'ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్..' పాట వినగానే హిందీ సినిమాల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి గుర్తుకొస్తాడు. 40 ఏళ్ల క్రితం మిథున్ హీరోగా నటించిన డిస్కో డ్యాన్సర్ సినిమాలోని ఈ పాట అప్పటికీ, ఇప్పటికీ పాపులరే.. అయితే కెరీర్ తొలినాళ్లలో తనతో నటించడానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదట. కలర్ తక్కువని పెద్ద హీరోయిన్స్ అతడిని దూరం పెట్టేవారట. పుట్టుకతో వచ్చిన రంగును ఎలాగూ మార్చలేం కాబట్టి తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకోవాలనుకున్నాడు. చివరకు అందరూ తన రంగు గురించి కాకుండా డ్యాన్స్ గురించి మాట్లాడుకునేలా చేశాడు.
డ్యాన్స్ వల్ల నా కలర్ పక్కనపెట్టారు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ.. 'నన్ను హీరోగా చూశాక జనాలు నాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. నా కొడుకును కూడా హీరో చేసేయొచ్చు అనుకున్నారు. నేను సామాన్య ప్రజల హీరోగా మారాను. కామన్ మ్యాన్‌కు సూపర్‌స్టార్ అవడం అనేది నాకు గొప్ప విషయం. నేను నా కాళ్లను కదిలిస్తూ డ్యాన్స్ చేస్తే ఎవరూ నా రంగు గురించి పట్టించుకోరనుకున్నాను. అదే నిజమైంది. నా డ్యాన్స్ వల్ల నా కలర్‌ను మర్చిపోయారు. ఎందుకంటే నలుపు రంగులో ఉన్నందున ఎవరూ నన్ను హీరోగా అంగీకరించలేకపోయారు. ఆ సందర్భంలో నాకు చాలా బాధేసేది. ఏడ్చేవాడిని కూడా!
ఆ హీరోయిన్ ఒక్కరే నన్ను పొగిడారు
పెద్ద హీరోయిన్స్ నావైపు కన్నెత్తి చూసేవారు కాదు.. నాతో నటించడానికి ఇష్టపడేవారు కాదు. నన్నసలు వాళ్లు హీరోగానే చూడలేదు. నాతో పని చేస్తే వారికి ఎటువంటి ఫేమ్ రాదని నన్ను పక్కనపెట్టేవాళ్లు. సరిగ్గా ఆ సమయంలో జీనత్ అమన్ వచ్చింది. ఇతడు చాలా బాగున్నాడు.. ఇతడితో నటించడానికేంటి సమస్య అని నా సరసన హీరోయిన్‌గా నటించింది. ఇక అప్పటినుంచి నా కెరీర్ బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది' అని చెప్పుకొచ్చాడు మిథున్ చక్రవర్తి.
చదవండి: చై మంచివాడు, సామ్ ఆ ఫోటో డిలీట్ చేసినందుకు నాపై ద్వేషం: ప్రీతమ్
Comments
Please login to add a commentAdd a comment