దళారులకు చెక్!
-
ఆర్టీఏ కార్యాలయాల్లో నగదురహిత సేవలు
-
నేడు జిల్లాలో ప్రారంభించనున్న ఆర్టీఓ కిష్టయ్య
-
వాహనదారులకు సులువుగా, వేగంగా పనులు
-
మధ్యవర్తుల అదనపు వసూళ్లకు చెల్లుచీటి
-
మీసేవా ద్వారా అందుబాటులోకి 59రకాల సేవలు
-
ఆయా కేంద్రాల ఆపరేట్లరకు ప్రత్యేకశిక్షణ
మహబూబ్‌నగర్ క్రై ం: డ్రై వింగ్ లైసెన్స్‌కు ఎంతవుతుందో చాలామందికి తెలియదు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలో అవగాహన ఉండదు. డ్రై వింగ్ లైసెన్స్ రెన్యూవల్‌కు ఎంత ఖర్చవుతుందో ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తే గాని పనికాదు. మధ్యవర్తులను ద్వారా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే ఖర్చులు తడిసిమోపెడు అవడం అందరికీ తెలిసిందే.. వీటన్నింటికీ అడ్డుకట్టవేయాలని రవాణాశాఖ భావిస్తోంది. దళారుల అక్రమ వసూళ్లకు ముకుతాడు వేయాలని ప్రణాళికసిద్ధం చేసింది. అందులో భాగంగానే 59రకాల సేవలను వేగంగా.. సులభంగా మీసేవా ద్వారా అందించనుంది. ఇప్పటికే ఆయా కేంద్రాల ఆపరేట్లరకు ప్రత్యేకశిక్షణ ఇచ్చారు.
నేటినుంచి 59రకాల సేవలు
ఈనెల 2(మంగళవారం)నుంచి ఆర్టీఏకు సంబంధించిన 59రకాల సేవలను మీసేవా ద్వారా అందించనున్నారు. డ్రై వింగ్, లైసెన్స్, వాహనాల పర్మిట్లు ఇతర ధ్రువీకరణ పత్రాల్లో మార్పులు, చేర్పులు.. ఇలా మొత్తం 59రకాల సేవలను అందజేయనున్నారు. ఇప్పటివరకు మీ సేవలో 329అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఆర్టీఏ నుంచి వచ్చే 59 కలుపుకుని మొత్తం 388సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇదివరకే వివిధ రకాల సేవలు అందిస్తున్న మీసేవా కేంద్రాలు జిల్లాలో 480ఉన్నాయి. ప్రస్తుతం కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కోసం మీసేవా ద్వారా పొందుతున్నారు. ఈ మాదిరిగానే ఆర్టీఏ సేవలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన వారు నేరుగా అందుబాటులోని కేంద్రాలకు వెళ్లి నిర్ధేశించిన రుసుం చెల్లించి రసీదు పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంబంధిత ధ్రువీకరణ పత్రాలను మీసేవలో ఇస్తే వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఆ పత్రాలను ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక అక్కడ డబ్బులు తీసుకునే దళారీ వ్యవస్థ ఉండదు. కేవలం సంబంధిత పత్రాలను తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ అధికారులు డబ్బులు అడిగితే అది లంచంగానే భావించవచ్చు.
నిర్ధేశించిన ధరలు
– లర్నింగ్ లైసెన్స్ పొందడానికి రూ.475, కేవలం ద్విచక్ర వాహనానికి రూ.290, బైక్, కారు కలిపి రూ.552, ద్విచక్ర వాహనం, కారు, ఆటోరిక్షా లైసెన్స్‌కు రూ.575 అవుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ లైసెన్స్‌కు రూ.650చెల్లించాల్సి ఉంటుంది.
– లైసెన్స్ రెన్యువల్ చేసుకునేందుకు రూ.485 ఫీజు ఉంటుంది. నకిలీ లైసెన్స్ పొందడానికి రూ.485రుసుం చెల్లించాలి.
– వాహనాల రిజిస్ట్రేషన్‌లో ద్విచక్ర వాహనానికి రూ.395, కారుకు రూ.635, రవాణా వాహనాలకు రూ.870, రవాణా మీడియం వాహనాలకు రూ.1060, భారీ వాహనాలకు రూ.1360రుసుం చెల్లించి వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వీటికంటే ఎక్కువగా అడుగుతున్నారంటే అవినీతి చోటుచేసుకుంటుందని వాహనదారులు తెలుసుకోవాలి.
ఇలా చేసుకోవాలి
ఆర్టీఏ వెబ్‌సైట్‌పై ఎం వాలెట్ వివరాలు, శాఖ సమాచారాలు, సేవల వివరాలు ఉంటాయి. ఏ సమాచారం కావాలంటే దానిపై క్లిక్‌చేస్తే ఆ సమాచార పత్రం కనిపిస్తుంది. ఆ తర్వాత నీలిరంగు బ్యానర్‌తో ఉన్న వరుసలో సేవలు(సర్వీసెస్), లైసెన్స్, రిజిస్ట్రేషన్, అనుమతులు, పన్నులు, ఫీజులు, యూజర్‌చార్జీలు, ఫెనాల్టీ, రోడ్డుభద్రత, గణాంకాలు తదితర ఉపవిభాగాలు ఉంటాయి. ఇందులో ఏ సేవలు పొందాలనుకునేవారు.. అందులోకి వెళ్లి పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
దళారులను నియంత్రించేందుకు..
ఆర్టీఏ కార్యాలయాల్లో దళారులను నియంత్రణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనదారులకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. వాహనదారులు మధ్యవర్తులను ఏమాత్రం సంప్రదించకుండా నేరుగా వాళ్ల పనులు వాళ్లే చేసుకోవచ్చు. ఇకనుంచి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో నగదు రహిత సేవలు అందుబాటులోకి వస్తాయి.
– లెక్కల కిష్టయ్య, ఆర్టీఓ, మహబూబ్‌నగర్