్టర్ అనే కంపెనీ ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. వీరు రూపొందించిన స్వైప్ మిష న్లో క్రెడిట్‌కార్డుకు బదులుగా చేతిని ఉంచితే చాలు.. సెన్సార్ల ద్వారా అది చేతిని స్కాన్ చేసుకొని కావాల్సిన డబ్బును మీ అకౌంట్ నుంచి ఐదు సెకన్లలోపే తీసుకుంటుంది. వేలిముద్రలులాగే, చేతిలో ఉండే నరాలు కూడా ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవు... దీన్ని ఆధారంగా చేసుకొనే ఈ కొత్తరకం స్వైప్ మిషన్‌ను తయారుచేసినట్లు రూపకర్తల్లో ఒకరైన ఫ్రెడరిక్ లేఫ్లాడ్ తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి స్వైప్మిషన్లను లండ్ యూనివర్సిటీలో 15 వరకు అమర్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల మోసాలు జరిగే అవకాశం ఉండదని చెప్పారు. ఈ విధానంలో షాపింగ్ చేయాలనుకునేవారు ముందుగా తమ ఫోన్ నంబర్‌కు సంబంధించిన చివరి నాలుగు సంఖ్యలను నమోదు చేసి, తర్వాత స్వైప్‌మిషన్‌పై చేతిని ఉంచితే చాలు... డబ్బులు బదిలీ అయిపోతాయి. -
చెయ్యే క్రెడిట్ కార్డు...!
వాషింగ్టన్: చేతిలో చిల్లిగవ్వలేకున్నా.... క్రెడిట్ కార్డు తీసుకెళ్లకున్నా... ఎంచక్కా మీరు షాపింగ్ చేయొచ్చు.... కొనాల్సినవన్నీ కొనేసి... మీ చేతిని స్వైప్ మిషన్‌పై పెడితే చాలు.. మీ అకౌంట్లోని డబ్బులు కావాల్సిన వారి ఖాతాలోకి వెళ్లిపోతాయి. స్వీడన్‌కు చెందిన క్విస్టర్ అనే కంపెనీ ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. వీరు రూపొందించిన స్వైప్ మిషన్‌లో క్రెడిట్‌కార్డుకు బదులుగా చేతిని ఉంచితే చాలు...సెన్సార్ల ద్వారా అది చేతిని స్కాన్ చేసుకొని కావాల్సిన డబ్బును మీ అకౌంట్ నుంచి ఐదు సెకన్లలోపే తీసుకుంటుంది. వేలిముద్రలులాగే, చేతిలో ఉండే నరాలు కూడా ఏ ఇద్దరికీ ఒక్కలా ఉండవు... దీన్ని ఆధారంగా చేసుకొనే ఈ కొత్తరకం స్వైప్ మిషన్‌ను తయారుచేసినట్లు రూపకర్తల్లో ఒకరైన ఫ్రెడరిక్ లేఫ్లాడ్ తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి స్వైప్మిషన్లను లండ్ యూనివర్సిటీలో 15 వరకు అమర్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల మోసాలు జరిగే అవకాశం ఉండదని చెప్పాడు. ఈ విధానంలో షాపింగ్ చేయాలనుకునేవారు ముందుగా తమ ఫోన్ నంబర్‌కు సంబంధించిన చివరి నాలుగు సంఖ్యలను నమోదు చేసి, తర్వాత స్వైప్‌మిషన్‌పై చేతిని ఉంచితే చాలు... ఐదు సెకన్లలోపే డబ్బులు బదిలీ అయిపోతాయి. కొత్తగా ఈ విధానంలో షాపింగ్ చేయాలనుకునేవారు తన చేతిని మూడు సార్లు స్వైప్‌మిషన్‌పై ఉంచి, పూర్తి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కంపెనీ అతడికి సంబంధించిన బయోమెట్రిక్ ఫ్రొఫైల్‌ను అన్ని స్వైప్మిషన్లలో నమోదు చేస్తుంది. ఆ తర్వాత ఈ స్వైప్మిషన్లున్న ఏ మాల్‌లోనైనా చేతితోనే షాపింగ్ చేయొచ్చు.