సాక్షి, హైదరాబాద్ : మోటార్ వాహన పన్ను చెల్లింపుల గడువును లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒక నెలరోజుల వరకూ పొడిగిస్తూ తెలంగాణా రాష్ట్ర రవాణా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 30తో ముగిసే త్రైమాసికానికి చెల్లించాల్సిన మోటార్ వాహన అడ్వాన్స్ పన్ను గడువును పెంచాలని వాహనదారుల అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పొడిగించిన గడువులోగా మోటార్ వాహన పన్ను చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీ విధించబోమని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్ అమలుతో పన్ను చెల్లించలేకపోయిన వాహనదారులకు ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment