విద్యుత్ శాఖకు 80 స్వైప్ మిషన్లు
Published Mon, Dec 5 2016 12:18 AM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM
కర్నూలు(రాజ్‌విహార్): పెద్ద నోట్ల రద్దు ప్రభావం విద్యుత్ శాఖపై తీవ్రంగా పడింది. ఇకపై భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో విద్యుత్ బిల్లులను కూడా అదే తరహాలో వసూలు చేసేందుకు స్వైప్ మిషన్లు ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా కొత్తగా 80 స్వైప్ మిషన్లను కొనుగోలు చేసింది. ఇందులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి 40, యాక్సిస్ బ్యాంకు నుంచి మరో 40 మిషన్లు కొనుగోలు చేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. వీటి నిర్వహణపై సిబ్బంది, అధికారులకు త్వరలో అవగాహన కల్పించి వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు.
Advertisement