
‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ పూజా హెగ్డే జంటగా కనిపించన్నారనే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డేను ఎంపిక చేయాలనుకుంటున్నారట.
‘ఐకాన్’ ప్రకటించి చాలా నెలలైన నేపథ్యంలో గతంలోనే హీరోయిన్ పాత్రకు పూజా హెగ్డే పేరును చిత్రబృందం పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత హీరోయిన్ల జాబి తాలోకి వేరే తారల పేర్లు వచ్చినప్పటికీ పూజానే ముందు వరుసలో ఉన్నారట. మరి.. అల్లు అర్జున్, పూజా అల... మూడోసారి జంటగా కనిపిస్తారా? వేచి చూడాలి.
చదవండి : మోహన్ లాల్, మమ్ముట్టిలకు యూఏఈ అరుదైన గౌరవం
చిరంజీవి బర్త్‌డే వేడుకలో కనిపించని అల్లు అర్జున్, ఏమైంది..
Comments
Please login to add a commentAdd a comment