
క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి
కోదాడఅర్బన్: క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 11న ఆలిండియా దళిత క్రైస్తవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్ తెలిపారు. మంగళవారం పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన దీనికి సంబంధించిన పోస్టర్‌ను , సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలో ఢిల్లీ కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్‌బాబు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్ల సుందర్‌బాబు, జిల్లా కార్యదర్శి దేవిరెడ్డి లింగారెడ్డి, కొండా రవి, కొత్తపల్లి ప్రశాంత్, జాన్ వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు గంటా జీవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.