2003లో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయిన బన్నీ ఇప్పటి వరకు 18 సినిమాల్లో హీరోగా నటించాడు. బన్నీ చేయబోయే 19, 20వ సినిమాలు కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈసినిమాలన్నింటిల్లో బన్నీ ఒక్కసారి కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. కానీ తొలిసారిగా బన్నీ డ్యూయల్ రోల్‌కు ఓకె చెప్పాడట.
ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఐకాన్ అనే సినిమాను ప్రకటించారు. ఓ మై ఫ్రెండ్, ఎమ్సీఏ సినిమాలను తెరకెక్కించిన వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడట. అంతుకాదు రెండు పాత్రలు పూర్తి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. త్రివిక్రమ్, సుకుమార్ సినిమాలు పూర్తయిన వెంటనే ఐకాన్ పట్టాలెక్కనుందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment