బన్నీకి జోడిగా రాశీ | Rashi Khanna to romance Allu Arjun In Icon | Sakshi
Sakshi News home page

బన్నీకి జోడిగా రాశీ

Jul 10 2019 11:42 AM | Updated on Jul 10 2019 11:42 AM

Rashi Khanna to romance Allu Arjun In Icon - Sakshi

విజయవంతమైన సినిమాల్లో నటించినా స్టార్ హీరోయిన్‌ ట్యాగ్‌ అందుకోలేకపోయిన నటి రాశీఖన్నా. ఎక్కువగా మీడియం రేంజ్‌ హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్న ఈ‍ బ్యూటీ ప్రస్తుతం రెండు సినిమాలతో ఉన్నారు. వెంకటేష్‌, నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న వెంకీ మామతో పాటు సాయి ధరమ్‌ తేజ్‌, మారుతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతి రోజూ పండగే సినిమాలోనూ నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాలు సెట్స్‌ మీద ఉండగానే ఈ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా రాశీ పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న బన్నీ తరువాత వేణు శ్రీరాం దర్శకత్వంలో ఐకాన్‌ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నాను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే క్వారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement