naxalite
-
ఎవరీ విక్రమ్‌గౌడ?
విక్రమ్‌గౌడ కుదురేముఖ్ జాతీయ ఉద్యానవనం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. కరావళి ప్రాంతంలో విక్రమ్‌గౌడ, మలెనాడు ప్రాంతంలో ముండగారు లతా బృందం చురుకుగా ఉండేవి. విక్రమ్‌గౌడ ఉడుపి జిల్లా హెబ్రి తాలూకా కూడ్లు నాడ్వాలు గ్రామ నివాసి. మొదట కార్మిక సంఘంలో పనిచేసిన విక్రమ్‌గౌడ ఆ తరువాత నక్సలైట్లలో చేరి అగ్రశ్రేణి నక్సల్‌గా ఎదిగారు. మూడుసార్లు కర్ణాటక పోలీసుల నుంచి తప్పించుకున్నారు. 2016 నుంచి కేరళ అటవీ ప్రాంతాల నుంచి కార్యకలాపాలను నడుపుతున్నారు. ఆయన మృతితో నక్సలైట్ నేతల సంఖ్య తగ్గింది. గతంలో పలువురి అరెస్టులు, లొంగుబాట్లు జరిగాయి.బనశంకరి: కర్ణాటక, కేరళ, తమిళనాడు పోలీసులకు మోస్ట్‌వాటెండ్ నక్సలైట్‌గా ఉన్న విక్రమ్ గౌడ ఎన్కౌంటర్లో చనిపోయారు. కర్ణాటకకు చెందిన నక్సల్స్ వ్యతిరేక దళం(ఏఎన్ఎఫ్) పోలీసులు సోమవారం రాత్రి ఉడుపి జిల్లాలో కబ్బినాలే అటవీ ప్రదేశంలో కూంబింగ్‌లో మట్టుబెట్టారు.ఎదురు కాల్పులు...విక్రమ్‌గౌడ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో 50 కి పైగా నేరాల్లో మోస్ట్ వాటెండ్‌గా ఉన్నారు. కొద్దిరోజులుగా ఉడుపి ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. దీంతో ఏఎన్ఎఫ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ జరుపుతున్నారు. ఐదుమంది నక్సలైట్లు నిత్యావసర వస్తువులను కొనడానికి కబ్బినాలెకు వచ్చినట్లు తెలిసి చుట్టుముట్టారు. ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి, ఇందులో విక్రమ్‌గౌడ (46) మరణించగా, మిగిలిన నక్సల్స్ పారిపోయినట్లు పోలీసు అధికారులు చెప్పారు.రూ.5 లక్షల రివార్డువిక్రమ్గౌడ, ముండగారు లతా, జయణ్ణ, వనజాక్షి, సుందరి అనేవారు నక్సల్ నేతలు కాగా, వారిపైన ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున బహుమానం ప్రకటించింది. గత 20 ఏళ్లు నుంచి నక్సల్ కార్యకలాపాల్లో విక్రమ్‌గౌడ పాల్గొంటున్నాడు. ఆయనపై చిక్కమగళూరు జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 50 కి పైగా దాడులు, విధ్వంసం కేసులు ఉన్నాయి.కేరళ నుంచి వచ్చి తూటాలకు చిక్కికేరళలో నక్సల్స్ కార్యకలాపాలు హెచ్చుమీరడంతో అక్కడ పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టారు. దీంతో చాలామంది నక్సల్స్ పొరుగునే ఉన్న ఉడుపి, మంగళూరు జిల్లాల్లోకి వచ్చారు. పశ్చిమ కనుమల్లోని అటవీ గ్రామాల పరిసరాల్లో తలదాచుకున్నారు. ఇటీవల కస్తూరిరంగన్ నివేదిక అమలు, అటవీ ప్రాంతం ఆక్రమణల తొలగింపు అంశాలపై ప్రజలతో సమావేశాలు జరిపారు. ఇది తెలిసి పెద్ద సంఖ్యలో పోలీసులు అడవుల్లో గాలింపు ప్రారంభించారు. విక్రమ్‌గౌడ మృతదేహాన్ని మంగళూరు ఆస్పత్రికి తరలించారు.లొంగిపోవాలని చెప్పాంబనశంకరి: ఎన్కౌంటర్ స్థలాన్ని మంగళవారం రాష్ట్ర ఆంతరిక భద్రతా విభాగం డీఐజీ రూపా మౌద్గిల్ పరిశీలించి మీడియాతో మాట్లాడారు. నక్సల్స్ కదలికల గురించి తెలిసి గాలింపు మొదలైంది, నక్సల్స్ ఎదురుపడ్డారు, లొంగిపోవాలని సూచించినప్పటికీ కాల్పులకు దిగారు. ఈ సమయంలో ఏఎన్ఎఫ్ బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో విక్రమ్‌గౌడ మృతిచెందారు. ఇతడిపై హత్య, దోపిడీలు, దొంగతనాలు తో పాటు 60 కి పైగా కేసులు ఉన్నాయి అని రూపా మౌద్గిల్ చెప్పారు. 10 రోజుల నుంచి గాలింపు జరుగుతోందని ఆమె చెప్పారు. -
అజ్ఞాత బాట.. కన్నీటి ఊట..
‘వెనకచ్చే ఆవుల్లారా.. ఎర్ర ఆవుల్లారో.. శ్రీరామ రామచంద్రుడా.. మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామచంద్రుడా.. ముందొచ్చే లేగల్లారా.. ముద్దు లేగల్లారో.. శ్రీరామ రామచంద్రుడా..మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామచంద్రుడా..’ అంటూ చదువు కోసం పట్నం వెళ్లిన కొడుకు కనిపించకుండా పోవడంతో కొడుకు తలపుల్లో తల్లి పడిన వేదనకు అద్దం పట్టే ఈ పాట ‘ఎన్కౌంటర్’ సినిమాలోనిది.సిరిసిల్ల: రాజన్న సిరిసిల్లజిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. సీపీఐ(ఎంఎల్) జనశక్తి నక్సలైట్ గ్రూపులో చేరి అడవిబాట పట్టాడు. 26 ఏళ్లు శ్రీనివాస్ జాడ తెలియక అతడి తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ, భూదమ్మలూ ఇదే తరహాలో తల్లడిల్లిపోయారు. చివ రికి శ్రీనివాస్‌ను కడసారి చూడకుండానే కన్నుమూశారు. పోలీస్ కౌన్సెలింగ్‌తో వెలుగులోకి..చాలాకాలం పాటు శ్రీనివాస్ ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ పేరుతో నక్సలైట్ ఉద్యమంలో పని చేస్తున్నాడని గుర్తించారు. దీంతో బండలింగంపల్లిలోని మ్యాదరి నారాయణ ఇంటికి పోలీసులు వచ్చి ‘మీ కొడుకు లొంగిపోయేలా చూడండి’ అంటూ.. కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజాఉద్యమ నిర్మాణంలో భాగంగా శ్రీనివాస్ ఒడిశా ప్రాంతంలో పనిచేస్తున్నాడని కొద్ది కాలం కిందట తెలిసింది. కానీ, అతని ఆచూకీ లేక కుటుంబసభ్యులు మనోవేదనకు గురయ్యారు. రాత్రిళ్లు వాకిట్లో అలికిడి అయితే చాలు కొడుకు వచ్చాడేమోననని ఆశ పడ్డారు. ఏళ్లతరబడి అతను ఎలా ఉన్నాడో... ఎక్కడున్నాడో తెలియలేదు.శ్రీనివాస్ అజ్ఞాతవాసం ఆ కన్నవారికి తీరని వేదన మిగిల్చింది. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా, ఆ మృతుల్లో ‘మావోడు ఉన్నాడో’నని ఆందోళన చెందారు. చివరకు కొడుకును చూడకుండానే 2017లో తల్లి భూదమ్మ చనిపోయింది. కొడుకు జాడ లేక, భార్య కన్నుమూసిన వేదనలో ఆ తండ్రి కూడా జూన్ 23న బండలింగంపల్లిలో కన్నుమూశాడు. నారాయణ దశదినకర్మ బుధవారం జరగనుంది. అజ్ఞాతంలో ఉన్న శ్రీనివాస్ ఎక్కడ, ఎలా ఉన్నారో జనశక్తి అగ్రనేతలు కూడా చెప్పలేకపోతున్నారు. -
ఒకపుడు నక్సలైట్.. హీరోగా 180 ఫ్లాప్స్.. అయినా తగ్గని స్టార్డమ్!
సూపర్ స్టార్లు బాలీవుడ్‌ను ఏడుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నటుడు మిథున్ చక్రవర్తి. 1970-80ల కాలంలో చలనచిత్ర పరిశ్రమ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, జీతేంద్ర, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా లాంటి సూపర్ స్టార్ల హవా నడుస్తోంది. అలాంటి టైంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్‌గా నిలిచాడు. ఇప్పటికీ మిథున్ స్టార్డమ్ ఏ మాత్రం తగ్గ లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వ ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల్లో మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా స్పెషల్ స్టోరీ. బాలీవుడ్ ఎంట్రీ తరువాత చాలామంది స్టార్స్ తమ కెరీర్లో ప్లాప్ సినిమాలను చాలానే ఇచ్చారు. కానీ మిథున్ రూటే సెపరేట్. 47 ఏళ్ల కెరీర్లో ఏకంగా 180 ఫ్లాప్ చిత్రాలను ఖతాలో వేసుకున్న ఏకైక బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి. తాను నటించిన 370 సినిమాల్లో దాదాపు 200 సినిమాలు అతను చూడను కూడా చూడలేదని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు మిథున్. 47 మూవీలు డిజాస్టర్లు మిగుల్చుకున్న హీరో కూడా ఆయనే. 1990వ దశకంలో, మిథున్ వరుసగా అత్యధిక ఫ్లాప్ చిత్రాల రికార్డును నెలకొల్పాడు . 1993-98లో బ్యాక్-టు-బ్యాక్ 33 చిత్రాలు అట్టర్ ఫ్లాప్. అయితేనేం మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్‌గా భావిస్తున్నారు ఫ్యాన్స్. చదవండి: పట్టుచీరలో మెరిసిన మాధురి, ఆ చీర ధర ఎంతో తెలుసా? మిథున్ చక్రవర్తి సూపర్ స్టార్డమ్ వెనుక కారణం ఏమిటంటే 50 హిట్ చిత్రాలే. ముఖ్యంగా 1976లో మృగయ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా తన తొలి జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఇక ఆ తరువాత డిస్కో డ్యాన్సర్ సినిమాతో ‘ఐ యామ్ డిస్కో డ్యాన్సర్’ పాటతో భారీ పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఈ మ్యూజిక్ అప్పట్టో దేశమంతా మారుమోగి పోయింది. అంతేకాదు భారతదేశంలోనే 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది ఈ బ్లాక్ బస్టర్ మూవీ. మిథున్ ఎక్కడ పుట్టాడు? 1950 జూన్ 16న కోలకత్తాలో జన్మించిన మిథున్ B.Sc, పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసాడు. వేలాదిమంది ఇతర బెంగాలీ యువకుల మాదిరిగానే నక్సలిజం పట్ల ఆకర్షితుడై 1960ల చివరలో పోరాటం బాట పట్టాడు. కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉన్నాడు. అయితే మిథున్ సోదరుడు ఘోర ప్రమాదంలో మరణించడంతో ఇంటికి తిరిగి రావాల్సి వచ్చింది. అలా సినిమాల్లోకి హీరోగా మిథున్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనుదిరిగి చూడలేదు.హిట్స్, ఫ్లాప్స్‌తో లెక్కలేకుండా వరుస సినిమాలతో డైరెక్టర్లు, నిర్మాతల ఫ్యావరేట్‌గా అవతరించాడు. ఎంతో కష్టపడి హీరో స్థాయికి ఎదిగాననీ, ఒక దశలో హీరో కావాలనే తన కల నెరవేరదేమో అనుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డట్టు పలు సందర్భాల్లో మిథున్ చక్రవర్తి చెప్పాడు. యోగితా బాలిని మిథున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మిథున్. వీరికి ముగ్గురు కుమారులు మిమో, నమషి, ఉస్మాయ్. కుమార్తె దిషానిని దత్తత తీసుకున్నారు. కుమారుడు నమాషి బ్యాడ్‌బాయ్ చిత్రంతో తెరంగేట్రం చేశాడు. నటనతో పాటు, వ్యాపారం, టీవీ హోస్ట్‌గా, బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా సంపాదిస్తున్నారు. మిథున్ చక్రవర్తి నెట్‌వర్త్ దాదాపు రూ.400 కోట్లు అని అంచనా. అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులతోపాటు, మెర్సిడెస్ బెంజ్ 1975, టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్‌తో సహా అనేక విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. రాజకీయ జీవితం తొలుత టీఎంసీ ఎంపీగా ఎన్నికైన మిథున్, ఆ తరువాత ఎంపీగా రాజీనామా చేసి మరీ 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో బీజేపీలో చేరాడు. -
పిడికెడు మట్టిని పిసికితే చారెడు కన్నీళ్లు రాలిన నేల.. రుద్రంగి చరిత్ర ఇదే!
రుద్రంగి రక్తచరిత్రకు సాక్ష్యం. నిత్య కల్లోలంతో పిడికెడు మట్టిని పిసికితే చారెడు కన్నీళ్లు రాలిన నేల. రాత్రయితే చాలు.. బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు.. ఇక్కడ పెరిగిన చెట్టుకు.. ఎగిరే పిట్టకు.. పుట్టకు.. గుట్టకు.. కన్నీటి కథలు తెలుసు.. తుపాకీ మోతలు.. గాలిలో కలిసే ప్రాణాలు.. ఇందిరమ్మ బొమ్మ సాక్షిగా తలను వేరు చేయబడిన మొండెం కళ్ల ముందు కనిపించిన దృశ్యం.. అణచివేత... తిరుగుబాటుకు సాక్ష్యం రుద్రంగి. ఊరు పెద్దదే అయినా.. దొరలు, భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా సాగిన పోరాటానికి చిత్రరూపమిస్తూ.. రుద్రంగి సినిమా రూపుదిద్దుకుంది. ఈ నెల 7న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రుద్రంగి సినిమాపై ‘సాక్షి’ ఈ వారం సండే స్పెషల్.. – సిరిసిల్ల దాడులు.. ప్రతిదాడులు మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి రుద్రంగి స్కూల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 2004లో ఉమ్మడి రాష్ట్రంలో నక్సలైట్లు, పోలీసుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో ప్రభుత్వం శాంతిచర్చలు జరిపింది. ఈ చర్చలు ముగి యగానే శాంతిని భగ్నం చేస్తూ ఎదురుకాల్పులు జరి గింది ఇక్కడే. మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. అంతకుముందు కొచ్చెగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు జనశక్తి నక్సలైట్లు మరణించారు. రుద్రంగి శివారులోని లింగంపేట వద్ద నక్సలైట్లు పేల్చిన మందుపాతరకు చందుర్తి ఎస్సై శ్రీనివాస్‌రావు మృత్యువాత పడ్డారు. చందుర్తి ఎంపీపీ గంగరాజంను నక్సలైట్లు ఇన్ఫార్మర్గా పేర్కొంటూ రుద్రంగిలో కాల్చిచంపారు. అంతకుముందు లక్ష్మి అనే మహిళను ఇన్ఫార్మర్ నెపంతో తల నరికి ఇందిరమ్మ విగ్రహానికి కట్టిన ఘటన అప్పట్లో సంచలనం. దాడులు, ప్రతిదాడులతో ఆ రుద్రంగి కన్నీటి ధారగా మారింది. పక్కనే దట్టమైన అడవి ఉన్న మానాల, మరిమడ్ల, వట్టిమల్ల, కలికోట, అంబారిపేట గిరిజనతండా, కొత్తపేట, లింగంపేట చుట్టూ ఊర్లతో రుద్రంగి కల్లోలమైంది. రుద్రంగిలో కొండాపూర్ ఎన్కౌంటర్ మృతుల పేరుతో జనశక్తి అమరవీరుల స్థూపం ఉంది. ఆ ఊరిపై ఉద్యమ గీతాలెన్నో జనబాహుళ్యంలోకి వెళ్లాయి. నిర్మాత మనోడే.. రుద్రంగి పేరుతో వస్తున్న ఈ సినిమాను 1960–90 ప్రాంతంలో జరిగిన సంఘటనలు, భూస్వామ్య వ్యవస్థ నేపథ్యంలో చిత్రీకరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రానికి నిర్మాత కాగా, అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు, ఆశీష్గాంధీ, విమలారామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు రైటర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న అజయ్సామ్రాట్ దర్శకుడు కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘రుద్రంగి నాది.. రుద్రంగి బిలాంగ్స్ టు మి’ అంటూ జగపతిబాబు చెప్పె డైలాగ్ గంభీరంగా ఉంది. జాలి, దయ లేని భీమ్రావు దొరగా జగపతిబాబు నటిస్తున్నారు. మొత్తానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక ప్రత్యేకతలు ఉన్న మేజర్ గ్రామం రుద్రంగిని వెండితెరకు ఎక్కించడం విశేషం. ఆ సినిమా ఎలా ఉంటుంది.. రుద్రంగి టైటిల్‌తో ఏం చెబుతారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈనెల 7న విడుదలకు సిద్ధమైంది. ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ హీరో బాలకృష్ణ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సిరిసిల్లకు చెందిన వెల్దండి వేణు దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘బలగం’ సినిమా విజయవంతం కాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా నేపథ్యంలో మరో సినిమా ‘రుద్రంగి’ వెండితెరపైకి రావడం విశేషం. ఎగిసిపడిన ఉద్యమాల ఖిల్లా రుద్రంగి సలుపుతున్న గాయాలముల్లె. వలపోతల కన్నీటిధార. 1975 దశకంలో ఎగిసిపడిన నక్సలైట్ ఉద్యమ కెరటం. చుక్కనీరు దొరకని దైన్యం. నిరుద్యోగం నిచ్చెన మెట్లతో గల్ఫ్ దేశాలకు వలసపోయిన బతుకులు. భూస్వామ్యపు అణచివేతలు.. చుట్టూరా ఎత్తయిన గుట్టలు.. గుట్ట కింద కుప్ప పోసినట్లుగా ఉండే ఇళ్లు. అందులో తాతల నాటి పెంకుటిండ్లే ఎక్కువగా కనిపిస్తాయి. గల్ఫ్ సిరులు తెచ్చిన బిల్డింగులు.. పదిహేను వేల జనాభాతో ఉన్న ఆ పల్లె రుద్రంగిగా వెండితెరకెక్కింది. రుద్రంగి ఒకప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్ద ఊరు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో ఓ మండల కేంద్రం. పసుపు, వరి, మొక్కజొన్న, పత్తి పంటలతో ఆ పల్లె ఇప్పుడు పసిడి రాసులతో తులనాడుతోంది. మా ఊరిలో నేను ఒక్కడినే నటించాను మా సొంతూరు రుద్రంగి. మా ఊరి పేరుతో వస్తున్న సినిమాలో నాకు నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమాపై మా ఊరి అందరిలో ఆసక్తి పెరిగింది. మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రుద్రంగి రాబోతుంది. ఆ సినిమాను వెండి తెరపై చూస్తేనే ఆసక్తిగా ఉంటుంది. – తోకల తిరుమల్, రుద్రంగి యువకుడు -
విద్యార్థిగా మారిన మోస్ట్ వాంటెడ్ నక్సల్.. చరిత్ర సృష్టించింది
వయసు పదిహేను ఏళ్లే. కానీ మోస్ట్ వాంటెడ్ నక్సలైట్. కొండకోనలే ఆవాసాలు. మారణాయుధాలతో సహవాసం. అయితే ఆమెలో ప్రస్తుతం మార్పు వచ్చింది. గన్లను వదిలి పుస్తకాలు, పెన్‌లను చేతబూనింది.. చదువుల్లో రాణించింది. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి చరిత్ర సృష్టించింది. ఇంతకు ఆమెలో ఇంత మంచి మార్పు ఎలా వచ్చింది. ఇందుకు కారణాలేంటో తెలుసుకుందాం. మహారాష్ట్రలోని గోండియాకు చెందిన ఇరావుల హిందుజ తండ్రి.. చిన్నతనంలోనే మరణించాడు. తల్లి మరో వ్యక్తిని వివాహమాడి వెళ్లిపోయింది. ఒంటరైన ఈమెను ఎవరూ దగ్గరికి తీయలేదు. దీంతో తాను నక్సలిజంలో చేరిపోయింది. ఒడిశాలోని గడ్చిరోలి, మహారాషష్ట్రలోని గోండియా ప్రాంతాల్లో మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్టులో చేరింది. పేరుమోపిన నక్సలైట్‌గా మారింది. పదిహేనేళ్లలోనే హిందుజపై ఆరు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, అయితే గోండియా ప్రాంతానికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి ఎస్పీ సందీప్ అతోల్ ఈ విశయంపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆవిడను సరైన దిశగా మార్చడంలో విజయం సాధించారు. 2018లోనే ఎస్పీ సలహాతో అటవి మార్గం విడిచి, జనావాసాలను చేరింది. పోలీసు అధికారి సందీప్ అతోల్ మద్దతుతో చదువును కొనసాగించింది. ప్రస్తుతం ఇంటర్లో 45.83 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. సందీప్ అతోల్ కుటుంబమే తన కుటుంబమని అంటోంది. భవిష్యత్‌లో పోలీసు ఉద్యోగం సాధిస్తానని చెబుతోంది. సమస్యల పరిష్కారానికి అటవి దారి ఒక్కటే మార్గం కాదని తెలిపింది. చదవండి: సివిల్స్ ఫలితాల్లో ఇద్దరికి ఓకే ర్యాంకు, రోల్ నెంబర్.. నాదంటే.. నాది.. చివరికి! -
నక్సలైట్‌గా మారిన ఆర్జీవీ.. ముక్కలు ముక్కలుగా కేక్ కటింగ్
RGV Cake Cutting AT Konda Movie Wrap Up Praty: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన సినిమాల కంటే కాంట్రవర్సరీస్తోనే ఎక్కువగా పాపులర్ అయ్యాడు. తాజాగా నక్సలైట్ అవతారం ఎత్తి మరోసారి వార్తల్లో నిలిచాడు. సినిమా షూటింగ్ పూర్తైన సందర్భంగా వర్మ చేసిన రచ్చ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. కాగా వరంగల్‌కు చెందిన పొలిటికల్ లీడర్స్ కొండా మురళి-సురేఖ దంపతుల జీవి కథ ఆధారంగా ఆర్జీవీ కొండా అనే ఫ్యాక్షన్ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా వరంగల్‌లోని గోపాల్పూర్ కొండామురళి గెస్ట్‌హౌస్‌లో ముగింపు వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండా మురళి, కొండా సురేఖ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో నక్సలైట్ గెటప్‌లో వచ్చిన ఆర్జీవీ.. పెద్ద తల్వార్‌తో కేకును ముక్కలు ముక్కలుగా కోశాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. కిల్లింగ్ ఏ కేక్ ఫర్ కొండా అంటూ రాసుకొచ్చాడు. చదవండి: Rgv Hotel: 'ఆర్జీవీ హోటల్'.. అక్కడ అన్నీ అవే కనిపిస్తాయి KILLING a CAKE for KONDA pic.twitter.com/BXMmJIpV5F — Ram Gopal Varma (@RGVzoomin) December 26, 2021 -
వివాహేతర సంబంధం.. మాజీ నక్సలైట్ దారుణ హత్య
సాక్షి, నల్గొండ: మాజీ నక్సలైట్ దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులే హంతకులయ్యారు. శరీరం నుంచి తలను వేరుచేసి అతి కిరాతకంగా హత్య చేసి గోతిలో పూడ్చిపెట్టారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం, వద్దిపట్లకు చెందిన నామ శ్రీనివాస్(38), ఆదిబట్ల మున్సిపల్ సమీపంలోని బొంగ్లూర్ వద్ద మెట్రోసిటీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ భార్య కవిత 16 ఏళ్ల క్రితమే మృతిచెందింది. ప్రస్తుతం ఆయన మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెండు నెలలుగా కనిపించకకుండా పోయాడు. ఈ విషయాన్ని సదరు మహిళ తమ బంధువులకు సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 14న శ్రీనివాస్ తండ్రి, కుటుంబ సభ్యులు ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నవంబర్ 12న హత్య రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే శ్రీనివాస్‌కు ఎల్బీనగర్లో స్నేహితులు ఉన్నారు. వీరిలో బ్రహ్మచారి, నరేష్, రాజమ్మ (ట్రాన్స్‌జెండర్)తో ఎక్కువగా కలిసి ఉండేవాడు. బ్రహ్మచారి నకిలీ బంగారం వ్యాపారం చేస్తుండే వాడు. అతనిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. బ్రహ్మచారి పోలీసుల కంట పడకుండా.. శ్రీనివాస్ మెట్రోసిటీలో ఓ గది అద్దెకు ఇప్పించి దాచిపెట్టాడు. బ్రహ్మచారితో ఉంటున్న స్వాతి ఫోన్ నంబర్ తెలుసుకుని శ్రీనివాస్ స్నేహం చేశాడు. ఎలాగైనా ఆమెను లోబర్చుకోవాలని భావించాడు. బ్రహ్మచారి ఉంటున్న సమాచారాన్ని ఎల్బీనగర్ పోలీసులకు అందజేశాడు. వారు బ్రహ్మచారిని అరెస్టు చేయించి, జైలుకు పంపించారు. ఆ తర్వాత స్వాతికి దగ్గరైన శ్రీనివాస్ ఆమెతో సహజీవనం సాగించాడు. జైలుకు వెళ్లిన 18 రోజుల తర్వాత బ్రహ్మచారి బయటకు వచ్చాడు. అతనికి స్వాతి జాడ తెలియలేదు. శ్రీనివాస్ వద్ద ఉందని నరేష్, రాజమ్మ చెప్పారు. అప్పటికే స్వాతి బంగారాన్ని బ్రహ్మచారి దొంగిలించాడని శ్రీనివాస్ అతనిపై మరో కేసు పెట్టించాడు. బ్రహ్మచారి జైల్లో ఉన్న సమయంలో నరేష్‌తో మద్యం తాగిన శ్రీనివాస్ ఎలాగైనా బ్రహ్మచారిని హత్యచేస్తానని నరేష్‌తో చెప్పాడు. ఈ విషయాన్ని నరేష్.. బ్రహ్మచారితో చెప్పాడు. దీంతో రగిలిపోయిన అతడు శ్రీనివాస్ హత్యకు పథకం వేశాడు. మద్యం తాగించి.. నవంబర్ 12న నరేష్, బ్రహ్మచారి, రాజమ్మ కలిసి శ్రీనివాస్‌ని మట్టుబెట్టాలని చూశారు. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ కారులో బయలుదేరారు. బీఎన్‌రెడ్డి వద్దకు వచ్చి వైన్స్‌లో మద్యం కొనుగోలు చేసి మెట్రోసిటీకి వచ్చి తాగారు. ఔటర్ పక్కన ఆటవీ ప్రాంతం వద్దకు రాగానే.. కారులో కూర్చున్న శ్రీనివాస్ మెడకు వెనక సీటు నుంచి బ్రహ్మచారి క్లచ్‌వైర్ బిగించాడు. నరేష్, రాజమ్మ కాళ్లూ చేతులు పట్టుకున్నారు. శ్రీనివాస్ చనిపోగానే మృతదేహాన్ని ఆడవిలోపలికి తీసుకెళ్లి, గుంత తవ్వి కప్పేశారు. అంతకు మందు బ్రహ్మచారి.. శ్రీనివాస్ తలను కత్తితో నరికి వేరు చేశాడు. తలను తీసుకెళ్లిన నరేష్ ఎక్కడో పాతిపెట్టాడు. హత్య జరిగిన 45 రోజులకు విషయం వెలుగులోకి వచ్చింది. బ్రహ్మచారి పాత కేసులో అరెస్టు కాగా ఎల్బీనగర్ పోలీసుల విచారణలో నేరం ఒప్పుకున్నాడు. గోతిలో పాతి పెట్టిన శ్రీనివాస్ మొండాన్ని బయటకు తీశారు. పంచనామా అనంతరం తిరిగి పూడ్చివేశారు. బ్రహ్మచారి ఇప్పటికే పోలీసుల అదుపులో ఉండగా నరేష్, రాజమ్మ పరారీలో ఉన్నట్లు ఏసీపీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. కాగా, తన తండ్రి హత్య ఘటనలో బల్వంతయ్య అనే సీఐపై అనుమానం ఉందని, ఆయన్ని విచారించాలని శ్రీనివాస్ కుమారుడు గోపీ, కుటుంబ సభ్యులు చెప్పారు. చదవండి: ఏడాది సహజీవనం.. మోజు తీరాక.. ప్లేటు ఫిరాయించి.. -
రాష్ట్రం వైపు వందలాదిగా మావోయిస్టులు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల కదలికలను కనిపెట్టేందుకు పోలీసులు వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సత్ఫలితాలనిస్తోంది. ఆదివారం పోలీసులు డ్రోన్ వీడియో కెమెరా ద్వారా మావోలకు సంబంధించి కచ్చితమైన వివరాలు కనుగొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీసుస్టేషన్ పరిధిలో పాలోడి అటవీ ప్రాంతంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు వాగు దాటుతున్నట్లు డ్రోన్ కెమెరా ద్వారా వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. వీరంతా తెలంగాణ వైపు వస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య నిరంతరం పోరు నడుస్తోంది. గత కొన్ని నెలలుగా తెలంగాణలోనూ మావోయిస్టులు తమ కార్యకలాపాలను పెంచుతున్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత రెండు నెలల్లో పలుసార్లు ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 3న భద్రాద్రి జిల్లా గుండాల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు, 7వ తేదీన చర్ల మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వాగు దాటుతూ తెలంగాణ వైపు వస్తున్నట్లు డ్రోన్ కెమెరాలు కనిపెట్టాయి. దీంతో రాష్ట్రంలోని ములుగు, భద్రాచలం, పినపాక, మంథని నియోజకవర్గాల్లో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. -
నక్సలైట్ల కాల్పుల్లో జవాన్ మృతి..!
చత్తీస్గడ్: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలోని కోటీ క్యాంపు సమీపంలో నక్సలైట్లు జవాన్లపై కాల్పులు జరిపిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. క్యాంప్ దగ్గరలోని ఓ కిరాణా షాపింగ్‌కి వెళ్లిన ఇద్దరు జవాన్లపై నక్సల్స్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాన్ మృతి చెందగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన జవాన్ని దుష్యంత్ నందీశ్వర్‌గా గుర్తించి.. గాయపడిన జవాన్ని ఆస్పత్రికి తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
రూ.8 లక్షల రివార్డు.. చెల్లి కోసం లొంగిపోయాడు
రాయ్‌పూర్: రాఖీ పండగ అనేది ప్రధానంగా తోబుట్టువుల పండుగ. ఒకరి క్షేమం ఒకరు కోరుతూ జరుపుకునే పండుగ. ఆడపడుచు.. నిండు నూరేళ్లు తన సోదరులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ రాఖీ కడుతుంది. రక్ష కట్టించుకున్న సోదరులు జీవితాంతం వారికి తోడుగా ఉంటానని మాటిస్తారు. ఈ రాఖీ పండుగ నాడు.. రక్షా బంధన్ గొప్పతనాన్ని నిజం చేసే సంఘటన ఒకటి చత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. నక్సలైట్‌గా మారి.. ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతున్న ఓ అన్నను.. రాఖీ కట్టి.. జనజీవన స్రవంతిలో కలిసేలా చేసింది అతడి సోదరి. వివరాలు.. దంతెవాడ జిల్లా పల్నార్ గ్రామానికి చెందిన మల్లా అనే వ్యక్తి తన 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. (రక్షాబెహన్) గత 14 ఏళ్లుగా మల్లా ఇంటికి తిరిగి రాలేదు. దాంతో అతని చెల్లెలు లింగేతో పాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. తన అన్నయ్య ఇంటికి రావాలని ఎందరో దేవుళ్లకు మొక్కింది లింగే. ఈ క్రమంలో 2016లో మల్లా, ప్లాటూన్ డిప్యూటీ కమాండర్ అయ్యాడు. భైరవ్‌ఘడ్ ఏరియా కమిటీ నక్సలైట్ కమాండర్‌గా పనిచేస్తున్న మల్లా తలపై పోలీసులు 8 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు. సోదరుడి క్షేమం కోసం ప్రార్థిస్తోన్న లింగే.. దీనితో మరింత భయాందోళనకు గురయ్యింది. హిట్ లిస్ట్‌లో చేరిన తన సోదరుడు ఏదో ఒక రోజు పోలీసుల కాల్పుల్లో మరణిస్తాడని.. అలా కాకుండా తన అన్నను కాపాడుకోవాలని నిర్ణయించుకుది. (సోదరులకు రక్షాపూర్ణిమ) ఈ క్రమంలో లింగే రక్షాబంధన్ సందర్భంగా సోదరుడు మల్లాను కలిసింది. రాఖీ కట్టి.. పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేసింది. ఎన్నో ఏళ్ల తర్వాత సోదరిని కలుసుకున్న లింగే ఆమె కట్టిన రాఖీకి విలువ ఇచ్చాడు. నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అంగీకరించాడు. దాంతో మల్లాకు పునరావాసం కల్పిస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ వెల్లడించారు. -
సీపీ బాట డిప్యూటీ దళ కమాండర్ అరెస్ట్
సాక్షి, ఇల్లందు: సీపీఐ(ఎంఎల్) సీపి బాట(చండ్ర పుల్లారెడ్డి వర్గం) డిప్యూటీ దళ కమాండర్ జోగి భద్రయ్య అలియాస్ సుభాష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు డీఎస్పీ ప్రకాశరావు, గుండాల సీఐ గోపి, ఎస్సై ప్రవీణ్‌లు అతడిని శనివారం మీడియా ముందు హాజరుపరిచారు. ఇల్లందు మండలం కొమరారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇతడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఇతని నుంచి ఒక రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
నకిలీ నక్సలైట్లు అరెస్టు
– ఫైనాన్స్ వ్యాపారిని బెదిరించి రూ.1.50 కోట్లు డిమాండ్ – ఒకరు స్వయాన బావమరిది, మరొకరు మహిళా కండక్టర్ – బెదిరించడానికి వినియోగించిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, డ్రాఫ్ట్ లెటర్ స్వాధీనం – నిందితులను ఎస్పీ ఎదుట హాజరుపరచిన ఆదోని పోలీసులు కర్నూలు : నక్సలైట్ల పేరుతో ఫైనాన్స్ వ్యాపారిని బెదిరించి డబ్బు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. వీరిలో ఒకరు ఫైనాన్స్ వ్యాపారికి స్వయాన బావమరిది కాగా, మరొకరు మహిళా కండక్టర్ కావడం గమనార్హం. మంగళవారం సాయంత్రం వ్యాస్ ఆడిటోరియంలో ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ నకిలీ నక్సలైట్ల వివరాలు వెల్లడించారు. ఆదోని పట్టణం పోస్టల్ కాలనీలో నివాసముంటున్న ఎనకొండ్ల గుర్రెడ్డి చిన్నమార్కెట్ వీధిలో మల్లికార్జున పేరుతో సుమారు 15 సంవత్సరాల నుంచి ఫైనాన్స్ వ్యాపారం నడుపుతున్నాడు. 2016 ఫిబ్రవరి 20వ తేదీన రామకృష్ణ అలియాస్ ఆర్కే మావోయిస్టు కేంద్ర కమిటీ పేరుతో శ్రీధర్‌రెడ్డి, ఆవుల శారదలు కలిసి గుర్రెడ్డికి ఉత్తరం రాశారు. ఆదోనిలో అక్రమాలకు పాల్పడుతున్నందున తమకు రూ.1.50 కోట్లు 2017 మార్చి 6వ తేదీన ఇవ్వాలని ఉత్తరంలో పేర్కొన్నారు. ఇవ్వకపోతే అతడిని, అతడి కుమారుడిని చంపుతామని ఉత్తరంలో పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో 79937 74109, 78010 66823 నంబర్ల ద్వారా అరుణక్క పేరుతో గుర్రెడ్డికి ఫోన్ చేసి కోటిన్నర రూపాయలు తాము డిమాండ్ చేసినట్లు ఎవరికీ తెలియకుండా రహస్యంగా అందజేయాలని, లేకపోతే చంపుతామని బెదిరించారు. వెంటనే అతను అదే రోజు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా శ్రీధర్‌రెడ్డి, ఆవుల శారదపై పక్కా నిఘా వేసి అరెస్టు చేశారు. ఫిర్యాదుదారుడికి నిందితుడు శ్రీధర్‌రెడ్డి స్వయాన బావమరిది. ఫైనాన్స్ వ్యాపారం విషయంలో దెబ్బ కొట్టాలని శారదతో చేతులు కలిపి నక్సలైట్ల పేరుతో బెదిరింపులకు పాల్పడ్డారు. శారద స్వదస్తూరితో లెటర్ రాసి ఆత్మకూరులో స్పీడ్ పోస్టు ద్వారా గుర్రెడ్డికి పంపినట్లు విచారణలో బయటపడింది. 78010 66823 సిమ్‌ను ఆదోనికి చెందిన సురేంద్ర భార్య సెల్ నుంచి ఆమెకు తెలియకుండా ఆవుల శారద దొంగలించి అరుణక్క పేరుతో మాట్లాడి గుర్రెడ్డిని బెదిరించినట్లు శ్రీధర్‌రెడ్డి పోలీసు విచారణలో అంగీకరించాడు. భావ గుర్రెడ్డి ఆర్థికంగా బాగా సంపాదించడమే కాక తన ఫైనాన్స్ వ్యాపారానికి అడ్డు తగులుతున్నాడనే ఉద్దేశంతో మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టేందుకు ఈ కుట్ర పన్నినట్లు వెల్లడించారు. ఆవుల శారద ప్రస్తుతం ఆదోని ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తోంది. ఈమె శ్రీధర్‌రెడ్డికి ఆరు నెలల క్రితం పరిచయమైంది. గుర్రెడ్డిని బెదిరించడానికి వాడిన సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, డ్రాఫ్ట్ లెటర్‌ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసి ఛేదించిన డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు, ఆదోని మూడో పట్టణ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ సునిల్‌ను ఎస్పీ అభినందించారు. -
తొలితరం నక్సలైట్ నేత నాగన్న మృతి
-విప్లవ బీజాలు నాటిన ఉప్పల మోహన్‌రెడ్డి మిరుదొడ్డి(మెదక్ జిల్లా): మెతుకుసీమలో తొలిసారిగా విప్లవ బీజాలు నాటిన తొలితరం నక్సలైట్ నేత నాగన్న అలియాస్ ఉప్పల మోహన్‌రెడ్డి (56) అనారోగ్యంతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపెల్లిలో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1984 మధ్య కాలంలో దళ కమాండర్‌గా మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో నాగన్న నక్సలైట్ల ఉద్యమానికి బీజాలు వేశారు. నిరుపేదలను పీల్చి పిప్పిచేసే దొరల ఆగడాలను అరికట్టి పట్టణాలకు తరిమి కొట్టడంలో నాగన్న కీలక పాత్ర పోషించారు. ఉద్యమకాలంలో ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి నాగన్నతో అప్పుడే సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పట్లోనే సోలిపేట రామలింగారెడ్డి నక్సలైట్ల ఉద్యమానికి ఆకర్శితులు కావడానికి కారణంగా చెప్పవచ్చు. తన దళంలో పనిచేస్తున్న చిట్టాపూర్‌కు చెందిన వెంకటలక్ష్మి అనే దళిత మహిళను నాగన్న కులాంతర వివాహం చేసుకున్నారు. నక్సలైట్ ఉద్యమంలో ఆరోగ్యం సహకరించకపోవడంతో నాగన్న దంపతులు 1989లో అప్పటి జిల్లా ఎస్పీ సురేందర్ ఎదుట లొంగిపోయారు. పోలీసులకు లొంగిపోయే ముందు తన స్వలాభం కోసం ఆకాంక్షించకుండా నక్సలైట్ కార్యకలాపాలకు సంబంధించిన డబ్బు, తుపాకులు పార్టీకే అప్పగించారు. దీంతో నాగన్న నిజాయితీకి జిల్లా ప్రజలు హర్షించారు. లొంగిపోయిన నాగన్నకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆయన సొంత గ్రామమైన కొత్తపెల్లిలో పునరావాసం కల్పించింది. అనంతరకాలంలో ఆర్థికంగా చితికిపోయిన నాగన్న కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం సాయంత్రం ఆయన స్వగృహంలోనే తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. నాగన్న మృతితో ఆయన శ్రేయోభిలాషులు, సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. -
నక్సలైట్ పేరుతో బెదిరించిన వ్యక్తి అరెస్ట్
మంచిర్యాల: తాను ఒక నక్సలైట్‌నని, దళ కమాండర్‌నని, మావోయిస్టునంటూ వ్యాపారస్తుల నుంచి డబ్బులు అడుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు. మెదక్ జిల్లా సిద్దిపేటలోని పద్మనగర్‌లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్న అట్ల నాగభూషణంకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కూతురు ఇంటర్, కొడుకు బీటెక్ చదువుతున్నారు. కూలీ పనులతో ఇద్దరు పిల్లలను చదివించడం ఇబ్బందిగా ఉందని ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో 2014లో ఖమ్మం జిల్లా ఎల్లందుకు వెళ్లాడు. అక్కడే బస్టాండులో దొరికిన ఓ దుకాణం కవర్‌పై ఉన్న ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి, తనను నక్సలైట్‌గా పరిచయం చేసుకుని తమకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దుకాణ యజమాని ఫిర్యాదుతో పోలీసులు సెల్ నంబర్ ఆధారంగా నాగభూషణంను అరెస్ట్ చేయగా, బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం అక్కడి నుంచి ఇంట్లో మహారాష్ట్రకు వెళ్లి, రైస్‌మిల్లులో పనిచేస్తానంటూ బయలుదేరి నిజామాబాద్, అక్కడి నుంచి బాసరకు వచ్చాడు. ఈ క్రమంలో అతనిడికి దొరికిన డ్యుయల్ సిమ్ ఫోనుతో గత నెల ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్మల్‌లోని రెండు షాపుల యజమానులను, ఇంద్రవెల్లిలోని ఒక దుకాణ యజమానిని, మంచిర్యాలలోని ఓ వస్త్ర దుకాణ యజమానికి డబ్బులు ఇవ్వాలని నక్సలైట్ పేరుతో బెదిరింపులకు పాల్పడ్డాడు. బాసర నుంచి నిందితుడు సెల్‌ఫోనులోని సిమ్‌కార్డులు తీసేసి, సిద్దిపేటలోని తన ఇంటికి వెళ్లిపోయాడు. మంచిర్యాల తులసి దుకాణ వస్త్ర వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచిర్యాల పోలీసు స్టేషన్లో కేసు నమోదు కాగా, దర్యాప్తు ప్రారంభించి, నిందితుడి కాల్‌లిస్టు, ఐఎంఈ నంబర్ల ఆధారంగా సిద్దిపేటకు చెందినవాడిగా గుర్తించి, ఇంటికి వెళ్లి అరెస్టు చేసి, శుక్రవారం రిమాండుకు తరలించారు. ఎస్సైలు లతీఫ్, వెంకటేశ్వర్లు, ఏఎస్సై భవా నీ, హెడ్‌కానిస్టేబుల్ ఎండీ తాహిరుద్దీన్ పాల్గొన్నారు. -
ఐపీఎస్ మరణిస్తే రూ.కోటి
-
నక్సలైట్ కావడం నేరం కాదు: కేరళ హైకోర్టు
కొచ్చి: మావోయిస్ట్ కావడం నేరం కాదని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది. ఒక వ్యక్తిని నక్సలైట్ అనే ఏకైక కారణంతో అరెస్ట్ చేయడం కుదరదని స్పష్టం చేసింది. మన రాజ్యాంగ విధానాలతో వారి రాజకీయ సిద్ధాంతాలకు వైరుధ్యం ఉన్నప్పటికీ.. మావోయిస్టుగా ఉండటాన్ని నేరంగా పరిగణించలేమంది. ఆకాంక్షల ఆధారంగా ఆలోచించడం మానవుల మౌలిక హక్కని పేర్కొంది. ఒకవేళ వ్యక్తి కానీ, సంస్థ కానీ భౌతిక హింసకు పాల్పడటం లాంటి చర్యలకు పాల్పడితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, చట్టపర చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. నక్సల్‌గా పేర్కొంటూ శ్యామ్ బాలకృష్ణన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం తీర్పు ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్ మొహమ్మద్ ముస్తాఖ్ పై వ్యాఖ్యలు చేశారు. నేరం చేశాడనేందుకు ఆధారాలు లేకుండానే, కేవలం అనుమానిత మావోయిస్ట్ అనే ఏకైక కారణంతో బాలకృష్ణన్‌ను అరెస్ట్ చేశారని నమ్ముతున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేయడం ద్వారా బాలకృష్ణన్ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని పేర్కొంటూ.. బాలకృష్ణన్‌కు రెండు నెలల్లోగా రూ.లక్ష పరిహారంగా అందించాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో పదివేలు ఇవ్వాలని తీర్పునిచ్చారు. -
గన్‌కు బై నాగలికి సై
-
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
కేసముద్రం, న్యూస్‌లైన్ : జల్సాలకు అలవాటుపడిన ఓ వ్యక్తి డబ్బు కోసం అనేక అడ్డదారులు తొక్కాడు. సులువుగా డబ్బు సంపాదించి సమాజంలో ఉన్నత హోదాలో జీవించాలనే ఆశతో నక్సలైట్ అవతారం ఎత్తి రాష్ర్టంలోని పలు జిల్లాల్లో కిడ్నాప్‌లు, దొంగతనాలకు పాల్పడి చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ మేరకు మానుకోట సీఐ వాసాల సతీష్, ఎసై ్స రంజిత్‌రావు బుధవారం నిందితుడి వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వానపాకుల రాంబాబు(అలియాస్ ఆజాద్, బాబు) గతంలో అదే మండలంలోని మైనేని మోహన్‌తో తొలుత 9 మందితో ప్రజాసేవా దళాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామం నుంచి 2002లో ఆరు సింగిల్ ఫోర్ పిస్టళ్లను కొనుగోలు చేసి ఖమ్మం జిల్లా పాల్వచ పరిసర ప్రాంతాలైన బంగారుచెలుక, ఉల్వనూరు, రేగులగూడెం అటవీ ప్రాంతాల్లో దళ సభ్యులంతా కొద్ది రోజులుగా షూటింగ్‌పై శిక్షణ పొందారు. అనంతరం రాంబాబు పాల్వంచ ప్రాంతంలోని కేటీపీఎస్ కాంట్రాక్టర్ రమేష్‌ను బెదిరించి రూ.2 లక్షలు వసూలు చేశారు. టేకులపల్లిలోని ఓ క్వారీ యజమానిని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తుండగా అక్కడి పోలీసులు అరెస్టు చేసి 6 పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే కొన్ని నెలల పాటు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన రాంబాబు అదే ఏడాది ఓ కాంట్రాక్టర్‌ను కిడ్నాప్ చేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. అనంతరం 2007లో పాల్వంచలోని కృషి బార్ షాప్ యజమాని రాంమోహన్‌రావును బెదిరించి రూ.లక్ష, 2008లో నర్సంపేటలోని రూపా పేపర్ బైండింగ్ ఓనర్ లింగస్వామివద్ద రూ.20 వేలు వసూలు చేశాడు. 2012లో ఖానాపురంలోని అగ్రహర్ కాలనీలో రాజు అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఎల్‌సీడీని, ఖమ్మం జిల్లాలోని మారెమ్మగుడిలో రూ.30 వేలతోపాటు, 2013 జూన్ 23న వెస్ట్ గోదావరి జిల్లాలోని గొల్లప్రోలు గ్రామానికి చెందిన గుండెపల్లి పోలీస్ అనే రైస్ మిల్లు వ్యాపారిని కొట్టి రూ.6.30 లక్షలను వసూలు చేసి పరారయ్యాడు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం బీహర్‌లో కొనుగోలు చేసిన ఎయిర్‌గన్‌ను చూపిస్తూ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, కష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లోని వ్యాపారులను, కిరాణం షాపు యజమానులను, క్వారీ ఓనర్లను బెదిరిస్తూ రూ.2వేల నుంచి మొదలుకుని లక్షల వరకు డిమాండ్ చేస్తూ వస్తున్నాడు. అలాగే పలు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతూ దొంగతనాలు చేస్తూ వచ్చాడు. హత్య కేసులోనూ నిందితుడు.. పాల్వంచ గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ అనే మహిళ ఖమ్మం శివారులో హోటల్ నడుపుతోంది. ఆమె తన అల్లుడైన చింతల సత్యనారాయణతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో పెద్దకొడుకు కృష్ణ వీరి వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతూ వస్తున్నాడు. అయితే నాగేంద్రమ్మ హోటల్‌కు తరచూ వస్తున్న రాంబాబును వారు సంప్రదించి తమనుంచి కష్ణ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కృష్ణను చంపితే రూ.2లక్షలు ఇస్తామని నాగేంద్రమ్మ, సత్యనారాయణలు ఆశ చూపడంతో రాంబాబు దానికి సరేనన్నాడు. ఈ నేపథ్యంలో 2013 నవంబర్ 11న రాంబాబు.. కృష్ణకు మద్యం తాగించేందుకు బయటికి తీసుకెళ్లి బండరాయితో మోది హతమార్చాడు. కేసముద్రంలో చిక్కిందిలా.. రాంబాబు కేసముద్రం మండలంలోని తిమ్మంపేటకు చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి గతంలో పలు దొంగతనాలను పాల్పడ్డాడు. అయితే శ్రీనివాస్ అతడి నుంచి దూరంగా ఉండడంతో రాంబాబు ఒంటరిగా బెదిరింపులకు దిగుతూ దొంగతనాలు చేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్ 24 కేసముద్రం మార్కెట్ ఎదురుగా ఉన్న ఎలక్ట్రికల్ షాపులో కాపర్ వైరు దొంగిలించాడు. అనంతరం ఓ పల్లి వ్యాపారిని బెదిరించి రూ.14 వేలు, ఈ నెలలో తిమ్మంపేట గ్రామంలోని ఓ ఇటుక బట్టి వ్యాపారిని బెదిరించి రూ.2వేలు వసూలు చేశాడు. తోట పుల్లయ్య అనే పల్లి వ్యాపారిని కూడా ఎయిర్‌గన్‌తో బెదిరించి తనకు రూ.5 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. అయితే వ్యాపారులందరూ ఇస్తే తాను కూడా డబ్బులు ఇస్తానని చెప్పడంతో వెళ్లిపోయాడు. తర్వాత పసుపు వ్యాపారి రాజన్నను కూడా బెదిరించడంతో అతడు రూ.2వేలు ఇచ్చాడు. ఈ క్రమంలో గత జనవరి 30న సదరు వ్యాపారి రాంబాబు బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు రాంబాబు ఎదురుపడ్డాడు. అయితే రాంబాబును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా చేతిలో ఉన్న ఎయిర్‌గన్‌ను చూపిస్తూ బెదిరించాడు. దీంతో కానిస్టేబుల్ మంగీలాల్ వెనకవైపు నుంచి వచ్చి అతడిని చాకచక్యంగా పట్టుకున్నాడు.