చిల్లర వర్తకులకు ఉచితంగా స్వైప్ మిషన్లు
ఏపీ, తెలంగాణలో అవర్‌ట్రిప్.ఇన్ అందజేత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఆన్‌లైన్ లావాదేవీలు పెరిగారుు. స్వైప్ మిషన్లు ఉన్న సూపర్ మార్కెట్లు, పెద్ద ఔట్‌లెట్లు తమ వ్యాపారాలను సజావుగా సాగిస్తున్నారుు. మరి చిన్న చిన్న చిల్లర దుకాణాలు, వ్యాపారస్తులు మాత్రం వ్యాపారం లేక తల్లడిల్లిపోతున్నారు. మార్కెట్లో నోట్ల హడావుడి తగ్గితే కానీ వీరి వ్యాపారం మళ్లీ గాడినపడదు. వీరి కోసం హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అవర్‌ట్రిప్.ఇన్ స్టార్టప్ ఉచితంగా స్వైప్ మిషన్లను పంపిణీ చేయాలని నిర్ణరుుంచింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ట్రావెల్ ఏజెంట్లు, చిన్న దుకాణాదారులు, వర్తకులు, ఏపీ ఆన్‌లైన్, మీ సేవా, మీ సేవా కేంద్రాలు, ఎంఎస్‌ఎంఈలకు ఈ అవకాశం కల్పిస్తున్నామని కంపెనీ ఫౌండర్ బి. మోహన్ రావు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు.
సాధారణంగా స్వైప్ మిషన్ నుంచి జరిగే ప్రతి లావాదేవీ మీద 2-2.5 శాతం ఎండీఆర్ చార్జీలుంటాయని.. అరుుతే అవర్‌ట్రిప్ మాత్రం క్రెడిట్ కార్డ్ దారులకై తే 1.6 శాతం, డెబిట్ కార్డుదారులకై తే 1 శాతం మాత్రమే చేస్తుందని చెప్పారు. ఏపీ ఆన్‌లైన్, మీ సేవా కేంద్రాలకు కూడా ఉచితంగా స్వైప్ మిషన్లను అందిస్తామని.. వీరికి 1.2 శాతం చార్జీ విధిస్తామని.. మిషన్లు కావాలనుకునే వారు 94934 82134 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం బస్సు, విమాన టికెట్లు, హోటల్ బుకింగ్‌స, డొమెస్టిక్ మనీ ట్రాన్‌సఫర్, వినియోగ చెల్లింపులు వంటి సేవలందిస్తున్నాం. ప్రతి నెలా రూ.6-7 కోట్ల లావాదేవీలు జరుగుతున్నారుు. 2 నెలల్లో రూ.15 కోట్ల నిధుల సమీకరణ పూర్తి చేయనున్నామని’’ మోహన్ వివరించారు.