ప్రముఖ క్రికెట్ ప్రేజేంటర్ గౌరవ్ కపూర్ హోస్ట్ చేస్తున్న బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సందడి చేశాడు. ఈ షోలో పాల్గొన్న సెహ్వాగ్‌కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆసియాలో అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరని గౌరవ్ కపూర్ ప్రశ్నించాడు.
అందుకు బదులుగా అతడు భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కాకుండా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్‌ను ఎంపిక చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. కాగా 2000లలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలతో పోటీపడిన ఆటగాళ్లలో ఇంజమామ్ వుల్ హక్ ఒకడు.
ఓవరాల్‌గా తన అంతర్జాతీయ కెరీర్‌లో 498 మ్యాచ్‌లు ఆడిన ఇంజమామ్.. 20,569 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 25 సెంచరీలు, వన్డేల్లో 10 సెంచరీలు సాధించాడు. అయితే వన్డేల్లో మాత్రం 83 హాఫ్ సెంచరీలు ఇంజమామ్ చేశాడు.
"అందరూ సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతారు. కానీ ఇంజమామ్-ఉల్-హక్ ఆసియాలో అతిపెద్ద మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. అయితే సచిన్ పాజీ అందరి కంటే ముందున్నాడు. అతడికి ఎవ్వరితో పోటీ లేదు. కానీ ఆసియాలో మాత్రం అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విషయానికి వస్తే.. ఇంజమామ్‌ను మించిన వారు లేరు.
2003-04 కాలంలో ఇంజమామ్ ఓవర్‌కి 8 పరుగులు చేసేవాడు. అతను తన బ్యాటింగ్ పార్టనర్‌కి భయపడొద్దు అని ధైర్యం చేప్పేవాడు. ఓ మ్యాచ్‌లో ఆఖరి 10 ఓవర్లలో 80 పరుగులు అవసరం. ఇటువంటి సమయంలో ఏ ఆటగాడైనా ఒత్తడికి గురవుతాడు. కానీ ఇంజమామ్ మాత్రం చాలా కూల్‌గా ఉంటాడు. అదే విధంగా 2005లో ఓ మ్యాచ్‌లో డానిష్ కనేరియా రౌండ్‌ది వికెట్ బౌలింగ్ చేసి కాస్త ఇబ్బంది పెట్టాడు.
భారీ షాట్లు ఆడకుండా నన్ను ఆపేందుకు కనేరియా ప్రయత్నించాడు. నేను ఒకట్రెండు ఓవర్లు ఢిపెన్స్ ఆడాను. ఆ తర్వాత ఇంజమామ్ వైపు తిరిగి... ‘‘ఇంజీ భాయ్... నా కాళ్లు నొప్పి పెడుతున్నాయ్. ఎంత సేపు డిఫెన్స్ ఆడాలని’’ అని అన్నాను. దానికి అతడు ‘‘నన్నేం చేయమంటావ్’’ అన్నాడు. అందుకు బదులగా "సర్కిల్ లోపలకి లాంగ్ ఆన్ ఫీల్డర్‌ని తీసుకురా, నేను సిక్స్ కొడతా అని ఇంజీతో చెప్పా.
దానికి ఇంజమామ్ నవ్వాడు. ‘‘సరే నేను సిక్సర్ కొట్టపోతే ఆ ఫీల్డర్‌ని మళ్లీ వెనక్కిపంపించు’’ అని చెప్పాను. అందుకు అతడు అంగీకరించి ఫీల్డర్‌ని సర్కిల్ లోపలకి పిలిచాడు. కనేరియా గూగ్లీ వేయగా.. నేను చెప్పినట్లగానే బంతిని స్టాండ్స్‌కు పంపించాను. ఫీల్డింగ్ మార్చినందుకు కనేరియాకు ఒక్క సారిగా కోపం వచ్చింది.
వెంటనే కెప్టెన్ దగ్గరికి వెళ్లి ‘ఇంజీ భాయ్, మీరు ఫీల్డర్‌ను ఎందుకు పైకి తీసుకువచ్చారు? అని ప్రశ్నించాడు. అందుకు బదులుగా నువ్వు సైలెంట్‌గా వెళ్లి బౌలింగ్ చెయి, లేదంటే బయటకు వెళ్లిపోతావు అని ఇంజీ భాయ్ అన్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment