సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణ యించింది. ఇందులో భాగంగా తొలిసారిగా ఆదివా రం సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
ధరణి సహా ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆరు హామీల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో ప్రధానంగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్య ల గురించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వ నున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి మంగళ, శుక్రవా రాల్లో నిర్వహిస్తుండగా అదే విధానాన్ని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయనున్నారు.
కలెక్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరణ..
వంద రోజుల్లో ఆరు గ్యారంటీల హామీని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు పాలన ను ప్రజల ముంగిటకు ఎలా తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ వివరించనున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు కల్పిస్తున్న ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాన్ని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచగా వాటికి సంబంధించి కలెక్టర్ల నుంచి ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ తీసుకొనే అవకాశం ఉంది.
28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు..
నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడం, అధికార యంత్రాంగంలో జవా బుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టనుండటంతో ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ప్రభు త్వం ఆహ్వానించింది.
హైదరాబాద్‌లోని ప్రజా భవ న్‌లో వారానికి రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇళ్లు, భూ సమస్యలు, ఉద్యోగాలు, ధరణి, పెన్షన్లకు సంబంధించి ఎక్కు వగా ఫిర్యాదులు వస్తున్నందున వాటిని క్షేత్రస్థాయి లో పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన పేరిట గ్రామ సభలకు మొగ్గు చూపిందని చెబుతున్నారు.
ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు (ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి? ప్రజల నుంచి తీసుకోవాల్సిన దరఖాస్తులు, అర్హుల ఎంపిక.. అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్లకు వివరించనున్నట్లు సమాచారం. కాగా, ప్రజలు తమ సమస్యలను ఆన్‌లైన్ ద్వారా సైతం ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఈ నెల 27న ప్రజావాణి వెబ్‌సైబ్‌ను అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి 4 నెలలకోసారి గ్రామ సభలను నిర్వహించాలన్నారు.
ప్రజాప్రతినిధులంతా పాల్గొనేలా..
గ్రామ సభల్లో భాగంగా అన్ని గ్రామ పంచాయి తీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చోట్ల అధికార బృందాలు పర్యటిస్తాయి. ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ / కార్పొరేటర్ / కౌన్సిలర్లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసు కోనుంది. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖా స్తును పరిశీలించడానికి ప్రత్యేకమైన నంబర్ ఇవ్వడంతోపాటు దరఖాస్తులను కంప్యూటరీ కరించనుంది.
Comments
Please login to add a commentAdd a comment