Jaganannaku Chebudam
-
సమస్యలకు చకచకా పరిష్కారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం విజయవంతగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజలు చెప్పుకొన్న సమస్యలు చకచకా పరిష్కారమవుతున్నాయి. టోల్‌ఫ్రీ నంబర్‌కు ప్రజలు సమస్యలు చెప్పగానే, వాటిని సంబంధిత శాఖలు వెనువెంటనే పరిష్కరిస్తున్నాయి. ఈ ఏడాది మే 9వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఈ నెల 12వ తేదీ వరకు తెలిపిన సమస్యల్లో ఇప్పటివరకు 86 శాతం పరిష్కారమయ్యాయి. మిగతావి పరిష్కారదశలో ఉన్నాయి. 85 శాతానికి పైగా ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు వెల్లడైంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజలు సమస్యలను తెలపడానికి ప్రభుత్వం 1902 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఈ నంబరుకు వచ్చిన సమస్యలను నిర్ధారించిన గడువులోగా పరిష్కరించి, దాని స్థితిగతులను ఫిర్యాదుదారుకు తెలియజేస్తారు. ఇలా జవాబుదారీతనంతో కూడిన ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక సమస్యలు పరిష్కారమవుతున్నాయి. ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారాన్ని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు. పరిష్కరించిన సమస్యల పట్ల ప్రజలు అభిప్రాయాన్ని కూడా తిరిగి ఆడిట్ ద్వారా తెలుసుకుంటున్నారు. 1902 నంబరుకు ఈ నెల 12వ తేదీ వరకు 2,57,311 సమస్యలు వచ్చాయి. అందులో 2,20,785 సమస్యలను పరిష్కరించారు. అంటే 86 శాతం పరిష్కారమయ్యాయి. మరో 14 శాతం అంటే 36,526 సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి ఇటీవల జిల్లా కలెక్టర్లతో ఈ కార్యక్రమంపై సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించి, ప్రజల సంతృప్తి శాతాన్ని ఇంకా మెరుగుపరచాలని సూచించారు. సమస్యల పరిష్కారంంలో ఇంధన శాఖ, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్య, వ్యవసాయ శాఖల పట్ల ప్రజల్లో అత్యధికంగా సంతృప్తి వ్యక్తమైంది. అలాగే అన్నమయ్య , చిత్తూరు, తిరుపతి, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు. శ్రీకాకుళం జిల్లాల్లో జగనన్నకు చెబుదాంలో సమస్యల పరిష్కారం పట్ల అత్యధిక శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. -
మండల స్థాయిలోనూ ‘జగనన్నకు చెబుదాం’తో భరోసా
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండలాల స్థాయిలోనూ చేపట్టిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. కలెక్టర్లు, జిల్లాల అధికారులు స్వయంగా హాజరై వినతులు స్వీకరించి.. వాటిని పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోంది. అలాగే ప్రతి సోమవారం కలెక్టర్లు, అధికారులు కూడా జిల్లా స్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాగా, ప్రజా సమస్యలను మరింత సంతృప్త స్థాయిలో పరిష్కరించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1906 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సమస్యలు తెలియజేస్తే.. వాటిని త్వరగా పరిష్కరించేందుకు నాలుగు స్థాయిల్లో ఆడిట్ మెకానిజాన్ని ఏర్పాటు చేసింది. సీఎంవో అధికారులు, శాఖాధిపతులు, కలెక్టరేట్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెల నుంచి మండల స్థాయిలోనూ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి వారం బుధ, శుక్రవారాల్లో ఈ కార్యక్రమాన్ని కలెక్టర్లు నిర్వహిస్తున్నారు. ఏ రోజు.. ఏ మండల కేంద్రానికి కలెక్టర్లు, అధికారులు వస్తారో ముందే తెలియజేస్తున్నారు. దీంతో ప్రజలు ఆయా మండల కేంద్రాలకు వెళ్లి కలెక్టర్లను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఇలా వచ్చిన వినతులను అధికారులు అదే రోజు ‘జగనన్నకు చెబుదాం’ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రజల నుంచి 13,365 సమస్యలపై వినతులు వచ్చాయి. ఇందులో 4,517 పరిష్కారమవ్వగా.. 8,777 సమస్యలు పరిష్కార దశలో ఉన్నాయి. రీ ఓపెన్‌లో 71 సమస్యలున్నాయి. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో సీఎస్ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి.. పురోగతిని తెలుసుకున్నారు. అలాగే అధికారులకు పలు సూచనలు చేశారు. -
సమస్య ఏదైనా.. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ద్వారా సత్వర పరిష్కారం
-
'జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ద్వారా ఒక్క కాల్‌తో ఇంటి నుండే సమస్య పరిష్కారం
-
23 నుంచి ‘జగనన్న సురక్ష’
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను సంతృప్త స్థాయిలో పరిష్కరించడం, అర్హులెవరూ మిగిలిపోకుండా పథకాలను అందించడమే లక్ష్యంగా ఈనెల 23వతేదీ నుంచి జూలై 23 వరకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా, పటిష్టంగా అమలు చేసేందుకు దీన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం తొలిదశలో గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్ష గురించి వివరిస్తారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అక్కడ ఇంకా ఎవరికైనా అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదా? ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? వివిధ రకాల సర్టిఫికెట్లను పొందడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. ఆ వివరాలను నమోదు చేసుకుంటారు. ఆ తరువాత వెంటనే రెండో దశ కింద నిర్దేశిత తేదీల్లో మండల స్థాయి అధికారులు ఆయా గ్రామాల్లో సచివాలయాలను సందర్శిస్తారు. అర్హులుగా గుర్తించిన వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అదే రోజు అందచేస్తారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకుంటారు. జగనన్న సురక్షా ద్వారా అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన లబ్ధి చేకూర్చనున్నారు. ఈమేరకు స్పందనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, జగనన్న సురక్షా కార్యక్రమం, గడప గడపకూ మన ప్రభుత్వంపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఇంటింటికీ వెళ్లి జల్లెడ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోని సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వలంటీర్లు, గృహసారథులు ప్రతి ఇంటికీ వెళ్లి జగనన్న సురక్షా కార్యక్రమం గురించి వివరిస్తారు. ఆ ఇంటికి సంబంధించి ఇన్కమ్, మ్యారేజీ, డెత్ సర్టిఫికెట్ల నుంచి ప్రభుత్వ పథకాలను పొందడం దాకా ఏమైనా సమస్యలున్నాయా? అనే అంశంపై జల్లెడ పడతారు. ఒక్కరు కూడా మిస్ కాకుండా అన్ని వినతులు పరిష్కారం కావాలి. సమస్యలేమీ లేకుంటే కుశల ప్రశ్నలు వేసి వారి ఆశీస్సులు తీసుకుని మరో ఇంటికి వెళతారు. ఇంటింటికి వెళ్లిన సమయంలో ఎవరైనా సర్టిఫికెట్ల సమస్య లేదా ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నా, అర్హత ఉన్నా పథకాలు అందడం లేదని గుర్తించినా వివరాలు నమోదు చేసుకుంటారు. అనంతరం నిర్దేశిత తేదీల్లో గ్రామ సచివాలయాలకు వచ్చే మండల స్థాయి బృందాలు, వార్డు సచివాలయాలకు వచ్చే మున్సిపల్ స్థాయి బృందాలు అక్కడికక్కడే సర్టిఫికెట్లను ఇచ్చేస్తాయి. గ్రామాలకు రెండు బృందాలు మండల స్ధాయిలో ఎంపీడీవో, డిప్యూటీ తహశీల్దార్ ఒక బృందంగా, తహశీల్దార్, పంచాయతీరాజ్ ఈవో కలసి రెండో టీమ్‌గా ఏర్పాటవుతారు. ఈ రెండు బృందాలు గ్రామాలకు వెళ్తాయి. సచివాలయానికి వచ్చే తేదీ వివరాలను ముందే నిర్ణయించి అప్పటిలోగా గ్రామంలో ఉన్న క్షేత్రస్ధాయి సిబ్బంది ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు. నెల రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటినీ జల్లెడ పడతారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలు తదితరాలకు సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలున్న వారిని సచివాలయాల వద్దకు ఆహ్వానించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ అందిస్తారు. దీనివల్ల సమస్యలు మళ్లీ ఉత్పన్నం కాకుండా పరిష్కారమయ్యే అవకాశం కలుగుతుంది. వార్డులకు మున్సిపల్ బృందాలు అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది ఒక టీమ్‌గా ఉంటారు. జోనల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్, సిబ్బంది మరో బృందంగా ఏర్పడి వార్డుల్లో పర్యటిస్తారు. ఈ మొత్తం కార్యక్రమం జూన్ 23 నుంచి జూలై 23 వరకు నెలరోజుల పాటు జరుగుతుంది. సేవల్లో ఉన్నత ప్రమాణాలు.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ద్వారా అందే వినతుల పరిష్కారంలో క్వాలిటీ చాలా ముఖ్యం. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాల కార్యదర్శులంతా దీనిపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే ప్రభుత్వానికి ఎంత ప్రాధాన్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో పరిష్కారం కాని వినతులను కూడా సమర్ధంగా, నాణ్యతతో పరిష్కరించాలి. సగటు మనిషి ముఖంలో చిరునవ్వులు చూడాలి. నిర్దేశించుకున్న సమయంలోగా నాణ్యతతో వినతులను పరిష్కరించడం ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతున్నాం. 99.35 శాతం వినతులు పరిష్కారం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులు గడిచింది. ఇందుకోసం 1902 టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాం. 30 ప్రభుత్వ శాఖలు, 102 మంది హెచ్‌వోడీలతో పాటు రెండు లక్షల మందితో కూడిన ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు వినతుల పరిష్కారంపై దృష్టిపెట్టింది. సీఎంవో, సచివాలయం, విభాగాధిపతుల దగ్గర నుంచి జిల్లాలు, మండల స్థాయిల్లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. ఇప్పటివరకూ 59,986 వినతులు అందగా నిర్దేశిత సమయంలోగా 39,585 విజ్ఞాపనలు పరిష్కరించాం. మరో 20,045 పరిష్కారం దిశగా పురోగతిలో ఉన్నాయి. 99.35 శాతం వినతులు పరిష్కారమయ్యాయి. వినతులు పరిష్కరించే తీరు బాగున్నా సంతృప్తి స్థాయి పెరగాల్సి ఉంది. తిరస్కరిస్తే ఇంటికెళ్లి వివరించాలి ఒకవేళ గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారుడి ఇంటికి వెళ్లి ఎందుకు తిరస్కరణకు గురైందో వారికి వివరించాలి. సచివాలయ సిబ్బంది, వలంటీర్ వెళ్లి సంబంధిత వ్యక్తికి వివరించాలి. ఈమేరకు ఎస్‌వోపీలో మార్పులు తేవాలి. రిజెక్ట్ చేసిన గ్రీవెన్స్‌ను కలెక్టర్లు పరిశీలించాలి. ఇంకా పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే 24 గంటల్లోగా పరిష్కరించాలి. సంబంధిత విభాగానికి 24 గంటల్లోగా పంపాలి. ఈ మేరకు ప్రతి ఉద్యోగికి దీనికి సంబంధించి అవగాహన కల్పించాలి. గడప గడపకూ పనులకు నిధుల కొరత లేదు గడప గడపకూ మన ప్రభుత్వంలో ప్రాధాన్యతగా గుర్తించిన పనుల విషయంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆయా గ్రామాల్లో ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం రూ.20 లక్షలు ప్రతి సచివాలయానికి ఇస్తున్నాం. ఇది చాలా ప్రాధాన్యాంశం. గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గుర్తించిన పనులకు ఈ డబ్బులు మంజూరు చేయాలి. వెంటనే ఆ పనులు ప్రారంభమయ్యేలా చూడటం, నిధుల మంజూరు సక్రమంగా జరగాలి. నిధులకు ఎలాంటి కొరత లేదు. మంజూరు చేసిన పనులను వెంటనే మొదలు పెట్టేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే. కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకుని పనులను ముందుకు తీసుకెళ్లాలి. ఆగస్టు 1న అర్హులకు పథకాలు జగనన్న సురక్ష ద్వారా వివిధ పథకాలకు అర్హులుగా గుర్తించిన వారికి ఆగస్టు 1వతేదీన మంజూరు చేసి లబ్ధి చేకూరుస్తారు. అర్హత ఉన్నవారు ఎవరూ మిస్ కాకూడదన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశాల్లో ఒకటి. 26 జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా నియమించిన అధికారులంతా ఆయా ప్రాంతాల్లో నెలకు రెండు దఫాలు పర్యటించి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కలెక్టర్ల పర్యటన కూడా చాలా ముఖ్యమైన అంశం. ప్రతి జిల్లా కలెక్టర్ వారానికి రెండు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలి. నాలుగు సచివాలయాల్లో జాయింట్ కలెక్టర్ పర్యటించాలి. కార్యదర్శులు, హెచ్ఓడీలు నెలకు కనీసం రెండు సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. ఐటీడీవో పీవో, సబ్ కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు వారానికి నాలుగు సచివాలయాలను సందర్శించాలి. -
జూన్ 23 నుంచి జగనన్న సురక్షా కార్యక్రమం
సాక్షి, అమరావతి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై వర్చువల్‌గా 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష జరిపారు. జగనన్నకు చెబుదాంతో పాటు గడపగడపకూ మన ప్రభుత్వం, ఉపాధిహామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం- సాగునీరు విడుల, జగనన్న భూ హక్కు & భూ రక్ష కార్యక్రమాలపైనా ఆయన సమీక్ష చేపట్టారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చే వినతుల పరిష్కారంలో క్వాలిటీ అన్నది చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతున్నాం. ఒకవేళ గ్రీవెన్స్‌ను రిజెక్ట్ చేస్తే… సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్‌కు గురైందో వారికి వివరించాలి. పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే.. 24 గంట్లోగా వాటిని పరిష్కరించాలి అని సీఎం జగన్ అధికారులతో అన్నారు. నెలపాటు జగనన్న సురక్షా జూన్ 23వ తేదీ నుంచి జులై 23వ తేదీ వరకూ జగనన్న సురక్షా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి అనుబంధంగా ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఏదైనా పత్రాలకు సంబంధించి, సర్టిఫికెట్లకు సంబంధించి, అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా? లేవా? అన్నదానిపై జల్లెడపడతారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పతకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. సమస్యలు ఉన్నవారిని సచివాలయాల వద్దకు తీసుకువచ్చి.. వారి కావాల్సిన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు అన్నీ కూడా అందిస్తారు. జగనన్న సురక్షలో వివిధ పథకాల కింద అర్హులుగా గుర్తించనవారికి ఆగస్టు 1న మంజూరుచేస్తారు. 👉 ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలి. ఇందులో 60శాతం పనిదినాలు.. ఈనెలాఖరులోగా పూర్తికావాలి. ప్రతిరోజూ ప్రతి జిల్లాలో కనీసం 75వేల పనిదినాలు కల్పించాలి. సచివాలయాలు, ఆర్బీకేలు, విజేజ్‌క్లినిక్స్, డిజిటల్ గ్రంథాలయాలను వెంటనే పూర్తిచేయాలి అని సీఎం జగన్ అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. 👉 రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఇళ్లు కడుతున్నాం. ఇప్పటివరకూ సుమారు 3.9లక్షల వరకూ ఇళ్లు పూర్తయ్యాయి. రూఫ్ లెవల్, ఆపై ఉన్నవి సుమారు 5.27లక్షలు ఉన్నాయి. వీటిని త్వరతిగతిన పూర్తిచేసేలా చూడాలి. మిగతా ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి.. వాటి వేగాన్ని పెంచేలా చూడగలరు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత సుమారు రూ.147 కోట్లు ఇచ్చాం. 👉 సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లనిర్మాణానికి అన్ని ఏర్పాట్లూ చేయాలి. జులై 8 నుంచి పనులు ప్రారంభించాలి. ఆప్షన్ -3 ఎంపిక చేసుకున్న వారికి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్లు కట్టే నిర్మాణం మొదలుకావాలి. 👉 ఖరీఫ్ పనులు ప్రారంభం అయ్యాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొరత రాకుండా చూడండి. ఎక్కడైనా కల్తీలు కనిపిస్తే.. కలెర్టర్లను, ఎస్పీలను బాధ్యుల్ని చేస్తాను. అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి. జులై 1 నుంచి ఇ-క్రాప్ బుకింగ్స్ ప్రారంభించాలి. సెప్టెంబరు మొదటి వారానికి పూర్తిచేయాలి. సెప్టెంబరు నెలాఖరులోగా తుది జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సీసీఆర్సీ కార్డులపై అవగాహన కల్పించి… కౌలు రైతులకు మేలు చేసేలా చర్యలు తీసుకోండి: 👉 మొదటి ఫేజ్‌లో 2వేల గ్రామాల్లో జగనన్న భూ హక్కు, భూ రక్ష కార్యక్రమం పూర్తయ్యింది. సచివాలయాల స్థాయిలోనే రిజిస్ట్రేషన్ సహా అన్నిరకాల సేవలు వీరికి అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. ఈ గ్రామాల నుంచి రైతులు ఎవ్వరూకూడా తహశీల్దార్, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాకూడదు. ప్రతి పని కూడా గ్రామ సచివాలయాల స్థాయిలోనే జరగాలి. రెండో దశ కింద మరో 2వేల గ్రామాల్లో - సెప్టెంబర్ 30కల్లా భూపత్రాలు అందాలి. అక్టోబరు 15 నుంచి ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభం కావాలి. 👉 జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీపై కలెక్టర్లు సమీక్ష చేయాలి. ఎక్కడైనా సరిపడా లేకున్నా, ఇచ్చిన వస్తువుల బాగోలేకున్నా.. వెంటనే సమాచారం తెప్పించుకోండి.\ పాఠశాల ప్రదానోపాధ్యాయులనుంచి ఈ సమాచారాన్ని సేకరించి వెంటనే తగిన చర్యలు తీసుకోండి. నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఆరో తరగతి, ఆపై పబడ్డ క్లాసులకు సంబంధించి తరగతి గదుల్లో జులై 12 కల్లా… ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ఏర్పాటు కావాలి. వాటిని చక్కగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వండి అని సీఎం జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఇదీ చదవండి: వాళ్లు వదిలేసినా.. జగనన్న పూర్తి చేస్తున్నాడు! -
ప్రజా సమస్యల పరిష్కారానికి జగనన్నకు చెబుదాం 1902 హెల్ప్ డెస్క్
-
‘జగనన్నకు చెబుదాం’పై టీడీపీ నీచ రాజకీయం.. వర్ల రామయ్య పైత్యం
సాక్షి, అమరావతి: ప్రజల సమస్యల్ని పరిష్కరించడం కోసం ప్రభుత్వం ప్రారంభించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై టీడీపీ నీచ రాజకీయాలకు తెరతీసింది. మీడియా సాక్షిగా జగనన్నకు చెబుదాం గ్రీవెన్స్ సెల్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య, కార్యకర్తలు మూకుమ్మడిగా ఫోన్లు చేశారు. వెటకారంగా మాట్లాడుతూ ఉద్యోగులను వేధింపులకు గురిచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నుంచే వర్ల రామయ్య.. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తనతోపాటు మరో 20 మంది పార్టీ నేతలు, కార్యకర్తలను మీడియా సమావేశంలో కూర్చోబెట్టి వారితో 1902 హెల్ప్‌లైన్‌కి ఒకేసారి ఫోన్లు చేయించారు. తాను కూడా తన ఫోన్ నంబరు, ల్యాండ్‌లైన్ నంబర్ల నుంచి ఫోన్ చేశారు. హెల్ప్‌లైన్‌లో మాట్లాడుతున్న ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడుతూ, వెటకారం చేస్తూ వర్ల రెచ్చిపోయారు. ‘నీ పేరేంటి.. నీ ఫోన్ నంబర్ చెప్పు.. నీ దుంప తెగ.. నువ్వు చాలా తెలివైనవాడివయ్యా.. నా సమస్యను జగనన్నకు చెప్పే అవకాశం లేదా? అన్ని సమస్యల్ని వెంటనే పరిష్కరించేస్తామన్నారుగా..’ అంటూ ఉద్యోగిని వేధించారు. ‘సీఎం జగన్ అవినీతి చేస్తున్నారు.. ఫిర్యాదు రాసుకో అంటూ’ ఉద్యోగిని చాలాసేపు ఇబ్బంది పెట్టారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమమైన ‘జగనన్నకు చెబుదాం’ను అడ్డుకోవడం, దానిపై బురద జల్లడమే లక్ష్యంగా వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ తన నీచ రాజకీయాల కోసం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం అన్యాయమని మండిపడుతున్నారు. ప్రజల నిజమైన ఫిర్యాదుల పరిష్కారానికి అవకాశం ఇవ్వకుండా రాజకీయ డ్రామాలాడడం టీడీపీ నైజానికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు, టీడీపీ నేతలు ఎంతకైనా దిగజారతారనే దానికి ఇది నిదర్శనమని అంటున్నారు. ప్రభుత్వంతో తమ సమస్యలు చెప్పుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ నేతలు అడ్డుకోవడంపై సొంత పార్టీ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులను వేధించడానికి, వారి విధులకు ఆటంకం కలిగించడానికి చేసిన ప్రయత్నంగానూ ఇది కనిపిస్తోందని ధ్వజమెత్తుతున్నారు. -
సమస్యలు తీర్చే 'సేవకులం'
అర్హత ఉండి కూడా ఏ కారణం చేతైనా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందకపోయినా, న్యాయం మీ వైపున ఉన్నా న్యాయం జరగని పక్షంలో, ఇప్పటికే ప్రయత్నించినా సత్ఫలితాన్ని ఇవ్వని పరిస్థితుల్లో ఇక నేరుగా మీ జగనన్నకు చెబుదాం టోల్ ఫ్రీ నంబరు 1902కి ఫోన్ కొట్టండి. నేరుగా నా కార్యాలయానికే (సీఎంవో) ఫోన్ వస్తుంది. సమస్యలకు ఈ స్థాయిలో పరిష్కారం చూపే దిశగా గొప్ప ఆలోచనతో అడుగులు వేస్తున్నాం. మీ సమస్యను నా సమస్యగానే భావించి ట్రాక్ చేస్తాం. నేరుగా సీఎంవో దీన్ని ట్రాక్ చేస్తుంది. ఫిర్యాదు పరిష్కారంపై ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు మెసేజ్‌లు, సందేశాలు వస్తాయి. మీ సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో మీరు నేరుగా వెబ్సైట్లో కూడా చూడవచ్చు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్థాయిలో ఎదురయ్యే సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారాలను చూపాలనే తపనతో ‘జగనన్నకు చెబుదాం’ అనే కార్యక్రమాన్ని తెచ్చినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రిగా తానున్నది అధికారాన్ని చలాయించడానికి కాదని, తన దగ్గర నుంచి సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల వరకు అంతా ప్రజా సేవకులమేనని స్పష్టం చేశారు. జగనన్నకు చెబుదాం 1902 టోల్‌ఫ్రీ నంబర్, వెబ్‌సైట్‌ను సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, జిల్లా కేంద్రాల నుంచి అధికారులు వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతా కలసికట్టుగా ఒక్కటై ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చూడాలనే తపనతో పనిచేద్దామని ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి సీఎం పిలుపునిచ్చారు. సీఎం జగన్ ప్రసంగం వివరాలివీ.. ధర్మబద్ధంగా పరిపాలిస్తే.. జగనన్నకు చెబుదాం కార్యక్రమం మిగతా వాటి కంటే భిన్నం. 3,648 కి.మీ సాగిన నా సుదీర్ఘ పాదయాత్రలో కనిపించిన సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే దిశగా అడుగులు వేస్తూ నాలుగేళ్లుగా పాలన ముందుకు సాగుతోంది. చాలావరకు ఉత్పన్నమయ్యే సమస్యలన్నీ మానవ తప్పిదాలే అని పాదయాత్రలో అర్థమైంది. ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందిస్తే, న్యాయంగా, ధర్మబద్ధంగా ఉంటే ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం ఉంటుంది. 90 – 95 శాతం సమస్యలకు పరిష్కారాలను చూపవచ్చని పాదయాత్రలో గుర్తించా. నాడు.. అడుగడుగునా లంచాలే నా పాదయాత్రలో గ్రామాల్లోకి వెళ్లినప్పుడు పింఛన్లు రాలేదంటూ చాలా మంది వృద్ధులు వచ్చేవారు. పెన్షన్లు రాలేదని గోడు వెళ్లబోసుకుంటుంటే చాలా బాధ అనిపించేది. ఆ ప్రభుత్వం తీరు పట్ల ఆశ్చర్యం కలిగేది. పెన్షన్లు పొందేందుకు అన్ని అర్హతలున్నా మలి వయసులో అవస్థలు పడుతున్న దుస్థితి. జన్మభూమి కమిటీలు కనికరిస్తేగానీ పింఛన్లు రాని దయనీయ పరిస్థితి. మొదట మీరు ఏ పార్టీకి సంబంధించిన వారని జన్మభూమి కమిటీ నాయకులు ప్రశ్నిస్తారు. ఆ తరువాత ప్రతి పనికీ నాకెంత ఇస్తావు? అని లంచాలు అడిగే గుణం వారిది. పెన్షన్ల దగ్గర నుంచి ఇళ్ల కేటాయింపుల వరకూ ఇదే పరిస్థితి ఉండేది. ప్రభుత్వ పథకం ఏది తీసుకున్నా ప్రతి అడుగులోనూ వివక్ష, లంచాలే కనిపించేవి. ఊర్లో కొంత మందికి మాత్రమే ఇస్తామని చెప్పేవారు. ఎవరైనా చనిపోతే గానీ కొత్తవారికి అందని దయనీయ పరిస్థితులను నా పాదయాత్రలో చూశా. నాలుగేళ్లుగా సంతృప్త స్థాయిలో ఏ వ్యవస్ధలోనైనా అర్హులందరికీ ప్రయోజనం చేకూర్చడం, ఏ పార్టీ అనే వివక్ష లేకుండా ఇవ్వడం, లంచాలకు తావు లేకుండా సంతృప్త స్థాయిలో అందించడం గొప్ప మార్పులు తెచ్చేందుకు దోహదం చేస్తాయి. సంతృప్త స్థాయిలో గ్రామ స్థాయిలో అర్హులందరికీ మేలు చేస్తే దాదాపు 90 – 95 శాతం సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని భావించి సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చాం. లంచాలు, వివక్షకు తావు లేని ఒక గొప్ప వ్యవస్ధని గ్రామ స్థాయిలో తీసుకొచ్చాం. ప్రతి రెండు వేల జనాభాకు ఒక సచివాలయం, ప్రతి యాభై ఇళ్లకు ఒక వలంటీర్‌ను కేటాయించి ఎవరికి ఏ సమస్య వచ్చినా చేయి పట్టుకుని నడిపించే పరిస్థితి ఇవాళ ఉంది. లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. ప్రజలకు మరింత చేరువగా పాలన ఈ వ్యవస్థలే కాకుండా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ విధానం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం, అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాలలు.. ఇలా ఏది తీసుకున్నా గ్రామ స్థాయిలో మార్పులు స్పష్టంగా తెలుస్తున్నాయి. పాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తూ వారికి మరింత చేరువయ్యేలా ఈ నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. ఆ బాధ తెలిసిన ప్రభుత్వమిది లంచాలు, వివక్షకు చోటులేని వ్యవస్థ కోసం దేశంలో ఎక్కడా చూడని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. అందులో భాగంగా ఇప్పటికే ‘స్పందన’ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. సమస్యల పరిష్కారంలో గ్రామ సచివాలయాల నుంచి కలెక్టర్ల వరకూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యారు. దీనికోసం ఒక యంత్రాంగాన్ని తెచ్చాం. ప్రజలకు ప్రభుత్వం నుంచి ఒక హక్కుగా అందాల్సిన ఏ సేవ అయినా ఎక్కడైనా అందకుంటే బాధ్యతగా అందించేలా, జాప్యం జరగకుండా నివారించగలిగాం. న్యాయం, ధర్మం మన పక్షాన ఉన్నా కూడా తమకు రావాల్సింది రాకపోతే ఎలాంటి బాధ అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా అడుగులు ముందుకు వేశాం. సమస్యలకు పరిష్కారాలను చూపేలా స్పందన ద్వారా అడుగులు వేశాం. స్పందన మరింత మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. నేరుగా మీ ముఖ్యమంత్రికే చెబుదాం అనే ఆలోచనతో దీన్ని చేపట్టాం. గట్టి ప్రయత్నం చేసినా ఫలించకుంటే.. మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకు, కలెక్టర్ల దగ్గర నుంచి మున్సిపల్ కమిషనర్ల దాకా, అక్కడ నుంచి గ్రామ సచివాలయాల వరకు అన్ని స్థాయిల్లో అందరినీ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నాం. అర్జీదారుడికి సంతోషాన్ని కలిగించేలా, చిరునవ్వు కనిపించాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాం. నాణ్యతగా సమస్యల పరిష్కారానికి వేదిక ఇది. ఏదైనా సమస్య ఉన్నప్పుడు సచివాలయం సహా అందుబాటులో ఉన్న వ్యవస్థల ద్వారా గట్టి ప్రయత్నం చేయండి. ఆ తరువాత కూడా అర్హత ఉన్నా న్యాయం జరగని పరిస్థితి ఉంటే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ఉపయోగపడుతుంది. నేరుగా జగనన్నకే చెబుదాం అన్నది ఈ కార్యక్రమం సారాంశం. మీ బిడ్డకే ఫోన్ కొట్టండి అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలు, సేవలు అందకపోవడం, వైఎస్సార్ పెన్షన్ కానుక, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు, సామాజిక పథకాలు, భూమి రికార్డులు ఇలా ఎలాంటి సమస్యలైనా మీ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితాలు రాని పక్షంలో నేరుగా మీ జగన్‌కు, మీ అన్నకే, మీ తమ్ముడికే, మీ బిడ్డకే ఫోన్ కొట్టండి. 1902కు ఫోన్ కొడితే నేరుగా నా కార్యాలయానికే (సీఎంవో) ఫోన్ వస్తుంది. ఫిర్యాదులను గౌరవిస్తూ ‘వైఎస్సార్ ఐడీ నంబర్’ మీరు ప్రయత్నం చేసినా పరిష్కారం కాని సమస్యలు నేరుగా నా దృష్టికే వస్తాయి. ఫోన్ చేశాక మీకు యునిక్ ఐడీ నంబరు వస్తుంది. యువర్ సర్వీస్ రిఫరెన్స్ (వైఎస్సార్) ఐడీ నెంబరు అని పేరుపెట్టాం. మీ ఫిర్యాదుకు అంత గౌరవం ఇస్తూ వైఎస్సార్ పేరు పెట్టాం. సీఎంవో, సీఎస్, డీజీపీ పర్యవేక్షణ జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసేందుకు మండల కేంద్రం, జిల్లా కేంద్రం, రాష్ట్ర సచివాలయం, సీఎంవోలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు పెట్టాం. సీఎంవో, సీఎస్, డీజీపీ దీన్ని సమర్థంగా నిర్వహించేలా బాధ్యతలు అప్పగించాం. మానిటరింగ్ యూనిట్లలో ప్రతి చోటా మీ సమస్య పరిష్కారాన్ని పర్యవేక్షిస్తారు. స్పెషల్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా జిల్లాల్లో పర్యటించి కలెక్టర్లతో మమేకమై జగనన్నకు చెబుదాం కార్యక్రమం సమర్థంగా అమలయ్యేలా పర్యవేక్షిస్తారు. మీకు ఉత్తమ పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటారు. మీ సమస్య పరిష్కారం అయ్యాక ఫోన్ చేసి ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇవన్నీ జరుగుతాయి. ఎదిగేకొద్దీ పెద్ద సేవకులే.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నా దగ్గర నుంచి ప్రారంభిస్తే అంతా ప్రజలకు దగ్గరై సేవలు అందించడానికే ఉన్నాం. ప్రతి అధికారి పెద్ద స్థాయిలోకి వెళ్లేకొద్దీ మరింత పెద్ద సేవకుడు అవుతాడు. మీకు మరింత మంచి చేయాలనే తపనతో అడుగులు వేస్తున్న మీ ప్రభుత్వం ఇది. -
1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు: కలెక్టర్లు
సాక్షి, అమరావతి: ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, ఎస్పీలు మాట్లాడారు. ఏమన్నారో వారి మాటల్లోనే.. ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం గడిచిన ఆరు నెలలుగా మీరు ఇస్తున్న సూచనల మేరకు మా జిల్లాలో జిల్లా స్ధాయిలో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటుచేశాం, కలెక్టర్, జేసీల నేతృత్వంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పనిచేస్తుంది, ఇందులో ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కన్వీనర్‌గా ఉన్నారు, అన్ని ప్రభుత్వ విభాగాలలో వస్తున్న వినతులు, ఫిర్యాదులు పరిశీలించడం, మండల స్ధాయిలో కూడా పరిశీలించేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి గ్రీవియెన్స్‌ను పరిశీలించడం, మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సంబంధిత వార్త: ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా ఇక్కడికి వచ్చాను: సీఎం జగన్ మా జిల్లాలో వస్తున్న గ్రీవియెన్స్‌ను పరిష్కరించడం, రీ ఓపెన్ అయిన వాటిని పరిష్కరించడం చేస్తున్నాం. మీ సూచనల ప్రకారం గ్రామ సచివాలయం నుంచి జిల్లా కేంద్రం వరకు అందరూ పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మీ పేరు ఉండడం వల్ల నాణ్యతతో కూడిన పరిష్కారం వచ్చేలా చర్యలు తీసుకున్నాం, ప్రతి సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మీ సూచనలు సలహాలు పాటించి ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాం. మా జిల్లా యంత్రాంగం అంతా సర్వసన్నద్ధంగా ఉంది. థాంక్యూ సార్. -దినేష్ కుమార్, కలెక్టర్, ప్రకాశం జిల్లా ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కారం సార్, ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం అంతా వీక్షిస్తుంది. మేం మా దగ్గరకు వచ్చే గ్రీవియెన్స్ పరిష్కారానికి పూర్తి మెకానిజాన్ని సిద్దం చేసుకున్నాం, 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్ ఏర్పాటుచేశాం, స్పెషల్ ఆఫీసర్ కూడా పరిశీలిస్తున్నారు, ఫిర్యాదు చేసిన వ్యక్తి సమస్య పరిష్కారం అవగానే చిరునవ్వుతో వెనుదిరగాలి అనే విధంగా ముందుకెళుతున్నాం, గడిచిన కొద్ది వారాలుగా మేం ఈ కార్యక్రమానికి పూర్తి సన్నద్దమై ఉన్నాం. జిల్లా స్ధాయి నుంచే కాదు మండల స్ధాయి నుంచి కూడా అధికారులు సిద్దంగా ఉన్నారు, ఎలాంటి జాప్యం లేకుండా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నాం, ఇప్పటికే జిల్లా అధికారులకు తగిన విధంగా శిక్షణ కూడా ఇచ్చాం, గ్రీవియెన్స్ పరిష్కారం తర్వాత ఇతరులకు ఉపయోగపడేలా మార్గదర్శకాలు కూడా రూపొందిస్తున్నాం. ఇది ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది.! -నిషాంత్‌కుమార్, కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం, జిల్లా స్ధాయిలో, మండల స్ధాయిలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లలో అవసరమైన పోలీస్ సిబ్బందిని నియమించాం, ఇప్పటికే అవగాహన తరగతులు నిర్వహించాం, 1902 నెంబర్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళేలా చర్యలు తీసుకున్నాం, డైలీ స్టేటస్ రిపోర్ట్‌ను తీసుకుని పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం, పిటీషన్‌ను నిర్ణీత కాలపరిధిలో పరిష్కరిస్తున్నారా లేదా అని జిల్లా స్ధాయిలో పర్యవేక్షణ జరుగుతుంది, అన్ని శాఖల సమన్వయంతో పిటీషనర్‌కు న్యాయం జరిగేలా చూస్తాం, సివిల్ కేసుల పరిష్కారానికి మండల, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సహకారం తీసుకుంటాం. ఫీడ్ బ్యాక్ మెకానిజాన్ని కూడా ఏర్పాటుచేశాం, ఈ కార్యక్రమం దేశానికే రోల్‌మోడల్ అవుతుందని భావిస్తున్నాం. అన్భురాజన్, ఎస్పీ, వైఎస్సార్ కడప జిల్లా -
జగనన్నకు చెబుదాం వెబ్ సైట్ లాంచ్
-
ప్రజలకు సేవ అందించేందుకే నేను ఈ స్థానంలో ఉన్నా
-
ప్రజలకు సేవ చేసేందుకే సేవకుడిగా ఇక్కడికి వచ్చాను: సీఎం జగన్
Live Updates: సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో సీఎం జగన్ స్పీచ్ అర్హత ఉన్నా.. రాని పరిస్థితులు ఉన్నా, న్యాయం మీ వైపున ఉన్నా.. జరగని పరిస్థితులు ఉన్నా…, ఇంతకుముందు ప్రయత్నం చేసినా.. మీ ప్రయత్నం సత్ఫలితం ఇవ్వని పరిస్థితుల్లో… ప్రభుత్వ సేవలకు సంబంధించి ఇలాంటి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపేలా తపన, తాపత్రయంతో పుట్టకొచ్చిన మరొక మెరుగైన ఆలోచన నేరుగా మీ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని తీసుకు వచ్చాం -ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ►జగనన్నకు చెబుదాం కార్యక్రమం మిగతా కార్యక్రమాలకంటే భిన్నమైనది. ►ప్రతి సమస్యలకూ పరిష్కారం చూపాలని నాలుగు సంవత్సరాలుగా మన పరిపాలన సాగింది. ►3648 కి.మీ సాగిన నా పాదయాత్రలో ప్రతి గ్రామంలో, ప్రతి జిల్లాల్లో… నాకు కనిపించిన సమస్యలకు పరిష్కారం వెతికే క్రమంలో అడుగులు వేస్తూ ఈ నాలుగేళ్లుగా ముందుకు సాగాం. ►చాలావరకు సమస్యలు అన్నీ కూడా మానవ తప్పిదాలే. ►ప్రభుత్వం పలకాల్సిన పరిస్థితుల్లో పలికితే, ప్రభుత్వం న్యాయంగా, ధర్మంగా ఉంటే… ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం అవుతాయని పాదయాత్రలో కనిపించింది. ►ఈ పద్ధతిలో ప్రభుత్వం లేకపోతే 90 నుంచి 95శాతం సమస్యలు వస్తాయి. ►పింఛన్లు రాలేదని పాదయాత్రలో నా దగ్గరకు వచ్చేవారు. ►జన్మభూమి కమిటీలు చెప్తేకాని.. ఇవ్వని పరిస్థితి ఆనాటిది. ►మీరు ఏ పార్టీకి సంబంధించన వారని వాళ్లు అడిగేవారు. ►అంతేకాక ప్రతి పనికీ కూడా నాకెంత ఇస్తావు అని అడిగే గుణం. ►పెన్షన్ల దగ్గర నుంచి చూస్తే.. ఇళ్లకేటాయింపులు వరకూ ఇదే పరిస్థితి. ►ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా.. ప్రతి అడుగులోనూ వివక్ష, లంచాలు కనిపించేవి. ►మేం ఇవ్వగలిగింది ఇంతే.. ఊర్లో ఇంతమందికే ఇస్తామని చెప్పేవారు. ►ఎవరైనా సరే తప్పుకుంటేనే, చనిపోతేనే మిగతావాళ్లకి వచ్చే పరిస్థితి. ►నా సుదీర్ఘ పాదయాత్రలో ఇవన్నీ చూశాం. ►అర్హత ఉన్నవాళ్లు ఎంతమంది ఉంటే.. అంతమందికి ఇవ్వడం, తన పార్టీ, వేరే పార్టీని చూడకుండా ఇవ్వడం, వివక్ష లేకుండా ఇవ్వడం, లంచాలు లేకుండా ఇవ్వడం, సంతృప్తి స్థాయిలో ఇవ్వడం, గ్రామస్థాయిలో ఇవ్వగలిగితే.. అన్ని పరిష్కారాలూ దొరుకుతాయని పరిపాలనలో మార్పులు తీసుకు వచ్చాం. ►గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం. ►వ్యవస్థల్లోకి లంచాలు, వివక్షలేని గొప్ప మార్పులను తీసుకు వచ్చాం. ►రైతు భరోసాకేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, ఆస్పత్రుళ్లలో వైద్యసేవలు, పిల్లలు చదువుతున్న స్కూళ్లు, ఇతరత్రామనం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి ప్రజలకు మరింత చేరువగా పరిపాలనను తీసుకువచ్చేలా ఈ నాలుగేళ్లలో అడుగులు పడ్డాయి. ►దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా మార్పులు తీసుకువచ్చాం. ►ఇందులో భాగంగా ఇప్పటికే స్పందన అనే కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. ►గ్రామ సచివాలయాలనుంచి కలెక్టర్ల వరకూ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అయ్యారు. ►దీనికోసం ఒక యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చాం. ►ప్రజలకు హక్కుగా అందాల్సిన సేవలను బాధ్యతగా అందించేలా, ఎలాంటి జాప్యంలేకుండా చూడగలిగాం. ►న్యాయం, ధర్మం ఉండి వారికి రావాల్సింది వారికి రాకపోతే ఎలాంటి బాధ అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా అడుగులు ముందుకు వేశాం. ►సమస్యలకు పరిష్కారాలు చూపించేలా స్పందన ద్వారా అడుగులు వేశాం. ►ఇవాళ దానికి మరింత మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ►మారుమూల గ్రామాల నుంచి జిల్లా స్థాయి వరకూ అన్ని స్థాయిల్లో అందర్నీ భాగస్వాములను చేస్తున్నాం. ►జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమం ద్వారా కొన్ని మెరుగులు తీసుకువచ్చాం. ►సమస్యకు పరిష్కారం చూపించేటప్పుడు అర్జీదారుకి సంతోషాన్ని కలిగించేలా, ఆ మనిషి ముఖంలో చిరునవ్వులు చిందించాలన్న తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దాం. ►నాణ్యతతో సమస్యల పరిష్కారానికి వేదిక ఇది. ►ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత సమస్యలకు మెరుగైన పరిష్కాం చూపించడానికి వేదిక ఇది. ►మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న వ్యవస్థలద్వారా గట్టిగా ప్రయత్నం చేయడం. ►ఇలా చేసిన తర్వాత కూడా మనవైపు న్యాయం ఉండి న్యాయం జరగని పరిస్థితి ఉన్నా, అర్హత ఉన్నా కూడా రాని పరిస్థితులు ఉన్నా, ప్రయత్నం చేసినా కూడా ►సత్ఫలితం రాని పరిస్థితులు ఉన్నా.. అప్పుడు జగనన్నకు చెబుదాం అనే ఈ కార్యక్రమం ఉపయోగపడేలా నేరుగా జగనన్నకే చెబుదాం అన్నది ఈ కార్యక్రమం సారాంశం. ►అర్హత ఉన్న ప్రభుత్వ సేవలు అందకపోయినా, పథకాలు అందకపోయినా, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కానుక, భూమి రికార్డులు ఇలా ఎలాంటి సేవ అయినా.. మన ప్రయత్నంచేసినప్పటికీ కూడా మనకు ఫలితాలు రాని పక్షంలో నేరుగా మీ జగన్‌కు, మీ అన్నకే, మీ తమ్ముడికే, మీ ఇంట్లో మీ బిడ్డకే ఫోన్ కొట్టండి. ►1902కు ఫోన్ కొడితే… నేరుగా సీఎంఓకే ఫోన్ వస్తుంది. ►పరిష్కారం ఈ స్థాయిలో చూపించే గొప్ప ఆలోచనకు అడుగులు వేస్తున్నాం. ►మీరు ప్రయత్నంచేసినా పరిష్కారం కాని సమస్యలు నేరుగా నా దృష్టికే వస్తాయి. ►కాల్చేశాక మీకు ఒక వైయస్సార్ రిఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుంది. ►మీ ఫిర్యాదుకు అంత గౌరవం ఇస్తూ వైయస్సార్ పేరు పెట్టాం. ►మీ సమస్యను నా సమస్యగా భావించి.. దాన్ని ట్రాక్ చేస్తాం. ►నేరుగా సీఎంఓనే దీన్ని ట్రాక్ చేస్తుంది. ►ప్రతి అడుగులోకూడా ఎస్‌ఎంఎస్‌ద్వారా, ఐవీఆర్‌ఎస్‌ద్వారా మీ ఫిర్యాదు పరిష్కారంపై ఎప్పటికప్పుడు మెసేజ్‌లు, సందేశాలు వస్తాయి. లేదా నేరుగా కూడా చూడవచ్చు. ►మండలాలు, జిల్లాలు, రాష్ట్ర సచివాలయాల్లో, సీఎంఓలో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లు పెట్టాం. ►సీఎంఓ, సీఎస్, డీజేపీ.. ముగ్గురుకూడా సమీక్షలు చేసి.. ఈ కార్యక్రమాన్ని ముందుకు బలంగా నడుపుతారు:. ►ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లలో ప్రతి చోటా కూడా మీ సమస్య పరిష్కారాన్ని మానిటరింగ్ చేస్తారు. సొల్యూన్ ఇచ్చేలా అడుగులు ముందుకు వేస్తారు. ►సమస్య పరిష్కారం అయ్యాక… మీకు ఫోన్‌చేసి.. మీ ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. ►జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇవన్నీకూడా జరుగుతాయి: ►వీటన్నింటి ద్వారా ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను: ►ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నా దగ్గరనుంచి మొదలుపెడితే… అంతా ప్రజలకు సేవలకు అందించడానికే ఉన్నాం. ►కేవలం అధికారాన్ని చెలాయించడానికి కాదు. ►సచివాలయంలోని అధికారి నుంచి వాలంటీర్ వరకూ కూడా ప్రజలకు సేవకులమే. ►ప్రజల ముఖంలో చిరునువ్వులకోసమే. ►ఈ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం. ►భాగస్వాములైన అధికారులందరికీ కూడా కోరేది ఒక్కటే.. అంతా కూడా కలిసికట్టుగా ఒక్కటై ప్రతి ముఖంలో కూడా చిరునవ్వులు చూడాలి. ►ప్రభుత్వ ప్రతిష్టను ఇంకా పెంచేలా, సమర్థతను మరింత పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ►జిల్లాలకు సీనియర్ అధికారులను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించాం. ►క్రమం తప్పకుండా వీరు జిల్లాలకు వస్తారు. ►జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేలా చూస్తారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ఆహ్వానం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాలతో పాటు గ్రామ సచివాలయాలు / రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈవోలు, డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక జడ్పీటీసీకి ఈ సమాచారాన్ని అందచేయడంతోపాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని పేర్కొంది. గ్రామ సచివాలయాల్లో నిర్వహించే కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను ఆహ్వానించాలని సూచించింది. జగనన్నకు చెబుదాం కార్యక్రమం లక్ష్యాలివే.. ► ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్ ► సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్ధాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో జగనన్నకు చెబుదాం ► వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బందులున్నా వైఎస్సార్ పెన్షన్ కానుక అందుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నా, రేషన్ కార్డు వంటివి పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా రైతన్నలకైనా, అక్కచెల్లెమ్మలకైనా, అవ్వాతాతలకైనా, మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా ► వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు అందుకోవడంలో ఏమైనా సమస్యలున్నా ► రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా ► ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర వ్యక్తిగత ఇబ్బందులున్నా ► ప్రభుత్వ సేవలకు సంబంధించి ఇలాంటి ఏ సమస్య పరిష్కారానికైనా జగనన్నకు చెబుదాం – 1902 మీ సమస్యకు పరిష్కారం ఎలా జరుగుతుందంటే.. 1. మీ సమస్యను తెలియచేసేందుకు తొలుత 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలి 2. కాల్ సెంటర్ ప్రతినిధికి మీ సమస్యను చెప్పండి 3. మీ ఫిర్యాదును నమోదు చేసుకుని వైఎస్సార్ (యువర్ సర్వీస్ రిక్వెస్ట్) ఐడీని కేటాయిస్తారు 4. మీ అర్జీ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్ అందుతుంది 5. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి -
జగనన్నకు చెబుదాం కార్యక్రమం..నేడు ప్రారంభించనున్న సీఎం జగన్
-
‘జగనన్నకు చెబుదాం’@ 1902
సాక్షి, అమరావతి: సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టనున్నారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభిస్తారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్ ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్ చేస్తారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చు. సంక్షేమ పథకాలు, వైఎస్సార్ పెన్షన్ కానుక, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే రైతన్నలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, మరెవరైనా సరే ఫిర్యాదు చేయవచ్చు. రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా, ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర ఇబ్బందులున్నా జగనన్నకు చెబుదాం ద్వారా పరిష్కారం కోసం 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలి. ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితి, పరిష్కారం గురించి తెలుసుకునే వీలుంది. ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో పాటు నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ఆహ్వానం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నేడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల పరిషత్ కార్యాలయాలతో పాటు గ్రామ సచివాలయాలు / రైతు భరోసా కేంద్రాల్లో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈవోలు, డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. స్థానిక జడ్పీటీసీకి ఈ సమాచారాన్ని అందచేయడంతోపాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని పేర్కొంది. గ్రామ సచివాలయాల్లో నిర్వహించే కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలను ఆహ్వానించాలని సూచించింది. ఎలా చెబుదామంటే..? 1. మీ సమస్యను తెలియచేసేందుకు తొలుత 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయాలి 2. కాల్ సెంటర్ ప్రతినిధికి మీ సమస్యను చెప్పండి 3. మీ ఫిర్యాదును నమోదు చేసుకుని వైఎస్సార్ (యువర్ సర్వీస్ రిక్వెస్ట్) ఐడీని కేటాయిస్తారు 4. మీ అర్జీ స్టేటస్ గురించి ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్ అందుతుంది 5. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి -
Jaganannaku Chebudam: రేపట్నుంచే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజల సమస్యలను నిర్దిష్ట సమయంలోగా నాణ్యతతో పరిష్కరించడంతో పాటు నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని రేపు(మంగళవారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. సంతృప్త స్ధాయిలో ప్రజా వినతుల పరిష్కారమే లక్ష్యంగా కొత్త కార్యక్రమం చేపట్టనున్నారు సీఎం జగన్. జగనన్నకు చెబుదాం కార్యక్రమం లక్ష్యాలివే.. ప్రతి వినతి పరిష్కారం అయ్యే వరకూ ట్రాకింగ్ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత స్ధాయిలో మీకు ఎదురయ్యే మీ సమస్యలకు మరింత మెరుగైన, నాణ్యమైన పరిష్కారం చూపాలన్న తపనతో జగనన్నకు చెబుదాం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో మీకు ఏమైనా ఇబ్బందులున్నా వైఎస్సార్ పెన్షన్ కానుక అందుకోవడంలో ఏమైనా సమస్యలు ఉన్నా, రేషన్ కార్డు వంటివి పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా రైతన్నలకైనా, అక్కచెల్లెమ్మలకైనా, అవ్వాతాతలకైనా, మరెవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైనా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవలు అందుకోవడంలో ఏమైనా సమస్యలున్నా రెవెన్యూ రికార్డులకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా ప్రభుత్వ సేవలకు సంబంధించి మరే ఇతర వ్యక్తిగత ఇబ్బందులున్నా ప్రభుత్వ సేవలకు సంబంధించి ఇలాంటి ఏ సమస్య పరిష్కారానికైనా జగనన్నకు చెబుదాం – 1902 మీ సమస్యకు పరిష్కారం ఎలా జరుగుతుందంటే.. 1. మీ సమస్యను చెప్పేందుకు 1902 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి 2. కాల్ సెంటర్ ప్రతినిధితో మీ సమస్యను చెప్పండి 3. మీ ఫిర్యాదును నమోదు చేసుకుని YSR (యువర్ సర్వీస్ రిక్వెస్ట్) ఐడీని కేటాయిస్తారు 4. ఎప్పటికప్పుడు మీ అర్జీ స్టేటస్ గురించి ఎస్ఎంఎస్ ద్వారా మీకు అప్డేట్ అందుతుంది 5. సమస్య పరిష్కారం తర్వాత ప్రభుత్వ సేవలపై మీ అభిప్రాయాన్ని పంచుకోండి అవగాహన ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలు తెలుసుకునేందుకు వీలు కల్పించడంతో పాటు వారి నుండి ఫిర్యాదులు స్వీకరించి సత్వర పరిష్కారం అందించడం ఫిర్యాదు స్టేటస్ ఐవీఆర్ఎస్, ఎస్ఎంఎస్ ద్వారా పౌరులు ఎప్పటికప్పుడు తమ ఫిర్యాదుల స్ధితిని, వాటి పరిష్కారం గురించి తెలుసుకునే సౌకర్యం పరిష్కారం అనేక సమస్యలకు అత్యున్నత స్ధాయిలో పరిష్కారం, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్లతో పాటు ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది వ్యక్తిగా మీకు ఎదురయ్యే సమస్యల పరిష్కారాన్ని ఇంకా మెరుగుపరిచేందుకు చేస్తున్న ప్రయత్నం ఈ వేదిక, మీకు ఎదురయ్యే సామూహిక సమస్యల (కమ్యూనిటీ గ్రీవియెన్సెస్) పరిష్కారానికి ఎన్ఆర్ఈజీఎస్, జీజీఎంపి డిపార్ట్మెంట్ బడ్జెట్ ఎలాగూ ఉన్నాయి. -
మే 9 నుంచి ‘జగనన్నకు చెబుదాం’
సాక్షి, అమరావతి: వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించి ప్రజల సమస్యలను నిర్దిష్ట సమయంలోగా నాణ్యతతో పరిష్కరించడంతో పాటు నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మే 9వతేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. నమోదైన సమస్యల పరిష్కారంతోపాటు ప్రభుత్వ సేవలు, పథకాలపై ఆరా తీయడం, ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని వివరించారు. ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్ అయి ఉంటారని, సేవల్లో సమస్యలు, సలహాలను నేరుగా తెలియచేయవచ్చని వెల్లడించారు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా సమస్యలు నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ఉద్దేశం, ఆశయాలు, లక్ష్యాలపై అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. హెల్ప్‌లైన్ నంబర్ 1902 మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అందుకోసం 1902 హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రవేశ పెడుతున్నాం. ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశాం. జగనన్నకు చెబుదాం పేరులో ముఖ్యమంత్రి అయిన నా పేరు జోడించారంటే ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంత ఉందో అర్థం అవుతోంది. ఇది చాలా ప్రతిష్టాత్మక కార్యక్రమం. మనం ఇప్పటికే స్పందన నిర్వహిస్తున్నాం. స్పందనకు మరింత మెరుగైన రూపమే ‘జగనన్నకు చెబుదాం’.. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే ‘జగనన్నకు చెబుదాం..’! సమస్యలను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి సమస్యను నమోదు చేసుకుంటే అత్యంత నాణ్యతతో పరిష్కరించాలి. సీఎంవో నుంచి మండలాల వరకూ పర్యవేక్షణ యూనిట్లు సీఎంవో, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లా, డివిజన్ స్థాయి, మండల స్థాయిలో మానిటరింగ్ యూనిట్లు ఉంటాయి. వీటిని కలెక్టర్లు తప్పనిసరిగా పర్యవేక్షించాలి. సమస్య పరిష్కారంలో క్వాలిటీ పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలి. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల(పీఎంయూ)ను సీఎంవో కూడా పర్యవేక్షిస్తుంది. హెల్ప్‌లైన్ ద్వారా గ్రీవెన్స్ నమోదవుతాయి. వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి. ఫిర్యాదు చేసిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. సమస్యల పరిష్కారంపై ప్రజలకు అప్డేట్స్ తమ సమస్యల పరిష్కారంపై ఐవీఆర్ఎస్, ఎస్సెమ్మెస్‌ల ద్వారా ప్రజలకు క్రమం తప్పకుండా అప్డేట్స్ అందుతాయి. అంతేకాకుండా ఇదే హెల్ప్‌లైన్ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో వలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్ గురించి అవగాహన కల్పిస్తారు. ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభమయ్యేలోగా వలంటీర్లు ప్రతి గడపకూ 1902 గురించి చెబుతారు. ప్రతేక అధికారులుగా సీనియర్ ఐఏఎస్‌లు సీనియర్ ఐఏఎస్ అధికారులు జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తారు. క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను సందర్శించి పర్యవేక్షిస్తారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును కలెక్టర్లతో కలసి పర్యవేక్షిస్తారు. సమస్యల పరిష్కారాల తీరును ర్యాండమ్‌గా తనిఖీ చేస్తారు. ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ల పనితీరును గమనిస్తారు. ఎక్కడైనా సమస్య పరిష్కారం పట్ల సంతృప్తి చెందకుంటే తిరిగి ఓపెన్ చేస్తారు. ఎస్ఎంఎస్, ఐవీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు. పరిష్కారం తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు. చీఫ్ సెక్రటరీ, సీఎంవో, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్ చేస్తారు. ప్రతి 15 రోజులకోసారి పూర్తిస్థాయిలో సమీక్ష ఉంటుంది. ప్రతి కలెక్టర్‌కు తక్షణం రూ.3 కోట్లు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారంటే ఇది ఎంత ముఖ్యమైనదో అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి అధికారులపై ఆధారపడే విధులను నిర్వహిస్తారు. మీరు అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే ప్రభుత్వం సమర్ధంగా పని చేసినట్లే. అప్పుడే ఈ కార్యక్రమం చక్కగా సాగుతున్నట్లు లెక్క. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ప్రజలకు నాణ్యంగా సేవలను అందించాలన్నదే దీని ఉద్దేశం. ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్లను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది. అవసరమైన చోట ఈ డబ్బులను ఖర్చు చేయవచ్చు. వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం. గ్రామ స్థాయిలో అన్ని అంశాలపై దృష్టి కలెక్టర్లు, స్పెషల్ ఆఫీసర్లు, మానిటరింగ్ యూనిట్లు గ్రీవెన్స్‌తో పాటు గ్రామస్ధాయిలో అన్ని అంశాలపైనా దృష్టి పెడతారు. దీనివల్ల వేగంగా గ్రీవెన్స్ పరిష్కారంలో డెలివరీ మెకానిజం ఉంటుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలోని సచివాలయాలు, ఆర్బీకేలు, అంగన్వాడీలు, విలేజ్ క్లినిక్స్.. అవన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్న అంశంపైన కూడా దృష్టిపెడతారు. గ్రామాలలో ఇళ్ల నిర్మాణంపైనా దృష్టి సారిస్తారు. ఇవి సక్రమంగా పనిచేస్తే గ్రామస్ధాయిలో చాలావరకు సమస్యలు సమసిపోతాయి. అవి సమర్థంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. దీనికోసమే మానిటరింగ్ కమిటీలతో పాటు స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నాం. సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజాశంకర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఏపీడీడీసీఎఫ్ ఎండీ అహ్మద్‌బాబు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ (మౌలిక వసతులు కల్పన) కాటమనేని భాస్కర్, వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ హరికిరణ్, ఆర్ అండ్ బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ సూర్యకుమారి, సెర్ఫ్ సీఈఓ ఏ ఎండి ఇంతియాజ్, ఆరోగ్య కుటుంబసంక్షేమశాఖ కమిషనర్ నివాస్, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్‌బాబు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీషా, డీఐజీ గోపీనాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. -
మే 9న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం
-
జగనన్నకు చెబుదాం..
సాక్షి, అమరావతి: ప్రజా వినతులను సంతృప్త స్థాయిలో పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇందుకు అధికారులంతా సన్నద్ధం కావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం సన్నాహకాల్లో భాగంగా స్పందన కార్యక్రమంలో అత్యధిక అర్జీలు అందుకుంటున్న ప్రభుత్వ విభాగ అధిపతులతో శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి వినతి పరిష్కారం అయ్యేంత వరకూ ట్రాక్ చేయాలని చెప్పారు. ‘అందిన అర్జీలపై ప్రతి వారం ఆడిట్ చేయడంతో పాటు నివేదికలు తీసుకోవాలి. ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్న దానిపై ప్రతివారం సమీక్ష చేయాలి’ అని అన్నారు. సీఎంఓతో పాటు ప్రతి ప్రభుత్వ శాఖలో ‘జగనన్నకు చెబుదాం’ ప్రాజెక్ట్ మానిటరింగ్ విభాగాలు ఉండాలని చెప్పారు. తర్వాత జిల్లా, మండల స్థాయిలో, మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల స్థాయిలో కూడా ఈ విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. మానిటరింగ్ యూనిట్లు సమర్థవంతంగా పనిచేస్తేనే ఈ కార్యక్రమం మంచి ఫలితాలిస్తుందని తెలిపారు. ఈ మెకానిజం అంతా సిద్ధం కాగానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. సహనం, ఓపిక, పునఃపరిశీలన ►సంబంధిత విభాగంలో సరిగ్గా పని జరగలేదనే కారణంతోనే వినతులు, ఫిర్యాదులు వస్తాయి. ఇలాంటి సందర్భాల్లో వారిని సంతృప్తి పరిచేలా పరిష్కారం చూపడం అన్నది సవాల్‌తో కూడుకున్నది. సహనం, ఓపిక, పునఃపరిశీలన, విధానాల పునరి్నర్మాణాలతో ముందుకు సాగాలి. ►స్పందన డేటా ప్రకారం అత్యధికంగా ఫిర్యాదులు రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, హోంశాఖ, ఆరోగ్యం–కుటుంబ సంక్షేమ శాఖల నుంచి వస్తున్నాయి. జగనన్నకు చెబుదాం ప్రారంభమయ్యాక కూడా ఇవే విభాగాల నుంచి వినతులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈ శాఖలకు చెందిన విభాగాధిపతులు అర్జీల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సిబ్బందికి ఓరియంటేషన్ ►జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై సిబ్బందికి ఓరియెంటేషన్ ఇవ్వాలి. మానిటరింగ్ యూనిట్ల ఏర్పాటుపై కూడా మార్గదర్శకాలు రూపొందించాలి. నిర్దేశిత సమయంలోగా వినతులు పరిష్కారం కావాలి. ఆ సమయంలోగా పరిష్కారం కావడం, పరిష్కారంలో నాణ్యత ఉండడం అన్నది చాలా ముఖ్యం. సమస్య పరిష్కారం అయ్యాక వినతులిచ్చిన వారి నుంచి లేఖ తీసుకోవాలి. ►ఏదైనా అర్జీని తిరస్కరించాల్సిన నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. తిరస్కరణకు గురైనా, జరిగిన ప్రక్రియపై అర్జీదారులు సంతృప్తి వ్యక్తం చేసేలా ఉండాలి. అవినీతికి సంబంధించిన అంశాలను చాలా గట్టిగా తీసుకోవాలి. తప్పు చేయడానికి భయపడే పరిస్థితి ఉండాలి. ►పోలీసులకు వచ్చే అర్జీల పరిష్కారానికి మండల స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలి. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో కూడిన మండల, మున్సిపల్ స్థాయి సమన్వయ కమిటీ వారంలో ఒక రోజు సమావేశమై అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ విభాగాధిపతులు త్వరలో కలెక్టర్లతో సమావేశం నిర్వహించి.. వారికి అవగాహన కల్పించాలి. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, సెర్ప్ సీఈఓ ఏఎండీ ఇంతియాజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.