grace period
-
పర్యాటక వీసాతోనూ ఉద్యోగ దరఖాస్తులు: అమెరికా
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో ఉద్యోగం కోల్పోయి కొత్త కొలువు దొరక్క దేశం వీడాల్సి వస్తుందేమోనని ఆందోళన పడుతున్న హెచ్–1బి వీసాదారులకు, ముఖ్యంగా భారత టెకీలకు భారీ ఊరట! బిజినెస్ (బి–1), పర్యాటక (బి–2) వీసాదారులు కూడా అమెరికాలో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇంటర్వ్యూలకూ హాజరు కావచ్చని ఆ దేశ పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్సీఐఎస్) పేర్కొంది. ‘‘అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన వారు 60 రోజుల్లోపు మరో ఉద్యోగం చూసుకోలేని పక్షంలో అమెరికా వీడటం తప్ప మరో మార్గంలేదనే అపోహలో ఉన్నారు. మరింత కాలం దేశంలో ఉండేందుకు వారికి పలు మార్గాలున్నాయి. 60 రోజుల్లోపు వీసా స్టేటస్‌ను (బి–1, బి–2కు) మార్చుకుంటే ఆ గ్రేస్ పీరియడ్ ముగిశాక కూడా అమెరికాలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చు’’ అని వివరించింది. అయితే ఉద్యోగం దొరికాక అందులో చేరేలోపు వీసా స్టేటస్‌ను తదనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయమై పలువురు వెలిబుచ్చిన పలు సందేహాలకు సమాధానంగా సంస్థ ఈ మేరకు ట్వీట్ చేసింది. బి–1 వీసాను స్వల్పకాలిక బిజినెస్ ప్రయాణాలకు, బి–2ను ప్రధానంగా పర్యాటక అవసరాలకు అమెరికా జారీ చేస్తుంటుంది. మాంద్యం దెబ్బకు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సహా పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా గత నవంబర్ నుంచి అమెరికాలోనే 2 లక్షల మందికి పైగా నిరుద్యోగులయ్యారు. వీరిలో కనీసం లక్ష మంది భారతీయులేనని అంచనా! -
అమెరికాలో మన టెకీల మెడపై... ‘గడువు’ కత్తి!
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్–1బీ ప్రొఫెషనల్స్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘సదరు కుటుంబాలకు ఇది పెను సంక్షోభం. వారికి చూస్తుండగానే సమయం మించిపోతోంది. అమెరికాలో పుట్టిన తమ పిల్లలను వెంటపెట్టుకుని వారి త్వరలో దేశం వీడాల్సిన పరిస్థితులు దాపురించాయి’’ అంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన 60 రోజుల గ్రేస్ పీరియడ్లోగా మరో ఉద్యోగం గానీ, ఉపాధి గానీ చూసుకోని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. జాబ్ మార్కెట్ అత్యంత ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కోవడం చాలామందికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. దొరికినా అత్యంత సంక్లిష్టంగా ఉన్న హెచ్–1బీ మార్పు తదితర నిబంధనల ప్రక్రియను గ్రేస్ పీరియడ్లోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో దాన్ని కనీసం 180 రోజులకు పెంచాలంటూ ఆసియా అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్షుని సలహా కమిటీ ఇటీవలే సిఫార్సు చేయడం తెలిసిందే. ‘‘దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నా అవి ఆమోదం పొంది అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. ఈలోపు 60 రోజుల గ్రేస్ పీరియడ్ పూర్తయ్యే వారికి నిస్సహాయంగా దేశం వీడటం మినహా మరో మార్గం లేదు’’ అంటూ ఎఫ్ఐఐడీఎస్ ఆవేదన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ పెంపు సిఫార్సును పరిశీలించి నిర్ణయం తీసుకునే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. భారీగా ఉద్వాసనలు...: గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలుకుని పలు దిగ్గజ కంపెనీలు కొన్నాళ్లుగా భారీగా ఉద్యోగుల తొలగింపు బాట పట్టడం తెలిసిందే. దాంతో గత నవంబర్ నుంచి అమెరికాలో కనీసం 2.5 లక్షల మందికి పైగా ఐటీ తదితర ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ‘‘వీరిలో దాదాపు లక్ష మంది దాకా భారతీయులేనని అంచనా. ఆదాయ పన్ను చెల్లించే హెచ్–1బి ఇమిగ్రెంట్లయిన వీరు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెదుక్కుని సదరు కంపెనీ ద్వారా హెచ్–1బికి దరఖాస్తు చేసుకోలేని పక్షంలో దేశం వీడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు’’ అని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. -
గ్రేస్ పీరియడ్: హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట!
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న హెచ్-1బి ఉద్యోగులకు ఊరట. ఉద్యోగం పోయిన రెండు నెలల్లోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్‌ను ఆర్నెల్లకు పెంచాలని అధ్యక్షుని సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుని ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది భారత టెకీలకు భారీ ఊరట కలగనుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల మేరకు వారంతా 60 రోజుల్లోగా మరో ఉపాధి చూసుకోలేని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పెంచాల్సిందిగా సిఫార్సు చేసినట్టు ఆసియా అమెరికన్లు తదితరులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. అమెరికాలో 2022 నవంబర్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఏకంగా 80 వేల మంది భారతీయులేనని అంచనా! గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఊరట! మరోవైపు, ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో ఆమోదిత ఐ-140 ఉపాధి ఆధారిత వీసా పిటిషన్లుండి, ఐదేళ్లకు పైగా గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) జారీ చేయాలని అధ్యక్షుని సలహా కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇమిగ్రెంట్ వారి వీసా దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడేదాకా అమెరికాలో వృత్తి, ఉద్యోగాలు కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని కమిటీ సభ్యుడు అజన్ జైన్ భుటోరియా తెలిపారు. -
‘హెచ్–1బీ’ గ్రేస్ పీరియడ్ 12 నెలలకు పెంచాలి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో లే–ఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ఇతర రంగాల్లోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఫలితంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు నిరుద్యోగులుగా మారుతున్నారు. హెచ్–1బీ(నాన్–ఇమ్మిగ్రెంట్) వీసాపై ఉంటున్నవారు ఉద్యోగం పోయాక 60 రోజుల్లోగా(2 నెలలు) మరో కొలువు వెతుక్కోవాలి. లేకపోతే స్వదేశానికి వెళ్లిపోవాలి. ఈ గ్రేస్ పిరియడ్‌ను 60 రోజుల నుంచి 12 నెలలకు(ఒక సంవత్సరం) పెంచాలని కోరుతూ ఫౌండేషన్ ఫర్ ఇండియా, ఇండియన్ డయాస్పోరా స్టడీస్ అండ్ గ్లోబల్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అనే రెండు భారత–అమెరికన్ సంస్థలు పోరాటం ప్రారంభించాయి. భారత టెకీలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఆన్లైన్లో పిటిషన్లు సమర్పిస్తున్నాయి. అధ్యక్షుడితోపాటు డిపార్టుమెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి, యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్‌కు ఆన్లైన్లో పిటిషన్లను పంపిస్తున్నాయి. -
హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట
వాషింగ్టన్: కరోనా సంక్షోభంతో చిక్కుల్లో పడ్డ అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట. అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సంబంధిత పత్రాలను సమర్పించాలంటూ నోటీసుల జారీ చేసిన హెచ్-1బీ వీసాదారులకు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యుఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుభవార్త అందించింది. అవసరమైన పత్రాలను సమర్పించడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో రెండు నెలలపాటు ఇమ్మిగ్రేషన్ ను ఇటీవల నిలిపివేయడంతో గ్రీన్ కార్డు కార్డు కోసం ఎదురు చూస్తున్నవారికి రెండు నెలల సమయం దొరికింది. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా, వీరిలో హెచ్-1బీ వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. శుక్రవారం నాటి యుఎస్సీఐఎస్ ఉత్తర్వుల ప్రకారం హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలు కొనసాగింపు వీసా(ఎన్-14), తిరస్కరించే నోటీసులు, ఉపసంహరించుకునే నోటీసు, ప్రాంతీయ పెట్టుబడి కేంద్రాలను ముగించే నోటీసులు, ఫారం ఐ-290బీ నోటీస్ ఆఫ్ అప్పీల్ లేదా మోషన్ తదితర అంశాలకు సంబంధించిన వాటిని 60 రోజుల్లోగా సమర్పించాలని సూచించింది. అభ్యర్థనలు, నోటీసుల విషయంలో చర్యలు తీసుకోవడానికి ముందు 60 రోజులలోగా స్పందించాలని తెలిపింది. గడువు ముగిసిన వారిపై ఏదైనా చర్య తీసుకునే ముందు నిర్ణీత తేదీ నుండి 60 క్యాలెండర్ రోజుల వరకు అందుకున్న ఫారం ఐ-290బీ ను పరిశీలిస్తామని యుఎస్సీఐఎస్ తెలిపింది. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు) కోవిడ్ -19 పరిస్థితిని సమీక్షించిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయులను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంటామని ఏప్రిల్ 10న ప్రభుత్వం తెలిపింది. పరిస్థితిని అంచనా వేసిన తరువాత విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంటామని భారత ప్రభుత్వం సూచించిన కొద్ది రోజుల తరువాత అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసలదారులపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
వాహనదారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్ : మోటార్ వాహన పన్ను చెల్లింపుల గడువును లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఒక నెలరోజుల వరకూ పొడిగిస్తూ తెలంగాణా రాష్ట్ర రవాణా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 30తో ముగిసే త్రైమాసికానికి చెల్లించాల్సిన మోటార్ వాహన అడ్వాన్స్ పన్ను గడువును పెంచాలని వాహనదారుల అభ్యర్ధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పొడిగించిన గడువులోగా మోటార్ వాహన పన్ను చెల్లింపులపై ఎలాంటి పెనాల్టీ విధించబోమని ఈ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్ అమలుతో పన్ను చెల్లించలేకపోయిన వాహనదారులకు ప్రభుత్వ నిర్ణయం ఊరట కలిగించింది. చదవండి : హైదరాబాద్‌లో లాక్డౌన్ మరింత కఠినం -
నోట్ల డిపాజిట్లకు నో మోర్ ఛాన్స్
రద్దయిన నోట్ల డిపాజిట్లకు ఇక ఎలాంటి అవకాశాలు ఇవ్వబోమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. జూన్ 30 వరకు గ్రేస్ పిరియడ్ పెంచమంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నవంబర్ 8న హఠాత్తుగా పెద్దనోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేసిన అనంతరం వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు సాధారణ ప్రజలకు డిసెంబర్ 30 వరకు ప్రభుత్వం గడువిచ్చింది. అలాగే విదేశాల్లో ఉన్న భారతీయులకు, బ్లాక్ మనీ హోల్డర్స్ కు మరో అవకాశంగా మరో మూడు నెలలు అదనంగా మార్చి 31 వరకు టైమిచ్చింది. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. ప్రస్తుతం రద్దయిన నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు ఇక ఎలాంటి సమయం ఇవ్వమని, గ్రేస్ పిరియడ్ పెంచడానికి ఎలాంటి తాజా నోటిఫికేషన్ తీసుకురావడం లేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అదేవిధంగా నోట్ల రద్దయిన కాలంలో జరిపిన దాడుల్లో, రికవరీల్లో మొత్తం లెక్కలో చూపని నగదుగా రూ.5,400 కోట్లను కేంద్ర ఏజెన్సీలు గుర్తించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వివరాలకు సంబంధించిన ఓ అఫిడివిట్ ను ప్రభుత్వం, సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. డిసెంబర్ 30 తర్వాత పాత నోట్ల డిపాజిట్లను ఆర్బీఐ స్వీకరించడం లేదని, ఇది నవంబర్ 8న జారీచేసిన నోటిఫికేషన్ విరుద్ధమని ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు సుప్రీంకోర్టులో తమ పిటిషన్లను దాఖలు చేశాయి. ఎన్ఆర్ఐలకు ఇచ్చిన మాదిరిగా తమకు సమయమివ్వాలని కోరుతూ ఈ పిటిషన్ ను నమోదుచేశారు.. ఆ పిటిషన్లకు స్పందించిన ప్రభుత్వం, సమయం కోరడానికి పిటిషన్ దారులకు ఎలాంటి హక్కులు లేవని ప్రభుత్వం తేల్చిచెప్పింది. -
ప్రభుత్వం గ్రేస్ పీరియడ్‌లో ఉంది
మీట్‌ది ప్రెస్‌లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ‘‘గ్రేస్ పీరియడ్’’లో ఉందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలు ఈ మధ్య కాలాన్ని భరించినా వారిలో ఆందోళన పెరుగుతోందని, వారి సమస్యలను పరిష్కరించకపోతే అది పూర్తిస్థాయి అసంతృప్తిగా మారుతుందని చెప్పారు. ఇతరపార్టీల ఎమ్మెల్యేలను అధికారపార్టీలోకి ఆకర్షించడం వల్ల అసెంబ్లీలో మెజారిటీ లభిస్తుంది తప్ప దానితో ప్రజల హృదయాలను గెలుచుకోలేరని హితవు పలికారు. శనివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘‘మీట్‌ది ప్రెస్’’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలు గతంలో కూడా ఉన్నాయని కొందరు మంత్రులు వాదించడం సరికాదన్నారు. రుణాల మాఫీ విషయంలో రెండు రాష్ట్రాల సీఎంలు బాధ్యతారహితంగా వ్యవహరించారన్నారు. గత ఎన్నికల్లో సీపీఐ తెలంగాణలో ప్రభావం చూపకపోవడంపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సురవరం స్పందిస్తూ, ‘మాపార్టీకి ఓట్లు వేయని ప్రజలే చెప్పాలి’ అనడంతో నవ్వులు విరిశాయి. విలీనం కాదు లెఫ్ట్ పునరైక్యత... దేశంలోని వామపక్షాలు అన్నీ ఒకటిగా ఏర్పడాల్సి ఉందని, 1964లో కమ్యూనిస్టుపార్టీలో చీలిక ఏర్పడినప్పటి వాదనలు ఇప్పుడు అసంబద్ధమని సురవరం అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలని తాము గతంలోనే ప్రతిపాదించినా, చీలిక కారణాలపై చర్చించాలని సీపీఎం నాయకులు ఏడాదిగా అంటున్నారని చెప్పారు. కార్మిక హక్కులకు కేంద్రం తూట్లు పొడుస్తోంది: దాస్‌గుప్తా కార్మిక సంఘాల ఏర్పాటును కఠినతరం చేసేలా కేంద్రం సంస్కరణలు తీసుకురాబోతుందని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి గురుదాస్ గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్మిక చట్టాలకు పార్లమెంట్ సమావేశాలలో సవరణలు తీసుకొచ్చే ప్రయత్నాలలో ఉందన్నారు. వీటికి నిరసనగా డిసెంబర్ 5న దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఏఐటీయూసీ జాతీయసభల్లో పాల్గొన్న ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. -
తెలివిగా వాడితే క్రెడిట్ మీదే..
ఆర్థిక లావాదేవీలన్నీ ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే కానిచ్చేస్తున్నారు. సినిమా టికెట్ దగ్గర నుంచి విమానం టికెట్ల వరకు, టెలీఫోన్ బిల్లు దగ్గర నుంచి బీమా ప్రీమియం వరకు, పెన్‌డ్రైవ్ దగ్గర నుంచి ఖరీదైన ఎల్ఈడీ టీవీ వరకు ఇలా అన్నీ ఆన్లైన్లో కొనేస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహించడానికి బ్యాంకులు, క్రెడిట్ కార్డు సంస్థలు క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు, జీరో వడ్డీరేటుకే ఈఎంఐ వంటి ఆఫర్లను ఇబ్బడిముబ్బడిగా ప్రకటిస్తున్నాయి. అందులో ఇది పండుగల సీజన్ కావడంతో ఈ ఆఫర్లు మరింత జోరందుకున్నాయి. ఈ ఆఫర్ల నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకోకుండా వినియోగించుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. కార్డు తీసుకునేటప్పుడు ఏదైనా క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు వార్షిక ఫీజులు, వడ్డీరేట్లు, గ్రేస్ పిరియడ్, చెల్లింపులు ఆలస్యం అయితే విధించే అపరాధ రుసుము వంటి విషయాలపై పూర్తి స్పష్టత తీసుకోండి. అవసరమైతే ఈ విషయంలో క్రెడిట్ కార్డు సంస్థ నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా వార్షిక ఫీజులు ఎక్కువ ఉన్న కార్డులు దూరంగా ఉండండి. ఇక లావాదేవీల విషయానికి వస్తే సకాలంలో చెల్లించ గలిగితే అన్ని లావాదేవీలకు క్రెడిట్ కార్డును వినియోగించుకోవచ్చు. దీని వల్ల రివార్డు పాయింట్లతో పాటు ఇటు క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు అన్ని కార్డులు యుటిలిటీ బిల్లుల చెల్లింపుపై 5-10 శాతం క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నాయి. ఉదాహరణకు మీరు రూ. 1,000 కరెంట్ బిల్లు క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తే దానిపై 5% క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటే రూ. 50 తిరిగి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఈ విలువకు సమానమైన రివార్డు పాయింట్లు పొందుతారు. చాలా క్రెడిట్ కార్డులు పూర్తిగా వాడిన మొత్తం కాకుండా మినిమమ్ బ్యాలెన్స్ చెల్లించే అవకాశాన్ని కల్పిస్తాయి. తప్పని పరిస్థితుల్లో తప్ప ఈ అవకాశాన్ని వినియోగించుకోవద్దు. దీనివల్ల వచ్చే నెల చెల్లించే మొత్తం పెరగడమే కాకుండా వడ్డీ భారం పెరుగుతుంది. అంతే కాదు క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి వస్తుంది. కొంతమంది కనిపించిన కార్డుకల్లా దరఖాస్తు చేస్తుంటారు. అనేక కార్డులు కలిగి ఉండటం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఇలా ఎక్కువ క్రెడిట్ కార్డులకు దరఖాస్తు చేస్తే క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశం ఉంది. అలాగే ఇన్ని కార్డుల నిర్వహణ అనేది కూడా కష్టమవుతుంది. చివరగా చెప్పేది ఏమిటంటే అప్పు లభిస్తోంది కదా అని వాడకుండా తిరిగి కట్టుకునే సామర్థ్యం ఉన్నప్పుడే క్రెడిట్ కార్డును వినియోగించండి. అప్పుడే పూర్తి ప్రయోజనాలను పొందుతారు. రివార్డు పాయింట్లు అన్ని కార్డులు, లావాదేవీలపై రివార్డు పాయింట్లు ఒకే విధంగా ఉండవు. సాధారణంగా వినియోగించిన ప్రతీ రూ. 100 - 150లకు ఒక రివార్డు పాయింటును ఇస్తుంటాయి. ఇలా కూడబెట్టుకున్న రివార్డు పాయింట్లను ఉపయోగించుకొని కంపెనీ అందించే వివిధ వస్తువులు లేదా సేవలను వినియోగించుకోవచ్చు. ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. 5,000 రివార్డు పాయింట్లు ఉంటే ఆ విలువకు సమానమైన వస్తువు కొనుగోలు చేయలేరు. రివార్డు పాయింట్ల మొత్తంలో 20 నుంచి 30 శాతానికి విలువైన వస్తువులను కొనగలరు. ఇప్పుడు అన్ని క్రెడిట్‌కార్డు సంస్థలు ఆన్లైన్ ద్వారానే ఈ రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కంపెనీ అందిస్తున్న వస్తువులు సేవల్లో రిడీమ్ పాయింట్లకు అనుగుణంగా వినియోగించుకోవచ్చు. రిడీమ్ పాయింట్లకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. సాధారణంగా ఈ ఎక్స్పైరీ డేట్ ఒకటి నుంచి మూడేళ్లుగా ఉంటుంది. అలాగే ఈ పాయింట్లను రీడీమ్ చేసుకున్నప్పుడు చాలా కంపెనీలు సర్వీస్ చార్జీలను కూడా వసూలు చేస్తున్నాయి.