సూపర్ స్టార్లు బాలీవుడ్‌ను ఏడుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు మిథున్ చక్రవర్తి. 1970-80ల కాలంలో చలనచిత్ర పరిశ్రమ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జీతేంద్ర, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా లాంటి సూపర్ స్టార్ల హవా నడుస్తోంది. అలాంటి టైంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్‌గా నిలిచాడు. ఇప్పటికీ మిథున్ స్టార్‌డమ్ ఏ మాత్రం తగ్గ లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్లో మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా స్పెషల్ స్టోరీ.
బాలీవుడ్ ఎంట్రీ తరువాత చాలామంది స్టార్స్ తమ కెరీర్‌లో ప్లాప్ సినిమాలను చాలానే ఇచ్చారు. కానీ మిథున్ రూటే సెపరేట్. 47 ఏళ్ల కెరీర్‌లో ఏకంగా 180 ఫ్లాప్ చిత్రాలను ఖతాలో వేసుకున్న ఏకైక బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి. తాను నటించిన 370 సినిమాల్లో దాదాపు 200 సినిమాలు అతను చూడను కూడా చూడలేదని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు మిథున్. 47 మూవీలు డిజాస్టర్‌లు మిగుల్చుకున్న హీరో కూడా ఆయనే. 1990వ దశకంలో, మిథున్ వరుసగా అత్యధిక ఫ్లాప్ చిత్రాల రికార్డును నెలకొల్పాడు . 1993-98లో బ్యాక్-టు-బ్యాక్ 33 చిత్రాలు అట్టర్ ఫ్లాప్. అయితేనేం మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్‌గా భావిస్తున్నారు ఫ్యాన్స్.
చదవండి: పట్టుచీరలో మెరిసిన మాధురి, ఆ చీర ధర ఎంతో తెలుసా?
మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్‌డమ్ వెనుక కారణం ఏమిటంటే 50 హిట్ చిత్రాలే. ముఖ్యంగా 1976లో మృగయ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా తన తొలి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఆ తరువాత డిస్కో డ్యాన్సర్ సినిమాతో ‘ఐ యామ్ డిస్కో డ్యాన్సర్’ పాటతో భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ మ్యూజిక్ అప్పట్టో దేశమంతా మారుమోగి పోయింది. అంతేకాదు భారతదేశంలోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ.
మిథున్ ఎక్కడ పుట్టాడు?
1950 జూన్ 16న కోలకత్తాలో జన్మించిన మిథున్ B.Sc, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసాడు. వేలాదిమంది ఇతర బెంగాలీ యువకుల మాదిరిగానే నక్సలిజం పట్ల ఆకర్షితుడై 1960ల చివరలో పోరాటం బాట పట్టాడు. కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉన్నాడు. అయితే మిథున్ సోదరుడు ఘోర ప్రమాదంలో మరణించడంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అలా సినిమాల్లోకి హీరోగా మిథున్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనుదిరిగి చూడలేదు.హిట్స్, ఫ్లాప్స్‌తో లెక్కలేకుండా వరుస సినిమాలతో డైరెక్టర్లు, నిర్మాతల ఫ్యావరేట్‌గా అవతరించాడు. ఎంతో కష్టపడి హీరో స్థాయికి ఎదిగాననీ, ఒక దశలో హీరో కావాలనే తన కల నెరవేరదేమో అనుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు పలు సందర్భాల్లో మిథున్ చక్రవర్తి చెప్పాడు.
యోగితా బాలిని మిథున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మిథున్. వీరికి ముగ్గురు కుమారులు మిమో, నమషి, ఉస్మాయ్. కుమార్తె దిషానిని దత్తత తీసుకున్నారు. కుమారుడు నమాషి బ్యాడ్‌బాయ్ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. నటనతో పాటు, వ్యాపారం, టీవీ హోస్ట్‌గా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా కూడా సంపాదిస్తున్నారు. మిథున్ చక్రవర్తి నెట్‌వర్త్ దాదాపు రూ.400 కోట్లు అని అంచనా. అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులతోపాటు, మెర్సిడెస్ బెంజ్ 1975, టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్‌తో సహా అనేక విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి.
రాజకీయ జీవితం
తొలుత టీఎంసీ ఎంపీగా ఎన్నికైన మిథున్, ఆ తరువాత ఎంపీగా రాజీనామా చేసి మరీ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బీజేపీలో చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment