CM YS Jagan Review Meeting with District Collectors and SPs - Sakshi
Sakshi News home page

జూన్‌ 23 నుంచి నెలపాటు జగనన్న సురక్షా కార్యక్రమం

Published Wed, Jun 14 2023 1:32 PM | Last Updated on Wed, Jun 14 2023 4:52 PM

Cm Jagan Review Meeting With District Collectors And Sps - Sakshi

సాక్షి, అమరావతి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వర్చువల్‌గా 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు. జగనన్నకు చెబుదాంతో పాటు గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్‌, వ్యవసాయం- సాగునీరు విడుల, జగనన్న భూ హక్కు & భూ రక్ష కార్యక్రమాలపైనా ఆయన సమీక్ష చేపట్టారు. 


సీఎం జగన్‌ ఏమన్నారంటే..
జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ అన్నది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాం. ఒకవేళ గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే… సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్‌కు గురైందో వారికి వివరించాలి. పరిశీలించని గ్రీవెన్సెస్‌ ఏమైనా ఉంటే.. 24 గంట్లోగా వాటిని పరిష్కరించాలి అని సీఎం జగన్‌ అధికారులతో అన్నారు.

నెలపాటు జగనన్న సురక్షా

  • జూన్‌ 23వ తేదీ నుంచి జులై 23వ తేదీ వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. 
  • జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. 
  • ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై జల్లెడపడతారు. 
  • డాక్యుమెంటేషన్‌, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పతకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు.
  • సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందిస్తారు.
  • జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించనవారికి ఆగస్టు 1న మంజూరుచేస్తారు.

👉 ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. ఇందులో 60శాతం పనిదినాలు.. ఈనెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం 75వేల పనిదినాలు కల్పించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విజేజ్‌క్లినిక్స్‌, డిజిటల్‌ గ్రంథాలయాలను వెంటనే పూర్తిచేయాలి అని సీఎం జగన్‌ అధికార యంత్రాగాన్ని ఆదేశించారు.

👉 రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. ఇప్పటివరకూ సుమారు 3.9లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయి. రూఫ్‌ లెవల్‌, ఆపై ఉన్నవి సుమారు 5.27లక్షలు ఉన్నాయి. వీటిని త్వరతిగతిన పూర్తిచేసేలా చూడాలి. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.. వాటి వేగాన్ని పెంచేలా చూడగలరు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.147 కోట్లు ఇచ్చాం.

👉 సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి. జులై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్‌ -3 ఎంపిక చేసుకున్న వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లు కట్టే నిర్మాణం మొదలుకావాలి.

👉 ఖరీఫ్‌ పనులు ప్రారంభం అయ్యాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడండి. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే.. కలెర్టర్లను, ఎస్పీలను బాధ్యుల్ని చేస్తాను. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి. జులై 1 నుంచి ఇ-క్రాప్‌ బుకింగ్స్‌ ప్రారంభించాలి. సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలి. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి… కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోండి:

👉 మొదటి ఫేజ్‌లో 2వేల గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం పూర్తయ్యింది. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్‌ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్‌, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి పని కూడా గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలి. రెండో దశ కింద మరో 2వేల గ్రామాల్లో - సెప్టెంబర్‌ 30కల్లా భూపత్రాలు అందాలి. అక్టోబరు 15 నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాలు ప్రారంభం కావాలి. 

👉 జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువుల బాగోలేకున్నా.. వెంటనే సమాచారం తెప్పించుకోండి.\ పాఠశాల ప్రదానోపాధ్యాయులనుంచి ఈ సమాచారాన్ని సేకరించి వెంటనే తగిన చర్యలు తీసుకోండి. నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఆరో తరగతి, ఆపై పబడ్డ క్లాసులకు సంబంధించి తరగతి గదుల్లో జులై 12 కల్లా… ఐఎఫ్‌పీ ప్యానెల్స్‌ ఏర్పాటు కావాలి. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వండి అని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

ఇదీ చదవండి: వాళ్లు వదిలేసినా.. జగనన్న పూర్తి చేస్తున్నాడు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement