![Frame cashless medicare scheme for road victims during Golden Hour](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/9/gh.jpg.webp?itok=NwsaXkvW)
కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించే విషయంలో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ కాలంలో బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స అందించేలా ఒక పథకాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మోటార్ వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 162(2) ప్రకారం ఈ పథకం అమల్లోకి తేవాలని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని రూపొందించి, అమలు చేయాలని స్పష్టంచేసింది. దీనివల్ల విలువైన ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొంది.
సెక్షన్ 2(12–ఎ) ప్రకారం గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత తొలి గంట. రోడ్ ప్రమాదంలో క్షతగాత్రులుగా మారిన వారికి తొలి గంటలో చికిత్స అందిస్తే వారి ప్రాణాలు కాపాడే అవకాశాలు అధికంగా ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. చికిత్స ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాణాలు కాపాడడం కష్టమవుతుందని పేర్కొంటున్నారు. చట్టప్రకారం గోల్డెన్ అవర్‌లో బాధితు లకు నగదు రహిత చికిత్స అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసిహ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ ఏడాది మార్చి 14వ తేదీలోగా పథకాన్ని తీసుకురావాల్సిందేనని, ఈ గడువును పొడిగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment