శంకరన్‌, శ్రీధరన్‌లా పనిచేయండి: కలెక్టర్లతో సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments At Collectors Conference | Sakshi
Sakshi News home page

శంకరన్‌, శ్రీధరన్‌లా పేరు తెచ్చుకోండి: కలెక్టర్లతో సీఎం రేవంత్‌

Published Tue, Jul 16 2024 11:31 AM | Last Updated on Tue, Jul 16 2024 12:14 PM

CM Revanth Reddy Comments At Collectors Conference

సాక్షి,హైదరాబాద్‌: ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు విశ్వాసం కల్పించేలా పనిచేయాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఒక శంకరన్, ఒక శ్రీధరన్‌లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా పనిచేయాలని కోరారు. మంగళవారం(జులై 16) సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. 

‘ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు స్వీకరించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని మీతో జరిగిన తొలి సమావేశంలో ఆదేశించాం. ఎన్నికల కోడ్ ముగియగానే పారదర్శకంగా కలెక్టర్ల బదిలీలు నిర్వహించాం. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. కలెక్టర్లలో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చినవారు ఉన్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యమైతేనే మీరు ప్రజలకు సరైన సేవలు అందించగలుగుతారు. 

తెలంగాణను మీ సొంత రాష్ట్రంగా భావించి పనిచేయాలి. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో మీ నిర్ణయాలు ఉండాలి. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏంటో తెలుసుకోండి. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే మీకు కూడా ఎలాంటి సంతృప్తి ఉండదు. మీ ప్రతీ చర్య. ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలి. 

సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపైనే ఉంది. కలెక్టర్లు క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే. ప్రతీ పేద విద్యార్థి కోసం ప్రభుత్వం ప్రతీ నెలా రూ.85వేలు ఖర్చు పెడుతోంది. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ అత్యంత కీలకం. విద్యావ్యవస్థ దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి. 

ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ  ఆస్పత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు బదిలీ అయితే విద్యార్థులు సొంత కుటుంబ సభ్యుడిలా స్పందించారు. 

కలెక్టర్లు బదిలీ అయినా ప్రజల నుంచి అలాంటి స్పందన వచ్చేలా మీ పనితనం ఉండాలి. ప్రజావాణి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత మీపైనే ఉంది’అని రేవంత్‌ కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, మంత్రులు, సీఎస్‌ ఇతర ఉన్నతాధిరులు పాల్గొన్నారు.

కలెక్టర్లతో సీఎం రేవంత్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement