
నాష్విల్ : అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా-ATA), ఇండియన్ కమ్యూనిటీ నాష్విల్ (ICON) ఆధ్వర్యంలో ప్రతీ ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఈ వేడుకలో భాగంగా మహిళకు తైక్వాండోలో శిక్షణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణలో 25మంది పాల్గొన్నారని, వారందరికి రచన అగర్వాల్ నేతృత్వంలో శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. 2008 నుంచి తైక్వాండోలో నిపుణులైన రచన.. మహిళలు తమను తాము రక్షించుకునేందుకు వీలుగా ఉండేలా వారికి తర్ఫీదునిస్తున్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 9న జరుపనున్నట్లు కమిటీ హెడ్ రాధికా రెడ్డి తెలిపారు.



Comments
Please login to add a commentAdd a comment