చెయ్యే క్రెడిట్ కార్డు! | hand is credit card | Sakshi
Sakshi News home page

చెయ్యే క్రెడిట్ కార్డు!

Published Thu, May 1 2014 12:45 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

చెయ్యే క్రెడిట్ కార్డు! - Sakshi

చెయ్యే క్రెడిట్ కార్డు!

వాషింగ్టన్: చేతిలో చిల్లిగవ్వలేకున్నా.. క్రెడిట్ కార్డు  తీసుకెళ్లకున్నా.. ఎం చక్కా మీరు షాపింగ్ చేయొచ్చు.. కొనాల్సినవన్నీ కొనేసి.. మీ చేతిని స్వైప్ మిషన్‌పై పెడితే చాలు.. మీ అకౌంట్‌లోని డబ్బులు కావాల్సిన వారి ఖాతాలోకి వెళ్లిపోతాయి. స్వీడన్‌కు చెందిన క్విస్టర్ అనే కంపెనీ ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. వీరు రూపొందించిన స్వైప్ మిష న్‌లో క్రెడిట్‌కార్డుకు బదులుగా చేతిని ఉంచితే చాలు.. సెన్సార్‌ల ద్వారా అది చేతిని స్కాన్ చేసుకొని కావాల్సిన డబ్బును మీ అకౌంట్ నుంచి ఐదు సెకన్లలోపే తీసుకుంటుంది.

వేలిముద్రలులాగే, చేతిలో ఉండే నరాలు కూడా ఏ ఇద్దరికీ ఒకేలా ఉండవు... దీన్ని ఆధారంగా చేసుకొనే ఈ కొత్తరకం స్వైప్ మిషన్‌ను తయారుచేసినట్లు రూపకర్తల్లో ఒకరైన ఫ్రెడరిక్ లేఫ్లాడ్ తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి స్వైప్‌మిషన్‌లను లండ్ యూనివర్సిటీలో 15 వరకు అమర్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల మోసాలు జరిగే అవకాశం ఉండదని చెప్పారు. ఈ విధానంలో షాపింగ్ చేయాలనుకునేవారు ముందుగా తమ ఫోన్ నంబర్‌కు సంబంధించిన చివరి నాలుగు సంఖ్యలను నమోదు చేసి, తర్వాత స్వైప్‌మిషన్‌పై చేతిని ఉంచితే చాలు... డబ్బులు బదిలీ అయిపోతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement