icon
-
ఫ్యాషన్‌కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..
ఇటీవల విశ్వ సుందరి పోటీల్లో అందానికి అర్థం మారుతుందన్నట్లుగా విజేతలను నిర్ణయించారు నిర్వాహకులు. అందులో పాల్లొన్న అందాల బామ్మలు కూడా మచ్చలేని శరీరమే సౌందర్యం కాదని ఆత్మవిశ్వాసమే అసలైన అందమని చాటిచెప్పేలా పాల్గొని అందర్ని ఆశ్చర్యపరిచారు. అలానే ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కాలేజ్ యువత మాత్రమే ట్రెండ్ సెంట్ చేస్తారనుకుంటే పొరపాటే. క్రియేటివిటీ, అభిరుచి ఉంటే వయసు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్ చేసింది ఎనిమిపదుల గ్రానీ. రెస్ట్ తీసుకునే వయసులో సరికొత్త ట్రెండ్ సృష్టించి ఔరా..! అని ప్రశంలందుకుంటోంది ఈ బామ్మ. ఇంతకీ ఎవరామె అంటే..జాంబియాలోని ఓ గ్రామానికి చెందిన 85 ఏళ్ల మార్గరెట్ చోలా అనే బామ్మకు ఫ్యాషన్ ఐకానిక్‌గా స్టార్డమ్ తెచ్చుకుంది. అందుకు సోషల్ మీడియానే కారణం. సరదాగా గ్రానీ సిరీస్ 'లెజండరీ గ్లామా'లో నటించింది. అందులో ఆమె వివిధ రకాల ఫ్యాషన్ గెటప్‌లతో ప్రేక్షకులను అలరించింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు ప్రపంచమంతటా మారు మ్రేగిపోయింది. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో విపరితీమైన ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. ఆమె మనవరాలు డయానా కౌంబానే దీనంతటికీ కారణం. ఈ బామ్మ తన హై ఫ్యాషన్ వార్డ్ రోబ్‌తో సోషల్ మీడియాలో దాదాపు లక్షకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. మొదట్లో ఇబ్బంది పడ్డ ఆ తర్వాత ఆ ఆధుని ఫ్యాషన్ డ్రెస్‌లకు అలవాటు పడిపోయింది బామ్మ చోలా. డ్రెస్సింగ్ నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రతిదాంట్లోనూ ప్రత్యేక కేర్ తీసుకుంటుంది మనవరాలు కౌంబా. ఆమె కారణంగానే ఇంత అందంగా కెమెరాకు ఫోజులిస్తోంది ఈ ఎనభై ఐదేళ్ల బామ్మ. అంతేకాదండోయ్..టీ షర్ట్స్, జీన్స్ వేసినప్పుడు చక్కటి లుక్ కోసం చేతి గోర్లు కూడా పెంచుతోందట. ఇంతకముందు తన జీవితం ఎలా సాగిందనేది అంత గుర్తు లేదు. కానీ ఇప్పుడు తన మనవరాలి పుణ్యమా అని.. సరొకొత్త రూపంతో మీ ముందుకు వస్తుంటే అసలు జీవితం అంటే ఇది కదా..! అనిపిస్తోంది. కొత్తదనంతో అందంగా మలుచుకోవడమే లైఫ్ అని అంటోంది ఈ బామ్మ. అంతేగాదు ఆమె నటించిన సిరీస్ కూడా.. "మాకు కూడా కొన్ని కోర్కెలు ఉంటాయి..మేము కూడా ప్యాషన్‌కి తీసిపోం అనిపించేలా సీనియర్ సిటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేగాదు ఆ సిరీస్‌లో.. నలుగురు మనవరాళ్లు తమ గ్రానీలను అందంగా తీర్చిదిద్దే పనిని ఈ స్టైలిష్ బామ్మకు అప్పగించితే.. ఆమె ఎలా ట్రెండ్ సెట్ చేస్తుందనేది ప్రధాన ఇతివృత్తం. ఏదీఏమైన ఈ ఏజ్‌లో ఇలా ఫ్యాషన్‌గా తయారవ్వడం అంటే మాటలు కాదు. పైగా తన సరికొత్త రూపంతో అందరికీ ప్రేరణ కలిగించి, ఆదర్శంగా నిలిచింది బామ్మ చోలా. View this post on Instagram A post shared by Dee (@thevintagepoint_) (చదవండి: వర్క్ లైఫ్ బ్యాలెన్స్: ఏ సంస్థ లేదా కార్యాలయం అలాంటి ఆఫర్ ఇవ్వదు..!) -
దేశీ గర్ల్ టు గ్లోబల్ ఐకాన్: మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం ఆమె!
దేశీ అమ్మాయి కాస్త ప్రపంచ సుందరిగా కిరీటాన్ని కైవసం చేసుకుంది. అక్కడి నుంచి మొదలైన ఆమె విజయపరంపర ప్రభంజనంలా దూసుకుపోయింది. నటిగా మెప్పించి అందరీ అభిమానాన్ని పొందింది. అందివచ్చిన ప్రతి అవకాశన్ని అందిపుచ్చుకుంది. అవకాశం చిక్కినప్పుడల్లా మహిళ హక్కుల గురించి విరుచుకుపడేది. అదే ఆమెను ఫోర్బ్స్ మ్యాగజైనలో శక్తిమంతమైన మహిళగా నిలబెట్టింది. పైగా తన కళా నైపుణ్యంతో మహిళ సాధికారతనకు అసలైన నిర్వచనం ఇచ్చింది. ఎవరామె అంటే..ఆ మహిళ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. సాధాసీధా దేశీ గర్ల్ నుంచి గ్లోబల్ ఐకాన్ రేంజ్‌కి ఎదిగింది. ఆమె స్వతంత్రంగా, శక్తిమంతంగా ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించికుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ తనలోని కొత్త వెర్షన్‌ని పరిచయం చేసింది. ఒక కూతురిగా, సోదరి, భార్య, తల్లిగా ఇలా అన్ని రోల్స్‌కి సమన్యాయం చేసింది. 2000లో మిస వరల్డ్ పోటీలో సాధించిన గెలుపుతో మొదలైన ఆమె ప్రస్తానం వెనుతిరిగి చూడాల్సిన పనిలేకుండా..విజయపరంపరతో దూసుకుపోయింది. అలాగే బాలీవుడ్లో కెరీర్‌ను మొదలుపెట్టి అతి తక్కువ కాలంలో వేలాదిమంది అభిమానుల మనుసును గెలుచుకుంది. అక్కడి నుంచి హాలీవుడ్లో ప్రవేశించి తన కెరియర్ని నిర్మించుకుంది. అలాగే ప్రియాంక నటించిన అంతర్జాతీయ వెబ్ సిరీస్ క్యాంటికో ఆమెకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. అలా ఆమె గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకుంది.2018లో విదేశీయుడు జోనాస్‌ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలో ఉండే సాంప్రదాయ మూస పద్ధతులన్ని బద్దలు గొట్టింది. ఆ తర్వాత సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొంది..దానిపై ఉండే అపోహలను దూరం చేసింది. ఆమె తన నటనకు గానూ పద్మశ్రీ అందుకుంది. అలాగే యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలయ్యింది.అంతేగాకుండా ఫోర్బ్స్ వందమంది శక్తిమంతమైన మహిళల్లో ఆమె ఒకరిగా నిలిచింది. ప్రియాంక తరుచుగా లింగ సమానత్వం, విద్య, మహిళల హక్కులపై తన గళాన్ని వినిపిస్తుంటుంది. అలాగే పలు టాక్ షోలు, ఇంటర్వ్యూలలో తన అభిప్రాయాలను చెప్పేందుకు వెనకాడలేదు. అంతేగాదు బాలీవుడ్లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి, రావాల్సిన మార్పు గురించి మాట్లాడుతుంది. మహిళలు జీవించే ప్రపంచం ఉండకూడదు, మహిళలు అభివృద్ధి చెందే ప్రపంచం ఉండాలని నర్మగర్భంగా చెబుతుంది. అలాగే సరళమైన పదాల్లో స్త్రీల హక్కులు లేనందున స్త్రీవాదం అవసమరమయ్యిందని తనదైన శైలిలో కౌంటరిస్తుంటుంది. ఆధునిక మహిళకు ప్రియాంక ఓ స్ఫూర్తి. తను ఎంచుకుని తీసే సిమాలలో అత్యంత శక్తిమంతమైన మహిళల పాత్రలతో సమాజానికి ఇవ్వాల్సిన సందేశం ఇస్తుంటుంది. అంతేగాదు తప్పు చేయడం మానవ సహజం దాన్నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ప్రధానమైనదని అంంటోంది. ఆమె అచంచలమైన శక్తి, అంకితభావం, సాధికారతకు ప్రియాంక నిలువెత్తు నిదర్శనం. ఓ స్త్రీగా ఏమేమో చేయొచ్చొ చేసి చూపించింది అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.(చదవండి: ఉషా చిలుకూరి..ఏయూ ప్రొఫెసర్ శాంతమ్మ మనవరాలే..!) -
Alia Al Rufai: తానొక.. అందమైన ఫ్యాషన్ లేడీ!
బాలీవుడ్లో అనుష్కా శర్మకు మంచి నటిగానే కాదు స్టయిల్ ఐకాన్‌గానూ పేరుంది. ఎయిర్ పోర్ట్ లుక్ నుంచి రెడ్‌కార్పెట్ వాక్ దాకా సందర్భానికనుగుణంగా ఆమె «ధరించే కాస్ట్యూమ్స్‌కి వీర ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాషనిస్టా వెనుక స్టయిలిస్ట్ అలియా అల్ రుఫై కృషి ఉంది. ఆమె ఎవరో తెలుసుకుందాం..అలియా అల్ రుఫై.. వాళ్లమ్మ ఇండియన్. నాన్న అరబ్. అందుకే తనను తాను హాఫ్ ఇండియన్, హాఫ్ అరబ్‌గా అభివర్ణించుకుంటుంది అలియా. పన్నెండవ ఏట నుంచే ఆమెకు ఫ్యాషన్ మీద ఆసక్తి ఏర్పడింది. కారణం వాళ్లమ్మే. వింటేజ్ స్టయిల్‌కి కంటెంపరరీ టచ్నిచ్చి క్రియేట్ చేసుకునే ఆమె డ్రెస్‌లు, బ్లౌజెస్ అలియాను అమితంగా ఆకట్టుకునేవట. ఆ ఆకర్షణే తన చుట్టూన్న వాళ్ల డ్రెస్ సెన్స్‌ని, కల్చర్స్ని గమనించే గుణాన్ని పెంచిందట అలియాలో. ఆ తపనే ఆమెకు ఫ్యాషన్ మ్యాగజైన్స్నీ పరిచయం చేసింది. వాటి ప్రభావంతో తన డైలీ రొటీన్ డ్రెసెస్లోనే ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చేది.తన ఫ్రెండ్ సర్కిల్లో కాంప్లిమెంట్స్ అందుకునేది. ఒకసారి బాల్యంలోనే.. ఇతిహాద్ ఎయిర్వేస్లో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నప్పుడు.. ఒక బ్లాంకెట్‌ని ఇంటికి పట్టుకొచ్చేసిందిట దొంగతనంగా! తర్వాత దాన్ని స్కర్ట్‌గా మలచుకుందట. అలా ఆమెకు ఫ్యాషన్ మీదున్న శ్రద్ధ తనతో పాటే పెరుగుతూ వచ్చింది. ముంబై యూనివర్సిటీలో ఏంబీఏ పూర్తి చేసింది. అయినా ఏదో వెలితి. తనకు జాబ్ శాటిస్ఫాక్షన్ దొరికేది ఫ్యాషన్ రంగంలోనే అని ఆమె ప్రగాఢ విశ్వాసం. అందుకే ‘హార్పర్స్ బజార్’లో జూనియర్ ఫ్యాషన్ ఎడిటర్‌గా ఆఫర్ వస్తే.. రెండో ఆలోచన లేకుండా అందులో చేరింది.అక్కడ పనిచేస్తున్నప్పుడే అనుకోకుండా బాలీవుడ్ నుంచి కాల్ అందుకుంది.. ‘మధుర్ భండార్కర్ తీస్తున్న ‘ఫ్యాషన్’ సినిమాకి స్టయిలిస్ట్‌గా ఉన్న రీతా ధోడీకి అసిస్టెంట్ కావాలి. రాగలరా?’ అంటూ! ‘వై నాట్.. అఫ్కోర్స్’ అంటూ వెంటనే రీతా ధోడీ స్టయిల్ టీమ్‌లో మెంబర్ అయింది. ‘తొలి అవకాశమే కంగనా రనౌత్, ప్రియంకా చోప్రాలతో కలసి పనిచేయడం.. నా అదృష్టం! వాళ్ల దగ్గర చాలా నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే ‘ఫ్యాషన్’ సినిమా ఫ్యాషన్ ప్రపంచం గురించి నాకెన్నో విషయాలను తెలియజెప్పింది. ఎన్నో మెలకువలనూ నేర్పింది’ అని చెబుతుంది అలియా.ఆ సినిమా ఆమె కెరీర్‌కి మైలు రాయి అనుకోవచ్చు. అక్కడి నుంచి ఆమె ప్రయాణం ముందుకే సాగింది. పలు ఫ్యాషన్ షోలకు పనిచేసింది. ఎన్నో ఫ్యాషన్ మ్యాగజైన్స్‌కి ఆర్టికల్స్ రాసింది. అలా ఆమె నైపుణ్యం చూసిన అనుష్కా శర్మ .. అలియాను తన పర్సనల్ స్టయిలిస్ట్‌గా నియమించుకుంది. ఆమె అనుష్కా దగ్గర చేరగానే అనుష్కా తీరుతెన్నులే మారిపోయాయి. ఏ డ్రెస్ అయినా అనుష్కా కోసమే డిజైన్ అయిందేమో అన్నంత ఆప్ట్‌గా.. ఏ యాక్ససరీకైనా ఆమె వల్లే అందం వస్తుందేమో అన్నంత గ్రేస్‌ఫుల్‌గా కనిపించసాగింది ఆ నటి.దీన్ని బాలీవుడే కాదు యూరప్ ఫ్యాషన్ ప్రపంచమూ గమనించింది. అలియాకు చాన్స్‌ల వరద కురిపించింది. సెలబ్స్ ఎవరైనా రెడ్‌కార్పెట్ మీద కాలు పెట్టాలంటే అలియా స్టయిలింగ్ చేయాల్సిందే అన్నంత పాపులర్ అయిపోయింది. అలా దీపికా పదుకోణ్, ఆలియా భట్, కియారా ఆడ్వాణీ, యామీ గౌతమ్, నర్గిస్ ఫక్రీ, శ్రద్ధా కపూర్ వంటి వాళ్లందరికీ అలియా పర్సనల్ స్టయిలిస్ట్‌గా పనిచేసింది.ఫ్యాషన్‌లో మరింత స్కిల్ సంపాదించుకునేందుకు 2018లో మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఫ్యాషన్ రంగంలో పట్టభద్రురాలైంది."అంకితభావం, హార్డ్‌వర్కే నన్నీ రోజు ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేర్చాయి. బ్యూటీ అంటే నా దృష్టిలో సింప్లిసిటీ! మీ స్కిన్‌తో మీరు ఎంత కంఫర్టబుల్‌గా ఉంటే అంత అందంగా కనపడతారు. నా వింటేజ్ ఫ్యాషన్‌కి ఇన్స్పిరేషన్ మా అమ్మే అని చెబుతాను. సందర్భానికి తగ్గట్టు ఆమె రెడీ అయ్యే తీరే నాలో ఫ్యాషన్ సెన్స్‌ని పెంచింది. సీజన్స్ మారుతుంటాయి. ఫ్యాషన్ మాత్రం ఇవాల్వ్ అవుతూంటుంది. ఈ సత్యాన్ని గమనిస్తే స్టయిలిస్ట్లకు తిరుగులేదు.నేర్చుకోవడానికి బాలీవుడ్‌ని మించిన ఇండస్ట్రీ లేదు. మెంటర్ కన్నా రెండడుగులు ముందుండాలి ఎప్పుడూ! ఫలానా పని చేయండి అని మెంటర్ ఆర్డర్ వేయగానే ఆల్రెడీ డన్ అనే ఆన్సర్ ఉండాలి మన దగ్గర. నా ఫిలాసఫీకి వస్తే.. ఈ క్షణంలో బతకడాన్ని మించిన ఆనందంలేదు అంటాను. అదే అందం. చిన్న చిన్న విషయాల్లో ఆనందం వెదుక్కుంటాను!" – అలియా అల్ రుఫైఇవి చదవండి: తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ! -
50వ వసంతంలోకి అడుగుపెడుతోన్న కండలవీరుడు హృతిక్ రోషన్
-
ఆమె రాజవంశపు యువరాణి, రాయల్ ఫ్యాషన్ ఐకాన్! ఏకంగా డిప్యూటీ సీఎంగా..!
రాజవంశానికి చెందిన ఓ యువరాణి రాజకీయాల్లో రావడమే గాక ఏకంగా డిప్యూటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె రాజకీయ ప్రస్థానం సాగింది. ఎలా అత్యున్నత పదవిని అలకరించగలిగారు తదితరాల గురించే ఈ కథనం!. దియా కుమారి 1971లో జన్మించారు. ఆమె జైపూర్ రాజరిక రాష్ట్రానికి చివరి పాలక మహారాజా మాన్సింగ్II మనవరాలు. జైపూర్‌కు చెందిన మహారాజా సవాయి భవానీసింగ్, హెచ్ హెచ్ మహారాణి, పద్మినీ దేవిల ఏకైక కుమార్తె. ఆమెకు ముగ్గురు పిల్లలు, హెచ్‌హెచ్ సవాయి పద్మనాభ్ సింగ్, యువరాణి గౌరవి కుమారి, హెచ్‌హెచ్ లక్షరాజ్ ప్రకాష్, సిర్మౌర్ మహారాజా. దియా కుమారి ఎన్నో మహిళా సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను మనసును దోచుకుంది. రాజరికంలో పెరిగిన ఆమె తండ్రి దాతృత్వాన్ని వారసత్వంగా తీసుకుని ప్రజలకు సంబంధించిన ఎన్నో సేవా కార్యక్రమాలను చురుగ్గా ముందుండి చేసేది. ఆమె ప్రస్తుతం జైపూర్‌లో ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం సిటీ ఫ్యాలెస్‌లో నివాసం ఉంటున్నారు. మాన్సింగ్ మ్యూజియం నిర్వహణకు కూడా సాయం అందిస్తున్నారు. రాజరికం ఆధునికత కలగలిసిన మహిళ దియా కుమారి. ఆమె తన విధ్యాభ్యాసాన్ని భారత్, యూకేలలో పూర్తి చేశారు. రాజకీయ ప్రస్థానం.. 2013లో దియా కుమారీ బీజేపీలో చేరి రాజకీయాల్లోకి తెరంగేట్రం చేశారు. మహిళల హక్కులు, విద్య, గ్రామీణాభివృద్ధి కోసం తన వాణిని వినిపించడమే గాక, అందుకు సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజకీయాలతో సంబంధం లేకుండానే స్వతహాగా ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు చేశారు. ఆమె ప్రిన్సెస్ దియా కుమారి ఫౌండేషన్‌ను స్థాపించింది. దీని ద్వారా పిల్లలకు విద్య, ఆరోగ్య సంరక్షణ, మహిళా నైపుణ్యాభివృద్ధి వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. దియా కుమారీ సాంప్రదాయ కళలను, చేతిపనులు, సంగీతం, నృత్యం వంటి వాటిని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. వివాదాస్పద అంశాలు.. తాజ్ మహల్‌ని సొంతం చేసుకోవాలని కోర్టులో దావా వేశారు. తాజ్‌మహల్‌ను నిర్మించే స్థలం తన కుటుంబానికి చెందినదని, అందుకే ఆ ఆస్తి తనకే చెందుతుందని ఇటీవల ఆమె వాదనలు వినిపించారు. తమ వద్ద సరైన డాక్యుమెంటేషన్ ఉందని, అవసరమైతే కోర్టుకి సమర్పిస్తామని కూడా ఆమె స్పష్టం చేశారు. బహిరంగా బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చి తరుచుగా వార్తల్లో నిలవడం ఏదీఏమైన రాజవంశం నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు అయితే. మహామహులే రాజకీయాల్లో ఎదురుదెబ్బలతో బొక్కబోర్లాపడినవారు ఎందరో ఉన్నారు. కానీ ఈమె అప్రతిహాసంగా రాజకీయాల్లో దూసుకుపోవడమే గాక డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం విశేషం. (చదవండి: 'బ్లడ్ మనీ డీల్': మరణశిక్ష పడ్డ కూతురు కోసం ఓ తల్లి చేస్తున్న సాహసం!) -
ఈసీ ‘నేషనల్ ఐకాన్’గా సచిన్
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెంచేలా అవగాహన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ‘నేషనల్ ఐకాన్’గా సచిన్ వ్యవహరించనున్నారు. ఢిల్లీలో బుధవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ తదితరుల సమక్షంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌తో 3 సంవత్సరాల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఎంఓయూ కుదుర్చుకోనుంది. ఈ ఎంఓయూ ద్వారా యువత, పట్టణ ప్రాంతాల ఓటర్ల భాగస్వామ్యం పెంచే దిశగా టెండూల్కర్ ‘నేషనల్ ఐకాన్’గా తన బాధ్యతలు నిర్వహిస్తారు. కాగా గత సంవత్సరం ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎంఎస్ ధోని, అమీర్ ఖాన్, మేరీకోమ్ వంటి ప్రముఖులు కేంద్ర ఎన్నికల సంఘానికి ‘నేషనల్ ఐకాన్’లు వ్యవహరించారు. -
ముంబైలో ఘనంగా స్టైల్ ఐకాన్స్ అవార్డుల ప్రధానోత్సవం (ఫొటోలు)
-
దిల్ రాజుకు హ్యాండిచ్చిన బన్నీ.. ‘ఐకాన్’ అటకెక్కినట్టేనా!
కొన్నేళ్లుగా అల్లు అర్జున్ ‘ఐకాన్’ అనే సినిమా చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయిపోయింది. భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు దిల్ రాజు కూడా రెడీగా ఉన్నాడు. కానీ బన్ని మాత్రం ఎందుకో ఈ ప్రాజెక్ట్ ను ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మరోసారి సేమ్ సీన్ రిపీట్ చేశాడని ఇండస్ట్రీలో జోరుగా టాక్స్ వినిపిస్తున్నాయి. ఐకాన్ ప్రాజెక్ట్ లో ఐకాన్ స్టార్ అడుగు పెట్టడం లేదంటూ మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి. ఎప్పుడో 2018లో నా పేరు సూర్య రిలీజ్ తర్వాత చేయాల్సిన సినిమా ఇది. కాని అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ ను పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నాడు. ఒకసారి అలవైకుంఠపురములో తర్వాత స్టార్ట్ చేస్తాడని టాక్ వినిపించింది. ఆ తర్వాత ఇమిడియెట్ గా పుష్ప స్టార్ట్ అయింది. ఫుష్ప పార్ట్ 1 రిలీజైన తర్వాత తెరకెక్కుందని టాక్ వినిపించింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు బన్ని మరో ప్రాజెక్ట్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నాడట. ఐకాన్ ప్రాజెక్ట్ ను మరోసారి పెండింగ్ లో పెట్టాలనుకుంటున్నాడట. మరికొద్ది రోజుల్లో పుష్ప పార్ట్ 1న షూటింగ్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నిజానికి వేణుశ్రీరామ్ మేకింగ్ లో ఐకాన్ స్టార్ట్ చేయాలి. కాని ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్లేస్ లో బోయపాటితో సినిమా చేయాలనుకుంటున్నాడట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అంతకుమించిన వసూళ్లను, పైగా పాన్ ఇండియా స్థాయిలో కొల్లగొట్టాలి అనుకుంటున్నాడట అల్లు అర్జున్. మరి బన్నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. -
ముచ్చటగా మూడోసారి!..బుట్టబొమ్మతో బన్నీ స్టెప్పులు
‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా కనిపించన్నారనే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డేను ఎంపిక చేయాలనుకుంటున్నారట. ‘ఐకాన్’ ప్రకటించి చాలా నెలలైన నేపథ్యంలో గతంలోనే హీరోయిన్ పాత్రకు పూజా హెగ్డే పేరును చిత్రబృందం పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్ల జాబి తాలోకి వేరే తారల పేర్లు వచ్చినప్పటికీ పూజానే ముందు వరుసలో ఉన్నారట. మరి.. అల్లు అర్జున్, పూజా అల... మూడోసారి జంటగా కనిపిస్తారా? వేచి చూడాలి. చదవండి : మోహన్ లాల్, మమ్ముట్టిలకు యూఏఈ అరుదైన గౌరవం చిరంజీవి బర్త్‌డే వేడుకలో కనిపించని అల్లు అర్జున్, ఏమైంది.. -
'ఐకాన్' స్టార్ ప్రయోగం : అంధుడిగా అల్లు అర్జున్!
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్నా నటిస్తుంది. రెండు భాగాలుగా వస్తోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక పుష్ప షూటింగ్ అనంతరం అల్లు అర్జున్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘కనుబడుట లేదు’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కబోతున్న ఈ మూవీలో బన్నీకి నిజంగానే కళ్లు కనిపించవట. అంధుడి పాత్రలో బన్నీ కనిపించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఐకాన్ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. గతంలో మాస్ మహారాజా రవితేజ కూడా ‘రాజా ది గ్రేట్’ సినిమాలో అంధుడి పాత్రలో నటించి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి బన్నీ చేయనున్న ఈ ప్రయోగంలో ఎంత వరకు సక్సెస్ అవుతారన్నది చూడాల్సి ఉంది. చదవండి : పది కేజీఎఫ్‌లు ఒక్క పుష్పతో సమానం: ఉప్పెన డైరెక్టర్ అల్లు అర్జున్ సతీమణి స్నేహ సరికొత్త రికార్డు -
అల్లు అర్జున్ను దారుణంగా అవమానించిన దిల్ రాజు!
అల్లు అర్జున్- దిల్‌రాజు కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారని, మూవీ మోషన్ పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. ఈ మూవీకి 'ఐకాన్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను కూడా అనౌన్స్ చేసేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ మూవీ పట్టాలెక్కలేదు. సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న పుష్ప మూవీలో అల్లు అర్జున్ నటిస్తుండగా, డైరెక్టర్ వేణు శ్రీరామ్ వకీల్‌సాబ్ మూవీని తెరకెక్కించడంలో బిజీ అయిపోయారు. దీంతో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన దిల్ రాజ్ ఐకాన్‌పై వస్తున్న వార్తలపై స్పందించారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తన తదుపరి చిత్రం ఐకాన్ ఉండబోతుందని, త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమాలో బన్నీ పాత్రపై మాత్రం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంతేకాకుండా స్టైలిష్ స్టార్ బన్నీకి ఐకాన్ స్టార్ అనే టైటిల్‌ను తాము పెట్టలేదని, బన్నీ తనకు తాను పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో, వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరినందువల్ల, బన్నీ ఈ సినిమాలోనటించడం లేదని ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ముందు నుంచీ ఈ ప్రాజెక్టుపై బన్నీ ఆసక్తి చూపడం లేదని, అందుకే పుష్ప తర్వాత కొరటాల డైరెక్షన్లో మూవీ చేసేందుకు రెడీ అయిపోయాడని తెలుస్తోంది. అయితే వకీల్‌సాబ్ హిట్‌తో వేణు శ్రీరామ్ డైరెక్షన్లో 'ఐకాన్' చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించవచ్చని దిల్ రాజు భావించడట. కానీ వేణు శ్రీరామ్‌ని కాదని, బన్నీ ఇంకో మూవీ కమిట్ అవ్వడంపై దిల్ రాజ్ అసహనం వ్యక్తం చేస్తున్నారట. అందుకే ఐకాన్ మూవీలో బన్నీ కాకుండా మరో హీరోతో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది. ఈ వార్తలపై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. చదవండి : 'అతని వల్లే ఆర్తి అగర్వాల్ కెరీర్ ఫేడ్ అవుట్ అయ్యింది' పుష్ప: తగ్గేదే లే అంటున్న నిర్మాతలు.. ఆ సీన్ కోసం 40కోట్లు! -
బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఐకాన్’ మూవీపై దిల్‌రాజు క్లారిటీ
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ముందుగా అనుకున్న తేది ప్రకారం ఆగష్టు 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనుకోకుండా కరోనా సెకండ్ వేవ్ పంజా విసురుతుండటంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. తో పుష్ప విడుదల మరో నాలుగు నెలలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగష్టు 13 తేదీని వాయిదా వేసి డిసెంబర్ 17న రిలీజ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా పుష్ప అనంతరం బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఏ క్లారిటీ రాలేదు. ఇప్పటి వరకు ఏ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చదవండి: అల్లు స్నేహారెడ్డి ఐడియాకి సమంత ఫిదా అయితే పుష్పకు ముందు శ్రీరామ్ వేణు డైరెక్షన్ బన్నీ ‘ఐకాన్’..కనబడుట లేదు అనే ట్యాగ్‌లైన్‌తో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు దీన్ని నిర్మించనున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల అది వీలు కాకపోవడంతో తరువాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో, శ్రీరామ్ పవన్ ‘వకీల్ సాబ్’ సినిమాతో బిజీ అయిపోయారు. అయితే ఇటీవల జరిగిన వకీల్‌సాబ్ ప్రమోషనల్లో దర్శకుడు శ్రీరామ్‌ను అందరూ బన్నీతో ఐకాన్ సినిమా ఎప్పుడు స్టార్ కానుందని ప్రశ్నించారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ప్రారంభంపై తనకు ఎలాంటి అప్డేట్ అందలేని సమాధానమిచ్చారు. చదవండి: తమ్ముడికి కంగ్రాట్స్ చెప్పిన అల్లు అర్జున్.. కారణం ఇదే తాజాగా ఐకాన్ సినిమాపై నిర్మాత దిల్‌రాజ్ క్లారిటీ ఇచ్చారు. వకీల్‌సాబ్ ప్రెస్ మీట్లో ఐకాన్‌కు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటలతో బన్నీ ఐకాన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. తమ తక్షణ తదుపరి ప్రాజెక్టు ఐకాన్ అని దిల్‌రాజు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా నాకు ఈ స్క్రిప్ట్‌తో బాగా కనెక్ట్ అయ్యాను. నా హార్ట్‌కు టచ్ అయ్యింది. శ్రీరామ్‌వేణు స్టోరీ వినిపించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు దీనిపై పనిచేయాలన్న ఆసక్తి ఏర్పడింది. ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం’. అని వెల్లడించారు. -
బన్నీ ‘ఐకాన్’పై మరోసారి క్లారిటీ..
గతేడాది అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ‘ఐకాన్- కనబడుటలేదు’ అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ మైండ్ ఫ్రెండ్, ఎమ్సీఏ సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలిపారు. త్రివిక్రమ్, సుకుమార్‌లతో సినిమాల అనంతరం ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లనున్నట్టుగా చెప్పారు. బన్నీ కేరీర్లో 21వ చిత్రంగా దీనిని ప్రకటించారు. అయితే ఆ తర్వాత నుంచి ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వెలువడలేదు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు వేణు శ్రీరామ్.. పవన్ కల్యాణ్ హీరోగా ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందని అనుకున్నారు. అయితే సరిగా ఏడాదికి అంటే.. ఈ ఏడాది బన్నీ బర్త్ డే సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చేసిన ట్వీట్ చూస్తే ఐకాన్ మూవీ త్వరలోనే పట్టాలెక్కనున్నట్టుగా తెలుస్తోంది. ఐకాన్ టీమ్ తరఫును బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే గతేడాది ఏ పోస్టర్‌ను అయితే విడుదల చేశారో.. ఇప్పుడు కూడా అదే పోస్టర్‌ను పోస్ట్ చేశారు. అయితే పుష్ప చిత్రం పూర్తయిన తర్వాత ఐకాన్ మూవీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొంతకాలం కిందట వేణు శ్రీరామ్ పవన్ సినిమాతో బిజీగా మారడంతో ఐకాన్ మూవీ ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. గతంలో ఈ వార్తలను అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాస్ ఖండించారు. ఐకాన్ ప్రాజెక్ట్ ఆగిపోలేదని.. ఆ కథ బన్నీకి బాగా నచ్చిందని అతి త్వరలో ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలిపారు. కాగా, ఐకాన్ చిత్రంలో బన్నీ ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. Team #ICON wishes Stylish Star @alluarjun a Very Happy Birthday! #HappyBirthdayAlluArjun pic.twitter.com/jeRDhpc4zw — Sri Venkateswara Creations (@SVC_official) April 8, 2020 చదవండి : బన్ని బర్త్‌డే.. ‘నువ్వు బాగుండాలబ్బా’ బన్ని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన సుకుమార్ -
ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్న బన్నీ, మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. త్రివిక్రమ్ సినిమా తరువాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు బన్నీ. తాజా సమాచారం ప్రకారం ఐకాన్‌ను పక్కన పెట్టి సుకుమార్ సినిమాను లైన్లోకి తీసుకువచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. సుకుమార్‌తో ఉన్న స్నేహం కారణంగా బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ముందుగా సుకుమార్ సినిమాను పూర్తి చేసి, తరువాత ఐకాన్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. తన హోమ్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌తో కలిసి హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్ విలన్‌గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్ టబు, మలయాళ నటుడు జయరామ్, మురళీ శర్మలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
బన్నీపై దుష్ప్రచారం : స్పందించిన మెగా టీం
కొద్ది రోజులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ముందుగా ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న సినిమాకు సంబంధించి కో డైరెక్టర్‌తో అల్లు అర్జున్‌కు గొడవ అయినట్టుగా వార్తలు వచ్చాయి. తరువాత బన్నీ కొత్తగా కొన్న కారవాన్‌కు ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా లోకేషన్లో బన్నీ డిమాండ్లు నిర్మాతలకు తలనొప్పిగా మారాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే వరుసగా వస్తున్న ఈ నెగెటివ్ వార్తలపై మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, పీఆర్వో, నిర్మాత ఎస్కేఎన్ స్పందించాడు. అల్లు అర్జున్ పై జరుగుతున్న దుష్ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. పద్దెనిమిదేళ్లుగా అల్లు అర్జున్ ఎంతో కష్టపడి, శ్రమించి తెచ్చుకున్న స్టార్ ఇమేజ్ను కొన్ని వార్తలు తగ్గించలేవు. అంకితభావం, సాయం చేసే మనస్థత్వం ఆయన్ని ఎప్పుడూ అభిమానులకు మరింత చేరువ చేస్తుంది. చివరకు ఎవరు విజయం సాధిస్తారో చూద్దాం. ప్రస్తుతం ఏఏ19 చిత్రీకరణ జరుగుతోంది అదే సమయంలో తదుపరి రెండు చిత్రాల ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అంటూ ట్వీట్ చేశారు ఎస్కేఎన్. ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్‌తో పాటు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. Dear invisible enemy Few Negative articles can't bring down 18 years hard work of a down to earth star. His dedication & helping nature always connect him with his followers Let's see who ll have last smile Super fantastic #AA19 getting ready& 20,21's pre production work in swing — SKN (@SKNonline) July 27, 2019 -
బన్నీకి జోడిగా రాశీ
విజయవంతమైన సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్ ట్యాగ్ అందుకోలేకపోయిన నటి రాశీఖన్నా. ఎక్కువగా మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు సినిమాలతో ఉన్నారు. వెంకటేష్, నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న వెంకీ మామతో పాటు సాయి ధరమ్ తేజ్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతి రోజూ పండగే సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగానే ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్గా రాశీ పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బన్నీ తరువాత వేణు శ్రీరాం దర్శకత్వంలో ఐకాన్ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నాను హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్వారిటీ వచ్చే అవకాశం ఉంది. -
అల్లు అర్జున్ కెరీర్లో తొలిసారిగా..!
2003లో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయిన బన్నీ ఇప్పటి వరకు 18 సినిమాల్లో హీరోగా నటించాడు. బన్నీ చేయబోయే 19, 20వ సినిమాలు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈసినిమాలన్నింటిల్లో బన్నీ ఒక్కసారి కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ తొలిసారిగా బన్నీ డ్యూయల్ రోల్‌కు ఓకె చెప్పాడట. ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఐకాన్ అనే సినిమాను ప్రకటించారు. ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడట. అంతుకాదు రెండు పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలు పూర్తయిన వెంటనే ఐకాన్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది. -
నాష్‌విల్లేలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నాష్విల్లే : అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా), ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ నాష్విల్లే(ఐసీఓఎన్)లు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. నాష్‌విల్లేలోని వాండెర్‌బిల్ట్ విశ్వవిద్యాలయ వేదికగా రాధిక రెడ్డి, లావణ్య రెడ్డి, బిందు మాధవి, శిరీష కేస, రవళి కల్లు తదితరుల ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షురాలు చల్లా కవిత హాజరయ్యారు. మహిళా దినోత్సవంలో భాగంగా ఆటా, ఐసీఓఎన్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాయి. ఇందులో భాగంగా మహిళలు తమ ప్రతిభకు పదును పెడుతూ పోటాపోటీగా ఆటపాటలతో అలరించారు. షాపింగ్ మేళాను నిర్వహంచారు. ఇండియన్ స్పెషల్ వంటకాలు, డ్యాన్స్‌లు, పాటలతో సభా ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఇండియన్ రిజినల్ లాంగ్వేజస్, కమ్యూనిటీ సర్వీస్‌లో కృషి చేసిన మహిళలు గ్రీష్మా బినోష్, హారిక కనగాల, కిరుతీగ వాసుదేవన్, శ్యామలి ముఖర్జీ, రచన కెడియా అగర్వాల్, డాక్టర్ అరుందతి రామేష్లను ఆటా సన్మానించింది. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆటా బోర్డు సభ్యులు జయంత్ చల్లా, అనిల్ బోడిరెడ్డి, రామకృష్ణారెడ్డి ఆళ్ల, శివ రామడుగు, సుశీల్ చందా, శ్రీహాన్ నూకల, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆటా నేతృత్వంలో మహిళలకు తైక్వాండో శిక్షణ
నాష్విల్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా-ATA), ఇండియన్ కమ్యూనిటీ నాష్విల్ (ICON) ఆధ్వర్యంలో ప్రతీ ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఈ వేడుకలో భాగంగా మహిళకు తైక్వాండోలో శిక్షణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణలో 25మంది పాల్గొన్నారని, వారందరికి రచన అగర్వాల్ నేతృత్వంలో శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. 2008 నుంచి తైక్వాండోలో నిపుణులైన రచన.. మహిళలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఉండేలా వారికి తర్ఫీదునిస్తున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 9న జరుపనున్నట్లు కమిటీ హెడ్ రాధికా రెడ్డి తెలిపారు. -
అంబేడ్కర్ ఓ ఐకాన్ మాత్రమే..!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రాజకీయాల్లో నేడు డాక్టర్ అంబేడ్కర్ అత్యంత ప్రజాదరణ కలిగిన చారిత్రక పురుషుడు. ప్రతి పార్టీ ఎన్నికల సందర్భంగానో, జయంతి, వర్ధంతుల సందర్భంగానో ఆయన ఉపన్యాసాల గురించి, భావాల గురించి మాట్లాడుతుంది. ‘సమాజంలో ఓ వెనకబడిన వర్గం నుంచి వచ్చిన నేను ఈ రోజున ప్రధాన మంత్రి అయ్యానంటే అందుకు కారణం అంబేడ్కర్’ ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎన్నికలు సమీపించినా ఆయన అంబేడ్కర్ పేరును తలవకుండా ఉండలేరు. ఆయన దేశంలో డిజిటల్ లావాదేవీల కోసం ‘భీమ్’ యాప్‌ను తీసుకొచ్చారు. భీమ్ అంటే మనలో ఎక్కువ మందికి దళితుల నినాదం ‘జైభీమ్’లోని అంబేడ్కర్ మనకు స్ఫురించరు. మహాభారతంలోని భీముడు మనకు స్ఫురిస్తారు. అది వేరే విషయం అనుకోండి! 1980వ దశకం వరకు కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన స్రవంతిలోని ఏ రాజకీయ పార్టీ అంబేడ్కర్ పేరును తలవలేదు. ఎన్నికల సందర్భంగా కూడా ప్రస్తావించలేదు. బీజేపీ మొదటి నుంచి ఆయనకు మరీ దూరంగా ఉంటూ వచ్చింది. పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం జయంతి, వర్ధంతులకు పూలదండలు వేసి మొక్కుబడికి నివాళులర్పించేవారు. 1990 దశకం వరకు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అంబేడ్కర్‌ను పట్టించుకోలేదని మేధావి, విద్యావంతుడు కంచ ఐలయ్య పేర్కొన్నారు. 1978లో ‘ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ ఏర్పాటుతో మరోసారి అంబేడ్కర్ ప్రజల దృష్టికి వచ్చారు. ఈ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసిన వ్యవస్థాప నాయకుల్లో ఒకరైన కాన్షీరామ్ 1984లో బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడంతో అంబేడ్కర్ పేరు మరింత ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాన్షీరామ్ శిష్యురాలు మాయావతి హయాంలో అంబేడ్కర్ పేరు మారుమోగిపోయింది. దళితుల ఓట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు అంబేడ్కర్‌ను ఎత్తుకోవడంతో ఆయన దళితులకు ఓ ఐకాన్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిన వీపీ సింగ్ ప్రభుత్వం 1990లో అంబేడ్కర్‌కు దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను ప్రకటించింది. జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలకు అంబేడ్కర్ అంటే అసలు పడేది కాదు కనుక స్వాతంత్య్ర రాజకీయాల్లో ఆయన వివాదాస్పద నాయకుడిగానే చెలామణి అయ్యారు. గాంధీజీని తాను కనీసం వ్యక్తిగత నైతిక ప్రమాణాల ప్రాతిపదికగా కూడా మహాత్ముడిగా గుర్తించనని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబేడ్కర్ వ్యాఖ్యానించడం పట్ల నాడు గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు నొచ్చుకున్నారు. బ్రిటీష్ ఇండియాలో ఎన్నికలు రెండు రకాలుగా ఉండాలని, దళితులకు ప్రత్యేక ఓటింగ్ విధానం ఉండాలని, వారు దళితులను మాత్రమే తమ ప్రతినిధులుగా ఎన్నుకుంటారంటూ అంబేడ్కర్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. దాన్ని విరమించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గాంధీజీ బెదిరించడంతో ఆ ప్రతిపాదనను ఆయన ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. 1956లో అంబేడ్కర్ మరణించినప్పుడు జవహరలాల్ నెహ్రూ తన సంతాప సందేశంలో ‘వెరీ కాంట్రవర్శియల్ ఫిగర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ (భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నాయకుడు)’ అని వ్యాఖ్యానించారు. ఇక ఆయన ఆత్మకథను రాసిన ధనుంజయ్ కీర్ ‘మోస్ట్ హేటెడ్ మేన్ ఇన్ ఇండియా (భారత్‌లో ఎంతో వ్యతిరేకత కలిగిన నాయకుడు)’గా వర్ణించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో విసిగిపోయిన అంబేడ్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీలను ఏర్పాటు చేసినా ఆయనకు ఓట్లు రాలలేదు. నేడు దళితుల ఓట్ల కోసం మాత్రం ప్రతి పార్టీ ఆయన పేరును నమ్ముకుంటోంది. అయినప్పటికీ అంబేడ్కర్కుగానీ, ఆయన రచనలకుగానీ నిజమైన గుర్తింపు రావడం లేదు. ఆయన్ని ఓట్లు కురిపించే ఓ ‘ఐకాన్’గానే చూస్తున్నారు. -
ఇంటి సమస్యకు 3–డీ ప్రింటింగ్ పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి పైగా తగిన ఇంటి వసతి లేకుండా బతుకు వెళ్లదీస్తున్నట్టు ‘వరల్ట్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్స్ రాస్ సెంటర్ ఫర్ సస్టయినబుల్ సిటీస్’నివేదిక వెల్లడించింది. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు ఏడింట ఒకవంతు మంది ప్రజలకు కనీసం జీవించడానికి అవసరమైన గూడు వంటి సౌకర్యం అందుబాటులో లేదు. అయితే ఇంత తీవ్రంగా మారిన ఇంటి సమస్య పరిష్కారానికి ‘ఐకాన్’ అనే లాభాపేక్ష లేని నిర్మాణ సాంకేతిక కంపెనీ ప్రపంచంలోనే తొలి 3–డీ (త్రీ డైమెన్షన్స్) ఇంటిని రూపొందించింది. ఈ డిజైన్, సరళిలో అనుమతి సాధించిన మొదటి ఇల్లు గత నెలలో అమెరికా టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో నిర్మితమైంది. అదీ కూడా 24 గంటల వ్యవధిలోనే... నాలుగు వేల డాలర్ల లోపు అయిన ఖర్చుతో... ఏదో ఇల్లు అనగానే చిన్న స్థలంలో, ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇరుకు ఇరుకుగా నిర్మించినదై ఉంటుందని మనకు అనిపిస్తుంది. అయితే ఈ 3–డీ ఇళ్లు మాత్రం ఒక హాలు, పడక గది, స్నానపుగది, ఆఫీసు కోసం ఉద్ధేశించిన చిన్న స్థలంతో కూడిన బాల్కనీ వంటివన్నీ ఇందులో అమరిపోయాయట. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పేదలు ఎదుర్కుంటున్న గృహ సమస్య పరిష్కారానికి ఈ డిజైన్ దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ ఇంటి కోసం తక్కువ స్థలమే అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసే అవకాశంతోపాటు , తక్కువ ఖర్చు కారణంగా డబ్బు ఆదా వంటి అంశాలు కలిసొస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతానికైతే ఐకాన్ సంస్థ ఆస్టిన్లోని ఈ ఇంటిని నమూనా (ప్రోటోటైప్) గా ఉపయోగిస్తోంది. దీనిని తమ కార్యాలయంగా ప్రయోగాత్మకంగా ఉపయోగించడంతో పాటు ఓ మోడల్‌గా ప్రదర్శిస్తోంది. ఒక చిన్న కుటుంబం అవసరాలు తీరేలా 3–డీ ప్రింటింగ్‌ను ఉపయోగించి ఇంటి డిజైన్‌ను రూపొందించిన కంపెనీ ఇదొక్కటే కాదు. చైనా, ఇటలీ, రష్యాలలో ఇలాంటి కంపెనీలు ఈ ప్రింటింగ్తోనే డిజైన్లు రూపొందించాయి. దుబాయ్ కూడా 3–డీ ప్రింటింగ్‌తో భవనాలు నిర్మించేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాళోజీ హెల్త్ వర్సిటీ లోగో విడుదల
తెలంగాణ పటం, కాకతీయ కీర్తితోరణం తెరిచిన పుస్తకం.. గ్రీకు చిహ్నంతో రూపకల్పన ఇక వర్సిటీలో పూర్తిస్థారుు కార్యకలాపాలు హన్మకొండ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారిక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కాళోజీ హెల్త్వర్సిటీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో వివిధ మెడికల్ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు, పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ తరఫున అధికార లోగో అవసరం ఏర్పడింది. కాళోజీ వర్సిటికి సంబంధించి అధికారిక లోగోను ప్రకటించాల్సిందిగా వైస్‌చాన్స్‌లర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ లోగోలను ప్రభుత్వం పరిశీలించింది. చివరకు తెలంగాణ రాష్ట్ర పటం దానిపై కాకతీయ కళాతోరణం.. వీటికి ముందు తెరిచిన పుస్తకంలో వైద్యవృత్తికి సంబంధించిన గ్రీకు ఆరోగ్య చిహ్నం (క్యాడిసియోస్)లతో కూడిన చిత్రాన్ని కాళోజీ వర్సిటీ అధికారిక లోగోగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోగోకు ఇరువైపులా సురక్ష చిహ్నాలైన ఆకులు ఉన్నాయి. లోగోకు కింది భాగంలో సర్వేజనా సుఖినోభవంతు అనే నినాదాన్ని చేర్చారు. వృత్తాకారంలో ఉన్న ఈ లోగో పైభాగంలో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, వరంగల్, తెలంగాణ రాష్ట్రం అని ముద్రించారు. హన్మకొండ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారిక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కాళోజీ హెల్త్వర్సిటీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో వివిధ మెడికల్ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు, పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ తరఫున అధికార లోగో అవసరం ఏర్పడింది. కాళోజీ వర్సిటికి సంబంధించి అధికారిక లోగోను ప్రకటించాల్సిందిగా వైస్‌చాన్స్‌లర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ లోగోలను ప్రభుత్వం పరిశీలించింది. చివరకు తెలంగాణ రాష్ట్ర పటం దానిపై -
నెట్‌పై భారత్ వైఖరికి అమెరికా మద్దతు
న్యూఢిల్లీ : ఇంటర్నెట్ గవర్నెన్స్ విషయంలో ప్రపంచ దేశాల ప్రజలంతా కూడా పాలుపంచుకోవాలన్న భారత్ వైఖరిని అమెరికా సమర్థించింది. దీనిపై ఇరు దేశాల అభిప్రాయాలు ఒకటేనని అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి క్యాథరిన్ ఎ నొవెలీ పేర్కొన్నారు. ఇటీవల అర్జెంటీనాలో జరిగిన ఐకాన్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఇంటర్నెట్ గవర్నెన్స్‌పై భారత్ సముచితంగా స్పందించిందని ఆమె తెలిపారు. కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కి పంపిన ఈమెయిల్లో నొవెలీ ఈ అంశాలు ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ఇంటర్నెట్ నిబంధనలు, విధానాల రూపకల్పనలో ఐకాన్ కీలక పాత్ర పోషిస్తోంది. -
బల్దియాకు మరో అవార్డు
ఐకాన్ ఎస్డబ్ల్యూఎం-2014 ప్రకటించిన నిపుణుల కమిటీ గవర్నర్ చేతుల మీదుగా నేడు అందుకోనున్న కమిషనర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : ఓరుగల్లు నగర పాలక సంస్థ మరో అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైంది. క్లీన్‌సిటీ పేరుతో చెత్త ప్రక్షాళన నిబంధనవళి(సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్), పర్యావరణ పరిరక్షణ ప్రామాణికాలను సమర్థంగా అమలుచేస్తుండడంతో ఐకాన్ ఎస్డబ్ల్యూంం-2014 అవార్డు ఇవ్వాలని నిపుణుల కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ యూనివర్సిటీలో రెండు రోజులుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై జరుగుతున్న నాలుగో అంతర్జాతీయ సదస్సులో నిర్ణయించారు. దీంతో గురువారం సాయంత్రం అవార్డును గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా బల్దియా కమిషనర్ సువర్ణ పండాదాస్ స్వీకరిస్తారని అధికారులు తెలిపారు. రాష్ర్టంలోనే మొదటిసారిగా.. నగరాలు, పట్టణాలకు సమస్యగా మారడమే కాకుండా పర్యావరణానికి ముప్పుగా పరిణమించిన చెత్త వ్యవహారంపై.. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అమలుచేయాలని 2012 అక్టోబర్‌లో కేంద్రప్రభుత్వం కార్పొరేషన్లను ఆదేశించింది. దీంతో రాష్ర్టంలోనే మొదటిసారిగా వరంగల్‌లో క్లీన్‌సిటీ చాంపియన్‌షిప్ ప్రారంభించారు. ఆందులో భాగంగా ఇంటింటా తడి, పొడి చెత్త సేకరించడమే కాకుండా సేకరించిన చెత్త ద్వారా వర్మీ కంపోస్టు, బయో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి, పొడి చెత్తను విక్రయింయించడం వంటి ప్రక్రియల ద్వారా ఆదాయాన్ని పోగు చేస్తున్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఐకాన్-2014 అవార్డును ప్రకటించారు. కాగా, బల్దియాకు గతంలో కూడా ఐఎస్ఓ-14,001 సర్టిఫికెట్, జాతీయ స్థాయిలో ఉత్తమ శానిటేషన్ నిర్వహణ అవార్డు లభించగా, ఐసీఎల్ఈఐ సంస్థ సభ్యత్వాన్ని కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఐకాన్ అవార్డు రావడంపై బల్దియా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం అవార్డు స్వీకరించడానికి ముందు బల్దియా కమిషనర్ సువర్ణ పండాదాస్.. వరంగల్ క్లీన్‌సిటీ అమలును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. దీనిపై చర్చించేందుకు బుధవారం సాయంత్రం కమిషనర్, ఎంహెచ్ఓ ధన్‌రాజ్ సమావేశమై సమాలోచనలు చేశారు.