SPs Meeting
-
9 అంశాల ఎజెండా !
ఇవీ ఎజెండాలోని అంశాలు ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం – కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం– సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య. శాంతిభద్రతలు–రక్షణ సంబంధిత సమస్యలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం.సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలకు ముందే సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 16న మంత్రులతో కలిసి కీలక సమావేశం నిర్వహించనున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్కమిషనర్లు, ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొంటారు. పాలనను పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించే క్రమంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్టు సమాచారం.గత డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకసారి కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశం నిర్వహించినా, ఆ తర్వాత వెంటనే లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడం, కలెక్టర్లు, ఎస్పీలంతా పూర్తిగా ఎన్నికల విధుల్లోనే నిమగ్నం కావడంతో పాలనపై దృష్టి సారించలేకపోయారు. కోడ్ ముగియడం, ఈ మధ్యనే కలెక్టర్లు, కార్యదర్శులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్ల బదిలీలు చేయడం ద్వారా కొత్తగా ఆయా స్థానాల్లోకి వచ్చిన అధికారులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ ప్రా«థమ్యాలపై దిశానిర్దేశం చేయడానికి ఈ సమావేశాన్ని వినియోగించుకోనున్నారు. 16న నిర్వహించే సమావేశ ఏజెండాలోని అంశాలను కూడా వారికి పంపించారు. ప్రధానంగా తొమ్మిది అంశాలను ఎజెండాలో చేర్చారు. ⇒ రాష్ట్రప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చి, అక్కడ ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించడం, వాటిని సంబంధిత విభాగాలకు పంపించి అవి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.గడిచిన ఆరేడు నెలల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఏ విధమైన విజ్ఞాపనలు ఉన్నాయి? వచి్చన విజ్ఞాపనల్లో ఎన్నింటికి పరిష్కరించారు? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? పెండింగ్‌లో ఉండడానికి గల కారణలేంటి? అన్న అంశాలను ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ⇒ ఆర్థికంగా పెద్దగా భారం కాని పనులు కూడా పరిష్కరించకుండా ఉన్న పక్షంలో వాటిపై అధికారులకు నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారి ఒకరు వివరించారు. ⇒ భూముల సమస్యకు సంబంధించి ధరణిని రద్దు చేస్తామని, రైతులకు ప్రయోజనకరంగా ఉండే కొత్త వ్యవస్థ తీసుకొస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచి్చన సంగతి తెలిసిందే. ధరణిపై ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం నియమించిన సంగతి విదితమే. ఆ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశమై పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసినట్టు తెలిసింది. దీనిపై కలెక్టర్ల నుంచి ఫీడ్ తీసుకొని ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ⇒ వ్యవసాయ సీజన్ ప్రారంభమై దాదాపు నెలన్నర రోజులు అవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువులు, వర్షాభావ పరిస్థితులున్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ⇒ వర్షాకాలసీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉన్నందున, ముందస్తుగా చేపట్టాల్సిన జాగ్రత్తలు గురించి ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఆస్పత్రుల్లో సరైన వైద్య సదుపాయం కలి్పంచేందుకు డాక్టర్లు, సిబ్బంది, మందులు తదితర అంశాలను చర్చించనున్నారు. ⇒ వర్షాకాలంలో దాదాపు 20 కోట్ల మొక్కలను ఈసారి నాటాలని నిర్ణయించారు. కార్యక్రమం కొనసాగుతున్న తీరును కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నారు. ⇒ మహిళాశక్తి క్యాంటీన్ల ఏర్పాటు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలని చర్చించనున్నారు.⇒ విద్యాసంవత్సరం ప్రారంభం, పాఠశాలల పరిస్థితి, వసతి గృహాలు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల కొరత తదితర అంశాలను క్షుణ్ణంగా కలెక్టర్లతో సమీక్షిస్తారు. ⇒ ఇక శాంతిభద్రతలు, రక్షణపరమైన అంశాలతోపాటు, రాష్ట్రంలో పెరిగిపోతున్న మాదక ద్రవ్యాలను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలు, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల మాట వినిపించరాదని సీఎం ఇదివరకు ఇచి్చన ఆదేశాలు మరోసారి ఈ సమావేశంలో పునరుద్ఘాటించనున్నారు. -
ఐఏఎస్, ఐపీఎస్‌లకు సీఎం రేవంత్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం ముగిసింది. కాగా, ఈ సమావేశంలో భాగంగా సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే, ప్రతీ ఒక్కరూ పని చేయాల్సిందే. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తప్పుకోవచ్చు.. పని విషయంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదే క్రమంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, సమీక్ష సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ప్రజా ప్రతినిధులు, అధికారులు జోడెద్దులుగా పనిచేయాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులకు సమన్వయం లేకపోతే టార్గెట్ రీచ్ కాలేం. సచివాలయంలో ఏ నిర్ణయం తీసుకున్నా క్షేత్ర స్థాయిలో అమలు చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లదే. ప్రజాపాలన పేరుతో గ్రామసభను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేయాలి. నిస్సహాయులకు సహాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి అంటే అద్ధాల మేడలు, రంగుల గోడలు కాదు. చివరి వరుసలో ఉన్న పేదవాడికి సంక్షేమం అందించే బాధ్యత అధికారులదే. గ్రామసభల్లో ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు అర్థం అయ్యేలాగా వినిపించాలి. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందించడమే మా లక్ష్యం. పోలీసులకు ఫ్రీడమ్.. అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చ ఇస్తున్నాం. భూకబ్జాదారులపై కఠినంగా వ్యవహరించాలి. భూకబ్జా అనే పదం రాష్ట్రంలో వినిపించకూడదు. బుక్ మై షో, సన్‌బర్న్ నిర్వహణపైన పోలీసులు నిఘా పెట్టి అసలు విషయాలు తేల్చాలి. సన్‌బర్న్ ఈవెంట్‌ను మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు నిషేధించాలి. వీటి వెనకాల ఎవరున్నా వదిలిపెట్టకండి. గంజాయిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. గంజాయి విస్తరణ కాలేజీలకు చేరింది.. పోలీసులు వీటిపై నిఘా పెట్టాలి. నకిలీ విత్తనాల సరఫరాపై నిఘా పెట్టాలి. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలి. ప్రతీ ఒక్కరికీ బాధ్యత అవసరం.. జిల్లాలకు మంత్రులు, ప్రతీ సెగ్మెంట్‌కు స్పెషల్ ఆఫీసర్ నియామకం. గ్రామ సభల్లో ప్రభుత్వ సందేశాన్ని ప్రజలకు అర్థం అయ్యే విధంగా వినిపించాలి. అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమం అందించడమే మా లక్ష్యం. మాతో పనిచేయడానికి అధికారులు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సీఎస్, డీజీపీకి చెప్పి తమ బాధ్యతల నుంచి తప్పుకోవచ్చు. బాధ్యత తీసుకున్న ప్రతీ అధికారి వారి బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించాల్సిందే. రోజుకు 18 గంటలు పని చేయండి అని సూచించారు. ఫ్రెండ్లీ ప్రభుత్వమే కానీ.. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి గ్రామ సభలపై సమీక్షలు ఉంటాయి. ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉంది. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎస్ఆర్ శంకర్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్క అధికారి విధులను నిర్వర్తించాలి. మాది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ప్రజల చేత ఫ్రెండ్లీగా ఉన్నంతవరకే ఫ్రెండ్లీ గవర్నమెంట్. అధికారులు సంక్షేమం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అధికారులు ప్రజల మనసును గెలిచి మంచి పేరు తెచ్చుకోవాలి. అధికారులు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా పని చేయగలను అన్న ఆలోచనలో ఉండాలి. అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది అమరులయ్యారు. తెలంగాణ ప్రజల డీఎన్ఏ స్వేచ్ఛను హరిస్తే సహించదు. ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే. ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కలిగేలా మనందరం కలిసి పని చేద్దాం అని సూచించారు. -
నేడు కలెక్టర్లు, ఎస్పీల సదస్సు
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాగానే ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణ యించింది. ఇందులో భాగంగా తొలిసారిగా ఆదివా రం సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ధరణి సహా ప్రభుత్వ ప్రాధాన్యతలు, ఆరు హామీల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో ప్రధానంగా సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్య ల గురించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వ నున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రతి మంగళ, శుక్రవా రాల్లో నిర్వహిస్తుండగా అదే విధానాన్ని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేయనున్నారు. కలెక్టర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరణ.. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల హామీని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు పాలన ను ప్రజల ముంగిటకు ఎలా తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ వివరించనున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు కల్పిస్తున్న ఆరోగ్యశ్రీ వైద్య సదుపాయాన్ని రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచగా వాటికి సంబంధించి కలెక్టర్ల నుంచి ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ తీసుకొనే అవకాశం ఉంది. 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన గ్రామ సభలు.. నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లడంతోపాటు ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచడం, అధికార యంత్రాంగంలో జవా బుదారీతనాన్ని పెంపొందించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టనుండటంతో ఈ సమావేశానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ప్రభు త్వం ఆహ్వానించింది. హైదరాబాద్‌లోని ప్రజా భవ న్లో వారానికి రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఇళ్లు, భూ సమస్యలు, ఉద్యోగాలు, ధరణి, పెన్షన్లకు సంబంధించి ఎక్కు వగా ఫిర్యాదులు వస్తున్నందున వాటిని క్షేత్రస్థాయి లో పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన పేరిట గ్రామ సభలకు మొగ్గు చూపిందని చెబుతున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు (ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు.. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలి? ప్రజల నుంచి తీసుకోవాల్సిన దరఖాస్తులు, అర్హుల ఎంపిక.. అందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కలెక్టర్లకు వివరించనున్నట్లు సమాచారం. కాగా, ప్రజలు తమ సమస్యలను ఆన్లైన్ ద్వారా సైతం ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఈ నెల 27న ప్రజావాణి వెబ్‌సైబ్‌ను అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి 4 నెలలకోసారి గ్రామ సభలను నిర్వహించాలన్నారు. ప్రజాప్రతినిధులంతా పాల్గొనేలా.. గ్రామ సభల్లో భాగంగా అన్ని గ్రామ పంచాయి తీలు, మున్సిపల్ వార్డులలో రోజుకు రెండు చోట్ల అధికార బృందాలు పర్యటిస్తాయి. ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ / కార్పొరేటర్ / కౌన్సిలర్లను ఆహ్వానించడంతోపాటు సంబంధిత ప్రజాప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసు కోనుంది. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖా స్తును పరిశీలించడానికి ప్రత్యేకమైన నంబర్ ఇవ్వడంతోపాటు దరఖాస్తులను కంప్యూటరీ కరించనుంది. -
జూన్ 23 నుంచి జగనన్న సురక్షా కార్యక్రమం
సాక్షి, అమరావతి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వర్చువల్‌గా 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు. జగనన్నకు చెబుదాంతో పాటు గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుల, జగనన్న భూ హక్కు & భూ రక్ష కార్యక్రమాలపైనా ఆయన సమీక్ష చేపట్టారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ అన్నది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాం. ఒకవేళ గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే… సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్‌కు గురైందో వారికి వివరించాలి. పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే.. 24 గంట్లోగా వాటిని పరిష్కరించాలి అని సీఎం జగన్ అధికారులతో అన్నారు. నెలపాటు జగనన్న సురక్షా జూన్ 23వ తేదీ నుంచి జులై 23వ తేదీ వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై జల్లెడపడతారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పతకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందిస్తారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించనవారికి ఆగస్టు 1న మంజూరుచేస్తారు. 👉 ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. ఇందులో 60శాతం పనిదినాలు.. ఈనెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం 75వేల పనిదినాలు కల్పించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విజేజ్‌క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వెంటనే పూర్తిచేయాలి అని సీఎం జగన్ అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. 👉 రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. ఇప్పటివరకూ సుమారు 3.9లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయి. రూఫ్ లెవల్, ఆపై ఉన్నవి సుమారు 5.27లక్షలు ఉన్నాయి. వీటిని త్వరతిగతిన పూర్తిచేసేలా చూడాలి. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.. వాటి వేగాన్ని పెంచేలా చూడగలరు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.147 కోట్లు ఇచ్చాం. 👉 సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి. జులై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్ -3 ఎంపిక చేసుకున్న వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లు కట్టే నిర్మాణం మొదలుకావాలి. 👉 ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడండి. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే.. కలెర్టర్లను, ఎస్పీలను బాధ్యుల్ని చేస్తాను. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి. జులై 1 నుంచి ఇ-క్రాప్ బుకింగ్స్ ప్రారంభించాలి. సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలి. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి… కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోండి: 👉 మొదటి ఫేజ్‌లో 2వేల గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం పూర్తయ్యింది. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి పని కూడా గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలి. రెండో దశ కింద మరో 2వేల గ్రామాల్లో - సెప్టెంబర్ 30కల్లా భూపత్రాలు అందాలి. అక్టోబరు 15 నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభం కావాలి. 👉 జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువుల బాగోలేకున్నా.. వెంటనే సమాచారం తెప్పించుకోండి.\ పాఠశాల ప్రదానోపాధ్యాయులనుంచి ఈ సమాచారాన్ని సేకరించి వెంటనే తగిన చర్యలు తీసుకోండి. నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఆరో తరగతి, ఆపై పబడ్డ క్లాసులకు సంబంధించి తరగతి గదుల్లో జులై 12 కల్లా… ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు కావాలి. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వండి అని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇదీ చదవండి: వాళ్లు వదిలేసినా.. జగనన్న పూర్తి చేస్తున్నాడు! -
కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఘన కీర్తిని చాటి చెప్పేలా రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలు నిర్వహించాలి దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ కోసం కలెక్టర్లకు రూ.105 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. హరితహారం, గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ, గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలకు పరిష్కారం, వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాల పంపిణీ, నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం, వానాకాలం పంటలకు ఇన్పుట్ సబ్సిడీగా రైతుబంధు పంపిణీ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. చదవండి: మరో బాంబు పేల్చిన సుకేశ్ చంద్రశేఖర్.. కవిత, కేజ్రీవాల్‌కు షాక్ -
కలెక్టర్లు ఎస్పీలతో సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్
-
ప్రజాస్వామ్యానికి చంద్రబాబు కొత్తభాష్యం!
అధికార పార్టీ కార్యకర్తలను సంతృప్తి పరచడం కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనట- ఈ విలువైన మాట చెప్పింది ఎవరని ఆశ్చర్యపోతున్నారా. కూర్చీ కూడా లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారని ఆవేదన చెందుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి వెలువడిన ఆణిముత్యమిది. విజయవాడలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెప్పారు బాబుగారు. అంతేకాదు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలుగు తమ్ముళ్లను భాగస్వాములను చేయాలని కూడా సెలవిచ్చారు. కార్యకర్తలందరినీ సంతృప్తిపరిస్తేనే తమకు భవిష్యత్ ఉంటుందని, కాబట్టి వారిని బాగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఉద్బోధించారు. గవర్నెన్స్ చేసినా చేయకపోయినా పొలిటికల్ గవర్నెన్స్ మాత్రం పక్కా జరగాలని సీఎం సెలవివ్వడంతో అవాక్కవడం అధికారుల వంతైయింది. అధికారంలోకి ఉన్న పార్టీకి అధికారులు అండగా నిలబడడం ఆటోమేటిగ్గా జరిగిపోతుటుంది. కానీ సీఎం స్వయంగా సమావేశం పెట్టి సైకిల్ పార్టీ కార్యకర్తలకు అండదండలు అందించాలని కోరడం అధికారగణానికి అమితా ఆశ్చర్యం కలిగించింది. సందు దొరికినప్పుల్లా రూల్స్ వల్లించే ప్రభుత్వాధిపతి రూల్స్ బుక్ పట్టించుకోవద్దడనం వారిని షాక్ కు గురిచేసింది. తాను చెప్పిన డైరెక్షన్ లోనే ముందుకెళ్లాలని కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించిన చంద్రబాబు ఇక్కడ కూడా తనదైన చతురత ప్రదర్శించారు. అభివృద్ధి పనులను పచ్చ బాబులకు కట్టబెట్టాలంటూనే, కలెక్టర్లు తప్పు చేస్తే కాపాడలేను అని ఝలక్ ఇచ్చారు. అంతేకాదు కొత్తగా ఏర్పడిన రాష్టానికి ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించే గురుతర బాధ్యతను కూడా కలెకర్ల మీద పెట్టారు. కలెక్టర్ బాగా పనిచేస్తే మేం మరో ఐదారు సీట్లు గెలుస్తాం. మళ్లీ అధికారంలోకొస్తాం అంటూ విషయం చెప్పారు. సీఎంతో సమావేశం అనగానే ఫైళ్లు సద్దుకుని పరిగెత్తుకుని వచ్చిన అధికారులకు పొలిటికల్ గవర్నెన్స్ పై బాబుగారు క్లాస్ తీసుకోవడంతో దిమ్మ తిరిగింది. 90 నిమిషాల ప్రసంగంలో రాజకీయాల గురించే ఎక్కువగా మాట్లాడరంటే అర్థం చేసుకోవచ్చు అధికారుల అవస్థ. నిబంధనల విషయంలో చాలా కఠినంగా ఉంటానని నిత్యం వల్లించే చంద్రబాబు అవసరమైతే రూల్స్ బ్రేక్ చేయమని చెప్పడం తనకు షాక్ కలిగించిందని బాబు భేటీకి హాజరైన ఓ కలెక్టర్ వాపోయారు. రాజధాని లేని రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు మున్ముందు మరెన్ని సిత్రాలు చేస్తారో మరి.