likker Shops
-
వారంలోగా మద్యం దుకాణాల్లో స్వైప్ మిషన్లు
కర్నూలు: మద్యం దుకాణాల్లో వారంలోగా స్వైప్ మిషన్లు ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ సీఐలను ఆ శాఖ సూపరింటెండెంట్ మహేష్‌కుమార్ ఆదేశించారు. కర్నూలులో సోమవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. నగదు రహిత లావాదేవీలపై ప్రతి ఒక్కరూ అవగాహన కల్గిఉండాలని సూచించారు. ఎక్సైజ్ నేరాలు పాతవి, కొత్తవి అన్ని ఆన్లైన్లో పొందుపర్చాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆదేశించారు.ఇదిలా ఉండగా.. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో పేపర్ రహిత పాలనపై ఎన్ఫోర్సుమెంటు డైరెక్టర్ వెంకటేశ్వరరావు విజయవాడ నుంచి అన్ని జిల్లాల ఎక్సైజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు కర్నూలు ఎక్సైజ్ కార్యాలయంలో ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు, కర్నూలు, నంద్యాల ఏఈఎస్‌లు ఫయాజుద్దీన్, హెబ్సిబారాణి, ఈఎస్‌లు ఆదినారాయణమూర్తి, మహేష్‌కుమార్‌తో పాటు జిల్లాలోని అన్ని స్టేషన్ల సీఐలు పాల్గొన్నారు. -
నేడో,రేపో మద్యం టెండర్లకు నోటిఫికే షన్
నూతన మద్యం విధానం ఖరారుకు నేడు సమావేశం జూలై 1 నుంచి షాపులను కేటాయించే అవకాశం సమీక్ష నిర్వహించిన ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర తెలంగాణలో14నే నోటిఫికేషన్ ప్రొద్దుటూరు: మద్యం షాపుల టెండర్ల నిర్వహణకు సంబంధించి ఉన్నతాధికారులు నేడో రేపో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లతో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఎస్ఎస్ రావత్ శనివారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతన మద్యం విధానాన్ని ఖరారు చేయనున్నారు. జిల్లాకు సంబంధించి మొత్తం 269 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందులో 80 వాటికి టెండర్లు జరగలేదు. ఎవరూ ముందుకు రాకపోవడంతో వీటిని అలాగే వదిలేశారు. రెండేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం టెండర్లు నిర్వహించి డిప్ విధానం ద్వారా షాపులను ఖరారు చేసింది. ఏడాదివరకే ఈ కాలపరిమితి ఉండగా ప్రభుత్వం మరో ఏడాది రెన్యూవల్ చేసి కాలాన్ని పొడిగించింది. ప్రస్తుతం రెండేళ్ల గడువు పూర్తయింది. ఈ నెలాఖరులోగా కొత్తగా టెండర్లు నిర్వహించి జూలై 1 నుంచి షాపులు కేటాయించాల్సి ఉంది. ఇందు కోసం వారం రోజుల గడువును విధించాల్సి ఉంది. ఈ ప్రకారం నేడో రేపో నోటిఫికేషన్ వెలువడనుంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 14న అక్కడ నోటిఫికేషన్ వెలువడగా 21వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు విధించారు. 23న డిప్ ద్వారా షాపులు కేటాయించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 2న ప్రమాణ స్వీకారం చేయగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఈప్రభావం కారణంగా తెలంగాణ కన్నా మన రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలులో జాప్యం జరిగింది. రెండు రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమేరకు కమిషనర్ శనివారం సమీక్ష నిర్వహించి విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ముఖ్యంగా ప్రివిలైజ్ ట్యాక్స్‌తోపాటు మున్సిపాలిటీల పరిధిలోని రెండు కిలోమీటర్ల విధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.