Motor Vehicles Act
-
‘ఎంవీ యాక్ట్’లో 6 నెలల నిబంధన అమానుషం: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాద పరిహార కేసుల్లో బాధిత కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన 6 నెలల్లోనే దావా వేయాలన్న మోటారు వాహన చట్ట నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది. ప్రమాదంలో ఎవరైనా మృతిచెందితే ఆ కుటుంబం కోలుకోవడానికే సంవత్సరానికిపైగా సమయం పడుతుందని వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ నిబంధన అమానుషమని పేర్కొంది. ఈ నిబంధనను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో అమికస్ క్యూరీ (కోర్టుకు సహాయకారి)గా న్యాయవాది పి.శ్రీరఘురామ్ను నియమిస్తున్నామని స్పష్టం చేసింది. నిబంధనలను పరిశీలించి ఏం చేయాలన్న దానిపై నివేదిక అందజేయాలని ఆయన్ను ఆదేశించింది. అలాగే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం అమ్రాడ్ గ్రామానికి చెందిన అయిటి హనుమాండ్లు గతేడాది ఏప్రిల్ 15న తన భార్య నవనీత సహా ఇద్దరు మైనర్ కుమారులతో కలసి ద్విచక్ర వాహనంపై గ్రామం నుంచి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నలుగురికీ తీవ్ర గాయాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒక కుమారుడు మృతిచెందాడు. ఈ నేపథ్యంలో తమ కుమారుడి మరణానికి కారణమైన ద్విచక్రవాహనదారుడి నుంచి పరిహారం కోరుతూ నిజామాబాద్ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌లో గతేడాది నవంబర్ 10న హనుమాండ్లు పిటిషన్ వేశారు. అయితే అప్పటికే ప్రమాదం జరిగి 6 నెలలు దాటడంతో పిటిషన్‌ను స్వీకరించేందుకు ట్రిబ్యునల్ నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకెక్కారు. -
కారులో ముందు కూర్చున్నా, వెనకాల కూర్చున్నా అది తప్పనిసరి
ముంబై: ఇకపై కారులో ప్రయాణించే వారందరు కచ్చితంగా సీటు బెల్టు పెట్టుకోవాల్సిందేనని ముంబై పోలీసులు స్పష్టం చేశారు. నవంబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఈ నిబంధనను పాటించని వారికి మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం శిక్ష విధిస్తామని హెచ్చరించారు. కారులో ముందు కూర్చున్నా, వెనకాల కూర్చున్నా సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలన్నారు. ఒకవేళ కార్లలో ప్రయాణికులందరికీ సరిపడా సీటు బెల్టులు లేకపోతే యజమానులు తక్షణమే వాటిని ఏర్పాటు చేసుకోవాలని ముంబై పోలీసులు సూచించారు. కార్లలో ప్రయాణికులందరికీ సీటు బెల్టు తప్పనిసరి అని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గత నెలలోనే ప్రకటించారు. దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన అనంతరం ఈ ప్రకటన చేశారు. కార్లలో సీటు బెల్టు నిబంధన, ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో లోపాల వల్లే సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఈసీ -
బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని ఫైన్.. చలాన్ ఫోటో వైరల్
తిరువనంతపురం: బైక్‌పై వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించకపోయినా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకున్నా ఫైన్ వేయడం సాధారణంగా జరుగుతుంటుంది. కానీ కేరళలోని ఓ ట్రాఫిక్ పోలీస్ మాత్రం బైక్‌లో సరిపడా పెట్రోల్ లేదని రూ.250 ఫైన్ వేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను బసిల్ శ్యామ్ అనే వ్యక్తి తన ఫేస్బుక్లో షేర్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. బైక్‌లో పెట్రోల్ లేకపోతే కూడా ఫైన్ వేస్తారా? ఇలాంటి రూల్ కూడా ఉందా? అని నెటిజన్లు కేరళ ట్రాఫిక్ పోలీసులపై సెటైర్లు వేస్తున్నారు. బసిల్ శ్యామ్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో వన్ వే స్ట్రీట్‌లో అపసవ్యదిశగా బండి నడిపాడు. అది చూసి ట్రాఫిక్ పోలీస్ బైక్ ఆపాడు. రూ.250 ఫైన్ కట్టమన్నాడు. అందుకు ఒప్పుకుని అతను చెల్లించాడు. అయితే తీరా ఆఫీస్‌కు వెళ్లాక చలాన్ చూస్తే.. బైక్‌లో సరిపడా పెట్రోల్ లేనందుకు ఫైన్ వేసినట్టుంది. దీంతో అతడు షాక్ అయి చలాన్ ఫోటో తీసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. భారత మోటారు వాహన చట్టం, కేరళ చట్టంలో బైక్‌లో పెట్రోల్ సరిపడా లేకపోతే ఫైన్ వేయాలనే నిబంధన ఎక్కడా లేదు. అయితే బస్సు, కారు, వ్యాను, ఆటో వంటి కమర్షియల్ వాహనాలు పెట్రోల్,డీజిల్ సరిపడా లేకుండా ప్రయాణించి ప్రయాణికులకు ఇబ్బంది కల్గిస్తే రూ.250 ఫైన్ కట్టాలనే నిబంధన కేరళ రవాణా చట్టంలో ఉంది. కానీ ఇది బైక్‌లకు వర్తించదు. దీంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని మాజీ అధికారులు రవాణా శాఖకు సూచించారు. చదవండి: త్వరలో శివసేన నుంచి మరో సీఎం.. ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు -
హెల్మెట్ రూల్స్ కఠినతరం: ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు..
న్యూఢిల్లీ: బండి నడిపే వాళ్లకు హెల్మెట్ తప్పనిసరితో పాటు వెనకాల కూర్చునే వాళ్లకు సైతం హెల్మెట్ తప్పనిసరి నిబంధనలు చాలా చోట్ల అమలు అవుతున్నాయి. అయితే హెల్మెట్ విషయంలో మోటార్ వెహికిల్స్ యాక్ట్ కొత్త సవరణను కఠినంగా అమలు చేయబోతోంది. తేడాలొస్తే.. జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ మీద వేటు తప్పదని స్పష్టం చేసింది. నాణ్యత ప్రమాణాలు లేని హెల్మెట్లు ధరించినా ఫైన్ మోత తప్పదు ఇక నుంచి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లపై తప్పక ఉండాల్సిందే. పూర్తిస్థాయిలో రక్షణ కలిగించే హెల్మెట్లు మాత్రమే.. అదీ సర్టిఫైడ్ అయ్యి ఉండాలి. అలా లేకుంటే.. మోటర్ వెహికిల్స్ యాక్ట్ 1988 లోని సెక్షన్ 129 ఉల్లంఘనల కింద సెక్షన్-194డీ ప్రకారం.. వెయ్యి రూపాయల ఫైన్‌తో పాటు మూడు నెలలపాటు లైసెన్స్‌పై వేటు వేస్తారు. ఐఎస్ఐ మార్క్ హెల్మెట్లను మాత్రమే టూవీలర్స్‌పై ఉపయోగించడం తప్పనిసరి చేస్తూ జూన్ 1, 2021లో ఆదేశాలు జారీ అయ్యాయి. నాన్-ఐఎస్ఐ హెల్మెట్లను బ్యాన్ చేసినా.. ఇప్పటికీ చాలామంది వాటినే ఉపయోగిస్తుండడం గమనార్హం. బైక్ రైడింగ్‌లో ఉన్నప్పుడు హెల్మెట్ బకెల్, బ్యాండ్ గనుక పెట్టుకోకున్నా.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. ఐఎస్ఐ మార్క్, బీఎస్ఐ సర్టిఫికేషన్ లేని హెల్మెట్ గనుక ఉపయోగిస్తే.. వెయ్యి రూపాయల జరిమానా విధిస్తారు. హెల్మెట్ సక్రమంగా ధరించినా.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన, రెడ్ లైట్ జంపింగ్ చేయడం లాంటివాటికి కూడా 2 వేల రూపాయల జరిమానా తప్పదు. చదవండి: జీఎస్టీ సిఫార్సులపై కేంద్ర, రాష్ట్రాలకు హక్కులు -
వాహనదారులకు అదిరిపోయే శుభవార్త!
న్యూఢిల్లీ: మీకు దగ్గర ఏదైనా వాహనం ఉందా? లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే, మీకు శుభవార్త. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహన 1989 చట్టంలోని కొన్ని నిబంధనలలో మార్పులు చేసింది. ఈ కొత్త నిబందనల ప్రకారం.. వాహన యజమాని వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో తన వాహనానికి నామినీ పేరును కూడా జత చేయవచ్చు. ప్రస్తుతం ఎలాగైతే బ్యాంక్ ఖాతా, భీమా వంటి ఖాతాలకు నామినీని పెట్టుకున్నామో అలాగా అన్నమాట. వాహన యజమాని మరణించినప్పుడు ఆ వాహనాన్ని తన పేరు మీద మార్చుకోవడానికి ఈ మార్పుల వల్ల సులభతరం కానుంది. నామినీ పేరును వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో లేదా తర్వాత అయిన ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా జత చేయవచ్చు. ఇప్పటి వరకు నామినీని జాతచేయడంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉండే విదంగా కొత్త నిబందనలు తీసుకువచ్చింది. నామినీ పేరును జత చేయాలంటే అతని గుర్తింపు కార్డు తప్పనిసరిగా సమర్పించాలి. వాహన యజమాని మరణించిన తర్వాత ఆ వాహనాన్ని తన పేరుమీదకు మార్చాలంటే 30 రోజుల్లోపు యజమాని మరణాన్ని రిజిస్ట్రేషన్ అథారిటీకి తెలపాల్సి ఉంటుంది. అలాగే, వాహన యజమాని మరణించిన 3 నెలల్లో నామినీ వాహన బదిలీ కోసం ఫారం-31 ను సమర్పించాలి. పెళ్లి విడాకులు, ఆస్తి విభజన వంటి సందర్భాల్లో నామినీలో పేరు మార్పు కోసం యజమాని అంగీకరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(SOP)తో మార్చవచ్చు. ప్రస్తుతం ఒక వాహనం రిజిస్టర్డ్ యజమాని మరణించిన సందర్భంలో వాహనాన్ని నామినీకి బదిలీ చేయడానికి వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాలి. రాష్ట్రం రాష్ట్రానికీ ఈ విధానం మారుతూ ఉంటుంది. యజమాని మరణించిన సందర్భంలో వాహన బదిలీకి చట్టపరమైన వారసుడిగా గుర్తింపు రుజువు చూపించాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పౌరుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నవంబర్ 27న, 2020 రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో నామినీ పేరు వాహనం యజమాని జత చేయడానికి సెంట్రల్ మోటార్ వాహనాలు 1989 చట్టంలో మార్పులు చేయాలని మొదట ప్రతిపాదించింది. తర్వాత అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అలాగే, సాధారణ ప్రజల నుండి సలహాలు కోరింది. అన్నీ సూచనలను పరిశీలించిన తరువాత, మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. చదవండి: కరోనాతో చనిపోతే రూ.2లక్షలు వస్తాయా? -
రోడ్డు ప్రమాదాలు ఆపలేమా!
రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో చట్టం చేయలేని పని కరోనా పర్యవసానంగా విధించిన లాక్ డౌన్ చేసిందని సుప్రీంకోర్టుకు వివిధ రాష్ట్రాలు సమర్పించిన నివేదికలు చెబుతున్నాయి. నిరుడు జనవరిలో మోటారు వాహనాల చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. దాని ప్రకారం ట్రాఫిక్ ఉల్లం ఘనలకు ఇకపై భారీ జరిమానాలు విధించే అవకాశం ఏర్పడిందన్నారు. ఇందువల్ల గణనీయంగా ప్రమాదాలు తగ్గుతాయని చాలామంది అంచనాలు వేశారు. కానీ పరిస్థితి పెద్దగా మెరుగైన దాఖలా లేదు. అయితే లాక్డౌన్ వల్ల మాత్రం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. అది ఎత్తేశాక ప్రమాదాలు మళ్లీ యధాప్రకారం పెరిగాయని తాజా నివేదికల సారాంశం. ఈ జనవరినుంచి సెప్టెంబర్ వరకూ రోడ్డు ప్రమాద మరణాలు అంతక్రితంతో పోల్చి చూస్తే బాగా తగ్గాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య 2019 ఏప్రిల్–జూన్ మధ్య 1,27,157మంది వుండగా, ఈ ఏడాది అదే కాలంలో గాయపడినవారు 57,755మంది మాత్రమే. ఈ కాలంలో అత్యధిక భాగం లాక్‌డౌన్‌లోనే గడిచింది కాబట్టే ఈ తగ్గుదల కనబడింది. లాక్డౌన్ కాలంలో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడం, రహదార్లపైకి తక్కువ సంఖ్యలో వాహనాలను అనుమతించడం అందుకు కారణం. నిరుడు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మోటారు వాహనాల(సవరణ) చట్టాన్ని అమలు చేయడానికే మొదట్లో చాలా ప్రభుత్వాలు సందేహించాయి. అమలు మొదలుపెట్టిన రాష్ట్రాలు కూడా కొన్నిరోజులు గడిచేసరికల్లా పునరాలోచనలో పడ్డాయి. మొదట్లో భారీ జరిమానాలు అమలు కావాల్సిందేనని, ఈ విషయంలో పునరాలోచన వుండబోదని కేంద్ర ప్రభుత్వం చెప్పినా మరికొన్ని రోజులు గడిచేసరికి అది మెత్తబడింది. జరిమానాలు ఎంత వుండాలో రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చని వెసులుబాటునిచ్చింది. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం చట్టంలోని జరిమానాలతో పోలిస్తే గణ నీయంగా తగ్గించేసింది. ఒడిశా రాష్ట్రమైతే మొన్న మార్చినుంచి మాత్రమే చట్టాన్ని అమలు చేయడం మొదలుపెట్టింది. వీటన్నిటికీ రాజకీయ ఒత్తిళ్లే కారణమని వేరే చెప్పనవసరంలేదు. ఏటా విడుదలయ్యే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) నివేదికలు చూస్తే భయం కలుగుతుంది. మొన్న అక్టోబర్‌లో విడుదలైన ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం 4,37,396 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,54,732మంది ఆ ఉదంతాల్లో కన్నుమూశారు. ఇందులో 1,39,000 ఉదం తాలు జరిమానాలు భారీగా పెంచాక జరిగినవే. ఎన్సీఆర్బీ వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలు ఇచ్చే గణాంకాలపై ఆధారపడి నివేదిక రూపొందిస్తుంది. అయితే ప్రమాదాలన్నీ ఫిర్యాదుల వరకూ రావని, కాబట్టి వాస్తవ ప్రమాదాలు, మరణాల సంఖ్య ఆ నివేదికల్లో చూపే గణాంకాలనుమించి వుంటాయని నిపుణులంటారు. ఢిల్లీ ఐఐటీ కొన్నేళ్లక్రితం రూపొందించిన నివేదిక ప్రకారం చూస్తే అధికారిక గణాంకాలకన్నా వాస్తవ మరణాలు 47–63 శాతం ఎక్కువగా వుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 2016లో ఇదే విధంగా చెప్పింది. భారత్‌లో ప్రభుత్వ గణాంకాల కన్నా రోడ్డు ప్రమాదాల మృతులు కనీసం రెండు రెట్లు ఎక్కువుండొచ్చని అభిప్రాయపడింది. నగరాలు, పట్ట ణాల్లో వెనువెంటనే ఫిర్యాదులందినట్టుగా పల్లెసీమల్లో వుండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కొత్త చట్టం అమలు మొదలైనప్పుడు వాహన చోదకుల్లో చాలామంది భయపడ్డారు. ఏమాత్రం తేడా వచ్చినా భారీ వడ్డనలు తప్పవనుకున్నారు. అనేక నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీబ్రా క్రాసింగ్‌కు ముందే వాహనాలను ఆపడం కనబడింది. శరవేగంతో పోయే ధోరణి కూడా మారింది. హెల్మెట్ ధరించకపోతే విధించే జరిమానాలు, భారీ శబ్దం చేసే హారన్లు మోగిస్తే విధించే జరిమానాలు పెరగడంతో ఎవరికివారు నాగరికంగా వుండటం నేర్చుకున్నారు. కానీ కొన్ని వారాలు గడిచేసరికల్లా పరిస్థితి మొదటికొచ్చింది. ఏ నిబంధననైనా స్థిరంగా అమల్లో వున్నప్పుడే మెరుగైన ఫలితాలొస్తాయి. వాహనచోదకుల్లో చాలామంది ట్రాఫిక్ పోలీసులతో తగాదాకు దిగడం చూసి రాజ కీయ పక్షాలు కూడా అలాంటివారికి మద్దతు పలకడంతో ప్రభుత్వాలు కూడా వెనక్కి తగ్గడం మొద లుపెట్టాయి. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇంతక్రితం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిం చేవారిపై రూ. 100 జరిమానా వుంటే దాన్ని రూ. 500కు పెంచారు. గరిష్ట మొత్తం రూ. 10,000 వరకూ వుంది. కేంద్రం ఇచ్చిన వెసులుబాటుతో కొన్ని రాష్ట్రాలు తర్వాతకాలంలో ఈ జరిమానాల్లో మార్పులు చేసుకున్నాయి. అయితే ప్రభుత్వాల పరంగా అనేకానేక లోపాలున్నాయి. రహదార్లు ఎలా వున్నాయో, సిగ్నలింగ్ వ్యవస్థలెలా పనిచేస్తున్నాయో సక్రమంగా పట్టించుకునేవారు లేకుండా పోవడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి అవి వరంగా మారాయి. ప్రభుత్వాల లోటు పాట్లను చూపి, తమనుతాము సమర్థించుకునేవారు అంతకంతకు పెరిగారు. ఏతావాతా కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్ వల్ల మాత్రమే మన దేశంలో ప్రమా దాల సంఖ్య, మరణాల సంఖ్య తగ్గాయి. ఈ అంశాన్ని ప్రభుత్వాలన్నీ తీవ్రంగా పట్టించుకోవాలి. ప్రపంచంలో అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగే దేశం మనదే. ప్రకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు, ఉగ్రవాద ఉదంతాలు వగైరాల్లో మరణించేవారితో పోలిస్తే రోడ్డు ప్రమాదాల్లో మరణిం చేవారే అధికమని ఏటా నిరూపణవుతోంది. మోటారు వాహనాల చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిందే. అదే సమయంలో దెబ్బతిన్న రహదారులను ఎప్పటికప్పుడు మరమ్మతు చేయడం, రహదార్ల నిర్మాణంలో వున్న లోపాలను సరిచేయడంవంటివి కొనసాగుతుండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్సుల మంజూరులో చోటుచేసుకుంటున్న అవకతవకలను సరిదిద్దాలి. తమ వంతుగా చేయాల్సి నవి ప్రభుత్వాలు చేసినప్పుడే వాహనచోదకుల్లో కూడా చట్టాలంటే భయభక్తులుంటాయి. వారు దారికొస్తారు. కేవలం లాక్డౌన్ వంటివి మాత్రమే భారత్‌లో రోడ్డు ప్రమాదాలను నివారిస్తాయనే అభిప్రాయం అందరిలో కలిగితే అది మన అసమర్థతను పట్టిచూపిస్తుంది. -
గుడ్‌న్యూస్: సీజ్ చేసిన వాహనాలు రిలీజ్
సాక్షి, హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించిన వాహనదారులకు తెలంగాణ పోలీస్‌శాఖ శుభ వార్తను అందించింది. లాక్డౌన్ కాలంలో జప్తు చేసిన వాహనాలను విడుదల చేయాలని రాష్ట్ర డీజీపీ నిర్ణయించారు. వాహనాలను భద్రపరచడం సమస్యగా మారడంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాహనాల విడుదలపై డీజీపీ మహేందర్ రెడ్డి పలు మార్గదర్శకాలను జారీ చేశారు. మోటార్ వెహికిల్ చట్టం (ఎంవీ యాక్టు) కింద జప్తు చేసిన వాహనాలకు జరిమానా విధించి యజమానులకు ఇవ్వాలని సూచించారు. ఐపీసీ, ఇతర చట్టాల కింద జప్తు చేస్తే యజమాని నుంచి బాండ్ రాయించుకని, జిరాక్స్ పత్రాలు తీసుకోవాలి తెలిపారు. (తెలంగాణలో కొత్తగా పది కరోనా పాజిటివ్ కేసులు) కోర్టుల్లో కేసులకు సంబంధించిన ప్రక్రియ యథాతథంగా కొనసాగించాని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలు నేపథ్యంలో చాలా మంది వాహనదారులు ఆంక్షలను ఉల్లంఘించిన విషయం తెలిసిందే. పోలీసులు వీరిపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1.60 లక్షల వాహనాలను సీజ్ చేసినట్టు పోలీసుశాఖ ద్వారా సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లక్షకు పైగా వాహనాలు ఉన్నట్లు తెలిసింది. (దేశంలో కొత్తగా 3390 పాజిటివ్ కేసులు) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1401284236.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వాహనదారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : మోటార్ వాహన పన్ను చెల్లింపుల గడువును లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒక నెలరోజుల వరకూ పొడిగిస్తూ తెలంగాణా రాష్ట్ర రవాణా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 30తో ముగిసే త్రైమాసికానికి చెల్లించాల్సిన మోటార్ వాహన అడ్వాన్స్ పన్ను గడువును పెంచాలని వాహనదారుల అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పొడిగించిన గడువులోగా మోటార్ వాహన పన్ను చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీ విధించబోమని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్ అమలుతో పన్ను చెల్లించలేకపోయిన వాహనదారులకు ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగించింది. చదవండి : హైదరాబాద్‌లో లాక్డౌన్ మరింత కఠినం -
హెల్మెట్ పెట్టుకోకుంటే లైసెన్స్ పోద్ది
సాక్షి, అమరావతి బ్యూరో: రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ప్రతి 100 మందిలో 30 మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే వాహన చోదకుల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఇటీవల అమల్లోకి వచ్చిన నూతన మోటార్ వాహన చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా విజయవాడ నగరంలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది. విజయవాడలో 5 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఇందులో 60 శాతం మందికి పైగా వాహనచోదకులు హెల్మెట్ లేకుండానే రోడ్లపైకి వస్తున్నారు. నగరంలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించని వారే అధికంగా మృత్యువాత పడుతున్నారు. నగరంలో జనవరి 1వ తేదీ నుంచి హెల్మెట్ ధరించకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులపై కేసులు నమోదు చేస్తారు. వారి డ్రైవింగ్ లైసెన్సులను నెల రోజులపాటు సస్పెండ్ చేయబోతున్నారు. సస్పెన్షన్ సమయంలో మళ్లీ డ్రైవింగ్ చేస్తే వాహనాన్ని సీజ్ చేయనున్నారు. సెప్టెంబరులో కృష్ణా జిల్లావ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో నిబంధనలు పాటించని 372 మందిపై చర్యలు తీసుకున్న సంగతి విదితమే. వీరిపై కేసులు నమోదు చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్‌లను సైతం సస్పెండ్ చేశారు. మళ్లీ జనవరి 1వ తేదీ నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు. ఇన్సూరెన్స్ సొమ్ము రాదు ‘‘కేంద్ర మోటార్ వాహన చట్టం 138(ఎఫ్) ప్రకారం ద్విచక్ర వాహనం నడిపే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా వారి డ్రైవింగ్ లైసెన్సులను నెల రోజులపాటు సస్పెండ్ చేస్తాం. డ్రైవింగ్ లైసెన్సు రద్దుచేసిన సమయంలో వాహనం నడుపుతూ మరోసారి పట్టుబడితే కేసు నమోదు చేయడమే కాకుండా వాహనం సీజ్ చేస్తాం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా లేదా లైసెన్స్ రద్దు సమయంలో వాహనం నడిపి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ సొమ్ము రాదు’’ – ఎస్.వెంకటేశ్వరరావు, డీటీసీ, కృష్ణా జిల్లా -
జరిమానాలకు జంకుతున్న వాహనదారులు
సాక్షి, వరంగల్ క్రైం: వాహనంతో రోడ్డెక్కాలంటే వంద ప్రశ్నలు... జరిమానా ఏ రూపంలో పొంచి ఉందో తెలియని అయోమయ పరిస్థితి.. గతంలో మాదిరిగా వాహనాలను ఆపి జరిమానా విధించడం లేదు.. మనం వెళ్తుంటే మనకు తెలియకుండా ఫొటో తీసి ఆన్లైన్లో జరిమానా చలాన్ పంపిస్తున్నారు.. దీనికి తోడు నూతన వాహనం చట్టం, ట్రాఫిక్ జరిమానాలపై వాట్సప్ గ్రూప్‌ల్లో భయపెట్టే విధంగా వైరల్ అయిన వీడియోలు... ఫలితంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనంతో బయలుదేరాలంటేనే ఒకటికి, రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి! ఇలా కారణాలేమైతే ఏమిటి కానీ కేసుల సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గడం వెనుక వాహనదారుల్లో పెరిగిన జాగ్రత్తలు.. అధికారుల అవగాహన కార్యక్రమాలనే చెప్పాలి. తగ్గుముఖం పడుతున్న కేసులు ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం, భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన మార్పుతో ట్రాఫిక్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. చాలామంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుంటే బయటకు పోవడానికి భయపడుతున్నారు. అలాగే, ఎక్కడ వాహనం ఆపాలన్నా నో పార్కింగ్ బోర్డు ఉందా అని ఒకటికి, రెండు సార్లు ఆలోచిస్తున్నారు.. అలాగే, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. గ్రీన్ లైట్ పడిన తర్వాతే బండిని ముందుకు దూకిస్తున్నారు. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో వాహనదారులు జరిమానాల బాధ నుంచి తప్పుకుంటున్నారు. ఫలితంగా వాహనదారులకే కాకుండా ఎదుటి వారు కూడా ప్రమాదాల బారి నుంచి బయటపడుతున్నారు. ఉల్లంఘన జరిగితే అంతే.. సిగ్నల్ జంప్, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, నో పార్కింగ్, రాంగు రూట్ ఇలా అనేక అంశాల్లో ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించి వాటిని నేరుగా ఇంటికే చలాన్ పంపిస్తున్నారు. దీంతో లబోదిబోమంటున్న వాహనదారులు.. తాము నిబంధనలను ఎక్కడ ఉల్లాంఘించామో తెలియజేసేలా సమ యం, తేది, వాహనం ఫొటో జత చేస్తుండడంతో కిక్కురుమనలేని పరిస్థితి ఎదురవుతోంది. ఇక ట్రాఫిక్ అధికారులు వాహనాల తనిఖీ సమయంలో జరిమానా విధించే పెండింగ్ చలాన్లు ఉన్నాయా అని కూడా పరిశీలిస్తున్నారు. ఫలితంగా ఎప్పటిప్పుడు జరిమానా చెల్లించక తప్పడం లేదు. వీటన్నింటినీ అధిగమించేందుకు నిబంధనలు పాటించడమే మార్గమని భావిస్తుండడంతో కేసుల సంఖ్య తగ్గుతోందని గణాంకాలు చెబుతున్నాయి. -
సెప్టెంబర్ నుంచి పెరిగిన లెర్నింగ్ లైసెన్స్‌లు
సాక్షి, వైరా: సెప్టెంబర్ 1 నుంచి ఆర్టీఓ కార్యాలయాల ఎదుట లైసెన్స్‌లు తీసుకునేందుకు జనాలు బారులు తీరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన వాహన చట్టాన్ని సెప్టెంబర్ 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. వాహన చట్టం ప్రకారం దేనికి ఎంతో జరిమానా విధిస్తారో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వాహనదారుల్లో భయంతో లైసెన్స్‌లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ట్యాక్స్‌లను చెల్లించేందకు ముందుకు వస్తున్నారు. ప్రమాదాలను నివారించడానికి, మద్యం సేవించి వాహనం నడపకుండా అడ్డుకునేందుకు, లైసెన్స్‌లు లేకుండా తిరగడం ఆగేలా, అతి వేగాన్ని కట్టడి చేయడానికి ఈ చట్టం ద్వారా అధిక జరిమానాలు విధించేలా నిర్ణయించిన విషయం విదితమే. దీంతో..తనిఖీల్లో దొరికితే ఫైన్లు అధికంగా కట్టాల్సి వస్తుందనే భయంతో వాహనదారులు స్వయంగా కావాల్సిన పత్రాలు పొందేందుకు రవాణాశాఖ కార్యాలయం ఎదుట బారులు తీరుతున్నారు. జిల్లాలో గతంలో రోజుకు సగటు 40 ప్రస్తుతం సగటు 70 సత్తుపల్లిలో 40 ఖమ్మంలో 120 వైరాలో 35 వైరాలోని ఎంవీఐ కార్యాలయం ఫైన్ల భయంతోనే.. కొత్తచట్టం ద్వారా ఎక్కువ ఫైన్ వేస్తారనే భయంతోనే లైసెన్స్‌లు, బండి కాగితాలు తీసుకుంటున్నారు. మద్యం తాగి వాహనం నడపడానికి జంకుతున్నారు. – సామల ఉదయ్‌కుమార్, వైరా శ్రద్ధ పెరిగింది.. సెప్టెంబర్ 1 నుంచి లైసెన్స్‌లు తీసుకోవడానికి వాహన దారులులు శ్రద్ధ చూపుతున్నారు. ఆ సంఖ్య గతం కంటే పెరిగింది. ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వాహన ట్యాక్స్‌లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. అవగాహన పెరగాల్సి ఉంది. వాహనదారులు నేరుగా వచ్చి అవసరమైన పత్రాలు చేయించుకోవచ్చు. – శంకర్‌నాయక్,ఎంవీఐ, వైరా -
‘వాహన’ నేరాలకూ ఐపీసీ వర్తింపు: సుప్రీం
న్యూఢిల్లీ: వాహనాలను అధిక వేగంతో నడపడం, బాధ్యతారాహిత్యమైన డ్రైవింగ్ వంటివి మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించి చేసే నేరాలు. అయితే మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించిన వారు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)ని కూడా అతిక్రమించినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ రెండూ వాటి పరిధుల్లో చక్కగానే పనిచేస్తున్నాయని, ప్రమాదాల సమయంలో చట్టరీత్యా ఎదుర్కోవాల్సిన విచారణలో కూడా రెండూ సరిగ్గానే ఉన్నాయని అ. మోవా చట్టానికి చెందిన కేసులను ఐపీసీ కింద పరిగణించలేమంటూ 2008 డిసెంబరు 22న గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును విచారిస్తూ సుప్రీంకోర్టు ఆదివారం ఈ వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ కేసును విచారించింది. మోటారు చట్టంలో ఐసీపీని ప్రవేశ పెట్టొద్దంటూ అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరాం, అరుణాచల్, గౌహతి హైకోర్టు ఇచ్చిన సూచనలను పక్కన పెట్టింది. మోటారు చట్టం చెప్పలేదు... బాధ్యతారాహిత్యమైన డ్రైవింగ్, అధిక వేగం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణించినా, తీవ్రంగా గాయపడినా వారికి పడాల్సిన శిక్షపై మోటారు చట్టంలోని చాప్టర్ 8 క్షుణ్నంగా వివరించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఐపీసీ సెక్షన్ 279, 304 పార్ట్–2, 304ఏ, 337, 338లు వివరించాయని తెలిపింది. మోటారు చట్టంలోని చాప్టర్ 8 వాటి వల్ల జరిగే ప్రమాదాలన్నింటిని కలిపి చెప్పిందని పేర్కొంది. వాహన చట్టంలోకి ఐపీసీ అవకాశం ఇస్తే క్రిమినల్ చట్టం కూడా మోటారు చట్టంలో ప్రవేశిస్తుందని తెలిపింది. -
అలా చేస్తే రూ.22 వేల చలానా తప్పించుకోవచ్చు..!
న్యూఢిల్లీ : నూతన మోటారు వాహన చట్టం అమల్లోకి రావడంతో ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు పడుతున్నాయి. చలానా మొత్తాలు ఏకంగా 10 రెట్లు పెరిగాయి. గతంలో లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా విధించగా.. ఇప్పుడది రూ.5000లకు చేరింది. ఇక ఈ చట్టంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాహనం ఖరీదు కంటే చలానా మొత్తమే ఎక్కువగా ఉన్న ఉదంతాలూ వెలుగుచూశాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు యథాతదంగా నూతన మోటారు వాహన చట్టాన్ని అమలు చేస్తుండగా.. కొన్ని రాష్ట్రాలు జరిమానా మొత్తాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలాఉండగా.. పంజాబ్‌కు చెందిన సునీల్ సంధూ అనే పోలీసు సోషల్ మీడియా వేదికగా వాహనదారులకు భారీ ఊరట కలిగించే ప్రయత్నం చేశాడు. అన్ని పత్రాలు ఉండి కూడా కొందరు జరిమానాలు చెల్లిస్తున్నారని.. అలాంటి వారు కొంచెం ఓపిగ్గా వ్యవహరిస్తే దాదాపు రూ.22 వేల చలానా నుంచి బయటపడొచ్చని తెలిపాడు. ‘లైసెన్స్ లేకుండా ట్రాఫిక్ సిబ్బందికి చిక్కితే రూ.5 వేలు ఫైన్ చెల్లించాలి. దాంతోపాటు బండి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ.5 వేలు, పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే రూ.10 వేలు, ఇన్సూరెన్స్ లేకపోతే రూ.2 వేలు చెల్లించాల్సి వస్తుంది. అంటే మొత్తం అక్షరాల రూ.22 వేలు జరిమానా చెల్లించాలి. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ.. వాటిని ట్రాఫిక్ సిబ్బందికి సమర్పించకపోతే భారీ చలానాలు తప్పవు. అటువంటి సందర్భాల్లో కాస్త సహనం ప్రదర్శించాలి. చలానా మొత్తం చెల్లించడానికి వాహనదారుడికి 15 రోజుల గడువు ఉంటుంది. ఆ సమయంలో కాస్త కష్టమైనా ఫరవాలేదు. ఓపికతో వాహనం పత్రాలన్నీ సంబంధిత అధికారులకు సమర్పిస్తే సరి. విధించిన చలానాలను రద్దు చేస్తారు. నామమాత్రంగా కేవలం రూ.100 మాత్రమే జరిమానాగా విధిస్తారు’ అని సునీల్ సంధూ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో వైరల్ అయింది. -
తాగి నడిపితే.. తాట తీసుడే..!
తరుచు జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం సేవించడం, అతివేగం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో జరుగుతున్నవే. వాటి నివారణకు కొత్త మోటారు వాహన చట్టాన్ని ఈ నెల ఒకటి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి.. ప్రజల నుంచి వ్యతికేకత రావడంతో కాస్తా వెనక్కి తగ్గింది. కా నీ మద్యం తాగి పట్టుబడితే కోర్టులు జరి మానాలతోపాటు శిక్షలు ఖరారు చేస్తున్నాయి. ఇక కొత్త రూల్స్ పాటించకుంటే భారీగా జరిమానా విధిస్తున్నాయి. సాక్షి, మంచిర్యాల: తరుచుగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మద్యం సేవించడం, అతివేగం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడంతో జరుగుతున్నవే... వాటి నివారణకు కొత్త వాహన చట్టాన్ని ఈ నెల ఒకటి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి.. ప్రజల నుంచి వ్యతికేకత రావడంతో కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నా.. కోర్టులు మాత్రం సీరియస్‌గా తీసుకుంటున్నాయి. మద్యం తాగి పట్టుబడితే.. జరిమానాలతో పాటు శిక్షలు ఖరారు చేస్తున్నాయి. ఇక కొత్త రూల్స్ పాటించకుంటే జేబుకు చిల్లు పడడమే. కొత్తచట్టం అమలై 15రోజుల్లోనే జిల్లాలోని ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమానాతో పాటు జైలుశిక్ష విధించారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరిస్తే మేలు... కొత్తచట్టం తీరు... సెప్టెంబర్ 1 నుంచి వాహన కొత్త చట్టం అమలవుతోందని వాహనదారుల్లో తీవ్రమైన భయాందోళనలో పడిపోయారు. 1వ తేదీన వాహనం పట్టుకొని రోడ్డుమీదికి రావాలంటే వెన్నులో వణుకు మొదలైంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాహన కొత్త చట్టం అమలు చేసేందుకు కొంత గడువు ఇచ్చినట్లు ప్రకటన చేయగానే వాహనదారులకు కొంత ఊరటనిచ్చింది. దేశ వ్యాప్తంగా అమలవుతున్న కొత్త వాహన చట్టంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రజల నుంచి పూర్తిగా వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేయనున్నట్లు ప్రకటన చేసింది. కానీ ఏమి లాభం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మాత్రం కొత్త చట్టాన్ని కోర్టులు తూ.చ తప్పకుండా అమలు చేస్తోంది. తాగి వాహనాలు నడిపిన వారి తాటతీయడం మొదులు పెట్టింది. పునరాలోచన... వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కొత్త వాహన చట్టం బిల్లును కేంద్ర ప్రభుత్వ దేశవ్యాప్తంగా అమలు చేసింది. కొత్త వాహన చట్టం అమలుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గి పునరాలోచన చేసే పనిలో నిమగ్నమైంది. కొత్త వాహన చట్టంలోని నిబంధనలు సవరించే దిశలో పునరాలోచన చేయనుంది. కొత్త చట్టంలో మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులు సైతం జైలుకు వెళ్లాల్సి ఉండేది. ఇలా ఒక్కటి కాదు మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి భారీ జరిమానా విధించడం, జరిమానాతో పాటు జైలు శిక్ష, చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే చట్టం సెక్షన్ – 199 ప్రకారం పిల్లల తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ.25వేలు జరిమానా విధిస్తూ మూడేళ్ల జైలు శిక్ష, వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేసే అవకాశం ఉండేది. అంటే సదరు వాహనాం మళ్లి రోడ్డెక్కె అవకాశం లేదు. ఇక ఉద్యోగులైతే ఉద్యోగం సైతం కోల్పోయే అవకాశం, దీంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేయడం ఉంది. ఒక వేల పిల్లలు ప్రమాదం చేస్తే వారి తల్లిదండ్రులను లేదా సంరక్షకులను దోషులుగా నిర్ధారించింది. రోడ్డుపై వెళ్లే అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోయిన రూ.10వేలు జరిమానా చెల్లించే విధంగా, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో సైతం రూ.10వేలు జరిమానా జైలు శిక్ష విధించేల చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలుకు బ్రేకులు వేసింది. జిల్లాలో సుమారు 20లక్షల వాహనాలు జిల్లాలో 8 లక్షల వరకు రవాణా వాహనాలు ఉండగా 12లక్షల వరకు రవాణేతర వాహనాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఘనంగా పెరుగుతున్నాయి. మరోవైపు హైవేలపై జరుగుతున్న ప్రమాదాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రమాదాల కారణాలపై నిపుణుల సర్వే ప్రకారం అధికంగా మద్యం మత్తులో, మితిమీరన వేగం, ట్రాఫిక్ నింబంధనలు పాటించకపోవడంతో జరిగే రోడ్డు ప్రమాదాలే అధికం. ప్రమాదాల నివారణకు అనేక అవగాహన కార్యక్రమాలు, స్వల్ప జరిమానాలు విధించిన వాహనదారుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలో కొత్త వాహన చట్టాన్ని అమలు చేస్తూ కఠినతరం చేసేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటు, రవాణా శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కోర్టుకు అప్పగించడంతో న్యాయమూర్తులే నూతన చట్టాన్ని అమలు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పాత చట్టం ప్రకారం రూ.2వేలు జరిమానా, జైలు శిక్ష విధించేవారు. కొత్త వాహన చట్టం ప్రకారం రూ.10వేలు జరిమానా జైలు శిక్ష విధిస్తున్నారు. కొత్తచట్టం ప్రకారం రెండు కేసులు... కొత్త వాహన చట్టం ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చెన్నూర్ కోర్టులో ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ జైలు శిక్ష ఖరారు చేశారు. దీంతో మందుబాబుల గుండెల్లో బండరాయి వేసినట్లైంది. ఒక పక్కకొత్త చట్టాన్ని అమలు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఇదేందని మందుబాబులు ప్రశ్నిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కోర్టుకు ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు రానందున సెప్టెంబర్ 1 నుంచి అమలైన కొత్తవాహన చట్టాన్ని అమలు చేస్తున్నారని పాతచట్టం ప్రకారం రూ.2వేల జరిమానా విధించాల్సి ఉండగా కొత్త చట్టం ప్రకారం రూ.10వేలు జరిమానాతో పాటు జైలుశిక్ష సైతం విధిస్తున్నారని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కొత్తవాహన చట్టంలోని నిబంధనలు, జరిమానా వివరాలు పోలీస్ ట్యాబ్‌లో ఆన్లైన్ చేయలేదని, దీంతో పాత వాహన చట్టం అమలులో ఉందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. 15రోజులు రెండు కేసులు ఈ నెల9న జైపూర్ మండలంలోని గంగిపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి మద్యం సేవించి వాహనం నడుపగా జైపూర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించినట్లు తెలడంతో కేసు నమోదు చేసి చెన్నూర్ కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనతంరం నారాయణరెడ్డి అతిగా మద్యం సేవించినట్లు తేలడంతో న్యాయమూర్తి సాయికుమార్ కొత్త వాహన చట్టం ప్రకారం రూ.10వేలు జరిమానా విధించారు. ఈ నెల 15న భీమారం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన టి.రాజం అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా భీమారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. అతిగా మద్యం సేవించినట్లు తేలడంతో కేసు నమోదు చేసి చెన్నూర్ కోర్టులో హాజరు పరుచగా విచారణ జరిపిన న్యాయమూర్తి రూ.10వేలు జరిమాన విధిస్తూ ఒక్క రోజు జైలు శిక్ష విధించారు. ఇక తాగి వాహనాలు నడిపితే అంతే సంగతి... జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పని పరిస్థితి... కోర్టు జరిమానా విధిస్తుంది.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులు కేసులు నమోదు చేయడం మట్టుకే పరిమితం జరిమానాలు, శిక్షలు కోర్టు ఆధీనంలో ఉంటుంది.. మద్యం సేవించి వాహనం నడిపిన వారికి పరీక్షలు నిర్వహించి కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచేంత వరకు మా పని జరిమానా, జైలు శిక్ష అదంత కోర్టు న్యాయమూర్తులు చూసుకుంటారు. మోటర్ వెహికిల్ కొత్త చట్టం ఇంక అమలుకాలేదు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు, ప్రతి వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్, వాహనాల పత్రాలు విధిగా పాటించాలి. డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరి, ఎవరిని ఊపేక్షించేది లేదు. – ప్రవీణ్‌కుమార్, ట్రాఫిక్ సీఐ, మంచిర్యాల -
భారీ పెనాల్టీలపై నిరసన: స్తంభించిన రవాణా
సాక్షి, న్యూఢిల్లీ : ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ పెనాల్టీలు వడ్డిస్తూ మోటార్ వాహన చట్టంలో చేపట్టిన సవరణలకు నిరసనగా దేశరాజధాని ఢిల్లీలో పలు ట్రాన్స్పోర్ట్ యూనియన్లు గురువారం సమ్మెకు పిలుపుఇచ్చాయి. రవాణా సమ్మెతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణీకులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటో రిక్షాలు, ట్యాక్సీలు, క్యాబ్‌ల సేవలు నిలిచిపోవడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. ట్రక్కులు, బస్‌లు, ఆటోలు, టెంపోలు, మ్యాక్సి క్యాబ్స్ సహా అన్ని వాహనాలకు సంబంధించిన 41 సంస్థలు, సంఘాలతో కూడిన రవాణా సంఘాల ఐక్య సమాఖ్య (యూఎఫ్‌టీఏ) సమ్మెకు పిలుపు ఇచ్చింది. మోటార్ వాహన చట్టానికి చేసిన సవరణలు మార్చాలని, భారీ పెనాల్టీల నుంచి ఉపశమనం కల్పించాలని, ప్రైవేట్ వాహన డ్రైవర్లకు బీమా, వైద్య సదుపాయం కల్పించాలని ట్రాన్స్పోర్ట్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. (చదవండి: హెల్మెట్ లేకున్నా.. ఒక్క రూపాయి కట్టలేదు..!) -
కొత్త వాహన చట్టంతో అంతా అలర్ట్
సాక్షి, మిర్యాలగూడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వాహన చట్టంతో వాహనదారులు అంతా అలర్ట్ అవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడే అమలు లేకపోయినప్పటికీ అక్కడక్కడా జరిమానాలు విధించడం వల్ల ముందస్తు జాగ్రత్తలు పడుతున్నారు. ఈ నెల 1వ తేదీన నుంచి కొత్త వాహనం చట్టం అమలులోకి వచ్చినా అంతకుముందునుంచే జిల్లాలోని ప్రధాన పట్ట ణాలైన నల్లగొండ, మిర్యాలగూడ ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించారు. దీంతో వాహనదారులు ముందస్తుగా వాహనానికి రిజిస్ట్రేషన్‌తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గతంలో జిల్లాలో రోజుకు వంద మంది దరఖాస్తులు చేసుకునే వారు.. కానీ నెల నుంచి రోజుకు రెండు వందల మంది దరఖాస్తు చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్నారు. లెర్నింగ్ లైసెన్స్‌లకు భారీగా దరఖాస్తులు మిర్యాలగూడ ఎంవీఐ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం కూర్చున్న దరఖాస్తు దారులు ఇన్ని రోజులు వాహనం నడుపుతున్నా డైవ్రింగ్ లైసెన్స్ ఎందుకులే అనుకున్నారు. కొత్త వాహన చట్టం రావడం వల్ల అలాంటివారందరూ లెర్నింగ్ లైసెన్స్ కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడలలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో కొత్త డ్రైవింగ్ లైసెన్స్ కోసం రోజుకు వందల మంది వెళ్తున్నారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ ఎంవీఐ కార్యాలయాల్లో ఈ ఏడాది జూలై మాసంలో 2,645 మంది కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోగా, ఆగస్టు మాసంలో 2,507 మంది తీసుకున్నారు. ఈ నెలలో ఏడు పని దినాల్లోనే ఇప్పటివరకు 1,418 మంది దరఖాస్తులు చేసుకొని లెర్నింగ్ లైసెన్స్‌లు పొందారు. స్లాట్ బుకింగ్‌కు వారం రోజుల గడువు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేవారు, పర్మనెంట్ లైసెన్స్ తీసుకునే వారు ముందుగా మీ సేవా కేంద్రంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంది. స్లాట్ బుకింగ్ చేసుకున్నాక గతంలో ఒక్క రోజులోనే ఎంవీఐ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. కానీ దరఖాస్తులు పెరగడం వల్ల వారం రోజులు ఆగాల్సి వస్తుంది. కొత్తగా లెర్నింగ్ లైసెన్స్ కోసం ద్విచక్ర వాహనానికి 300 రూపాయలు, ద్విచక్రవాహనాలతోపాటు నాలుగు చక్రాల వాహనానికి 450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ద్విచక్ర వాహనానికి 1,035 రూపాయలు, ద్విచక్ర వాహనంతో పాటు నాలుగు చక్రాల వాహనానికి 1,335 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి గతంలో కంటే ప్రస్తుతం ఎక్కువమంది డ్రైవింగ్ లైసెన్స్‌లు తీసుకుంటున్నారు. కొత్త వాహన చట్టం రావడం వల్ల డ్రైవింగ్ వచ్చిన వారంతా లైసెన్స్ తీసుకుంటున్నారు. గతంలో రోజుకు 40 నుంచి 45 మంది కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు. కానీ ప్రస్తుతం 90నుంచి వంద మంది దరఖాస్తు చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందుతున్నారు. ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. దీనితోపాటు వాహన రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. – శ్రీనివాస్‌రెడ్డి, ఎంవీఐ, మిర్యాలగూడ -
బైక్ ధర కన్నా..చలాన్లే ఎక్కువ.. మీరే ఉంచుకోండి!
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన చట్టంలో భారీ ట్రాఫిక్ జరిమానాలు విధిస్తుండటంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూత్ కాంగ్రెస్ గురువారం వినూత్న నిరసనను చేపట్టింది. కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసం ఎదుట కొన్ని మోటారు బైక్‌లను వదిలేసింది. ఈ బైక్‌ల ధరల కన్నా చలాన్ల రుసుమే ఎక్కువగా ఉందని, నమ్మశక్యంగానీరీతిలో విధించిన ఈ చలాన్లను భరించలేక బైక్‌లను వదిలేసి పోతున్నామని యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గడ్కరీ నివాసం ఈ బైక్‌లతో ఎదుట ఆందోళన నిర్వహించారు. కొత్త చట్టంలో సామాన్య ప్రజలు భరించేలేనిరీతిలో జరిమానాలు విధిస్తున్నారని, చాలా కేసుల్లో బైక్‌ల ధరల కన్నా.. జరిమానాల మొత్తం అధికంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీ శ్రీనివాస్ నేతృత్వంలో ఈ నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పౌరుల వ్యక్తిగత ప్రైవసీని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్ నోటీసుల పేరిట తమ వెబ్సైట్లో వాహనదారుల పూర్తి వివరాలు పొందుపరుస్తున్నారని, కేవలం బండి రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే చాలు.. వాహనదారుల పూర్తి వివరాలు వెబ్సైట్లో తెలుసుకునేవిధంగా ఉన్నాయని, ఇది పౌరుల వ్యక్తిగత ప్రైవసీపై దాడి చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమాచారం సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి చేరే అవకాశముందని బీ. శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ట్రాఫిక్ చలాన్లను తగ్గించనున్న మరో రాష్ట్రం!
యశవంతపుర: ఈ నెల ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మోటారు వాహన చట్టంతో వాహనదారులపై భారీ జరిమానాలు పడుతున్నాయి. రవాణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు చలానాలు రాస్తున్నారు. దీనిపై ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో గుజరాత్ మాదిరిగా కన్నడనాట కూడా చలాన్లను సగానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం బీఎస్ యడియూరప్ప బుధవారం ఈ విషయమై రవాణాశాఖ అధికారులకు సూచనలు చేశారు. తగ్గింపునకు సంబంధించి అధికారులతో చర్చించి సీఎం చేసిన ఆదేశాలను గట్టిగా పరిశీలిస్తున్నట్లు డీసీఎం, రవాణా శాఖమంత్రి లక్ష్మణ సవది తెలిపారు. ఇప్పటికే గుజరాత్లో మోటారు వాహన చట్టంలో మార్పులు తెచ్చి జరిమానాలను సగం వరకూ తగ్గించారు. దీంతో వాహనదారులకు కొంతైనా ఊరట దక్కింది. రాష్ట్రంలో కూడా చలాన్ల బాదుడుపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ మాదిరిగా వ్యవహరించాలని సంకల్పించింది. గుజరాత్ తరహాలో ట్రాఫిక్ చలాన్లు తగ్గిస్తామని సీఎం బీఎస్ యడ్యూరప్ప మీడియాతో పేర్కొన్నారు. 2 రోజుల్లో నివేదిక ఇతర రాష్ట్రాలలో విధిస్తున్న జరిమానాల విధానాన్ని కర్ణాటక అధికారులు అధ్యయనం చేశారు. రెండు రోజుల్లో సంపూర్ణ నివేదికను సీఎంకు అందజేయనున్నారు. ఆ తరువాత జరిమానాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జరిమానాల విధానంపై అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు డీసీఎం లక్ష్మణ సవది తెలిపారు. బెంగళూరులో కొత్త ట్రాఫిక్ జరిమానాలపై ఆవేదన వ్యక్తమవుతోంది. గుజరాత్లో హెల్మెట్ ధరించకుంటే రూ. వెయ్యికి బదులు రూ.500, సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే రూ.500 జరిమానాగా వసూలు చేస్తున్నారు. త్రిబుల్ రైడ్‌కు కేంద్రం వేయి రూపాయిల జరిమానాను విధించగా గుజరాత్ ప్రభుత్వం నూరు రూపాయలను వసూలు చేస్తోంది.ఇదే విధానాన్ని కర్ణాటకలోనూ అమలు చేయాలని సీఎం యడియూరప్ప నిర్ణయించారు. గుజరాత్లో మొదటి సారి సగమే విధించినా రెండోసారి అవే ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్రం విధించిన జరిమానాలను వసూలు చేస్తున్నారని కర్ణాటక అధికారుల బృందం చేసిన సర్వేలో తెలింది. ఎలాంటి విధానం అవలంబించాలన్న దానిపై పూర్తి నివేదిక వచ్చాక చర్చించి వారం నుండి తగ్గింపు జరిమానాలను అమలు చేసే అవకాశం ఉంది. జరిమానాల వసూలుపై సీఎం ఆరా రాష్ట్రంలో ఇప్పటివరకు వసూలైన కొత్త జరిమానాల వివరాలను సీఎం యడియూరప్ప అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల్లో కోటి రూపాయిల వరకు జరిమానాలు వసూలు చేసిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే ఐదు వందలకు మించి వసూలు చేస్తే ప్రజలపై భారం పడటంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని అధికారులు వివరించినట్లు తెలిసింది. చదవండి: ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు -
భారీ చలాన్లు, నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటార్ వాహన సవరణ చట్టం-2019 వల్ల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు భారీ జరిమానాల బారిన పడుతున్నారు. దీనిపై ఒకవైపు భారీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఈ నెలనుంచి అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ ఉల్లంఘనలు,భారీ చలాన్లను సమర్థిస్తూ కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనకుగాను తన వాహనానికి కూడా జరిమానా విధించినట్లు సోమవారం వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. తన పేరు మీద నమోదైన కారును అతి వేగంగా నడిపినందుకు ముంబైలోని బంద్రా-వర్లీ ప్రాంతంలో జరిమానా విధించారన్నారు. అంతేకాదు బాగా జరిమానాలు అవినీతి పెరగడానికి దారితీస్తుందనే ఆందోళనలను మంత్రి తోసి పుచ్చారు. అవినీతి పెరుగుతుందని అంటున్నారు..ఎలా జరుగుతుంది? తాము ప్రతిచోటా కెమెరాలను ఏర్పాటు చేసాము కదా అని కేంద్రమంత్రి పేర్కొనడం గమనార్హం. మోటార్ వెహికిల్ సవరణల చట్టం తీసుకురావడం పట్ల తమ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. భారీ జరిమానాల కారణంగా అవినీతి తగ్గుతుందని.. రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా చాలా వరకు నియంత్రించవచ్చన్నారు. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారు జరిమానాలకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఇలా వుంటే భారీ జరిమానాలపై సామాన్యుల నుంచి రాజకీయనేతల దాకా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనికితోడు గతంలో ఎప్పుడో పెండింగ్‌లో ఉన్న చలాన్లకు కూడా డబ్బులు వసూలు చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తమ వాహనాల ఖరీదుకు మించి చలాన్ల వడ్డింపు వుండటంతో ఏం చేయాలో తెలియక వాహనదారులు ఆందోళన పడుతున్నారు. కొందరైతే ఫైన్ చెల్లించలేక తమ వాహనాలను పోలీసుల వద్దే వదిలేసి వెళుతున్నారు. వాహనానికి నిప్పు పెట్టిన ఉదంతం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా
భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వాహన సవరణ చట్టం-2019 నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఈ చట్టం ప్రకారం వాహనదారులకు విధించే జరిమానాలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమంది కొత్త చట్టం ప్రకారం విధించిన జరిమానాలు చూసి షాక్ తిన్నారు. ఆర్టీవో అధికారులు తాజాగా ఓ ఆటో డ్రైవర్‌కు రూ. 47,500 జరిమానా విధించారు. ఈ ఘటన ఒడిశా భువనేశ్వర్‌లో బుధవారం చోటుచేసుకుంది. సరైన పత్రాలు లేకపోవడం, తాగి వాహనం నడపడం, లైసెన్స్ సక్రమంగా లేకపోవడంతో అధికారులు అతనికి భారీ మొత్తంలో జరిమానా విధించారు. బుధవారం నగరంలో వాహన తనిఖీలు చేపట్టిన అధికారులు మోటార్ వాహన చట్టం నిబంధనలు అతిక్రమించినందుకు ఆటో డ్రైవర్ హరిబంధు కన్హార్కు రూ. 47,500 జరిమానా విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి కొత్త చట్టం ప్రకారం ఈ జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై హరిబంధు మాట్లాడుతూ, తాను ఇంత మొత్తం జరిమానా చెల్లించే పరిస్థితి లేదని తెలిపారు. కావాలంటే అధికారులు తన వాహనాన్ని సీజ్ చేయాలని, లేకుంటే తనను జైలుకు పంపాలని కోరారు. ఇంటి వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆటో డ్రైవర్‌కు విధించిన జరిమానా వివరాలు సాధారణ జరిమానా - రూ. 500 డ్రైవింగ్ లైసెన్స్ సరిగా లేనందుకు - రూ. 5,000 పర్మిట్ లేకుండా వాహనం నడిపినందుకు - రూ. 10,000 మద్యం సేవించి వాహనం నడిపినందుకు - రూ. 10,000 పొల్యూషన్ సర్టిఫికేట్ లేనందుకు - రూ. 10,000 వాహనం నడిపేందుకు వేరే వ్యక్తిని అనుమతించినందుకు - రూ. 5,000 ఆటో రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ లేనందుకు - రూ. 5,000 ఇన్సూరెన్స్ లేనందుకు - రూ. 2,000 -
రూ.15 వేల బండికి జరిమానా రూ.23 వేలు
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త మోటార్ వాహన చట్టం నిబంధనలు పాటించని వాహనదారులకు చుక్కలు చూపెట్టడం ఖాయం. గుర్‌గ్రామ్‌లో చోటు చేసుకున్న ఉదంతం ఒకటి ఈ విషయాన్ని తేట తెల్లం చేసింది. నాలుగు రాష్ట్రాలు (తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్) మినహా దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ప్రకారం భారీ జరిమానాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా హెల్మెల్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, కాలుష్య నియంత్రణ.. ఇలా ఏ సర్టిఫికెట్ లేకపోయినా వాహనదారుడు పది రెట్లకు మించి భారీ మూల్యం చెల్లించాల్సిందే. దినేష్ మదన్ తాజా అనుభవం గురించి తెలుసుకుందాం.. దినేష్‌కు కొత్త ట్రాఫిక్ నిబంధనల కింద ఏకంగా రూ.23,000 జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఎందుకంటే.. లైసెన్స్, ఆర్సీ డాక్యుమెంట్స్ లేవు.. దీంతో పాటు హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు భారీ జరిమానా విధించారు. హెల్మెట్ లేదని బండి ఆపి, సర్టిఫికెట్లు లేవంటూ భారీ ఫైన్ విధించారని, వాట్సాప్‌లో లెసెన్స్ కాపీని చూపించినా అంగీకరించలేదని దినేష్ వాపోయాడు. హోండా యాక్టివా బైక్‌ను సెకండ్ హ్యాండ్లో రూ.15వేలకు కొన్నాను. ఇపుడు దీనికి రూ. 23 వేల జరిమానా చూసి షాకయ్యానంటున్నాడు దినేష్. బండికి సంబంధించిన కాగితాలన్నీ ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పాడు. అయితే హెల్మెట్ ధరించనందుకు గాను వెయ్యి రూపాయల ఫీజును తీసుకొని, తన బండి తనకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నాడు. అంతేకాదు.. ఇక మీదట అన్ని నిబంధనల్ని తు.చ. తప్పకుండా పాటిస్తానని తెలిపాడు. అయితే రూల్ ఈజ్ రూల్ అంటున్నారు అధికారులు. లైసెన్స్ లేని డ్రైవింగ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేదు, థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేదు, ఎయిర్ పొల్యూషన్ నిబంధనల ఉల్లంఘన, హెల్మెట్ లేని డ్రైవింగ్... ఈ నిబంధనల ఉల్లంఘనల కింద జరిమానా విధించామని వెల్లడించారు. చదవండి : 'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్లే! -
'ఆ' రాష్ట్రాల్లో పాత చలాన్లే!
న్యూఢిల్లీ: కొత్త మోటారు వాహన సవరణ చట్టం–2019 ఆదివారం నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ట్రాఫిక్ ఉల్లంఘనులకు విధించే జరిమానాలు అతి భారీగా ఉండడంతో తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాలు మాత్రం పాత చలాన్లే విధిస్తున్నాయి. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్‌తో సహా ఈ జాబితాలో బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రం కూడా చేరింది. అంతేకాక అనేక ఇతర రాష్ట్రాలు సవరించిన చట్టాన్ని అమలు చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. భారీ జరిమానాలు విధించడం సాధ్యం కాదని, ఈ విషయమై ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులతో చర్చలు జరిపి కొత్త జరిమానాలను నిర్ణయిస్తామని గుజరాత్ ప్రభుత్వ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సోమవారం పేర్కొన్నారు. అలానే మధ్యప్రదేశ్‌లో కొత్త చట్టం అమల్లోకి రాదని, జరిమానాల గూర్చి ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత చట్టం అమలు చేయబడుతుందని ఆ రాష్ట్ర న్యాయ వ్యవహారాల మంత్రి ప్రకటించిన విషయం విదితమే. ఢిల్లీలో కొత్త చట్టం అమలు చేస్తున్నప్పటికీ చలాన్ల విషయమై ట్రాఫిక్ పోలీసులతో చర్చలు జరిపే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేసింది. అయితే మోటారు వాహనాల సవరణ బిల్లు 2019ను పార్లమెంటు జూలైలో ఆమోదించింది. ఈ చట్టంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు ఉల్లంఘనులకు కఠినమైన జరిమానాలు విధించారు. కొత్త చట్టం ప్రకారం.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని వారికి జరిమానా రూ .100 నుంచి అమాంతం రూ .1,000లకు పెంచడం చర్చనీయాంశంగా మారింది. కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత మునుపెన్నడూ లేని విధంగా ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు మొదటి రోజు కేవలం 3,900 మందికి మాత్రమే చలాన్లు విధించారు. గత కొన్ని సంవత్సరాలుగా సాధారణంగా పండుగ రోజుల్లో, ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న వేళల్లో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి సగటున కేవలం 6గంటల వ్యవధిలో సగటున 15,000 నుంచి 20,000 చలాన్లు విధించే ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం జారీ చేసిన చలాన్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయితే సవరించిన చట్టం అమలులో మొదటి రోజు ఆదివారం కావడం, కొత్త చట్టం ప్రకారం జరిమానాలు చాలా భారీగా ఉండటంతో వాహనదారులు జాగ్రత్త పడడం ఒకటైతే, జారీ చేసిన మొత్తం చలాన్లు ఆదివారం రాత్రి 7 గంటల వరకు మాత్రమే తీసుకున్నవి అని ట్రాఫిక్ విభాగపు అధికారులు ధృవీకరించారు. -
తాగి నడిపితే..ఇకపై రూ.10 వేలు ఫైన్!
సాక్షి, న్యూఢిల్లీ : వాహనదారులు ఇక మీదట జాగ్రత్తగా నిబంధనలను పాటించాల్సిందే. లేదంటే జరిమానాల మోత మోగనుంది ఈ మేరకు మోటారు వాహనాల (సవరణ) బిల్లులో ప్రతిపాదిత మార్పులను కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, రహదారి భద్రత, నిబంధనల ఉల్లంఘనపై జరిమానాతో పాటు అవినీతిని అరికట్టడం లాంటి అంశాలను ప్రధానంగా ఈ బిల్లు పరిగణనలోకి తీసుకుంది. ప్రతిపాదిత సవరణ ప్రకారం మద్యం తాగి వాహనం నడిపితే జరిమానాను ఐదు రెట్లు పెంచనుంది. అలాగే ప్రమాదకరమైన రేసింగ్‌లు, అతివేగంగా నడిపితే జరిమానాను ఏకంగా పది రెట్లు పెంచేందుకు ప్రతిపాదించింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో సవరణ బిల్లును రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టనుంది తాజా నిబంధనల ప్రకారం జరిమానా తాగి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా. పరిమితికి మించి వేగంగా వాహనాన్ని నడిపితే రూ. 5వేలుగా ఉండనుంది. రోడ్డు ప్రమాద మృతులకు రూ. పది లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ. 2 లక్షలు పరిహారం మరో ముఖ్యమైన నిబంధన. ప్రైవేటు రవాణా సంస్థలు లైసెన్సింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా విధించాలని ఈ సవరణ ప్రతిపాదించింది. ఓవర్ లోడింగ్ వాహనాలు రూ. 20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరిమానా విధించేలా బిల్లును రూపొందించారు. అంతేకాదు రహదారి ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారికి, లేదా సమాచారం అందించిన వ్యక్తులు వేధింపులకు గురికాకుండా ఉండేలా ప్రతిపాదిత సవరణ చేసింది. అలాగే థర్డ్‌పార్టీ బీమాను గరిష్టంగా రూ.10 లక్షలు పరిమితం చేయాలనేది మరో ప్రతిపాదన. కొత్త వాహనాల నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, డ్రైవింగ్ లైసెన్స్ , వాహన రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ తప్పనిసరి అని తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ విషయంలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం 50 సంవత్సరాల వయస్సున్న ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ 20 వరకు సంవత్సరాలు చెల్లుతుంది. అయితే దీంట్లో వివిధ కేటగిరీలను చేర్చాలని భావిస్తోంది. ఉదాహరణకు, లైసెన్స్ హోల్డర్ వయస్సు 30-50 సంవత్సరాల మధ్య ఉంటే 10 సంవత్సరాల వరకు మాత్రమే( ప్రస్తుతం 20 ఏళ్ళతో పోలిస్తే) చెల్లుతుంది. కాగా ఈ సవరణలకు సంబంధించిన ఈ బిల్లుకు లోక్‌సభలో 2017 లో ఆమోదం లభించినప్పటికీ రాజ్యసభ మద్దతు పొందడంలో విఫలమైంది. ఈ ప్రతిపాదనలతో కూడిన బిల్లు చట్టం రూపం దాల్చాలంటే ఉభయ సభల అనుమతి పొందాల్సి ఉంటుంది. -
అంబులెన్సుకు దారివ్వకుంటే రూ.10 వేల ఫైన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సోమవారం నాడిక్కడ సమావేశమైంది. ఈ భేటీలో మోటార్ వాహనాల(సవరణ) బిల్లు–2019తో పాటు డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు–2019కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. వాహనాలు నడిపేటప్పడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధించేలా నూతన బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిప్రకారం అంబులెన్స్, ఇతర అత్యవసర సేవల వాహనాలను దారి ఇవ్వకుంటే రూ.10,000 వరకూ జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ చేసేందుకు అనర్హులైనప్పటికీ వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనదారులకు రూ.లక్ష వరకూ జరినామా విధించేలా బిల్లును రూపొందించారు. సీటు బెల్ట్ లేకుంటే లైసెన్స్ రద్దు.. రోడ్లపై అతివేగంతో దూసుకెళ్లే వాహనదారులకు రూ.1,000 నుంచి రూ.2,000 జరిమానా విధించాలని బిల్లులో నిబంధనలు చేర్చారు. ఇక ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 కట్టాలి. వాహనాల్లో సీటు బెల్టు ధరించకుంటే రూ.వెయ్యి జరిమానా చెల్లించడంతో పాటు 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తారు. ద్విచక్ర వాహనాలపై హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తే రూ.1,000 జరిమానాతో పాటు 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దవుతుంది. ఒకవేళ మైనర్ పిల్లలు రోడ్డు ప్రమాదానికి కారకులైతే వారి తల్లిదండ్రులు/ సంరక్షకులను దోషులుగా నిర్ధారిస్తారు. సదరు తల్లిదండ్రులు/ సంరక్షకులకు మూడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25,000 జరిమానా విధించవచ్చు. ఇలాగే ప్రమాదానికి కారణమైన రిజిస్ట్రేషన్‌ను రద్దుచేస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఉల్లంఘించే వాహనదారులకు విధిస్తున్న రూ.100 జరిమానాను ఈ బిల్లులో రూ.500కు పెంచుతూ బిల్లును రూపొందించారు. అధికారుల ఆదేశాలు పాటించకుంటే విధించే పెనాల్టీని రూ.500 నుంచి రూ.2 వేలకు పెంచారు. ఒకవేళ లైసెన్స్ అందుకోకుండానే వాహనాలు నడిపితే, లైసెన్స్ లేకుండా నడిపేవారికి రూ.5,000 జరిమానా విధించనున్నారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్ చేసేవారికి రూ.5,000, మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఓవర్ లోడింగ్ వాహనాలు రూ.20 వేల పెనాల్టీ కట్టేలా బిల్లులో నిబంధనల్ని చేర్చారు. ఒకవేళ ఈ నిబంధనలను స్వయంగా సంబంధిత అధికారులు ఉల్లంఘిస్తే జరిమానా రెట్టింపు అవుతుంది. డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లుకు ఆమోదం.. నేరాల్లో వ్యక్తులను గుర్తించేందుకు ఉద్దేశించిన డీఎన్ఏ ప్రొఫైలింగ్ బిల్లు–2019కు కేబినెట్ ఓకే చెప్పింది. బిల్లు ప్రకారం ప్రభుత్వం జాతీయ డీఎన్ఏ బ్యాంకు, ప్రాంతీయ డీఎన్ఏ బ్యాంకులను ఏర్పాటుచేస్తుంది. ఈ బ్యాంకుల్లో నేరం జరిగిన ప్రాంతంలోని డేటా, నిందితుల డేటా, అదృశ్యమైన వ్యక్తుల డేటా, గుర్తుతెలియని మృతుల డేటాను విడివిడిగా నిర్వహించాలి. అలాగే ఈ బిల్లు ప్రకారం డీఎన్ఏ రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తారు. డీఎన్ఏను విశ్లేషించే ప్రతీ ల్యాబ్ ఈ సంస్థ నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది. ఏడేళ్లు అంతకంటే ఎక్కువశిక్ష పడే నేరాలు లేదా హత్య కేసుల్లో డీఎన్ఏ సేకరణకు నిందితుల అంగీకారం అక్కర్లేదు. ఈ రెండు బిల్లులను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. -
15 ఆటోలు సీజ్
రెంజల్(బోధన్) : మోటారు వాహణ చట్టానికి విరుద్ధంగా నడుపుతున్న 15 ఆటోలను సీజ్ చేసినట్లు బోధన్ ఆర్టీవో రాజు తెలిపారు. శనివారం మండలంలోని సాటాపూర్‌లో జరిగిన వారాంతపు సంతకు ప్రయాణికులను తరలిస్తున్న ఆటోలను ఆయన తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న వాటిని పట్టుకుని సీజ్ చేశారు. ఇటీవల మెండారాలో జరిగిన సంఘటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి వారం మూడు రోజులపాటు ప్రత్యేక స్పెషల్‌డ్రైవ్‌లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిట్‌నెస్‌లేని ఆటోలను గుర్తించి సీజ్ చేస్తామన్నారు. సాటాపూర్ చౌరస్తాలో పలువురు ఆటోడ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.