చెయ్యే క్రెడిట్ కార్డు...! | New device lets you pay with your hands | Sakshi
Sakshi News home page

చెయ్యే క్రెడిట్ కార్డు...!

Published Wed, Apr 30 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 AM

చెయ్యే క్రెడిట్ కార్డు...!

చెయ్యే క్రెడిట్ కార్డు...!

వాషింగ్టన్: చేతిలో చిల్లిగవ్వలేకున్నా.... క్రెడిట్ కార్డు  తీసుకెళ్లకున్నా... ఎంచక్కా మీరు షాపింగ్ చేయొచ్చు.... కొనాల్సినవన్నీ కొనేసి... మీ చేతిని స్వైప్ మిషన్‌పై పెడితే చాలు.. మీ అకౌంట్‌లోని డబ్బులు కావాల్సిన వారి ఖాతాలోకి వెళ్లిపోతాయి. స్వీడన్‌కు చెందిన క్విస్టర్ అనే కంపెనీ ఈ సరికొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది. వీరు రూపొందించిన స్వైప్ మిషన్‌లో క్రెడిట్‌కార్డుకు బదులుగా చేతిని ఉంచితే చాలు...సెన్సార్‌ల ద్వారా అది చేతిని స్కాన్ చేసుకొని కావాల్సిన డబ్బును మీ అకౌంట్ నుంచి ఐదు సెకన్లలోపే తీసుకుంటుంది.

వేలిముద్రలులాగే, చేతిలో ఉండే నరాలు కూడా ఏ ఇద్దరికీ ఒక్కలా ఉండవు... దీన్ని ఆధారంగా చేసుకొనే ఈ కొత్తరకం స్వైప్ మిషన్‌ను తయారుచేసినట్లు రూపకర్తల్లో ఒకరైన ఫ్రెడరిక్ లేఫ్లాడ్ తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి స్వైప్‌మిషన్‌లను లండ్ యూనివర్సిటీలో 15 వరకు అమర్చినట్లు పేర్కొన్నారు. దీనివల్ల మోసాలు జరిగే అవకాశం ఉండదని చెప్పాడు.

ఈ విధానంలో షాపింగ్ చేయాలనుకునేవారు ముందుగా తమ ఫోన్ నంబర్‌కు సంబంధించిన చివరి నాలుగు సంఖ్యలను నమోదు చేసి, తర్వాత స్వైప్‌మిషన్‌పై చేతిని ఉంచితే చాలు... ఐదు సెకన్లలోపే డబ్బులు బదిలీ అయిపోతాయి. కొత్తగా ఈ విధానంలో షాపింగ్ చేయాలనుకునేవారు తన చేతిని మూడు సార్లు స్వైప్‌మిషన్‌పై ఉంచి, పూర్తి వివరాలతో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కంపెనీ అతడికి సంబంధించిన బయోమెట్రిక్ ఫ్రొఫైల్‌ను అన్ని స్వైప్‌మిషన్‌లలో నమోదు చేస్తుంది. ఆ తర్వాత ఈ స్వైప్‌మిషన్‌లున్న ఏ మాల్‌లోనైనా చేతితోనే షాపింగ్ చేయొచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement