వారంలోగా మద్యం దుకాణాల్లో స్వైప్ మిషన్లు
కర్నూలు: మద్యం దుకాణాల్లో వారంలోగా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ సీఐలను ఆ శాఖ సూపరింటెండెంట్ మహేష్‌కుమార్ ఆదేశించారు. కర్నూలులో సోమవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గిఉండాలని సూచించారు. ఎక్సైజ్ నేరాలు పాతవి, కొత్తవి అన్ని ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు.ఇదిలా ఉండగా.. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో పేపర్ రహిత పాలనపై ఎన్‌ఫోర్సుమెంటు డైరెక్టర్ వెంకటేశ్వరరావు విజయవాడ నుంచి అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు కర్నూలు ఎక్సైజ్ కార్యాలయంలో ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు, కర్నూలు, నంద్యాల ఏఈఎస్‌లు ఫయాజుద్దీన్, హెబ్సిబారాణి, ఈఎస్‌లు ఆదినారాయణమూర్తి, మహేష్‌కుమార్‌తో పాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు.