కాళోజీ హెల్త్ వర్సిటీ లోగో విడుదల | Kaloji Health University logo released | Sakshi
Sakshi News home page

కాళోజీ హెల్త్ వర్సిటీ లోగో విడుదల

Published Thu, Apr 21 2016 1:18 AM | Last Updated on Tue, Oct 30 2018 7:57 PM

Kaloji Health University logo released

తెలంగాణ పటం,  కాకతీయ కీర్తితోరణం
తెరిచిన పుస్తకం..  గ్రీకు చిహ్నంతో రూపకల్పన
ఇక వర్సిటీలో పూర్తిస్థారుు కార్యకలాపాలు

హన్మకొండ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారిక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కాళోజీ హెల్త్‌వర్సిటీ  పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో వివిధ మెడికల్ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు, పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ తరఫున అధికార లోగో అవసరం ఏర్పడింది. కాళోజీ వర్సిటికి సంబంధించి అధికారిక లోగోను ప్రకటించాల్సిందిగా వైస్‌చాన్స్‌లర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ లోగోలను ప్రభుత్వం పరిశీలించింది. చివరకు తెలంగాణ రాష్ట్ర పటం దానిపై  

కాకతీయ కళాతోరణం.. వీటికి ముందు తెరిచిన పుస్తకంలో వైద్యవృత్తికి సంబంధించిన గ్రీకు ఆరోగ్య చిహ్నం (క్యాడిసియోస్)లతో కూడిన చిత్రాన్ని కాళోజీ వర్సిటీ అధికారిక లోగోగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోగోకు ఇరువైపులా సురక్ష చిహ్నాలైన ఆకులు ఉన్నాయి. లోగోకు కింది భాగంలో సర్వేజనా సుఖినోభవంతు అనే నినాదాన్ని చేర్చారు. వృత్తాకారంలో ఉన్న ఈ లోగో పైభాగంలో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం, వరంగల్, తెలంగాణ రాష్ట్రం అని ముద్రించారు.

 హన్మకొండ : కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం అధికారిక చిహ్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరం నుంచి కాళోజీ హెల్త్‌వర్సిటీ  పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. దీంతో వివిధ మెడికల్ కోర్సులకు సంబంధించి ప్రవేశాలు, పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్సిటీ తరఫున అధికార లోగో అవసరం ఏర్పడింది. కాళోజీ వర్సిటికి సంబంధించి అధికారిక లోగోను ప్రకటించాల్సిందిగా వైస్‌చాన్స్‌లర్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వివిధ లోగోలను ప్రభుత్వం పరిశీలించింది. చివరకు తెలంగాణ రాష్ట్ర పటం దానిపై

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement