దేశీ అమ్మాయి కాస్త ప్రపంచ సుందరిగా కిరీటాన్ని కైవసం చేసుకుంది. అక్కడి నుంచి మొదలైన ఆమె విజయపరంపర ప్రభంజనంలా దూసుకుపోయింది. నటిగా మెప్పించి అందరీ అభిమానాన్ని పొందింది. అందివచ్చిన ప్రతి అవకాశన్ని అందిపుచ్చుకుంది. అవకాశం చిక్కినప్పుడల్లా మహిళ హక్కుల గురించి విరుచుకుపడేది. అదే ఆమెను ఫోర్బ్స్ మ్యాగజైనలో శక్తిమంతమైన మహిళగా నిలబెట్టింది. పైగా తన కళా నైపుణ్యంతో మహిళ సాధికారతనకు అసలైన నిర్వచనం ఇచ్చింది. ఎవరామె అంటే..
ఆ మహిళ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. సాధాసీధా దేశీ గర్ల్ నుంచి గ్లోబల్ ఐకాన్ రేంజ్‌కి ఎదిగింది. ఆమె స్వతంత్రంగా, శక్తిమంతంగా ఉంటుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించికుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ తనలోని కొత్త వెర్షన్‌ని పరిచయం చేసింది. ఒక కూతురిగా, సోదరి, భార్య, తల్లిగా ఇలా అన్ని రోల్స్‌కి సమన్యాయం చేసింది. 2000లో మిస వరల్డ్ పోటీలో సాధించిన గెలుపుతో మొదలైన ఆమె ప్రస్తానం వెనుతిరిగి చూడాల్సిన పనిలేకుండా..విజయపరంపరతో దూసుకుపోయింది.
అలాగే బాలీవుడ్‌లో కెరీర్‌ను మొదలుపెట్టి అతి తక్కువ కాలంలో వేలాదిమంది అభిమానుల మనుసును గెలుచుకుంది. అక్కడి నుంచి హాలీవుడ్‌లో ప్రవేశించి తన కెరియర్‌ని నిర్మించుకుంది. అలాగే ప్రియాంక నటించిన అంతర్జాతీయ వెబ్ సిరీస్ క్యాంటికో ఆమెకు మంచి పేరుని తెచ్చిపెట్టింది. అలా ఆమె గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకుంది.
2018లో విదేశీయుడు జోనాస్‌ని పెళ్లి చేసుకుని వివాహ బంధంలో ఉండే సాంప్రదాయ మూస పద్ధతులన్ని బద్దలు గొట్టింది. ఆ తర్వాత సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొంది..దానిపై ఉండే అపోహలను దూరం చేసింది. ఆమె తన నటనకు గానూ పద్మశ్రీ అందుకుంది. అలాగే యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమితురాలయ్యింది.
అంతేగాకుండా ఫోర్బ్స్ వందమంది శక్తిమంతమైన మహిళల్లో ఆమె ఒకరిగా నిలిచింది. ప్రియాంక తరుచుగా లింగ సమానత్వం, విద్య, మహిళల హక్కులపై తన గళాన్ని వినిపిస్తుంటుంది. అలాగే పలు టాక్ షోలు, ఇంటర్వ్యూలలో తన అభిప్రాయాలను చెప్పేందుకు వెనకాడలేదు. అంతేగాదు బాలీవుడ్‌లో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి, రావాల్సిన మార్పు గురించి మాట్లాడుతుంది. మహిళలు జీవించే ప్రపంచం ఉండకూడదు, మహిళలు అభివృద్ధి చెందే ప్రపంచం ఉండాలని నర్మగర్భంగా చెబుతుంది. అలాగే సరళమైన పదాల్లో స్త్రీల హక్కులు లేనందున స్త్రీవాదం అవసమరమయ్యిందని తనదైన శైలిలో కౌంటరిస్తుంటుంది.
ఆధునిక మహిళకు ప్రియాంక ఓ స్ఫూర్తి. తను ఎంచుకుని తీసే సిమాలలో అత్యంత శక్తిమంతమైన మహిళల పాత్రలతో సమాజానికి ఇవ్వాల్సిన సందేశం ఇస్తుంటుంది. అంతేగాదు తప్పు చేయడం మానవ సహజం దాన్నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ప్రధానమైనదని అంంటోంది. ఆమె అచంచలమైన శక్తి, అంకితభావం, సాధికారతకు ప్రియాంక నిలువెత్తు నిదర్శనం. ఓ స్త్రీగా ఏమేమో చేయొచ్చొ చేసి చూపించింది అందరికీ స్ఫూర్తిగా నిలిచింది.
(చదవండి: ఉషా చిలుకూరి..ఏయూ ప్రొఫెసర్ శాంతమ్మ మనవరాలే..!)
Comments
Please login to add a commentAdd a comment