‘సచిన్‌ రాముడైతే.. నేను హనుమంతుడిని’ | Virender Sehwag Says If Sachin Ram Iam Hanumant | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 9 2018 3:36 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Virender Sehwag Says If Sachin Ram Iam Hanumant - Sakshi

సెహ్వాగ్‌ షేర్‌ చేసిన ఫొటో

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతి విషయంపై తనదైన శైలిలో స్పందిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తనకు దైవంతో సమానమని ఎప్పుడు చెప్పే సెహ్వాగ్‌.. మరోసారి అతనిపై తనకున్న భక్తిని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు.  

సచిన్‌ రాముడైతే.. తాను హనుమంతుడిని అని తెలిపిన సెహ్వాగ్‌.. ఆ రాముడి, హనుమంతిడి స్టైల్‌లో దిగిన ఓ ఫొటోను షేర్‌ చేశాడు. దానికి క్యాప్షన్‌గా.. ‘దేవుడితో ఉన్నప్పుడు..అతని పాదాల వద్ద ఉండటం బాగుంది.’  అని పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌కు ఫిదా అయిన అభిమానులు.. అద్భుతమైన జోడి అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఓ అభిమానైతే ఏకంగా ‘సెహ్వాగ్‌ జీ.. మీరు సచిన్‌ నెంబర్‌ను మీ మొబైల్‌లో గాడ్‌జీ అని సేవ్‌ చేసుకున్నారా? దయచేసి సమాధానం ఇవ్వండి’ అని ప్రశ్నించాడు.   

93 అంతర్జాతీయ వన్డేల్లో సచిన్‌, సెహ్వాగ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగి 42.13 సగటుతో 3,919 పరుగులు చేశారు. 12 సెంచరీ, 15 హాఫ్‌ సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పి అత్యధిక పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement