
'నోట్ల రద్దు ప్రభావం భారీగా ఉంటుంది'
హైదరాబాద్: రాష్ట్రంలో సగటున 4 లక్షల కుటుంబాలకు ఒక జిల్లా చొప్పున ఉన్నందున ప్రభుత‍్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరడం ఇక సులువు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజల అసంతృప్తిని గుర్తించి వారికి మేలు చేసే విధంగా కార్యక్రమాలు ఉండాలని బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల సహకారం వల్లే గుడంబా, పేకాట లాంటి అవలక్షణాలను అరికట్టగలిగాం అని సీఎం వెల్లడించారు. అత్యవసర పనుల కోసం ప్రతి జిల్లా కలెక్టర్‌కు రూ. 3 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంపై భారీగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. నగదు రహిత లావాదేవీల దిశగా మనం వెళ్లాల్సిందే అని కలెక్టర్లతో కేసీఆర్ పేర్కొన్నారు. ఇందుకోసం మొబైల్ యాప్‌ల వినియోగం పెంచడంతో పాటు.. ప్రజల్లో క్యాష్ లెస్‌పై అవగాహన పెంచేందుకు విద్యార్ధులు, టీచర్లు, ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని కేసీఆర్ సూచించారు.