కొచ్చి: మావోయిస్ట్ కావడం నేరం కాదని కేరళ హైకోర్టు తేల్చి చెప్పింది. ఒక వ్యక్తిని నక్సలైట్ అనే ఏకైక కారణంతో అరెస్ట్ చేయడం కుదరదని స్పష్టం చేసింది. మన రాజ్యాంగ విధానాలతో వారి రాజకీయ సిద్ధాంతాలకు వైరుధ్యం ఉన్నప్పటికీ.. మావోయిస్టుగా ఉండటాన్ని నేరంగా పరిగణించలేమంది. ఆకాంక్షల ఆధారంగా ఆలోచించడం మానవుల మౌలిక హక్కని పేర్కొంది. ఒకవేళ వ్యక్తి కానీ, సంస్థ కానీ భౌతిక హింసకు పాల్పడటం లాంటి చర్యలకు పాల్పడితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, చట్టపర చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
నక్సల్‌గా పేర్కొంటూ శ్యామ్ బాలకృష్ణన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం తీర్పు ఇస్తూ న్యాయమూర్తి జస్టిస్ మొహమ్మద్ ముస్తాఖ్ పై వ్యాఖ్యలు చేశారు. నేరం చేశాడనేందుకు ఆధారాలు లేకుండానే, కేవలం అనుమానిత మావోయిస్ట్ అనే ఏకైక కారణంతో బాలకృష్ణన్‌ను అరెస్ట్ చేశారని నమ్ముతున్నట్లు తెలిపారు. అరెస్ట్ చేయడం ద్వారా బాలకృష్ణన్ వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించారని పేర్కొంటూ.. బాలకృష్ణన్‌కు రెండు నెలల్లోగా రూ.లక్ష పరిహారంగా అందించాలని, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో పదివేలు ఇవ్వాలని తీర్పునిచ్చారు.
నక్సలైట్ కావడం నేరం కాదు: కేరళ హైకోర్టు
Published Sat, May 23 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement
Advertisement