కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య తలెత్తుతుందో అర్థం కాని పరిస్థితి! అప్పటిదాకా ఆరోగ్యంగా కనిపించినవాళ్లు కూడా సడన్‌గా ఛాతీ నొప్పి, గుండెపోటు, ఇలా రకరాకల సమస్యలతో ఆస్పత్రిపాలవుతున్నారు. మూడు రోజుల క్రితం బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సైతం తీవ్రమైన ఛాతీ నొప్పితో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు.
బాగానే ఉన్నా..
తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ.. 'నేను బాగానే ఉన్నాను. ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే నా ఆహారపు అలవాట్లను కాస్త నియంత్రణలో ఉంచుకోవాలి. ఇక నేను నా పని మొదలుపెట్టాలి. రేపటి నుంచి షూటింగ్‌లో జాయిన్ అవ్వాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ చేసి మాట్లాడారు.
ఇటీవలే పద్మ భూషణ్
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసినందుకు తిట్టారు' అని చెప్పుకొచ్చాడు. కాగా మిథున్ చక్రవర్తి హిందీ, బెంగాలీ, ఒడియా, భోజ్‌పురి, తమిళ భాషల్లో కలిపి 350 సినిమాలు చేశాడు. సినీ పరిశ్రమకు అందించిన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇతడికి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది.
చదవండి: సెల్వతో పనిచేయడం ఇష్టమే.. మాజీ భర్త సినిమాపై సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment